Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 40

అందుకే మమ్మీ బిస్కెట్లు, చాక్లెట్లు, ఫ్రూట్స్ తప్ప బయట యేది కొనుక్కుని తిననివదు. చీటికీ మాటికి మమ్మీ గుర్తొస్తుంది. మమ్మితో ఎలా మాట్లాడాలో అర్ధం గావడం లేదు. యమ్మాయమ్మ మెసేజ్ యిస్తే మమ్మీ ఊరుకోదు. తప్పకుండా ఏదో ఒకటి చేస్తుంది.
మానవుడి పాశవికమైన ఇన్ స్తింక్ష్ట్స్ అన్నిటిలో బలవత్తరమైనది ఆకలి. వాళ్ళు వీళ్ళు వదిలేసిన ఎంగిలి పదార్ధాలు తినలేక ఒకరోజంతా మాడిన రాగ మర్నాడు కళ్ళు గట్టిగా మూసుకుని ఈగలు తోలుకుంటూ అవే తినేసింది. కాఫీ గ్లాసులు కడగడం, దొడ్డంతా వుడవడం పాచిపోయినవి ఎంగిలి పదార్ధాలు తినడం యిదే జీవితం రాగకి. భరించలేకపోతోంది. ఏం తోచనప్పుడు మేధాని పదును పెట్టుకునేందుకు ఒక్కతే కూర్చుని అడే ఆటలు కొన్ని నేర్పింది తల్లి. న్యూస్ పేపర్లోని ఒక పేరా తీసుకుని అందులో ఏదో ఒక అక్షరాన్ని ఐ లేక టి లేక ఇ అలా ఏదో ఒకటి కొట్టేసుకుంటూ వెళ్ళడం. అయిపోయాక కొంతసేపు బ్రెయిన్ కి రెస్ట్ యిచ్చి కొట్టేయకుండా ఏవైనా ఉన్నాయేమో వేరిపై చేసుకోవడం. ఒక్క అక్షరం కూడా మిగలకపోతే ఏకాగ్రత బాగా కుదిరినట్టు పాత న్యూస్ పేపర్ తీసుకుని ఒక్కొక్కటి కొట్టేద్దామని ముందు పరుచుకుంది పెన్సిల్ లేదు. కావాలని అడగడానికి కూడా యెవరు లేరు. మసి బొగ్గు తీసుకుని ఒక్కొక్క "యి" అక్షరము కొట్టేసుకుంటూ ఎక్సర్ సైజు ప్రారంభించింది. దాన్లో లీనమైపోయి తాతయ్య వచ్చింది కూడా గమనించలేదు.
"ఎహ్హెహ్హె.........." అనే నవు వినబడి తల పైకెత్తింది.
"నీకుదా ఇంగ్లీషు సదువుతావా?" ఆశ్చర్యంగా అడిగాడు. ఈనాటికి భారతదేశంలో అన్నీ వర్గాల వారికి ఇంగ్లీషు రావటమే నిజమైన చదువు.
"నాకో పెన్సిల్ కొనిస్తావా?" అడిగింది రాగ. "వెంటనే మా మమ్మీ దగ్గరకు వెళ్ళగానే నీ డబ్బులు నికేచ్చేస్తాను" అంది.
గులకరాళ్ళు ఎత్తు మించి కిందకు పడుతున్నట్లు నవి బయటికి కెళ్ళి ఓ పెన్సిల్ అది చెక్కుకోవడానికి బ్లేడు కొని తీసుకొచ్చాడు తాతయ్య. రాగ, "థాంక్స్:" చెప్పి తీసుకుంది. అప్పటివరకు ఆ పిల్ల బ్లేడ్ వాడలేదు. పెన్సిల్ మెండర్స్ వాడేది. అదైనా తల్లి ఏ రోజుకారోజు షార్ప్ న్ చేసి యిచ్చేది. పాపకి పెన్సిల్ ఇచ్చేసి వెళ్లిపోయాడు తాతయ్య. మొదటిసారిగా బ్లేడుతో పెన్సిల్ చెక్కుకొబోతు చెయ్యి కోసుకుంది. "అమ్మా" అని అరిచింది ఆ ప్రయత్నంగా అమ్మ రాలేదు. యజమానురాలు వచ్చింది.
"ఎందట్ట అరుస్తావు?" అంది గయ్యిమంటూ చటుక్కున పెన్సిల్ బ్లేడు కాగితాల కింద దాచేసింది. యజమానురాలు రాగ వేలు నుంచి కారుతున్న రక్తం చూసి జాలి పడకపోగా "శని మొహమా! కత్తిపీట దగ్గిర కెందుకు పోయావు? వంటిట్లో నీకేం పని? దొంగతనంగా ఏమైనా మెక్కుదామని చేరావా? గాడిదేద్దులా అరిచావంటే జాగ్రత్త" అని పాప నెత్తి మీద ఒక మొట్టికాయ మొట్టి వెళ్ళిపోయింది. ఏడుపు బయటికి రాకుండా రక్తం కారుతున్న వేలిని నోటికి అడ్డుగా పెట్టుకుంది. కొంతసేపటికి బాధ కొంత ఉపశమించింది.
గ్లాసులు కడిగే మట్టి కుండలోని మురికి నీళ్ళతో చెయ్యి కడుక్కుని చేతి కందిన పాత పేపరు బయటికి లాగింది. పట్టరాని ఆనందంతో తళుక్కుమన్నాయి రాగ కళ్ళు బాక్సు కట్టి ప్రచురించిన తల్లి ఉత్తరం ఒకసారి, రెండుసార్లు - మూడు సార్లు చదువుకుంది. ఏదేనా చదివినప్పుడు దాన్లో బాగున్న విషయాలు అండర్ లైన్ చెయ్యడం అణు నేర్పింది. రక్తం ఆరని వేలితో , "నా బంగారు తల్లీ" కింద అండర్ లైన్ చేసింది. తరువాత "నేను డాడీ నీకోసం వస్తాం" దగ్గిర మరింత గట్టిగా నొక్కి అండర్ లైన్ చేసింది. టైం గడవడం వల్లనో, పేపర్ కి వేలు వొత్తి పెట్టడం వల్లనో వేలు నుంచి రక్తం కారడం ఆగిపోయింది. తల్లి ప్రచురించిన చిన్న ఉత్తరం నిండా తన రక్తపు చారికలు చూసుకుని కిలకిల నవింది రాగ. ఆ పిల్ల అంత ఆహ్లాదంగా నవి చాలా రోజులైంది. "థాంక్స్! యమ్మాయమ్మ!" అనుకుంది. మనసులో. బురద బురదగా వున్న ఆ దొడ్లో బురద నీళ్ళు చిమ్మి మీద పడుతున్నా లెక్క చెయ్యకుండా రెండు చేతులు చాసి గిరగిర తిరిగింది. అలా ఎంత సీపేనా తిరిగేదేమో? ముందు గదిలోంచి యజమానిరాలి సైరన్ అరుపు వినిపించి టక్కున ఆగిపోయింది. మమ్మికి రిప్లయి రాయాలి ఎలా? తనని యిక్కడుంచి కదలనివరే! ఎలా?......ఎలా?
ఆ వూళ్ళో మలముత్రవిసర్జనకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చాలా ఇళ్ళల్లో లేవు. ఊరు పొలిమేరల్లో వున్న పొదల దగ్గిరకి చెంబులు తీసుకుని వెళ్తారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు ఇంటివెనకో, యింటి ముందో , ఏ చెట్టు కిందో కూర్చుంటారు. ఆ పాక హొటల్ కి కాంపౌండ్ లాంటి దేమి లేదు. వెదురు తడికల తలుపు ఆ తలుపు తీస్తే అటు వైపు అంతా పొదలు తుప్పలు తప్ప ఏం కనబడదు. రాగ న్యూస్ పేపర్ అంచుల్లో వున్న అంగుళం వెడల్పు తెల్ల కాగితం ముక్కలు జాగ్రత్తగా కత్తిరించి పెన్సిల్ తో సన్నటి అక్షరాలతో తల్లికి ఉత్తరం వ్రాసింది ఇంగ్లీషులో.
"డియర్ మమ్మీ!
నీ ఉత్తరం చదువుకున్నాను. నేనేక్కడున్నానో, వీళ్ళేవరో నాకేం తెలియడం లేదు. ఇదొక హొటల్ లాంటిది. మనం వెళ్ళే హొటల్ లా వుండదు. ఎవరెవరో బీడిలు కాల్చేవాళ్ళు, కూరగాయలమ్ముకునే వాళ్ళు యింకా ఎవరో అలాంటి వాళ్లోస్తారు. భయం వేసేలా నవే తాతయ్య వస్తాడు. ఇక్కడ ఎవరూ నన్ను బయటికి వెళ్ళనియడం లేదు. ఎలాగైనా నేనోచ్చేస్తాను. డాడీ అక్కడే వుంటే నేనొస్తాను. ఉండమని చెప్పు నువ్విక్కడికి వస్తే డాడీని కూడా తీసుకురా. నువు డాడీ యిద్దరూ కలిసొస్తే ఐ యామ్ వెరి వెరి హేపీ. ఈ కాగితాలు చాల సన్నగా వున్నాయి. మేటర్ పట్టటం లేదు.

                                                                                                          విత్ లవ్,
                                                                                                            నీరాగ."

పొడుగ్గా సన్నగా వున్న కాగితాన్ని చిన్న మడతగా చుట్టి చేత్తో పట్టుకుంది. కవరెక్కడ దొరుకుతుంది? పోస్టాఫీసు ఎక్కడుంది? కవరు కొనడానికి డబ్బులెలా వస్తాయి? మెల్లిగా లేచి వంటింట్లో పెళ్లెంలో వున్న నాల్గు సోమాసాలు కాగితంలో చుట్టుకుంది. అవి అమ్మితే డబ్బులోస్తాయని తెలిసింది యిప్పుడు రాగకి. తడిక తలుపు తీసింది. ఆ మాత్రం చప్పుదుకే యజమానురాలు లేచి" ఎవరు?" అని గయ్యిమంది. "నేనే నంబర్ టూకి " భయం భయంగా చెప్పింది రాగ. ఆవిడంటే రాగ కి ఎప్పుడూ భయమే. ఇప్పుడు మరింత భయంగా వుంది. అటువేపు అన్నీ పొదలు దుబ్బులు రోడ్డుగాని, ఇళ్ళు గాని కనపడ్డం లేదు.
పగలు కూడా ఏదో భయం భయంగా అనిపిస్తోంది. సాధారణంగా ఐదారడుగుల కంటే ఎక్కువ దూరం వెళ్ళేది కాదు పాప.
ఆ పిల్ల అక్కడున్నప్పుడు కూడా యజమానురాలు లోపల్నుంచి ఏదో అరుస్తూ చెపుతూనే వుండేది. ఆ రోజు కాళ్ళు ఎటు తీసికెళ్తే అటు నడవడం ప్రారంభించింది. దారి తెన్నూ తెలియడం లేదు. ఒకదశలో మళ్ళీ వెనక్కి పోదామన్నా దారి తెలియలేదు. మొండిగా నడుస్తొంటే సన్నని కాలిబాట కనిపించింది. ఏదో పెన్నిది దొరికినట్లు దాని వెంటపడి నడవడం మొదలుపెట్టింది. ఎంత దూరం నడిచిందో ఆ పిల్లకే తెలియడం లేదు.కడుపులో ఆకలి నకనకలాడుతున్నా సమోసల్ల్లో ఒక్కటి కూడా తినలేదు. పాడైపోకుండా జాగ్రత్తగా పట్టుకుంది. కొంతసేపటికి కాలిబాట మట్టిరోడ్డులో కలిసింది.
కుడివైపు కెళ్ళాలో ఎడమ వైపు కెళ్ళాలో తెలిలేదు. కొందరు మనుషులు గుంపుగా ఒకవేపు నడుస్తుంటే తనూ అటు నడిచింది. వాళ్ళలో ఒక నడివయసు స్త్రీ కి దగ్గిరగా వెళ్ళి పొట్లం లో వున్న సమోసాలు చూపించి. "సామోసాలు కొంటారా? వేడివేడివి ఇప్పుడే చేసినవి "హోటల్ యజమానురాలి అరుపులు వినివిని తినుబండారాల్లో యజమానురాలు వస్తువు యెలా అమ్మాలో తెలిసిపోయింది పాపకి.
ఆ నడివయసు స్త్రీ ఏదో అనబోతుండగానే "ఏయ్" అన్న గర్జన వినిపించింది. ఆ గొంతు ఎంత దూరంలోనైనా గుర్తించగలదు. ఆ సైరన్ అరుపు యజమానురాలిది. అప్పుడు గుర్తించింది తను అంతదూరం నడిచి, నడిచి, సరిగ్గా పాక హొటల్ ముందు వైపుకి వచ్చింది. సమోసాలు అక్కడే పడేసి పరుగు మొదలు పెట్టింది. నాలుగు అడుగులైనా వేయక ముందే యజమానురాలు రెక్క గట్టిగా పట్టుకుని తన్నుకుంటూ , ఈడ్చుకుంటూ పాక హొటల్ లోపలికి లాక్కుపోయింది. "దరిద్రపుగొట్టుదానా! నెంబర్ టూ, త్రీ అంటూ పారిపోతావా! ఏమేమి ఎత్తుకెళ్ళావో చెప్పు" అని బాదడం మొదలుపెట్టింది.

 Previous Page Next Page