Previous Page Next Page 
పాదాభివందనం పేజి 5

'నువు శకుంతల నెచ్చలివి కదా! అందుకే ఆ అనందం!' నవ్వుతు అన్నాడతను.

'కృష్ణశాస్త్రిగీతాలు చదివారా?'

'పిచ్చిపిల్ల! అనుకున్నారయనా. క్షేత్రయ్య సారంగపాణి. కృష్ణశాస్త్రి, పినారె, వేటూరి, వీళ్ళంతా భ్రష్ట యోగులు, సభ్య శ్రుంగారాన్ని భగవంతుడికి అంకితం చేసిన మహానుభావులు, అన్ని పాటలు వదిలేయ్. మనసున మల్లెలు మాలలుగా వుగించగలిగిన వూహశాలి శాస్త్రిగారొక్కరే.'

"మీరు గొప్ప విమర్శకులు.' మెచ్చుకోలుగా అంది.

తన మనస్సులోని భావాలకు ప్రతిబింబాలన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉంటె పరవశించి వింటుంది భువన.

'వెళదామా! చీకటి పడింది' అన్నారాయన. ముగ్గురూ లేచారు.

'మళ్ళీ ఎప్పుడు!' అన్నట్టుగా చూసింది భువన.

సాయంసమయంఇంట్లో ఎవరూ లేరు. పుట్టినరోజున వచ్చి ఈ రోజు వస్తానని చెప్పి వెళ్ళాడు రజని. ఎదురుచూస్తూ కూర్చుంది భువన. సరిగ్గా ఆరింటికి వచ్చాడతను.

కళ్ళు స్వాగతం చెప్పాయి. తోటలోనే కూర్చున్నారిద్దరూ. ప్రశాంతత భంగపడని ఏకాంతం. 'మోహిని! ఆ గొంతులోయుగ యుగాల ఆర్తి."

ఉలికిపడింది ఆమె. తొలినాడే. తొలి చూపులోనే, తొలి పరిచయంలోనే ఈ పరిస్థితి తప్పదని వుహించిందామె. ముప్పయి మూడేళ్ళ వయస్సులో ఏనాడూ మనస్సు ఎవరి పాదాల ముందూ పారవేసుకొని ధీరగంభీర హృదయ భగవంతునిలీలలు చిత్రమైనవి.

వూహ తెలిసిన నాటి నుంచి అలా పిలిపించుకోవాలనే ఆశ. అదేన్నాడు తీరలేదు. ఆ కోర్కె తీరకుండానే పోతాననుకునేది.

'నన్ను క్షమించు- దాదాపు నాలుగుపదుల వయస్సు నాది. అనుభవంలో అనుభూతి రసించి, నిరసించిపోయింది. అద్యాత్మపధాల వైపు పరిగిడే మనస్సు ఈ నెల రోజులుగా రాగభావనలతో నిండి పోతోంది. యౌవనం తొలిదశకి వెళ్ళిపోతున్నాను.

నిన్ను పలకరించేదానికి ముందు పదిహీను, ఇరవై రోజులుగా ఎంతో తపనపడ్డాను. తొలి చూపులోనే ప్రేమించాననటం ఒక్క యువకులకే పరిమితం కాదని తెలుసుకున్నాను. మన వయస్సు లేమిటి? మన స్థితులేమిటి? సాంఘికంగా మన స్థాయి ఏమిటి?

కానీ, మోహిని, మనస్సు ఇవన్ని ఆలోచించదు. నీవు.....నీవు అంటూ కలవరిస్తోంది. నీ సన్నిధి కోసం తపిస్తోంది. నీ దర్శనం కోసం ఆరాటపడుతోంది. నిర్మోహమైన ఈ ఆర్తి- స్వచ్చమైన అనురాగం లోకం దృష్టిలో ఎలా ఉంటుంది? నువేమనుకుంటావ్ మనస్సు విప్పలేను.

విప్పకుండా ఉండలేను. అందం, హృదయ సౌందర్యం, భావుకత, తన లోలతం- అన్నీ ముర్తిభవించిన నీ సన్నిధికి రాలేకుండా పోతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా సాధించిన మనో నిగ్రహం పటాపంచలైపోయింది.

ఆర్తిగా విన్న వించుకుంటున్నాను. అపార్ధం చేసుకుని తిరస్కరిస్తే ఈ జన్మకు భాగ్యం లేదనుకుంటాను. అర్ధం చేసుకుని స్వీకరిస్తే ప్రేమ ఫలించిన ప్రేమ పుజారిలా తప్పస్సు ఫలించిన భక్తుడిలా ఆనందిస్తాను.

నిర్హేతుకజా యమాన కటాక్షంతో పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లయింది. భువన మోహినికి. తన గుండె లయ తప్పుతున్న వేళ సవరించినట్లు ప్రేమగా వరించినట్లు అనిపించింది.

'రజని!' ఆమె గొంతులో ప్రేమపారావతాలు గిరికిలు కొట్టాయి.

'ఇది నేనెన్నడు అనుభవించని స్థితి. చదువుకునే రోజుల్లో, సంగితం అభ్యసించిన వేళల్లో. కన్నేగా నేను కలలు కన్నరోజుల్లో నేనుకన్న కలలన్ని రూపు దాల్చినట్టు నివి ఎదురయ్యావు. జీవితంలో ఏనాడూ ఇంత అదృష్టం పడుతుందని అనుకోలేదు. ఇలా అకాల శరత్ జ్యోత్స్న కెరటాలు విరిగి పై బడతాయని వూహించనేలేదు.'

ప్రశాంతమైన సాగరంలో అలలు రేగినట్లయింది. మనస్సు నిగ్రహించుకోలేను. ధర్మ మార్గం అతిక్రమించలేదు. నీ పాదం ముందు ఆత్మార్పణ చేసుకోకుండా ఉండలేదు. నిన్ను చూసే దాకా నాలో రాగ రస జాల ఇంకా రగులుతూనే ఉందని నాకు తెలిదు. ప్రేమ తరంగాలు బలంగా బలహీనమైన గుండెని తాకుతాయని అనుకోనేలేదు.'

'చాలు మోహిని, చాలు! నీ ప్రేమికుడు ధన్యుడు.'

ఏ విధమైన వ్యామోహం లేని ఈ ప్రేమ గుండెమో గిలిగింతలు పెడుతోంది. అచ్చమైన వెన్నెల తరంగాలాంటి నీ ప్రేమ- రజని- నన్ను- నా ప్రేమని నా జన్మని ధన్యం చేసింది. రసహినతతో ముడిపడి నిరసించిపోయిన బ్రతుకు తిరిగి రసించింది.'

'భగవంతుడు నిర్దయుడు, దయావంతుడు.'

'కరుణామయుడు గుండెలో గుబులుని సేదదిర్చాడు. ప్రేమ కోసం ఆర్తిగా అలమటించే రెండు హృదయాలను చేరువ చేశాడు.

అతను చప్పున ఆమె పాదాల నిస్పృశించాడు. 'దే'వి మూర్తి లాంటివి చరణాలు నా మనోమందిరంలో సుప్రతిష్టతమయ్యాయి. ఈ దాసుడు తరించాడు. నీ ప్రేమకి- రాగబావనకి పాదాభివందనం చేస్తున్నాను.

ఆమె అతని చేయిని అలాగే స్పృశించింది. ఇద్దరిలోనూ స్పందన లేదు. శాంతించిన కడలి కెరటాల్లా ఉన్నాయి మనస్సులు.

'మనం ఏ జన్మలో శాపగ్రస్తులం.'

ఆమె అతని పెదాలని అరచేత్తో మూసింది. తలిరాకుజొంపాల్లాగా ఉన్న ఆ పెదాల స్పర్శ ఆమెకి పరమశీతలంగా - హృద్యంగా ఉంది. అదృష్టవంతులం. జన్మాదిగా వెదుక్కుంటూ ప్రవహిస్తున్న ప్రేమ వాహిని ప్రణయ సాగరాన్ని చేరుకున్నది' ఆమె గొంతులో కోటి వ్రతాలు ఫలించిన తృప్తి.

'నిజం! అతని కళ్ళు మిలమిల్లాడాయి. 'మోహినీ!'

'రజని! నేను ఈ పిలుపుకి కూడా నోచుకోలేదంటే నమ్ముతావా! నువులా పిలుస్తూ ఉంటే నా నరాల ప్రణయ రహదారుల్ల్లో వలుపుటేరులు పరిగెడుతున్నాయి. జన్మ తరించింది. మనది నిషిద్దప్రేమ. వుహూ-కాదు- జన్మ జన్మల బంధం.

'మోహినీ! నా తపస్సు ఫలించింది. ఇన్నేళ్ళుగా కలలుకంటున్న స్త్రీ మూర్తివి నువు.

గాయత్రీ దేవి ప్రత్యక్షమైనట్టు శ్రీ విద్యాధిదేవత స్వప్న సాక్షాత్కరమైనట్టు ఉంది. నీకు మరోసారి పాదాభివందనం చేస్తున్నాను. స్త్రీ అమృతమూర్తి, అనురాగమూర్తి అని మరో పర్యాయం రుజువు చేశావు.

'నా గుండె సేద దీరింది, రజనీ! విన్నవించలేక మనసులో దాచుకోలేక ఎంతగా తపించానని!'

 Previous Page Next Page