"నాచువాసన గబ్బిలాలకంపు కొడుతున్నది"నిశ్చల అంది.
"ముందుగా తెలిస్తే దారి పోడుగూత సెంటు చల్లించేదానిని" కృతి అంది.
వాళ్ళ మాటలు వాళ్ళకే తమాషాగా వినవస్తున్నాయ్.
"యమర్జంటుగా ఏదైనా అవసరం అయింది అనుకో అప్పుడేలాగురా విజయ్!" సుబ్బారావు అడిగాడు.
"ఎంతో అవసరం అయితే తప్ప దారిలో ఎవరూ మాట్లవద్దని ముందే చెప్పాను అకస్మాత్తుగా మీద పడవచ్చు. ఎవరూ అధికప్రసంగం చేయవద్దు" విజయ్ అన్నాడు.
మనిషి పట్టే దారి మాత్రమే వున్న ఆ మార్గంలో ముందువాళ్ళు నడక సాగించారు. తర్వాత వొంగుని నడిచారు. ఇప్పుడు పడుకుని పారిపోతున్నారు. లేక పడుకుని జరుగుతున్నారు టైము ఎంత పట్టింది అని తెల్సుకోవడానికి విజయ్ తో పాటు అందరూ తమతమ రేడియం డైల్ వాచీలను మధ్య మధ్య చూసుకుంటున్నారు.
పావుగంటసేపు వాళ్ళయిదుగురు ముందుకు పాకారు.
"ఒరేయ్ ! నాకు ఆయాసం వస్తున్నది. ఇంకనేను చస్తే ఒక్క అంగుళం కదలను" సుబ్బారావు ఆగిపోయి ఆయాసంతో అన్నాడు.
"వీపు కదలకపోతే నీ నెత్తిమీంచి మేము ముందుకు పోలేము. మా నెత్తిమీంచి నీవు వెనక్కీ రాలేవు. నిన్నసలు రైల్లో చివరి పెట్టగా వేయాల్సింది" కమల నాథ్ విసుకున్నాడు.
"అందరికీ మంచిది పోనీ కొద్ది విశ్రాంతి తీసుకుందాం" కృతి అంది.
సుబ్బారావు ఆగిపోవటంతో అందరూ ఆగిపోక తప్పలేదు.
"అయిదు నిముషాలు చాల సుబ్బూ!" అడిగింది నిశ్చల.
"గంట ప్రయాణంలో మరి రెండు సార్లు మూడు నిముషాల చొప్పున రెస్ట్ తీసుకుందాం. అంతే గంటల తరబడి రెస్ట్ తీసుకుంటే మనం ముందుకు వెళ్ళటానికి చాలా సమయం వృధా అవుతుంది" అన్నాడు విజయ్.
"ఈ మార్గంకన్నా అదే బాగుంటుదేమో!" మూలిగాడు సుబ్బారావు.
"ఈ తఫా నిన్నోక్కడినీ అక్కడికి పంపించి చూస్తాం. డోంట్ వర్రీ సుబ్బాయ్ " అన్నాడు కమల్.
సరీగ గాలిలేకుండా చీకటిగా వున్న మార్గంలో కష్టతరమైన ప్రయాణం సాగిస్తున్న వాళ్ళు మనసారా నవ్వుకున్నారు. ఒక్కోమాట నడ్డి విరగ్గోట్టిన మనిషిని కృంగదీస్తే కొన్ని మాటలు సంజీవిలా పనిచేసి ప్రాణం కాపాడుతాయంటారు. అందుకే కమల్ మాటలకు అందరూ హాయిగా నవ్వుకున్నారు.
"ఇంక బయల్దేరుదాం రెడీ!" విజయ్ అంటూనే ముందుకు పాకాడు.
మళ్ళీ మామూలే కొద్దిగా రొప్పుతున్న ద్వని శ్వాసయొక్క అతి నెమ్మది శబ్దం పాకుతున్న చప్పుడు ముందుకీ జరిగిపోతున్నారు.
దాదాపు పావుగంట అయింది.
"నేరాను బాబోయ్ !" ఓ గావుకేక వేసి ఆగిపోయాడు. సుబ్బారావు.
అందరూ ఆగిపోయారు సడన్ బ్రేక్ వేసినట్లు.
"మళ్ళీ ఏ మొచ్చిందిరా నీకు?" విజయ్ గద్దించాడు.
"దీనికో దారీ తెన్నూ లేదు ఓ పక్కగా గాడాంధాకారం.మరోపక్క ఆయాసం. వేరోపక్క వీపుమీద టన్నులబరువు చుట్టూ నాచుకంపు . ఇలా ఎంతదూరం వెళ్ళినా మనగతి యింతే అయితే దిక్కుమాలిన చావు చస్తాం. బతికుంటే బలుసాకు పులుసు తిని బతకొచ్చు "
"బలుసాకు పులు సేం ఖర్మ నాయనా! మీ బామ్మచేసే బచ్చాలకుపులిసే తినొచ్చు" కమల్ వ్యంగ్యంగా అన్నాడు.
"ఇంక నే ముందుకు ఒక్క అరంగుళం కూడా కడలి రాలేనూరా మీ యిష్టం.!"
"వెనక్కి పోతావా"
"పోతాను. నన్ను పంపించండిరా బాబూ! ప్రయాణం మొదట్లోనే యింతకష్టం అనుకొలేదురా! హాయిగా యింట్లో కూర్చుని అరిశేలు, సున్నుండలూ తిని బామ్మ చెప్పే కబుర్లు వింటూ కూర్చోక వెధవ బంగారం మీద మోజుపడ్డాను బామ్మోయ్! నాకోసం విచారిస్తున్నావో ఏమో! ఈ కంతలో నే యిరుక్కుపోయానని తేలిస్తే మా బామ్మ......."
"డోంటాక్ రబ్బిష్ ! ఇష్టమై మాతో వచ్చి అరునొక్కరాగం ఆలాపిస్తావేమిటి! సుకుమారంగా పుట్టి పెరిగిన కృతి, నిశ్చల చూసు ఎంత నిబ్బరంగా వున్నారో!" కమల్ అన్నాడు.
"ఒరేయ్ సుబ్బుడూ! నేనేచెప్పేది జాగ్రత్తగా విను. అటు ఇద్దరు ఇటు ఇద్దరి మధ్యలో నీవున్నావ్ అవునా? నీ వెనుక వుంది నిశ్చల ఆ వెనుక వుంది కమల్ . వాళ్ళిద్దరూ వెనక్కి పోవాలి ఆపై వంగి నడవాలి. ఆపై లేచి నడవాలి. ఆపై నిన్ను గుహాబయట వదిలి వాళ్ళు మళ్ళీ ఇదే మార్గంగుండా ఇంత కష్టపడీ యిక్కడిదాకా రావాలి. అందాకా వేణూ కృతీ ఇక్కడ అనురాగ గీతాలో అద్వాన గీతాలో ఆలపిస్తూ ఉండి పోవాలి అవునా?"
"అవును కదా? అ పనేచేయాలి"
"ఛత్ . పూలిస్ గా మాట్లాడకు. మరలివెళ్ళే ప్రశ్నేలేదు. వీవేళ్ళా లనుకున్నా వాళ్ళమీంచి దాటి వెళ్ళటానికి చోటులేదు. ఈ బిలంలో ప్రవేశించాము. అంతే ముందుకే మనం వెళ్ళేది మృత్యువు ముంచుకొచ్చిన సరే దానికి ఎదురోడ్డి నిలిచి సాగిపోతా౦. అన్నింటికీ సిద్ధమయ్యే ఈ ప్రయాణం పట్టుకున్నాము ఇంక నీవు పెదవి కదపకు. నీవు కదిలి రాలేకపొతే నిన్ను వాళ్ళు నేట్టుతారు. నేను లక్కేళతాను సరేనా? నెట్టండిరా వాడిని రెడీ" అంటూ మళ్ళీ ప్రయాణం సాగించాడు విజయ్!
"అదిగాదురాఈ మార్గం ఇలాగే కొన్నివందల యోజనాల దూరం వుంటే ఎలా?" సుబ్బారావు గోణుకుటూ అన్నాడు.
"నీకు బతకాలనిలేదా?"
"వుంది కాబట్టే ఈ బాధ "
"ఈ మార్గం కొన్ని వందల యోజనాల దూరం నీ అతితెలివి ఆలోచనలా వుండదు. వుంటే అందరికీ నూరేళ్ళు నిండాయనుకుందాం. ఇంక నోరుమూసుకో " విజయ్ గట్టిగా అనటంతో సుబ్బారావు నోరుమూసుకున్నాడు. ఆలోచనలు యింటిదారిపట్టిస్తూ.
ఒక పళ్ళెంనిండా అరిశేలు. డబ్బా మూడో౦తులు జంతికలు చెకోడీలు .ఎర్రగా కళ్ళు చెదిరేలా కొత్తావకాయ ముద్దలు. దోసకాయ పప్పు. అప్పుడే వెన్నగాచిన నెయ్యి ఘుమఘుమలు . గట్టీమీగడ పెరుగు దానిమీద అరంగుళం మందాన మీగడ.మరచెంబునిండా చల్లని మంచి నీళ్ళు "తినరా పిచ్చినాయనా! మనిషికి తిండే పుష్టి గొడ్డుకి గుడ్డేబలము అన్నారు పెద్దలు. ఆ రోజుల్లో మీ తాతగారు."
"చల్లని గాలి తగులుతుందిరోయ్"
విజయ్ పెద్దగా అరిచాడు ముందుకు సాగుతూనే.
వెనక్కు తిరిగి వెళ్ళే యోగం ఎలాగూ లేదు. వీళ్ళు చస్తే ఆ శవాన్ని కూడా తను లాక్కెళ్ళటానికి ఏ మాత్రం మొహమాటం లేకుండా వున్నారు. ఇంక ఆయాసానికి బాధకి ఏడ్వటం దేనికని సుబ్బారావు హయిగావాళ్ళ బామ్మని తిండిని తలచుకుంటూ కాస్త ఉపశమనం పొందుతుండగా విజయ్ అరిచాడు.
నిజమే దగ్గరలో నీళ్ళు వున్నాయో లేక విశాలమైదదోవరాబోతున్నదో గాని చల్లని గాలి తగులుతున్నది.
"ఈ గాలిలో చల్లదనం వుంది కనుక ముందు మనకి నీరుతగలవచ్చు" కమల అన్నాడు.
"యూ ఆర్ కరెక్ట్ . ముఖం నేలకానించి చూడుతేమతెలుస్తుంది." విజయ్ అన్నాడు.
అందరి చేతులకి రబ్బర్ గ్లౌవ్స్ వున్నాయి. ముఖం నేల కానించి చూశారు. విజయ్ చెప్పింది నిజమే చల్లగా తేమగా వుంది నేల.
అప్పటికి అందరూ అలసిపోయి వున్నాను. అయినా పట్టుదలగా కార్యదీక్ష విడనాదకుండా మార్గంలో ఎం జరిగినా ముందుకు సాగేందుకే దృడ నిశ్చయ తోసాగిపోతున్నారు.
నేల చెమ్మదానం తెలిసేసరికి చెప్పలేనంత హుషారోచ్చింది.
నాలుగు నిమిషాల తర్వాత విజయ్ "నీళ్ళురా!" అంటూ అరిచి చెప్పాడు. నీళ్ళలో చేతులు పెట్టటం తెలిసిపోతున్నది అప్పటికే మిగిలినవారికి.
"నీళ్ళల్లో కూడా దేకుతూ పోవాలా?" సుబ్బారావు అడిగాడు.
"అదే చూస్తున్నాను" అన్నాడు విజయ్.
9
ఇంకోదడిగా ముందుకుపోతే ముఖం మునిగిపోటట్లుంది నీటిలో. అందరి పొట్టలకిందకి నీళ్ళు వచ్చాయి.
"ఇప్పుడేం చెద్దా౦రా విజయ్!" చివరినుండి కమల్ అడిగాడు.
"చూస్తేగాని చెప్పలేను. అందరూ అలాగే వుండండి" అంటూ విజయ్ కాస్త చెయ్యి పైకైత్తి టార్చ్ లైట్ వెలిగించాడు. ఫోకస్ ముందుకు వేశాడు. "జాగ్రత్తగా వినండి ఇక్కడంతా నీటిమాయం. లోతు మూరేడుమించి లేదనుకుంటాను చెయ్యిపెడితే నేల తగులు తున్నది . పొతే ఎదురుగా గోడలో రాయి కనిపిస్తున్నది. నీటిహొరు లేదు కాబట్టి నీళ్ళు ఎక్కడినుంచీ పడటంలేదు. వీటిలో కదలిక లేదు. కోనేరులా నిలవనీళ్ళేమో యివి" అంటూ లైటు ఫోకస్ పైకివేశాడు. విజయ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.