Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 8

 

    "పెద్దవాళ్ళని ఏమి అనకూడదని ఎక్కడా లేదు. ఎవరో ఒకరు నోరు ముసుకుంటారు కదా అని తప్పు లేకపోయినా చిన్న వాళ్ళనే కోప్పడుతుంటారు. వాళ్ళయితే వింటారు కదా. అది సంగతి" అన్నాడు రాజు. గొప్ప సత్యం కనిపెట్టిన వాడిలా ఫోజు పెట్టి.

 

    రాజు మాటలు సీతకి "నవ్వొచ్చాయి "చి పోరా." అంది ముద్దుగా.

 

    "రుపక్కకి తానే పెద్ద అందగత్తేనని గర్వం. ఎప్పుడు అద్దంతో ముఖం చూసుకుంటూ వుండటం, తల దువ్వుకోవటం, ఇప్పుడు నాకు అద్దము దువ్వేనా కావాలి. ఎలాగెం? గంటదాకా తలుపు తియ్యదు" అంది జయ.

 

    నేనో తమాషా చేస్తాను చూస్తూవుండు నెమ్మదిగా జయతో అన్నాడు రాజు.

 

    సహనానికి మరు పేరు సీత. తమ్ముడు చెల్లెళ్ళు అల్లరి చేస్తుంటే మృదువుగా మందలిస్తుంది గాని, అదేమని గట్టిగా అడగదు రాజు తరచుగా తమాషాలు చేసి నవ్వించటం తెలిసిన విషయమే. అయితే సీత నడగందే ఏ పని చేయడు రాజు. "చేయమంటావా." అన్నట్టు చూశాడు "ఊ" అంది సీత.

 

    తలుపు వద్దకెళ్ళాడు రాజు. గొంతు సవరించుకున్నాడు. అచ్చం రామచంద్రం మాట్లాడినట్టు "సీత! ఆఫీసు కాగితాలు మర్చిపోయనమ్మా! తీసుకెళదామని ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాను." అని ఆపై కాస్త స్వరం పెంచి తలుపు మీద తడుతూ "అమ్మాయ్ రూపా! తలుపు తియమ్మా! తొందరగా" అన్నాడు రాజు.

 

    "ఎందుకు" అంది లోపల నుంచి రూప నిజంగా తండ్రి వచ్చాడనే అనుకుంది.


    "ఆఫీసు కాగితాలు మర్చిపోయి వెళ్ళనమ్మా! తొందరగా తలుపు తియ్యి నా బంగారు తల్లివి కదూ!" రూపకి కోపం వచ్చినప్పుడు రామచంద్రం "బంగారు తల్లి, వరాలమూట " అంటుంటాడు అలాగే రాజు అన్నాడు.

 

    రాజు మాటలు రూప నమ్మింది.

 

    బళ్ళున తలుపులు తీసి అవతలికి తప్పుకుంది లోపలనే.

 

    బిలబిల మంటూ అంతా లోపలికి దూరారు, పక్కున నవ్వారు తెల్లబోయింది రూప.

 

    "ఆఫీసు కాగితం తీసుకు వెళ్ళిపోతాలేమ్మా రూపా" తండ్రి గొంతు అనుకరిస్తూ అన్నాడు రాజు.

 

    తండ్రి రాలేదని రూప కర్ధమయింది. తాను అందరితో చేరి నవ్వింది.

 

    కొద్ది సేపటికి అంతా మామూలయ్యారు.

 

    "జయా! నువ్వే తొందరగా తల దువ్వుకుని దువ్వెన యివ్వు" అంటూ రూప దువ్వెన జయకి అందించింది అప్పటికింకా రూప జడేసుకోటం కానేలేదు.

 

    "పోనేలే, నే కాసేపు ఆగుతాను నేవ్వే ముందు జడేసుకో," దువ్వెన తీసుకోకుండా అంది జయ.

 

    "రాజు నవ్వించబట్టే వాతావరణం చల్లబడింది. మరోసారి అయితే రూప కోపం ఇంత తొందరగా తగ్గాడు. రాజు చేసిన మిమిక్రి అది ధ్వని అనుకరణ కూడా పుటకలో రావాలేమో, నిజంగా అయితే రాజు కెవరు నేర్పలేదు."

 

    ఆలోచిస్తున్న సీత కళ్ళు చమర్చాయి.

 


                                                  6

 

    చేతులు కట్టుకుని తీవ్రంగా అటూ ఇటూ పచార్లు చేస్తున్న రామచంద్రం పచార్లు ఆపి బాబా కేసి చూశాడు.

 

    బాబా నిర్లక్ష్యంగా ముఖం పక్కకు తిప్పుకుని కూర్చున్నాడు.

 

    "నూట పాతిక రూపాయలంటే నీకంత తేలిగ్గా వున్నాయన్న మాట, బైటికెళ్ళి ఒక్క రుపాయంటే రూపాయి సంపాదించరా. కష్టమో సుఖమో తెలుస్తుంది. ఏమన్నా లేకపోయినా వెధవ నామోషిలకేం తక్కువ లేదు." అన్నాడు రామచంద్రం.

 

    "కాసేపు వగి ఆయనే వురుకుంటాడులే అనుకున్నాడు బాబా.

 

    "ఏ ధైర్యంతోరా అ గొప్ప, కాళ్ళ దగ్గిర కూటిని కాదంటున్నావ్, మన చేతుల్లో ఏమి లేదురా ఈ చిన్న విషయం గమనించ గలిగితే ఇంత మొండి తనం చేయవు."

 

    "మీ రెందుకు తొందరపడుతున్నారు నాన్నా బి.ఎ. పాసయ్యాను. హయిగా అయిదారొందలు తెచ్చుకునే జాబ్ వస్తుంది."

 

    "హాయిగా ....ఆహా ఎంత తేలిగ్గా చెప్పావురా, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, గోళ్ళు గిల్లుకుంటూ కూచుంటున్నారు. బి.ఎ. లు బి.కామ్ లు బియస్సీ లు చెప్పక్కరలేదు. ఇంటికి యిద్దరు ముగ్గురు కూడా వున్నారు. ఓ ఉద్యోగానికి పదివేల అప్లికేషన్లు వస్తున్నాయి. అలాంటిది....."

 

    "నాన్నా పదివేలమంది నిరుద్యోగులుంటే కనీసం వాళ్ళకోసం ఓ జాబ్ వుంది కదా ఆ జాబ్ అదృష్టవశాత్తు నాకే రావచ్చుగా!"   

 Previous Page Next Page