Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 6

    ''మైగాడ్! నీలిమ అంత నీచురాలా?''

    ''ఎస్ మేడమ్! ఎందుకంటే ఆమె ఉచ్చులో చిక్కుకోకుండా బయటపడిన వాడిని బహుశా నేనోక్కడినేనేమో....నాకు కూడా  ఎర వేసింది కాని  నేను ఆమె ప్రవర్తన పసిగట్టి కావాలనే దూరంగా వున్నాను. బహుశా అలా ఎవరితోనో హనీమూన్  ట్రిప్ కు  చెక్కేసి వుంటుంది. అందుకే కాలేజీకి గైరుహాజరయివుంటుంది.''

    అతను చెప్పే మాటలలో నిజం  వుందనిపించింది  ధీరజకు.

    బాధ్యత కలిగిన లెక్చరర్ వృత్తిలో  వుండి అంత నీచంగా ప్రవర్తించగలిగిన నీలిమపై ఆమెకు ఏహ్యభావం కలిగింది. అలాంటి  నీతిమాలిన లెక్చరర్ ఆచూకీ తీయడానికేనా తాను యింత అర్ధరాత్రి వేళ బయలు దేరి వచ్చింది!

    ఆ  ఆలోచనలతో ధీరజ గిరుక్కున వెనుదిరిగింది.

    మరు నిమిషంలోనే ఆమె స్కూటర్  దూసుకుపోయింది.

    అది చూసి సుధాకర్ పగలబడి నవ్వాడు. పడకమీద వయ్యారి అతనితో గొంతు కలిపింది.

    ''పూర్ ఆఫీసర్....నా మాటలను నిజమని నమ్మింది. నీలిమపై కసి తీర్చుకునే అవకాసం ఇన్నాళ్ళకు దొరికింది....నౌ షి ఈజ్  కారెక్టర్ లెస్ లేడీ.''

    అతను అంటుండగానే ఠఫ్ మంటూ కరెంట్  పోయింది.

    ''అరెరే....కరెంట్ పోయిందే'' అన్నది  ఆ వగలాడి.

    ''పోతే పోనీయ్! ఇప్పుడు మరింత బాగా ఎంజాయ్ చేయవచ్చు .'' సుధాకర్ మాటలకు రిప్లయ్ ఇవ్వలేదు ఆ అమ్మాయి.

    ''ఏంటి డియర్ మాట్లాడవు?''

    అయినా ఆసుందరి  పలకలేదు.

    నవ్వుకుంటూ బెడ్ పైకి చేరుకొని , ఆ  చీకటిలోనే దుప్పటిలో దూరి  ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు సుధాకర్.

    అంతే....

    కణకణలాడే నిప్పును  కౌగిలించుకున్నట్టు కరెంట్ షాక్ కొట్టిందతనికి.

    వెర్రిగా కేకవేసి అమాంతం బెడ్  పై నుంచి క్రిందకు దూకాడు.

    ఆ  క్షణంలోనే  కరెంట్ వచ్చింది.

    వెయ్యి  వోల్టుల విద్యుత్ తాకినట్టు క్రిందపడి వణికిపోతున్న సుధాకర్ తలపైకి  ఎత్తి బెడ్ వైపు చుసాడు.

    లెక్చరర్ నీలిమ నవ్వుతూ కూర్చుని వుంది.

    సుధాకర్ కు  మతిపోయినంత పనయింది. నమ్మలేనట్టు కళ్ళు నులుముకుని మరీ చూశాడు.

    సందేహంలేదు ....ఆమె నీలిమే!

    మరి, తనకు ఇంతవరకు సుఖాలు పంచి ఇచ్చిన వగలాడి  ఏమైనట్టు? అదీగాక యింత హటాత్తుగా, నమ్మలేని విధంగా ఆమె  స్థానంలో నీలిమ వుండటం ఏమిటి? తను తాకగానే  హైవోల్టేజ్ విధ్యుత్  తాకినట్టు షాక్ కొట్టడం ఏమిటి?

    ''రా....రమ్మన్నట్టు'' చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది నీలిమ.

    'అయ్య బాబోయ్!' లేచి పరుగు పెట్టబోయి లుంగీ వూడి కాళ్ళకు అడ్డుపడి నేలపై పడిపోయడతను.

    సుధాకర్ తల సూటిగాపోయి నేలకు ఠంగ్ మని కొట్టుకుంది.

    అసలే షాక్ కు  లోనై వుందతని మెదడు....బలంగా తాకిన ఆ  దెబ్బకు  దిమ్మెరపోయింది.

    కళ్ళు ముడతలు పడుతున్న ఆ సమయంలో సుధాకర్ చూపులు బెడ్ పైకి మళ్ళాయి.

    ఇప్పుడు అక్కడ నీలిమ లేదు.

    ఎలా సంబవం అది?

    నీలిమ ఏమైంది? అసలు నీలిమ ఎలా వచ్చింది?

    ఎన్నో ఆలోచనలు  చెడ పురుగులా అతని మెదడును తోలుస్తున్నా, అవేమీ పట్టనట్టు మగతలోకి జారిపోయాడతను.

                *            *          *          *

    కాలింగ్ బెల్ మ్రోగడంతో చేసే పని ఆపి  లేచి నిలుచున్నది  ఇన్స్పెక్టర్ ధీరజ....సాధారణంగా తనకోసం ఇంటికి వచ్చేవారెవరూ లేరన్నట్టే!

    ఎవరొచ్చి వుంటారో?

    తలుపులు తెరుచుకొన్న మరుక్షణంలోనే చిరునవ్వుతో లోనికి వచ్చాడు ఆ పెద్దమనిషి.

    ''శేఖర్ ....నువ్వా?!''

    అప్రయత్నంగానే  ధీరజ పెదవులు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.

    ''హౌ ఆర్ యూ....మైడియర్ స్వీట్ హార్ట్?'' అంటూ అమాంతం  ఆమెను కౌగిలించుకుని గుండ్రంగా తిప్పేసాడు.

    ''ఏయ్ నాటీ....కళ్ళు తిరుగుతున్నాయి. ఆపేయ్'' అతని భుజంపై, తల వాల్చి, అతని చెవిలో కువకువలాడిందామె.

    ''పెద్ద పోలీస్ ఆఫీసర్  గా పోజు  కొడుతున్నావ్ గా....ఈ  మాత్రానికే బయపడితే ఇక నువ్వేం పోలీస్ ఉద్యోగం చేయగలవు?'' అంటూ ఆమెను అలాగే  ఎత్తుకెళ్ళి మంచంపై పడేశాడు.

    ''అబ్బ తలుపులు తీసే వున్నాయి.''

    ''ఓహో ....తలుపులు వేస్తె ఫర్వాలేదన్నమాట....అయితే వేసి రమ్మంటావా?'' చిలిపిగా ఆమె బుగ్గపై చిన్న ముద్దొకటి ప్రజెంట్ చేసి  ఆమెను వదిలేసి అలసటగా మంచంపై వెనక్కు వాలాడు శేఖర్.

 Previous Page Next Page