"అంతెందుకు . హంపీ విరూపాక్షదేవాలయంలో కూడా ఆనాటి శాస్రజ్ఞలు ఓ వింత స్పష్టించారు. సరీగా మధ్యాహ్నం పన్నెండు కాంగానే లోపల ఎక్కడో గుడిలో వున్న నిరూపాక్షుడి పాదాలమీద ఎండ వెలుగుపడి నెమ్మదిగా అయన వెనుక గోడవైపు పడుతుంది. గుడి ప్రాగణందాటి గర్భగుడిలో విగ్రహం దగ్గరకి సూర్యకిరణాలు చొచ్చుకు పోయాయంటే వింతేకదా! ఇలాంటి వింతలు బోలెడు మన వాళ్ళు సృష్టించగాలేంది. ఇక్కడ వెలుగు పడటంలో వింతేముంది?" కమల అన్నాడు.
"నేనొకటి చెప్పనా?" కృతి అంది.
"ఓ చిన్న అనుమానం బైట పెట్టానో లేదో ఎన్ని పుణ్యక్షేత్రాల కధలు చెప్పారురా! ఇది ఓనాడు ఏ మహామునో నిర్మించిన గుహలాయివుంటాయి అందుకే అందరికీ గుళ్ళూ దేముళ్ళూ గుర్తుకు వచ్చారు మీ వరస చూస్తుంటే మరో నిమిషం ఆగితే భక్తీ గీతాలు పాడుతూ భజన చేసేటట్లు వున్నారు"
సుబ్బారావు అనంగానే అందరూ ఫక్కున నవ్వారు.
"నువ్వూ ఓ కధ చెప్పావు కదరా సుబ్బాయ్!" అన్నాడు నవ్వాపుకుంటూ కమల్.
"నాకో అనుమానం వస్తుందిరా!"
"నీకు సుబ్బారావుపేరు సరిపోదురా అనుమానాలరావ్ అని పెట్టాల్సింది. అదేదో అఘోరించు లేకపోతే పొట్ట వుబ్బిపోయే ప్రమాదం వుంది."
"మనం నుంచున్న చోటు నుంచి కిమ్దపద్దాం పైన నీళ్ళు వూరు తున్నట్లులేదు. పైనుంచి కిందికి అంత ధారా నీళ్ళు ఇప్పుడు పడటంలేదు. కంతవున్నప్పుడు నీళ్ళు కారుతూనే వుండాలికదా?"
ఇంక చాలురా సుబ్బాయ్! పైనుంచి ఆ నీరు పల్చగా గోడవారగా కారుతున్నది .మనం పడ్డచోట గోడ పాచిపట్టి వుంది. గమనిమ్చావు కదా! నా వూహా ప్రకారం మనం ముందు నుంచున్నాం చూడు అక్కడ నీటిబుగ్గలు లేచే ప్రమాదంకూడా వుంది. మనముందే నీటి బుగ్గ లేచింది అంటే ఆ ప్రదేశంలో కంత ఏర్పడిందన్నమాట. ఆ కంట్లోపడ్డ మనం ఆ నీటితోపాటు ప్రయాణించి కిందకొచ్చి పడ్డాం."
"మరి మనం పడ్డచోట పైన కంత కనబడలేదుకదురా!"
"పై భాగంనుంచి కిందభాగంలో పడలేదురా! ఆ మార్గం ఎన్ని వంకర్లు తిరిగి కిమ్దకోచ్చిందో మనకి తెలియదు ఆ నిముషాన ఎవరమూ స్పృహాలోలేము నీటితోపాటు కిందకొచ్చేస్తూ ఇక్కడ ఆగిపోయాము ఎందుకంటే మనం పడ్డచోట రెండంగుళాలు ఎత్తుమాత్రమె నీళ్ళు నిలవవున్నాయి నలువైపులకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. అందువల్లనే ప్రాణాలు రక్షింపబడ్డాయి. బుట్టలో కూర్చుని కింద కొచ్చి నట్టు నీటితో కిందికి వచ్చాము గోడలు పాచిపట్టి వున్నాయి మన శరీరం గోడకొట్టుకున్నా జారుతుందిగాని రాతిదెబ్బ తగలదు. బహుశా అలా జరుగివుంటుంది."
విజయ్ అనంగానే కమల అందుకున్నాడు.
"బహుశా అలా జరిగిందని సరిపెట్టుకోవడం వుత్తమోత్తమమైన పద్దతి. ఇప్పుడు ప్రయాణించి తెలుసుకోలెము కాబట్టి."
"మరి నీటి బుగ్గలేర్పడటం ఏమిటి?"
"కొండల్లో కొన్నిచోట్ల నీరు వుంటుంది ఆ నీటిఫోర్స్ ఎక్కువయినప్పుడు ఎటు పోవడానికి దారిలేక పక్కలకి తంతుంటుంది. రాయికాకుండా రాళ్ళతోగుల్ల ప్రదేశం అయితే. పక్కగోడలు విరుచుకుపడిపోయి జలపాతం పక్కనుంచి కిందికి పడుతుంది. అజలపాతమే పాయలుగా బైలుదేరి కొన్ని దారులగుండా ప్రయాణిస్తుంది. కొండలెక్కేవాళ్ళకి ఆ నీటిపాయలె నీరు అందించి ప్రాణం కాపాడు తుంటాయి. ఈ నీటిపాయలకే మరోపేరు సెలయేళ్ళు.
ఇహపోతే నీటిబుగ్గలనగా కింద నీటిఫోర్స్ పైకి తన్నంగానే గుల్లగావున్న పైభాగం నీటితో ధన్ మని పైకి లేచి కొద్దిసేపు తర్వాత ఆ ఫోర్స్ ఆగిమామూలు అవుతుంది. ఆ నీటికి రాళ్ళు జరిగో మట్టిజిరో మళ్ళీ అవి మూసుకుపోతాయి. అగ్నిపర్వతాలు పేలి లావావుప్పోంగినట్లు ఈ నీటిబుగ్గలు అంతే సాధారణంగా గంధక సమ్మేళనంతో కూడిన వేడి నీరుతో వుంటాయి. నీటి బుగ్గలు గంధకమనే కాదు ఎన్నో రసాయానాల సమ్మేళనం అది. వేడినీటి బుగ్గలయినట్లయితే కాలి చచ్చే వాళ్ళం మనం ఇవి చన్నీటిబుగ్గలు విపరీతమైన ప్రశార్ తో పైకి తంతాయి యిని"
"అర్దమైంది" సగం అర్దమయూ కానట్లు వున్నా అర్దమైంది అనేశాడు సుబ్బారావు.
"రక్షించావురా సుబ్బునాథం , ఇంకేం అనుమానాలు లేవుగా?"
"ప్రస్తుతానికి లేవురా"
"మరోసారి రక్షించావురా సుబ్బూ! ఒరేయ్ కమల ఇప్పుడు మనం ఏం చేద్దాం."
"ప్రస్తుతం వెలుతురూ కొద్దిగానైనా వుంది. అ ఇదేమంచి సమయం. ఈ గుహలేన్ని వున్నాయో చూద్దాం. "
"నేనూ అదే అనుకుంటున్నాను పదండి. అంతా కలసిపోదాం." విజయ్ లేస్తూ అన్నాడు.
అందరూ కలసి బయల్దేరారు .
రెండు గుహలు దారి మరో గుహలో ప్రవేశించి తరువాత సుబ్బారావుకి మరో అనుమానం వచ్చింది "కొంప మునిగింది ఆగండి రోయ్" అక్కడినుంచి ఒక్కడగు కూడా ముందుకేయకుండా.
"ఇది భయంకర ప్రదేశం" అంటూ మరో కేక పెట్టాడు
విషయం చెప్పి కేకలుపెట్టు" విజయ్ గద్దించాడు
"ఇదే మీ తాతగారు చెప్పిన మృత్యు ద్వారం."
సుబ్బారావు అనంగానే "ఈమాట నీకెలా తెలుసురా!" కమల అడిగాడు.
"బాగా గుర్తు తెచ్చుకోండి తూచితూచి అడుగులు వేస్తూ వేయి కళ్ళతో పరిసరాలు గమనిస్తూ ముందుకు సాగటం...... అని వుంది. ఆ తర్వాత అక్షరాలూ ఎగిరిపోయినా మళ్ళా ఏం రానుంది ? యీ చోటనే బహు జాగ్రత్త వహించాలి . మృత్యుద్వా __ ఆ తర్వాత చాలా తేలిక. అని మనం చదివాంకదా! విచిత్రంగావున్న యీ గుహలు వింతగావున్న ఈ మార్గాలు చూస్తుంటే మృత్యుద్వారం ఇక్కడేఎక్కడో వుందని తెలీయటంలా?"
ఆ నిముషాన సుబ్బారావు చెప్పింది నిజమేననిపించింది. ఒక గుహలోంచి మరో గుహలోకి వెళ్ళేద్వారం గుండ్రంగా వుంది ఇవన్నీ మృత్యువుకి ద్వారాలేమో! మనం వెళుతున్న మార్గం సరి అయినది కాదేమో!" యీ అనుమానాలతో ఎక్కడివాళ్ళు అక్కడ ఆగిపొయ్యారు.
కొద్దిసేపట్లోనే విజయ్ కి గుర్తుకు వచ్చింది.
"ఒరేయ్ సుబ్బూ! నీ అనుమానం కాదిగాని చంపావు కదరా. మా తాతగారు రాసిన కాగితాలలో అరడజను కాగితాలయిం తరువాత యీ మాట వస్తుంది. మ్రుత్యుద్వారం దాకా మనం యింకా చేరలేదు. డోంట్ వర్రీ , మనం యింకా ఈ కొండగుహల్లోనే అఘోరిస్తున్నాం"
విజయ్ అనంగానే అవునౌనంటూ అందరూ తలలూపారు. మళ్ళీ ముందు సాగారు.
కొన్ని గుహలు చిన్నవి కొన్ని గుహలు పెద్దవి. ఇంచుమించు అన్నీ ఒకేలాగున్నాయి. ఓ గుహలో వెలుతురు కొద్దో గొప్పోఉంటే మరో గుహలో చీకటి గయ్యారంలా వుంది.
"మనం యిలా వెళ్ళామంటే దారి తప్పుతామురా కమల్! వెనక్కీ మరలిపోదాం ఏం చేయాలో ఆలోచించి మళ్ళీ బయల్దేరుదాం. మన సామాను అక్కడే వుండిపోయింది" విజయ్ సిక్స్ సెన్స్ హెచ్చరించటంతో అపాయం తోచి చెప్పాడు.
"వెళ్ళటమే మంచిది. కారణం తెలియదు ఇప్పుడు టైము మూడున్నర వెలుతురు తగ్గింది గమనించావా?" కమల్ అన్నాడు.
"పొద్దు వాలిపోవటమో? కారుమేఘాలు కమ్ముకు రావటమో ! లేక యీ గుహల్లో చీకటిమాత్రమే చోటు చేసుకోవటమో! ఏదో మనం వెళ్ళటమే మంచిది" కృతికూడా ఆమోదించింది.
"పుడ్డుకి దూరమయ్యే మంటే గుడ్డ్లు వెళ్ళకొస్తాయి" సుబ్బారావు అన్నాడు.
నిశ్చల ఒక్కటీ ఏం మాట్లాడలేదు.
అందరూ తిరిగుముఖం పట్టారు. పట్టుమని పదిగుహలు కూడా చూడలేదు . దాంతోనే దారి తప్పి ఓ గుహలో౦చి మరో గుహలోకి రావటం మొదలు పెట్టారు అందరికీ లోలోపల కంగారువుంది. అయినా ధైర్యంగా వెతికి తామున్న గుహా పట్టుకున్నారు.
"అమ్య పెద్ద ఆపదలోంచి బైటపడ్డాం." సుబ్బారావు కింద చతుకిలబడుతూ అన్నాడు.
"అవును మనం ముందాలోచన లేకుండా బయల్దేరాం. నిజమే. అపదలోంచి బైటపడ్డట్లే " కృతి అంది సుబ్బారావు మాటలకి అంగీకరిస్తూ.
"తెల్లవారితే పెద్దఆపద ముంచుకు రాబోతున్నదని వారేరుగురు"
ఎవరికివారే నిశ్చింతగా కూర్చున్నారు. తీవ్రంగా ఆలోచిస్తూ.