Previous Page Next Page 
మిస్టర్ క్లీన్ పేజి 22

 

    ధైర్యకి యిప్పుడు సమయం చేజిక్కింది.

 

    అద్దెకున్న వాళ్ళు వూరికి వెళ్ళారు.

 

    తల్లి తండ్రి పెళ్ళికి వెళ్ళారు.

 

    ఎనిమిది గదుల యిల్లు. ఆ యింటి మొత్తం మీద ధైర్య తప్ప యిప్పుడు ఎవరు లేరు. చీకటి రాత్రి యింటి చుట్టూ కావాల్సినంత జాగా వుంది. చాలా చెట్లు వున్నాయి. స్ట్రీట్ లైటు బల్బు మడిపోయినట్లుంది. బయట వెలుగు లేనందున ఆ చీకట్లో చెట్లు చేతులు చాచి జుట్టు విరబోసుకున్న పిచాచాల్లా కనిపిస్తున్నాయి.

 

    ధైర్యకు చాలా ఆనందంగా వుంది. కోరుకున్న విధంగా సమయం తనదయింది. చేయవలసిన పనికితగ్గట్లు వంటరి వాతావరణం చేజిక్కింది. కల నిజమా మన కోరిక తిరేగా అని పాటపాడుతూ ఇల్లంతా తిరిగి వేర్రిగంతులు వేయలనిపించింది.

 

    రాత్రి పన్నెండు దాటితెగాని రంగంలోకి దిగటానికి లేదు.

 

    తల్లి తండ్రి ఏడున్నరకి వెళ్ళారు. అప్పటినుంచి మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంది ధైర్య. ఎంతకీ సమయం గడిచిపోవటంలేదు. గడియారంలో ముళ్ళకి పెరాలసిస్ వచ్చినట్లు కలం కుంటినడక నడుస్తున్నట్లు సమయం నత్త నడక నడుస్తున్నట్లు. ప్రకృతిస్తంభించినట్లు ఏదోగా వుంది ధైర్యకు.

 

    రాత్రి పన్నెండు పదికి రంగంలోకి దిగాలి.

 

    పరిశోధన మాసపత్రికలో ఉన్నదంతా కంఠతా వచ్చేసింది ధైర్యకి, అయినా మరోసారి చదివింది. కొవ్వొత్తి అగ్గిపెట్టె రెడీగా పెట్టుకుంది. ఇల్లు మొత్తం లైట్లు అర్పితే సరిపోతుందా లేక మెయిన్ స్విచ్ అర్పేయటం మంచిదా! కాసేపు ఆలోచించింది.

 

    కధలో అంటే సమయానికి కరంటు పోయింది. ఇది కధ కాదు. అ కధలో జరిగినట్లు సమయానికి కరెంటు పోదు కదా! ఏ గదిలో స్విచ్ అ గదిలో తీసేయొచ్చు. అది మంచి పని కాదు. ఏదన్నా శబ్దం విన్నా భయంపుట్టినా చటుక్కునా స్విచ్ అన్ చేసి  లైటు వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ అపటమే బెటర్ అనుకుంది ధైర్య.

 

    ధైర్య తాను చాలా ధైర్యం గలదాన్ని అనుకుంటూన్నప్పుడు "ఓ వేళ భయం పుట్టినా?" లాంటి మాట అసలు అనుకూడదు. కాని అనుకుంది. అంటే తనకి తెలియకుండానే మనసు అట్టడుగు పొరల్లో ఏ మూలనో రవంత భీతి వున్నట్లే ఇంత చిన్న విషయం ధైర్య గ్రహించలేక పోయింది.

 

    పావు తక్కువ పన్నెండు అయింది.

 

    ఉషారుగా లేచింది ధైర్య.

 

    ఆ యింట్లో ఎడం పక్కన వున్న గదిని తన ఎక్స్ పెరిమేంట్ కి ముందే ఎన్నుకుంది ధైర్య. ఆ గదిలోంచి లోపలి గదుల్లోకి వెళ్ళటానికి దారి వుంది గని ఆ గదిలోంచి బయటికి దారి లేదు. బయటికి చూడటానికి కిటికీ వుంది. కిటికిలోంచి చూస్తే కాంపౌండ్ లో వున్న పెద్ద నారింజ చెట్టు

 

                                        9)

 

    ఉసిరిక చెట్టు వంటి స్థంభం మేడలాంటి ఒకే కొబ్బరిచెట్టు ఆకాశాన్ని అంటేలా పొడుగ్గా సాగి.... చెట్లు మాత్రమే కనపడతాయి.

 

    కిటికీ దగ్గరగా టేబుల్ ని జరిపి కిటికీకి ఆనించి కుర్చీని వేసింది. బల్లమీద అగ్గిపెట్టెని కొవ్వొత్తిని వుంచింది. "డేంజెర్ స్కేలిటన్" ఆంగ్ల నవలని వాటి పక్కన వుంచింది. అంతకుమించి ఆ గదిలో ఏమి వుండరాదు కాబట్టి ఏమి లేకుండానే జాగ్రత్త పడింది ధైర్య.

 

    మెయిన్ వరండాలోనే వుంది. ఈ గదిలోంచి మూడు గదులు దాటితెగాని వరండా రాదు. టార్చిలైటు చేతిలోకి తీసుకుని ముందు వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళు తాగింది. బాత్రూమ్ కి వెళ్ళి వచ్చింది ఒక్కోగదిలో లైటు ఆర్పుతూ తలుపులు గడియలు వేస్తూ వరండాలోకి వచ్చింది. ఆ యింటి వరండాకి ఇనప మెష్ వుంది. మెష్ తలుపులు లోపలి గడియ తల్లీ తండ్రి వెళ్ళినప్పుడే వేసేసింది. ఆమె రాత్రిళ్ళు దానికి తాళం వేస్తారు. అలాగే తాళం వేసింది.

 

    ఇప్పుడు ఆ యింట్లోంచి బైటికి రావాలంటే వరండా మెష్ కి వేసిన తాళం తీసి బయటికి రావాలి. లేకపోతె వంట గదిలోంచి పెరట్లోకి దారి వింది. అటు బయటికి రావచ్చు. కాని ఆమె అటు తలుపులకి కూడా తాళం వేసింది. సరిగా చెప్పాలంటే యింటిని యినపెట్టేలా చేసుకుని దానిలో కూర్చుంది ఆమె. అలా అనుకోవచ్చు.

 

    ధైర్య వరండాలో వున్న మెయిన్ స్విచ్ ని అపు చేసింది. తాత్కాలికంగా యింటి మొత్తం మీద కరెంటు కట్ అయింది. ఎటు చూసినా గాడంధకారం. ఆమె చేతిలో టార్చిలైటు వుంది కాబట్టి వేయని తలుపులు వేస్తూ లోపలికి వచ్చింది. టార్చిలైటు దగ్గరవుంచుకోవటం మంచిది కాదు. కాబట్టి అది దగ్గరగా వుండరాదు. టార్చిలైటుని అలమరలోపెట్టి అలమర వేసింది,   

 Previous Page Next Page