కానీ ప్రత్యేకంగా ఎవరూ కంప్లయింట్ చేయకపోయినా నీలిమ హాస్టల్కు రావడం లేదనీ, వార్డెన్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అల్లరి భరించలేనిదిగా వుందని కాలేజీ ప్రిన్స్ పాల్ కు ఎవరూ ప్రత్యేకంగా చెప్పకుండానే తెలిసిపోయింది.
వాస్తవానికి ప్రిన్సిపాల్ కూడా అదే విషయాన్ని గురించి రెండు రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు కూడా....ఎందుకంటే కాలేజేకి వచ్చిన నీలిమ వున్నట్టుండి ఎక్కడకు వెళ్లిందో , ఎందుకు వెళ్లిందో ఎవరికీ చెప్పకుండానే ఎటో వెళ్ళిపోయింది.
ఏ లెక్చరర్ కూ కనిపించలేదు. ఏ క్లాసూ తీసుకోలేదు.
దానికి తోడు హాస్టల్ కూ వెళ్ళలేదని తెలియడంతో మరింత ఆశ్చర్యంగా వుంది.
నీలిమ ఆర్కియాలజీ లెక్చరర్ గా జాయిన్ అయిన తర్వాత ఆమె గురించి ఒక్క బేడ్ రిమార్క్ కూడా వినివుండని ప్రిన్సిపాల్ అప్పుడు తొలిసారిగా రెండు రోజులు నుంచి గైర్ హాజరయిన నీలిమ ప్రవర్తన గురించి తొలిసారిగా ఆలోచిస్తున్నాడు.
* * * *
జారిపోతున్న లుంగీతో వచ్చి విసుక్కుంటూ తలుపు తీసిన సుధాకర్....ఆడ పోలీస్ ఇన్స్ పెక్టర్ ని చూడగానే అవాక్కయిపోయాడు.
ధీరజ అతని ఫీలింగ్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా గదిలోకి నడచింది.
బెడ్ మీద మెడవరకూ దుప్పటి కప్పుకుని పడుకునివున్న సుందరాంగి ముఖం పాలిపోయింది.
పైన సీలింగ్ ఫాన్ తిరుగుతున్నా క్షణాలమీద ఆమె ముఖం నిండా చమట్లు పట్టింది.
''వెల్ మిస్టర్ సుధాకర్....ముక్కుపచ్చలారని అమాయకపు ఆడపిల్లలకు విద్యాభోధన చేసి సరయిన మార్గంలోకి మళ్ళించే పవిత్రమయిన వృత్తిలో వుండి నువ్వు చేసేది ఇలాంటి రంకు వ్యవహారం అన్నమాట....ది గ్రేట్ ఆర్కియాలజీ లెక్చరర్ సుధాకర్ గారు....మీలాంటి దగుల్బాజీ లెక్చరర్లు వుండబట్టే యువత సరియైన మార్గంలో పయనించలేకపోతూన్నారు.'' ఈసడింపుగా మాట్లాడుతున్న ధీరజ మాటలను మధ్యలోనే అడ్డుకున్నాడతను.
''చుడండి మిస్....మీ యునిఫారం చూసి మీకు గౌరవం ఇస్తున్నానని తెలుసుకొని మాట్లాడటం మంచిది.''
''యూ బ్రూట్....నీలాంటి దగుల్బాజీగాళ్ళు ఇచ్చే మర్యాద ఎవరికీ కావాలి .''
''మిస్ డోంట్ లూజ్ యువర్ టంగ్.''
''షటప్ యూ రాస్కెల్....బ్రోతల్ నేరం క్రింద ఇప్పటికిప్పుడు నిన్ను తీసుకెళ్ళి సెల్ లో పడేసి కుల్లబొడిస్తే తప్ప నీలాంటి వాళ్ళకు బుద్దిరాదు.''
''సారీ మేడమ్! ఇది సాని కొంప కాదు , నా అనుమతి లేకుండా నా ఇంట్లోని మనుషులను బలవంతంగా తీసుకెళ్ళడానికి ఏ చట్టమూ ఒప్పుకోదని మీకు తెలియదనుకుంటాను. ఒక స్త్రీ ఇష్టపూర్వకంగా నాతో సెక్స్ సుఖం పొందటానికి వచ్చినప్పుడు అది మీ దృష్టిలో వ్యభిచారనేరం అవుతుందా? నేనేమి రెప చేయలేదు....పై పెచ్చు ఏ వేశ్యను తెచ్చుకోలేదు. ఆమె గర్ల్ ఫ్రెండ్....నా పర్మిషన్ లేకుండా వచ్చి నా ఏకాంతాన్ని భంగం కలిగించినందుకు అసలు మీపై డిఫమేషన్ సూట్ వేయాలి.''
ఆ మాటలను బట్టే సుధాకర్ ఎంత చమత్కారో ఇన్స్ పెక్టర్ ధీరజకు అర్ధమయింది. అలాంటి వ్యక్తిని మాటలతో మభ్యపెట్టో, బెదిరించో సమాచారం రాబట్టే ప్రయత్నం చేసేకన్నా సూటిగానే అడగటం మంచిదనే నిర్ణయానికి వచ్చిందామె.
''లుక్ మిస్టర్ సుధాకర్, ఇంత అర్ధరాత్రి వేళ నీతో వాదిస్తూ కూర్చోవడానికి రాలేదు. అవునూ....నీకు గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువే వున్నారనుకుంటానే....''
''వాట్ డూ యూ మీన్?''
'' డోంట్ బీ సీరియస్ మాన్! లెక్చరర్ నీలిమ నీకు బాగా తెలుసు కదూ?'' అతని ముఖం వైపునే పరిశీలనగా చూస్తూ అడిగిందామె.
తెలుసన్నట్టు తల వూపాడతను.
''ఆమె రెండు రోజులుగా కనిపించడంలేదని మీ కాలేజీ ప్రిన్స్ పాల్ రిపోర్టు ఇచ్చారు. ఆ విషయంలో ఎంక్వయిరీ కోసం వచ్చాను. ఆమె కూడా మీ డిపార్టుమెంటు లెక్చరర్ కాబట్టి ఆమె గురించి ఎక్కువ విషయాలు చెప్పగల వ్యక్తి మీరేనని నాకు తెలుసు '' ధీరజ ఒక్కోమాట ఆచి తూచి నట్టు మాటాడింది.
సుదాకరకు అప్పటికి కొంచెం ధైర్యం వచ్చింది.
తనపై నిఘా వేసి వచ్చిందేమోనని సందేహం కాస్తా పటాపంచలైపోయింది.
''మీ కేం కావాలో అడగండి.''
''నీలిమకు ఎవరయినా బందువులున్నారా?''
''నాకు తెలిసి ఎవ్వరూ బంధువులు రారు. కానీ ఒక చెల్లెలు మాత్రం వుంది. ఎక్కడో చదువుకున్నట్టు ఆమె ఒకసారి మాటలమధ్యలో చెప్పినట్టు గుర్తు.''
''ఆమెకు యింకా పెళ్ళికాలేదు కదూ?''
''అవును మేడమ్! అయినా ఆమెకు పెళ్ళేందులెండి.''
''అదేంటి ?'' ధీరజ అనుమానంగా ప్రశ్నించింది.
''పెళ్ళి చేసుకుంటే ఒకే భర్తతో కాపురం చేయవలసి వస్తుందని''
''కాస్త వివరంగా చెప్పండి.''
''మీరు ఆడవాళ్ళైవుండి ఆ మాత్రం అర్ధం చేసుకోలేకపోయారా-పెళ్ళి చేసుకుంటే మరొకమగవాడితో స్వేచ్చగా వుండే హక్కును కోల్పోతుందికదా!''
''అంటే....''
''అది తెలియాలంటే నీలిమ ప్రవర్తన గురించి మీరు తెలుసుకోవాలి. ఆమె పైకి కనిపించేటంత సామాన్యురాలు కాదు. చక్కగా ఆకర్షణీయంగా వుండే మగవాళ్ళకోసం అందమయిన వలని విసురుతుంది. చివరకు వాళ్ళను సాలెగూటిలో చిక్కుకున్న ఈగలా తన చుట్టూ తిరిగేల చేసుకుని వాళ్ళ దగ్గరనుంచి సాధ్యమయినంత ఎక్కువ డబ్బు చేజిక్కించుకొని తరువాత వాళ్ళను దూరంగా వుంచుతుంది. అవసరమయినప్పుడల్లా తన అందమయిన శరీరాన్ని వాళ్ళకు పూలపాన్పులా అమర్చడంతో తేలుకుట్టిన దొంగల్లా ఆమె చేతిలో భంగపడిన మగవాళ్ళేవరూ తాము ఏవిదంగా మోసపోయిందీ చెప్పుకోలేరు'' ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్లు మౌనం వహించాడు సుధాకర్.