Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 4

    చెట్ల  కొమ్మలన్నీ జడలు విరబోసుకున్న భుతాల్లా పూనకం  వచ్చి ముందుకూ వెనకకూ ఊగిపోతున్నాయి. ఆకుల సందులో నుంచి వీస్తున్న గాలి నక్క ఊళలు పెడుతున్నట్లు వింత శబ్దాలను  స్పుస్టిస్తుంది.

    నగరమంతా అమావాస్య చీకటి పరుచుకుని వున్నా  ఆ  తోటలో మాత్రం ఎవరో  టార్చ్ లైట్ వేసినట్టు గుప్పుమంటూ వెలుగు....ఆ  వేలుగులోంచి పుట్టుకు వచ్చినట్లు తెల్లని  ఆకారం మెల్ల మెల్లగా  నడిచి వస్తోంది.

    ఆ  ఆకారం గెస్ట్ హౌస్ ని సమీపించింది.

    ఎవరో బలవంతంగా  తెరిచినట్లు ధడేలున ముగ్గురు మిత్రులున్న గది తలుపులు తెరుచుకోవడంతో  ఆ గదిలోకి  అడుగుపెట్టిందామె.

    వాకిలి దగ్గరే నిలిచి  ఒకసారి  ఆ గది నలువైపులా  పరిశీలనగా చూసింది. గదంతా చిందరవందరగా వుంది. తాగి పారేసిన విస్కీ సీసాలు, పగిలిన గాజు గ్లాసు  పెంకులు, సిగరెట్ పీకలు,  నలిగిపోయిన బెడ్ , వాడిపోయిన పూలు, చిట్లిన గాజుముక్కలు అస్తవ్యస్తంగా పడివున్నాయి. తలొకవైపున అపస్మారకంగా జోగుతున్న ఆ ముగ్గురు మిత్రులను  ఆ  స్థితిలో చూడగానే ఆమె ముఖంలో కటినత్వం చోటుచేసుకున్నది.

    ఆమె  ఆర్కిటాలజీ ప్రొఫెసర్  నీలిమ!

    మెల్లగా  ప్రారంభమయిన ఆ నవ్వు  క్షణక్షణానికీ పెద్దదై భయంకరమైన వికటాట్టహాసంగా మారిపోయింది.

    '' హహ్హా...హ్హ...హ్హ...హ్హ...హ్హ...''

    ప్రళయ ఘోషలా వినిపిస్తున్న ఆ  హాసద్వనికి ఎవరో  తట్టిలేపినట్టు ముగ్గురికీ ఒక్కసారిగా మెలకువ వచ్చింది.

    కళ్ళు తెరిచీ తెరవగానే ద్వారంలో  నిలిచి వున్న  నిలువెత్తు తెల్లని ఆకారాన్ని  చూడగానే వాళ్లకి మతులు పోయాయి. వెనకనుంచి లైటింగ్ పడటంవల్ల  ఆమె రూపం స్పష్టంగా  కనిపిస్తోంది.

    అంతవరకూ వికృతంగా నవ్విన ఆమె  పెదవులు ఇప్పుడు సమ్మోహనంగా నవ్వుతున్నాయి.

    ''ఓ మైగాడ్! నీలిమా లెక్చరర్ దెయ్యం  అయిందిరోయ్'' అంటూ  గావు కేక పెట్టాడు రమేష్.

    అంటూనే స్పృహ తప్పిపోయాడతను.

    మిగిలిన ఇద్దరూ కూడా ఆ షాక్ కు  ఎలా  వున్న వాళ్ళు  అలానే కుప్పకూలిపోయారు.

    అ దృశ్యం చూసి వెనుదిరిగి పోయింది ఆ ఆకారం.

    అంతవరకూ పట్టపగలూ వెలిగిన వెలుతురు అదృశ్యమైంది.

    భీభత్సం స్పృస్తిస్తున్న ప్రకృతి చల్లబడింది.

    మెల్లగా చీకట్లో కలిసిపోయింది లెక్చరర్ నీలిమ.

           *            *           *          *

    యూనివర్సిటీ హాస్టల్ స్టూడెంట్స్ ఇంకా  ఆ షాక్  నుంచి  తేరుకోలేకపోయారు.

    ఎంతో స్ట్రిక్ట్ గా వుండే తమ వార్డెన్ వున్నట్టుండి ఇంత కరుణా మయిలా ఎలా మారిపోయింది? ఎప్పుడు మారిపోయిందా? అనే ఆశ్చర్యం నుండి తెప్పరిల్లడం వాళ్ళకి అసాధ్యమయింది.

    డిసిప్లిన్ అతిక్రమించినట్టయితే పనిష్మంట్  ఇచ్చే వార్డెన్ వున్నట్టుండి 'లెటజ్ ఎంజాయ్ ది నైట్' అన్నాడంటే ఆశ్చర్యమేకాదా మరి.

    ''మేడమ్....మీరేనా....మీరేనా ఈ  మాటలంటున్నది?''

    ''ఎస్ మైడియర్ లకుముకి! జీవితమంటే ఎప్పుడూ సీరియస్సే కాదు-సరదాగా వుండటం కూడా  అని తెలుసుకో'' నవ్వుతూ చెప్పింది  నీలిమ.

    ఆ మాటలకు ఉలిక్కిపడింది ఆ అమ్మాయి.

    ''మేడమ్! నా పేరు లత అయితే మీరు  ఇంకేదో పేరుతొ పిలుస్తున్నారేంటి?'' ఆశ్చర్యాన్ని అణచుకుంటూ అడిగింది ఆ అమ్మాయి.

    ''నోనో మిస్ లతా....! నేను కరెక్ట్ గానే పిలిచాననుకుంటున్నాను. ఎందుకంటే  నీ బోయ ఫ్రెండ్ నిన్ను పిలిచేది 'లకుముకి' అనే కదా.... అందుకే ఆపేరుతో పిలిచాను.''

    ఆ అమ్మాయికి మరొక షాక్!

    నిజమే....తన ప్రియుడు  తనని అలాగే  పిలుస్తాడు. అతన్నేప్పుడూ మేడం చూడలేదు. కనీసం తనెప్పుడూ అతని టాఫిక్ తేలేదు కూడా....కేవలమ్ తమ ఇద్దరికీ మాత్రమే తెలిసిన ఆ లవ్ కోడ్ మేడం కు ఎలా తెలిసిందో  ఎంత బుర్ర చించుకున్నా అర్ధంకాలేదు ఆ లతాంగికి.

    ''మిస్ లతా! ఆ విషయం  నాకెలా తెలుసునని ఆలోచించి బుర్ర చెడగొట్టుకోకు....ఒక్క నీ  విషయమే  కాదు- ఐనో ఎన్విసిథింగ్ అండర్ స్టాండ్'' ఈసారి నీలిమ గొంతులో చిలిపితనంలేదు.

    ఎప్పటి నీలిమలా మారిపోయింది.

    ''గో  ఆన్ గర్ల్స్ ....మీ రూమ్స్ కు వెళ్ళిపోండి. క్రమశిక్షణకు నేనెంత ప్రాదాన్యత ఇస్తానో మీకు తెలుసు కదా? ఐ డోంట్ టాలరేట్ యువర్ ఇన్ డిసిప్లిన్....రెండే రెండు నిమిషాలలో ఎప్పటిలా మన హాస్టల్ ప్రశాంతంగా వుండాలి.''

    ఆర్మీ కాప్టెన్ ఆర్డర్స్ జారీ చేసినట్టు ఖంగుమంటున్న గొంతుతో చెప్పి తన ఆఫీస్ గది వైపు  చకచకా నడిచి వెళ్ళిపోయింది  నీలిమ.

    లేడీ స్టూడెంట్స్ అందరూ ఖంగుతిన్నారు.

    ఇంతకు ముందు సరదాగా మాట్లాడింది. నవ్వుతూ తమతో కలిసిపోయింది. అసలు  ఈ  హాస్టల్ చరిత్రలోనే  లెక్చరర్ నీలిమను అలా చూడటం అసంభవం అన్న విషయం  నిజం చేసింది.

    కాని క్షణాలమీద నీలిమలో మార్పు వచ్చేసింది. ఎప్పుడూ  స్ట్రిక్ట్ గా  వుండే బ్రహ్మరాక్షసి అవతారాన్ని  దాల్చింది.

    ఎంతలో ఎంత మార్పు....అసలు అదెలా సంభవం? రెండు రోజులుగా హాస్టలకు రాకుండా గైర్ హాజరయిన ననీలిమ వున్నట్టుంది ఇంత అర్ధరాత్రి వేళ రావడమేంటి?  ఒక గంట కూడా  హాస్టల్ వదలి  బయటకి వెళ్ళని వ్యక్తి ఏకంగా నలభై రెండు గంటల పాటు హాస్టల్లో లేనే లేదంటే ఎంతో ఆశ్చర్యం గొలిపే విషయమేగా మరీ? అయినా ఎవరూ నోరెత్తి అడిగే సాహసం చేయలేదు....చేయలేరు కూడా!

 Previous Page Next Page