Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 9

   
    "అదికాదు ఆంటీ - అసలు ఆడపిల్లని ఎలా టాకిల్ చేయాలో తెలియదే" అన్నాడు రమణ.

    "అదేం గురువును పెట్టుకుని నేర్చుకోవాల్సిన విద్యకాదు. దానంతట అదే వచ్చేస్తుంది. అది సహజమైన విషయం. చేపపిల్లకు ఎవరైనా ఈత నేర్పిస్తారా? కాకిపిల్లకు ఎలా ఎగరాలో ఎవరైనా తెలియజేస్తారా? పుట్టుకతోనే అది వస్తుంది. కాబట్టి ఎలాంటి సందేహాలూ పెట్టుకోవద్దు" అంది.

    "నిజమేననుకో కానీ ఎంత నచ్చచెప్పుకున్నా నాకు ధైర్యం రావడంలేదు. అందుకే నువ్వు, పెద్ద మనసుచేసి....." అంటూ ఆగాడు రమణ.
   
    "ఇంతవరకు ఎవరి జోలికి వెళ్ళకుండా ఎంచక్కావున్నావ్. ఇప్పుడు అనవసరంగా...." అంటూ ఆమె కూడా ఆగింది.

    "అనవసరం కాదు ఆంటీ, చాలా అవసరం, లేకపోతే ఈ భయం తోనే నేను వెధవను అయిపోతానని దిగులుగా వుంది" అన్నాడు బేలగా.

    "తొలిరేయి అనుభవానికి ఇద్దరూ కొత్తైవుంటే ఆ దాంపత్యం చాలా రోజులు నిలుస్తుందని ఎక్కడో విన్నాను. కాబట్టి కొత్తగానే ఉండు" అంది ఆమె.

    "అదికాదు ఆంటీ. పాత అయితేనే నేను ధైర్యంగా వుండగలను. కాదనకు ఆంటీ"

    ఆమె ఎంత నచ్చచెప్పినా అతను వినకపోయేటప్పటికి ఇక తప్పదనిపించింది. ఇలాంటి భయం మగాడికి కలక్కూడదు. కలిగిందంటే దానిని పోగొట్టాలి. లేకుంటే అసలుకే మోసం వస్తుందని తెలుసు చంద్రరేఖకి.

    "సరే, అయితే రేపు రాత్రికి వెన్నెల మొదలయ్యే వేళకి గంగమ్మ గుడి వెనకాలకి వచ్చేసేయ్" అని ఒప్పుకుంది ఆమె.
    రమణ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. చంద్రరేఖ తనకి ఆ విషయంలో గురువైతే ఇక తనకు ఏ చింతా వుండదు పెళ్ళాం దగ్గర మంచి మార్కులే కొట్టేయచ్చు.

    "మరి వస్తానాంటీ. చంద్రుడు తూర్పున పైకి లేవగానే నేను అక్కడికివచ్చి వాలిపోతాను" అని వెళ్ళిపోయాడు.

    అంతవరకు లోపలి చినిగిపోయిన దిండును కుట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న చిట్టి రమణ వెళ్ళడంచూసి బయటికి వచ్చాడు.

    రెండోరోజు మధ్యాహ్నం నుంచి రమణకు యాంగ్జయిటీ ప్రారంభమైంది. ఎప్పుడు చంద్రోదయం జరుగుతుందా అని కలువ పూలకంటే ఎక్కువగా కాచుక్కూర్చుని వున్నాడు.

    సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి, బాగా ఉతికిన పైజమా లాల్చీ వేసుకున్నాడు. ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళబుద్దికాలేదు.

    అలా పొలం వెంబడి నడుచుకుంటూ వెళ్ళాడు.

    పైరగాలి కొత్తగా తగులుతోంది. ఆకాశంలోని మబ్బులు రెల్లుదుబ్బుల్లా వున్నాయి.

    ఆలోచనల్ని విడగొట్టడానికే వున్నట్లు వంటకాలువలు మధ్య మధ్య అడ్డొస్తున్నాయి.

    అలా తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు. లైట్ గా భోజనం చేసి కొబ్బరి చెట్టుకింద వేసిన నులకమంచం మీద పడుకున్నాడు.

    మరో పది నిముషాలకి ఆకాశంలో ఎర్రగా చంద్రుడు పుడుతున్నాడు. పెట్రోమాక్స్ లైట్ వత్తికి గాలి కొడితే .తెల్లగా ప్రకాశవంతమైనట్లు చంద్రుడు తెల్లరంగులోకి మారుతున్నాడు.

    హడావుడిగా బయల్దేరి గంగమ్మగుడి వెనకాలకి చేరుకున్నాడు. అప్పటికి చంద్రరేఖ ఇంకా రాలేదు.
 
    గుడికి ఆనుకుని వున్న మంచినీళ్ళ గుంటల నీళ్ళు నిశ్చలంగా వున్నాయి. ఆకాశం మీద మబ్బుల దుప్పటిని పరిచి దేవతలు ఒరుగులు పెట్టినట్లు నక్షత్రాలు మినుకుమినుకుమని మెరుస్తున్నాయి.

    చంద్రరేఖకోసం అతను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. మరో పది నిముషాలకి ఆమె వచ్చింది.

    ఆమెను చూస్తూనే అతను చిన్నగా జర్క్ ఇచ్చాడు. వెన్నెలతో నేసినట్టు తెల్లటి చీర, జాకెట్టులో ఏమరపాటుతో చంద్రవరిక ఆకాశం లోంచి పట్టుతప్పి కిందపడిపోయినట్టుంది. తనకే తప్ప మరెవరికీ వెన్నెల దక్కకూడదని ఓ చుప్పనాతి మబ్బు చంద్రుడ్ని కప్పేసినట్టు తలంటి స్నానం చేసిన ఆమె తల వెంట్రుకలు వెనుకభాగాన్ని కమ్మేశాయి.

 Previous Page Next Page