Home » Vasundhara » Trick Trick Trick


    గోపి ఆలోచిస్తూ నిద్రకు పడ్డాడు.
    ఇక్కడిలాఉంటే అక్కడ చందూ నాయుడివద్దకు వెళ్ళి - "వాడిని మనపక్షానికి లాక్కురావడంకోసం నేనొక తిరుగులేనిపథకం వేశాను. ఎటొచ్చీ నాలుగురోజులపాటు మీరు మనమనుషులకు చెప్పి - ఊళ్ళో ఎక్కడా వాడికే ప్రమాదంరాకుండానూ, ఏ ఇబ్బందీ కలక్కుండానూ ఏర్పాటు చేయాలి. నాయుడుగారి రక్షణపొందిన మనిషికి జీవితం ఈ ఊళ్ళో ఎంతబాగుంటుందో వాడికి తెలియాలి. ఈ విషయమై మీరుచేసే ఏర్పాట్లమీద కూడా నా పథకం ఎంతగానో ఆధారపడి ఉంటుంది-" అన్నాడు.
    నాయుడు చందూని మెచ్చుకొని- "నీ ఉపాయం బాగుంది. శత్రువును బెదిరించడంవల్ల కాక-ఆదరించడంవల్లనే ఎక్కువ ప్రయోజనాలుంటాయి. నాకిలాంటిది తట్టనేలేదు-" అన్నాడు.
    "నాకు సెలవిప్పించండి బాస్- మళ్ళీ మీకు సరిగ్గా నాలుగురోజులు తర్వాతే కనిపిస్తానునేను. అదీ-వాడితోకలిసి....." అన్నాడుచందూ.
    అన్న ప్రకారం చందూ మర్నాడుదయమే గోపిఇంటికి వెళ్ళాడు. గోపికూడా అప్పటికి సిద్దంగా ఉన్నాడు.
    "ఏమైనా ఆలోచించావా?" అన్నాడు చందూ.
    "ఊఁ"
    "ఏమిటో చెప్పు-"
    "నిన్నిక్కడ ఎదిరించమని నువ్వనడం చాలా అన్యాయం ఎందుకంటే నీకిక్కడ స్థానబలమున్నది. మనమిద్దరం ఇక్కన్నించి బయల్దేరి" మరో ఊరు వెడదాం. అక్కడ మన బలా బలాలు పరీక్షించుకొందాం - అన్నాడు గోపి.
    చందూ అనుమానంగా-"నీది దూరాలోచనే - కానీ దురాలోచన కూడా కాదుగదా అని అనుమానంగా ఉంది-" అన్నాడు.
    "నీకిలాంటి అనుమానం వస్తుందని నాకు తెలుసు. నేను భయపడుతున్నది కేవలం నీస్థానబలానికి. అందుకే ఈ ఊరు వద్దంటున్నాను. ఊరుసెలక్షన్ కూడా నీకేవదిలిపెడుతున్నాను. ఇదికాక ఇంకేఊరన్నా సిద్దమే!"
    చందూ నవ్వి-" నాకంటే ఈ ఊళ్ళో నాయుడికి స్థానబలం ఎక్కువ. స్థానబలానికి భయపడేనువ్వు ఈ ఊళ్ళో ఉండి నాయుడినెలా ఎదిరించగలవు?" అన్నాడు.
    "యుద్ధంజరిగితే పాండవులు కౌరవుల్ని గెలువగలరు. కానీయుద్ధం లేకుండా పాండవుల రాజ్యంకాజేసే ఉపాయం శకుని కౌరవులకు చెప్పాడు. ధర్మరాజు జూదమాడడంలో సమర్దుడే-కానీ మాయాజూదం కావడంవలన ఓడిపోయాడు. జూదానికే నేనూ ఇప్పుడు సిద్దపడ్డాను. ఈ ఊళ్ళోనే అయితే-అది మాయాజూదమే అవుతుంది-" అన్నాడు గోపి.
    చందూ ఆశ్చర్యంగా - "ఎంతబాగా చెప్పావు? నువ్వు చాలా తెలివైన వాడివి-" అన్నాడు.
    "నాతెలివిసంగతి సరే- నాయుడు రక్షణ ఏర్పాట్లకు ఒప్పుకున్నాడా?" అన్నాడు.
    "నాయుడు నాకు బాస్ కావచ్చు. కానీ అతడు నామతలకు విలువ ఇస్తాడు. నాలుగురోజులపాటు ఈ ఊళ్ళో అంతానీ యిష్టం-" అంటూ చందూ ఉలిక్కిపడి- "అవునూ- మనంవేరే ఊరు వెడుతున్నాంగదా-నీకు రక్షణ ఏర్పాట్లు గురించిన ఆలోచనెందుకూ?" అన్నాడు.
    "తేరగా వచ్చేదేదీ వదిలిపెట్టను నేను-ఇంతకూ మనప్రయాణమెప్పుడు?" అన్నాడు గోపీ.
    "ఇప్పుడే..." అన్నాడు చందూ.
    "ఎక్కడికి?"
    "అది బస్ స్టాండ్ లో చెబుతాను-"
    గోపీ సాలోచనగా-" అయితే నువ్వు బస్ స్టాండుకి వెళ్ళిపో సరిగ్గా అరగంటలో నేనక్కడికి వస్తాను. ఆతర్వాత నీయిష్టం-" అన్నాడు.
    "అరగంట గడువెందుకూ?" అన్నాడు చందూ.
    "నీకు ప్రియురాలున్నదా?" అన్నాడు గోపీ.
    "లేదు-"
    "అందుకే నీకు గడువు అక్కర్లేదు. నాక్కావాలి...." అన్నాడు గోపీ. చందూతనలో తనునవ్వుకుంటూ మరేమీ అనకుండా వెళ్ళిపోయాడు.
    చందూ వెళ్ళగానే గోపీ వద్దకు వచ్చిందివిశాలి. నెమ్మదిగా అతడితో "అయితే నువ్వు నన్నీ ఊళ్ళో ఒంటరిగా నాలుగు రోజులు వదిలివెడతావన్న మాట-" అన్నది.
    "త్వరగా స్నానంచేయి-మనం బయటకు వెళ్ళాలి-" అన్నాడు గోపీ ఆమె మాటలు పట్టించుకోకుండా.
    "నేనురాను-" అన్నది విశాలి.
    "రానంటే ఎలా- ఈ ఊరంతా మనం ప్రణయగానాలు వినిపించాలి కదా-"అన్నాడు గోపీ.
    "మరినువ్వా చందూతో వెళ్ళిపోతున్నావుగా?"
    "నేనెక్కడికీ వెళ్ళను. నీతోనే ఉంటాను. ఈ నాలుగురోజులూ నిన్నాఫీసుక్కూడా వెళ్ళనివ్వను-" అన్నాడు గోపి.
    "మరి ఆ చందూ ఊరుకుంటాడా?"
    "ఎందుకూరుకోడు-? వాడూ నేనూ కలిసి ఊరు వెడతాంగా?"
    "నీ మాటలు నాకు అర్ధం కావడంలేదు-" అన్నది విశాల.
    "నాలాంటి మనిషి చందూని బస్ స్టాండ్ లో కలుసుకుంటాడు. అతఃడు నాలుగురోజులపాటు చందూను తప్పుదారి పట్టించి చివరకు తన ఓటమిని ఒప్పుకుంటాడు. చందూ ఉత్సాహంగా నాయుడి వద్దకువెడతాడు. ఈ నాలుగు రోజులూ నాయుడు చందూ ఏదో ఘనకార్యం చేస్తున్నాడనుకుని తన మనుషుల్ని మనకు రక్షణ కాపలాగా ఉంచుతాడు. లెటజ్ ఎంజాయ్-"
    "ఎంజాయ్ అంటే?"
    "కంగారుపడకు-జస్ట్ ప్రణయగానం.....అంతే!"
    విశాల కమగారుగా- "నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావని నాకు భయంగా ఉంది. ఈ నాలుగురోజుల ప్రణయగానం నీకు ప్రాణప్రమాదం కావచ్చు-" అన్నది.
    "నువ్వు చెబుతున్నది కొంతవరకూ నిజం. నా ప్రణయగానం ఈ ఫిరంగిపురంలో కొందరికి ప్రళయనాదం-" అన్నాడు గోపి. అప్పుడు అతడి కనులలో ఆవేశం కనబడింది. అది చూసి విషయాలకు కూడా భయం వేసింది.
    
                                         14
    
    నాలుగు రోజులపాటు గోపీ, విశాల ఫిరంగిపురంలో ఎంతో సరదాగా గడిపారు. వారిని దూరంగా ఉండి కనిపెట్టే నాయుడి మనుషులు నిజంగానే రక్షించారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra