"సరే! మీతో నా అసిస్టెంట్ ని మప్టిలో పంపుతాను. ఇహ ముందు ఎంత చిన్న సమాచారం అందినా నాకు వెంటనే తెలియపరుస్తుండండి. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. వాళ్ళు బహుశా రాన్ సామ్ " కోసం మిమ్మల్ని కాంటాక్టు చేస్తారని నా ఉహ . నాకు చెప్పకుండా డబ్బు యిచ్చేసి పాపని తెచ్చుకుందామని పులిష్ గా ఆలోచించకండి. పాప దక్కదు సరికదా! డబ్బు కూడా పోతుంది." హెచ్చరింపుగా అని వెళ్ళిపోయాడు మనోహర్. జలజకి కాలు ఎప్పుడూ ఒక చోట నిలవదు. ఎక్కడికెళ్తున్నావని గాని, ఎప్పుడొస్తావని గాని అడగటం మానుకుంది అణు.
ఫోన్ మోగింది డాన్సు స్కూల్ నుంచి, "ఎక్కన్నుంచో ఫెర్ ఫామేన్స్ కావాలంటూ ఆఫర్ వచ్చింది. ఆర్గనైజ్ చెయ్యమంటారా? స్కూలుకి రాగలరా?" అంటూ ఫోన్ లో అడిగింది సెక్రటరి.
"వస్తాను" చెప్పింది అణు. అశాంతిని ఒక వంకగా తీసుకుని కర్తవ్యం ఎగేయడం ఆమెకి ఏ మాత్రం యిష్టం వుండదు. సోమరిపోతులు మాత్రమే తమ పనులు ఎగేయడానికి కారణాలు వెదుక్కుంటారు. రాగను దక్కించుకోవాలంటే మొదట తను స్థిరంగా నిలబడాలి. తయారై స్కూలుకి వెళ్ళబోతూ అలవాటుగా పర్సు చూసుకుంది. అందులో తను పెట్టిన ఇరవై రూపాయల నోటు లేదు. ఇంట్లో పనిమనిషి వుంది, వంటమనిషి వుంది. కాని ఇద్దరిలో యెవర్ని తను దగ్గిర లేకుండా బెడ్ రూమ్ లోకి రానియదు. పర్సు చేత్తో పట్టుకుని హల్లో కొచ్చి "ఈ పర్సులో ఇరవై రూపాయల నోటు ఎవరైనా తీశారా?" అంది.
రెండు నిమిషాలు నిశ్శబ్దం తరువాత రాణి అచ్చయ్యమ్మా దేవి గొంతు పెగల్చుకుని "నేను తీశాను" అంది భయం భయంగా.
అణు కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఒకప్పుడు వీళ్ళిద్దరూ అతి చనువు తీసుకుని తన జీవితాన్ని చిందర వందర చేశారు. మళ్ళీ మరోసారి అంత సాతంత్ర్యం వాళ్ళకియ్య కూడదు.
"మికేదేనా అవసరమైతే నన్నడగండి అంతే కాని నాకు చెప్పకుండా పర్సులోంచి తీసుకోకండి" ఖచ్చితంగా అంది. తల వాలిపోయింది ముసలావిడకి. ఉహ యే మాత్రం తెలియని పసితనంలో ఏ భోగభాగ్యాలనుభవించిందో కాని, జ్ఞానం వచ్చినప్పటి నుంచి అవమానాలు, తిరస్కారాలు తప్ప మరో సుఖం తెలియదు ఆవిడకి.
"మీ వంట మనిషి చెప్పింది ఇక్కడి భువనేశ్వరి దేవి ఎంతో సత్యమున్న దేవత అని, రాగ దొరకాలని కోరుకుంటూ దేవికి అర్చన చేయించాను. ఊరు కొత్త కదా! వంట మనిషిని తీసుకుని ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చాను కోపం తెచ్చుకోకు ఎలాగైనా నీ డబ్బు నీకు తీరుస్తాను." ఏడుపు గొంతుతో అంది.
నిర్ఘాంతపోయింది అణు మనవరాలి కోసం యింత అరాటపడుతోందా యీ ముసలావిడ? పాపం తన ధోరణిలో తన ఆరాటం ప్రదర్శించుకుంది. మన దృష్టిలోంచి కాక ఎదుటి వాళ్ళ దృష్టిలోంచి ఆలోచించగలిగితే లోకంలో చేడ్డవాళ్ళంటూ ఎవరూ వుండరేమో? సాధారణంగా అందరూ చేసే పొరపాటు ఎదుటి వ్యక్తుల్ని తమ దృక్కోణంలోంచి వూహించుకోవడం ఆ ఉహాలు నిలబడనప్పుడు ఎదుటి వారిని తప్పుపట్టడం.
"సరేలెండి" ఇంకెప్పుడైనా డబ్బు కావాలంటే నన్నడగండి నేనిస్తాను" అంది మెత్తగానే.
"భయపడాదే పొన్ని! "ఆ చెవి నుంచి యీ చెవికి నోరంతా తెరచి నవుతూ చేతిలో ఐదురూపాయల నోటు ముందుకి జాపాడు.
రాగ భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది.
"వద్దు," అంది తల అడ్డంగా వూపుతూ.
"నికేమైందే? వొద్దా................"
"బయటివాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గాని, మిఠాయి గాని, యేది తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. నువేవరు? నేనెక్కడున్నాను? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?
"ఎహ్హెహ్హె......." అని రాగకి భయం కలిగేట్లా నవేడు.
"నమ్మ పేరు తాతయ్యిదా! ఎల్లారు తాతయ్యిదా పిలుస్తారు. నీ కూడా తాతాయ్యా అని కుపడు. ఇంగే నల్లయిరు కుదా?"
రాగకి అరవం రాదు. అయినా అతడి మాటల్లో భావం గ్రహించగలుగుతోంది.
"యమ్మాయమ్మ ఎక్కడుంది?"
"నాకుదా తేలదు. ఎంగే ఇరికాదో నాకు సోల్లలేదు. ఎప్పుడో వస్తంది. నీకుదా ఏమి కావాలన్నా ఎన్నకి సొల్లు"
"మమ్మితో మాట్లాడాలి. ఫోన్ దగ్గిరికి తీసుకెళ్తవా?"
"అమ్మమ్మ అందరి మాదిరి నమ్మకట్ట సొల్ల కుడాదే. నీకుదా ఏమి కావాలన్నా నాకుదా సోల్లనం. ఇదిదా విలేటి. ఇంగే ఫోన్ కడియాదు. ఇదిదా భువనేశ్వర్ ఇల్లై"
రాగ మనసులో అప్పటివరకు మినుకు మంటున్న ఆశ అణగారి పోయింది. భయంకరంగా నవుతూ అర్ధం అయి, కాని భాషలో మట్లాడే యితన్ని ఏం కావాలని అడగ్గలదు?"
ఐదు రూపాయల కాగితం జేబులో కుక్కుకున్నాడు తాతయ్య.
"నాన్ దా పూడుస్తా! ఎంగే పోకూడదు ఇక్కడదా గుండాలు, రౌడీలు, దొంగలు దా వుండారు. యమ్మాయమ్మ వస్తది." అని చెప్పి వెళ్లిపోయాడు తాతయ్య.
ఆపాక హొటల్ ముందు గదిలో కస్టమర్స్ వచ్చి కాఫీ టీ లు చపాతీలు, సమోసాలు మొదలైనవి తిని పోతుంటారు. వెనక వైపు వంటగది ఆ పక్కనే చీకటి కోఠారం లాంటి స్టోర్ రూమ్ వున్నాయి. వంటవాడ్ని పెట్టుకునేంత గొప్పది కాదు ఆ హొటల్ యజమాని. వంటింట్లో వంటలు చేస్తుంటాడు మరో కుర్రాడి సాయంతో.
అతడు మాటలు రాని మూగవాడిలా ఎవరితోను ఏమి మాట్లాడాడు. ఒక పెద్ద కుండా నిండా ఆలు బఠానీ కూర వుడకబెడుతూ ఆర్డర్ ప్రకారం చపాతీలు చేసేస్తుంటాడు. అతని భార్య గల్లా పెట్టి ముందర కూర్చుని అరవటం తప్ప మరొకటి రానిదానిలా అరుస్తూనే వుంటుంది. కొంతసేపు హొటల్ కి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అరుస్తూ చెప్తుంది. మరికొంత సేపు తొందరగా అందివమని ఫలహారాలందిచ్చే కుర్రాడి మీద అరుస్తుంది. మరికొంత సేపు హొటల్లో పదార్ధాలు బాగోలేదని ఎవరైనా కస్టమర్స్ అంటే వాళ్ళ మీద అరుస్తుంది.
ఆ యింటిలో ఎవరికి ఇంగ్లీషు పేపరు చదివేటంతా చదువు రాదు. కాని రెగ్యులర్ గా ఇంగ్లీషు పెపేరు మాత్రం తెప్పిస్తారు. ఆ హొటల్ కొచ్చే వాళ్ళంతా పేదవాళ్ళయినా వాళ్ళలో అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు వున్నారు కొందరు , ప్రత్యేకం పేపరు చదవడం కోసమే ఆ హొటల్ కొచ్చి కాఫీ తాగి పోతారు. అంచేత ఖర్చనిపించినా పేపర్ తెప్పించడం మానదా హొటల్ యజమానురాలు. ఏరోజు కారోజు పేపరు జాగ్రత్తగా మడత పెట్టి స్టోర్ రూమ్ లో షెల్ఫ్ లో దాస్తుంది. పాత పేపర్ కోనేవాడితో బేరాలు ఆడి ఆడి ఆ పేపర్లు అమ్మి డబ్బు తీసుకుంటున్నప్పుడు ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ఆ హొటల్ లో అనేక చిన్న హోటళ్ళలాగానే కస్టమర్స్ తిని పారేసిన వస్తువులు పారేయ్యరు.
అవన్నీ వేటికవి పెద్ద పెద్ద విస్తరాకుల్లో వేరు వేరుగా పోగులు వేయిస్తుంది ఆవిడ. అక్కడ పనిచేసే యిద్దరి కుర్రాళ్ళకి తిండి ఆ కుప్పల్లోంచే మొదట్లో రాగ "చీ చ్చి! ఎంగిలి," అని అసహ్యించుకుని తినలేదు. ఆ పిల్ల తిందో లేదో పట్టించుకునే వాళ్ళెవరు లేరక్కడ. పనివాళ్ళు తినగా మిగిలినవి పొట్లాలు కట్టించేసి బస్ స్టాప్ ల్లో అమ్మించేస్తుందావిడ. బస్ స్టాప్ లో ఏవేవో కొనుక్కుని తినడం ఎంత అనారోక్యకరమో స్పష్టంగా అర్ధమైంది రాగకి.