'నా జన్మ జన్మల చెలి! నేను సగంలో తపం చెడిన భక్తుడిని. వచ్చే జన్మ మనదే! నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేస్తాను. కనుగొన్న నిన్ను విడువలేను.'
'అంతరంగదారాన్నయినా చేరలేని మనుషుల్తో జీవించిన నాకు నా అంతరంగాన్ని కదిలించిన ప్రేమముర్తిగా నీవు లభించావు- ఈ జన్మకిదిచాలు.'
అతను ఆమె చేయి అందుకున్నాడు. వెచ్చని రక్తం అతి నెమ్మదిగా రాగావహినిలా ప్రవహిస్తోంది. దేవి సన్నిధిలో మనస్సు శాంతించినట్టుగా ఉంది.
ఆమె మనస్సులో ప్రేమ తరంగాలు అతణ్ణి అభిషేకిస్తున్నాయి. వలపు వాహిని గమ్యం చేరుకున్నది.
రసపల్లవం
కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ చాలా సందడిగా వుంది. మరో అరగంటలో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రాబోతోంది. ట్రయిన్ ప్రయాణం కొత్తయిన వాళ్ళు, కొత్త కాపురాలకి వెళ్ళే వాళ్ళు చాలా ఆత్రంగా గాబరాగా వున్నారు.
ప్లాట్ ఫాంకి ఓ చివర నుంచున్నాడు రాఘవరావు. అతని ముఖం చాలా గంభీరంగా వుంది. ఏదో సాధించి 'భారతరత్న' కి సమానమైన బిరుదు పొడబోయే వీరుడిలా వున్నాడు. ఆ తృప్తి, ఆ గర్వం ఆ అనందం అన్ని అయన గంభీరత వెనుక కన్పిస్తున్నాయి.
అయన దగ్గరగా అయన కంటే ఏడాది మాత్రమే చిన్నదైన అయన గృహసావిని శారద నుంచుని వుంది. జీవితాంతం దగ్గర్లో వున్నా ఆ వస్తువు విలువ తెలియక, అది చేజారి మరొకరి సొత్తై పోతున్న సమయంలో దాని విలువ గుర్తించి వేదనపోందుతున్న వ్యక్తిలా వుందామె సంభావించబోయే దుర్భర వియోగాన్ని భరించలేమన్నట్టుగా వున్నాయి ఆమె కళ్ళు.
వర్షించబోయే మేఘాలు తాము ఉషరకేత్రంలో వర్షిస్తోన్నందుకు విచారిస్తోన్నట్టుగా వున్నాయి ఆమె కళ్ళు. ఈ దుఃఖానికి విలువ లేదు. ఈ వేదనకి గుర్తింపు లేదు. ఈ భాధకి అంతం లేదు అన్నట్టుగా వున్నాయి ఆమె భావాలు.
'శారదా!' సహజ సిద్దమైన ప్రేమ పురిట స్వరంతో పిలిచాడు రాఘవ ఇన్నేళ్ళు అడవిలో కురిసిన వెన్నెల ఇకపై రసరమ్య సౌధం పై వర్షించబోతున్న అనందం అయన కంఠంలో ఉంది.
'నన్నలా పిలవకండి!' తన్నుకోస్తున్న దుఃఖాన్ని జనితమైన రోదన ద్వనిని, పూడుకుపోతోన్న గొంతుని నిగ్రహించుకుంటూ అంది.
నిట్టుర్పువిడిచాడాయన. అది ఓ అమాయకుడైన పసిపిల్లవాడిని చూసి జాలి పడినట్టుగా వుంది.
'ఎందుకీ ఆవేదన?'
చప్పున అయన ముఖంలోకి చుసిందామే! మీకు తెలిదా! నన్నిలా అర్ధాంతరంగా వదిలేసి, పిల్లల్ని విడిచి ఇప్పుడిలా వెళ్ళటం.'
'శారదా! నేను పారిపోవటం లేదు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. నీతో ముప్పై సంవత్సరాలు కాపురం చేశాను. ఏభై ఏళ్ళ వయస్సు వచ్చింది నాకు. సగం జీవితం పూర్తయిపోయింది. కానీ నిజమైన దాంపత్యజీవితం పల్లవించేది యిప్పుడే.
'హూ ఈ రసవల్లవం ఏనాడో నిరవ పల్లవం. అయి ప్రారంభంలోనే వడిలి వాడిపోయింది.' గుండెలో పొంగిన లావా-- అయినా చల్లగానే వెలువడింది.
'ఎప్పుడూ మిరింతే నన్ను ఏనాడూ గుర్తించలేదు గౌరవించలేదు.'
"తప్పు--నిన్ను అర్ధాంగిగా గుర్తించి గౌరవించి ఆదరించి-'
"కానీ ప్రేమించింది మరొకర్ని గుండెల్లో గుడి కట్టింది మరొకరికి, దేవతగా ఆరాధించింది ఇంకొకర్ని, నాకు ఆ స్థానం ఏనాడూ లేదు."
అతనేం జవాబివలేదు.
స్టేషన్ లో మొదటి గంట మ్రోగింది.
"ఇంక కొన్ని నిమిషాల్లో శాశ్వతంగా విడిపోతున్నాం. నా జీవితానికో గమ్యం నేను నా నలభయ్యోయేటే నిర్ణయించుకున్నాను. పదేళ్ళు అందుకోసం నా సర్వస్వం ధారపోసి శ్రమించాను. మీకు అన్ని సమకుర్చాను.
"ఏమండీ నాకు కావాల్సింది డబ్బేనా? నిలదిసినట్టుగా ప్రశ్నించింది."
ఆ ప్రశ్నకి జవాబివలేదు. " నీ పేర లక్ష రూపాయలు ఎఫ్. డి. చేశాను. వృత్తి రిత్యా సంపాదించిందంతా మీకే ఖర్చు చేశాను. ఫై.యఫ్. అమ్మాయికి ఇచ్చాను. నెలసరి పెన్షన్ నీకే రాసిచ్చాను. ఈ కట్టుకున్న బట్టలు, కొనుక్కున్న టిక్కెట్టు ఈనాడు ఆఖరిసారిగా నువు పెట్టిన కమ్మని భోజనం-'
ఆమె కళ్ళు వర్షించసాగాయి.
'పెద్దవాడు బ్యాంక్ అఫిసరయ్యాడు. పెళ్లైంది. ఓ ఇంటివాడయ్యాడు. తండ్రి కూడా అయ్యాడు భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగులు. చీకు చింత లేని ఉద్యోగం.'
"కానీ పెద్దగా మీరు-'
"ఎందుకు వాళ్ళకి, వాళ్ల సుఖాలకి అడ్డు"
ఆమెకి ఏదో- గతం- గుర్తొచ్చింది.
"ఇప్పుడు దేప్పుతున్నారా?" అంది బాధగా.
అతను వినిపించుకోనట్టే అన్నాడు! 'రెండో వాడు- నీ ముద్దుల కొడుకు ఫణి ఇంజనీర్ అయ్యాడు. పెళ్లి చేశాను. మనవరాల్ని ఎత్తుకున్నావు. వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాననేవాడు కదా! నీ గురించి దిగుల్లేదు.
"ఎన్ని వున్నా మీరు లేని."
"పిచ్చిదానా వయసై పోతున్నది. ఒకవేళ నేనూ మీ అన్నయ్యాలాగా."
"వద్దండి! వద్దు మీరు ఎక్కడున్నా క్షేమంగా వుండాలి నాలుగుకలాల పాటు." "ఇందులోనూ స్వార్ధమేనా! పసుపు కుంకుమలు, గాజులు, సుమంగళి చిహ్నాలు పుట్టుకతో వచ్చాయి. వాటిని భర్తతో వదిలేయ్యాలనటం చందాసం- అంతేకాదు మూర్ఖత్వం."
"పోనివండి."
"మూడోవాడు డాక్టరయ్యాడు. ఫారిన్ వెళ్లాడు, అక్కడే తోడు వెదుక్కున్నాడు. ఇక్కడ నిన్నూ నన్నూ చూసి అన్ని గమనించినవాడికి నీ లాటి ఇండియన్ వైఫ్ అంటే భయమేసింది. నన్ను రమ్మన్నాడు. కానీ ఏం వుందని నేను వెళ్లాలి. డిపెండెంట్ గా బ్రతకలేను, కదా!"
"మీ డబ్బుతో మనం వెళదాం."
"వద్దు, మళ్ళీ నిర్ణయం మార్చుకోలేను ఇచ్చిన మాటకి కట్టుబడాలి."
మళ్ళీ ఆమె ప్రసక్తి గుండెల్లో శూలం దిగినంత వేదన కరుగుతున్న జాలి కరుడుకట్టే వైనం.
"మాలని గొప్ప డ్యాన్సర్ ని చేశాను. తనకి నచ్చిన
వాడిని ఎన్నుకుంటే నీవు కాదన్నా ఆశిర్వదించాను. అమ్మాయి సుఖం కంటే నీ సంప్రదాయ భావాలు నీకు ఎక్కువయ్యాయి. అందుకే ఆమె మనకి దూరమైంది."
"మీరు వెళ్ళొచ్చారుగా."
రెండో బెల్ మ్రోగింది.