Home » Suryadevara rammohan rao » త్రినేత్రుడు-2


    "అయ్యో పాపం... ఛాలెంజ్ ని నెగ్గించుకోలేకపోయావే...?" ప్రియాంక నిజంగానే సానుభూతిగా అంది.

    "24 గంటలు కావడానికి మరో 20 క్షణాలుంది..."

    "నీ టైమ్ తప్పా..." ప్రియాంక మెల్లగా నవ్వుతూ అంది.

    "నా టైమ్ బాగానే వుంది. మీ టైమే పరిగెడుతోంది. దానికిప్పుడు బ్రేక్ పడబోతోంది. జనరల్ గా మనం ఫాలో అయ్యేది ఆల్ ఇండియా రేడియో టైమ్. దాని ప్రకారం ఇంకా పదిక్షణాలుంది..."

    ప్రియాంక ఆవేపు ఉలిక్కిపడింది.

    "రెండు మూడు వారాల వరకు మీకు ఫోన్స్ రావటం- మీనుంచి పోవటం వుండకపోవచ్చు. కనుక నువ్వేమైనా చెప్పదలుచుకుంటే వినటానికి నేను సిద్ధంగా వున్నాను..."

    ప్రియాంక ఉలికిపాటు నుంచి ఇంకా తేరుకోలేదు.

    "యస్టర్డే యూ ఫోన్స్... టుడే నో ఫోన్స్... నో రిలేషన్స్... దటీజ్ తిమ్మడు... ఓడిపోవటానికి 360 రోజులే వున్నాయి మీకు..." త్రినాధ్ ఫోన్ పెట్టేశాడు.

    జర్నలిస్ట్స్ మరింత ఉత్సాహంగా ముందుకు వంగారు.

    సరీగ్గా రెండు క్షణాలకి సుదర్శన్ రావు ఇంటికి సంబంధించిన రెండు ఫోన్ కనెక్షన్స్, హెడ్డాఫీసుకి సంబంధించిన పది లైన్స్, ఫ్యాక్టరీలకు సంబంధించిన 20 లైన్స్ నిశ్శబ్దంలోకి జారుకున్నాయి.


                                        *    *    *    *


    ప్రియాంక ఫోన్ వేపే చూస్తూ కూర్చుంది.

    "ఇంకెందుకమ్మా ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నావ్...? అతనా పని చేయలేడు. ఒకవేళ చేయగలిగినా పెట్టిన గడువు దాటిపోయింది..." సుదర్శన్ రావు దిలాసాగా అన్నాడు హాల్లోకి వస్తూ.

    "మన టైమ్ బావోలేదు నాన్నగారు..." అంది మెల్లగా.

    కూతురేమన్నదో సుదర్శన్ రావు కర్ధం కాలేదు.

    "అంటే..?"

    "మన టైమ్ అదుపు తప్పింది..."

    అతనికి అనుమానం వచ్చింది.

    వేగంగా వచ్చి కూతురి ముందున్న ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకొని ఒక్కసారి షాక్ తిన్నాడు.

    డైల్ టోన్ శబ్దం లేదు.

    ఫోన్ నిశ్శబ్దంగా వుంది.

    "దటీజ్ త్రినాధ్. ముప్పై క్షణాల క్రితమే అది చచ్చిపోయింది-" అంది సీరియస్ గా లేచి నించుంటూ ప్రియాంక.


                  *    *    *    *


    ప్రతిరోజు రాత్రి రెండు గంటలవరకు మన బాస్ యింటికి రావటం లేదట. ఇలా రెండు సంవత్సరాలుగా జరుగుతోందట..." హిందూ బోస్ జుత్తును మునివేళ్ళతో తమాషాగా కదిలిస్తూ అంది.

    బోస్ ఓ క్షణం ఆశ్చర్యపోయాడు.

    "రాత్రి ఎనిమిది గంటలకు ఆఫీస్ వదిలేస్తారు. ఎనిమిది నుంచి రెండు గంటలవరకు ఎక్కడికి వెళ్తున్నట్టు...? ఎక్కడ వుంటున్నట్టు...? ఒకవేళ మాలినిదేవిగారి దగ్గరకు వెళుతున్నాడేమో?"

    హిందూ అడ్డంగా తలూపింది.

    "ఆమె దగ్గరకు ప్రాతఃకాలమే వెళ్తాడు తప్ప వేరే టైమ్ లో వెళ్ళడు..."

    "ఇంతకీ నీకీ విషయమెలా తెల్సింది?

    బోస్ ఆమె ఒడిలోంచి లేస్తూ అడిగాడు.

    "నిన్న బాస్ ఇంటికి వెళ్ళాను. అప్పుడు టైమ్ రాత్రి తొమ్మిది గంటలు. బోర్డ్ మీటింగ్ మినిట్స్ మీద సంతకం అర్జంట్ గా కావల్సి వచ్చింది. అందుకే వెళ్ళాను. బాస్ గురించి అడగ్గా వసుంధరాదేవిగారు చెప్పారు." బోస్ ఆలోచిస్తున్నాడు.

    "ఒకవేళ బాస్ ఏదైనా వ్యసనానికి లోనయ్యారా...?" హిందూ సాలోచనగా అంది.

    "అంటే...?"

    "అంటే ఏముంది? ఉమెన్ ఆర్ వైన్ ఆర్ గేంబ్లింగ్..." ఆమె మాటలింకా పూర్తికాలేదు- బోస్ సివంగిలా లేచి హిందూ జుత్తును పట్టుకున్నాడు.

    "ఇదే ఆరోపణ మరొకరు చేసి వుంటే ఈపాటికి వారి తల రెండు చెక్కలయ్యేది. నువ్వు కాబట్టి సరిపోయింది. ఇంకెప్పుడు వంకరగా ఆలోచించకు. త్రినాధ్ గురించి ఎవరు చెడుగా మాట్లాడినా నేను క్షమించలేను" అంటూ ఆమె జుత్తు వదిలేసి ఆగ్రహాన్ని అణచుకొనే ప్రయత్నంలో వుండగా "సారీ... సారీ మైడియర్ బోస్... మగాడు రాత్రిళ్ళు లేట్ గా వస్తే ఒక సాధారణ స్త్రీ ఎలా ఆలోచిస్తుందో అలా నేను సయితం ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నాను" అంది వెంటనే హిందూ గిల్టీగా.

    ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా వున్నారు. "గమనించావా... ఈ మధ్య బోర్డ్ మీటింగ్స్ లో ఇంజనీర్ బాస్ నుంచి డిఫర్ అవుతున్నాడు" హిందూ అది నేరారోపణగా కాకుండా విశ్లేషిస్తున్నట్టుగా అంది.

    పచార్లు చేస్తున్న బోస్ ఠక్కున ఆగిపోయాడు. "గమనిస్తున్నాను" అన్నాడు సీరియస్ గా.


                  *    *    *    *


    ఎప్పుడూ రాత్రి రెండు గంటలకు బయటపడే త్రినాధ్ ఆరోజు మూడుగంటలకు కాని బయటకు రాలేకపోయాడు.

    నడుస్తున్నాడు... నడుస్తున్నాడు...

    నిశ్శబ్దంగా... నిర్మానుష్యంగా వున్న నగర వీధుల వెంట నడుస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో తననెవరూ గుర్తుపట్టకూడదన్నదే అతని యిన్ టెన్షన్.

    అలా నడుస్తూ బస్ స్టాండ్ వరకూ వచ్చాడు. అతనికెందుకో ఓసారి బస్ స్టాండ్ కి వెళ్ళి సరదాగా కాకాహోటల్ టీ తాగాలనిపించింది.

    పరిసరాల్ని గమనిస్తూ బస్ స్టాండ్ లోని కాకాహోటల్ దగ్గరకు వెళ్ళి "సింగిల్ టీ" అన్నాడు.

    బస్ స్టాండ్ మొత్తం నిశ్శబ్దంలో నిద్రపోతోంది. ప్రొద్దుటే లేచి ఫాస్ట్ బస్ కి దూర ప్రయాణం చేయాలనుకున్న నిరుపేదలు ఆదమరిచి నిద్రపోతున్నారు.

    వారివేపే చూస్తూ బాయ్ అందించిన టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు.

    అంతలో ఓ కుర్రాడు "పేపర్ పేపర్" అనుకుంటూ వచ్చాడు.

    అప్పుడు ఆలోచనల్నుంచి తేరుకున్న త్రినాధ్ పేపర్స్ అమ్మే కుర్రాడివైపు చూశాడు.

    అప్పుడే పేపర్స్ వచ్చేశాయా?

    పేపర్ బాయ్ ని దగ్గరకు పిలచి "టైమెంత?" అన్నాడు. '4-30' అన్నాడు బాయ్.

    అంటే...? తను గంటన్నర నుంచి అక్కడే, అలాగే వుండిపోయాడా?

    "పేపర్ కావాలా సార్...?" బాయ్ బోణీకోసం త్రినాధ్ వైపు ఆశగా చూశాడు.

    జేబులో చెయ్యిపెట్టి చిల్లర కొంతతీసి బాయ్ కిచ్చి పేపర్ తీసుకుంటూ ఓ క్షణం ఆగిపోయాడు. నిద్రకు నోచుకోని పసివాడి ముఖం- నీరసంగా కనిపిస్తోంది-

    అతని పసికళ్ళలో ఏదో ఆశ... తపన... మరేదో... పట్టుదల...

    "నువ్వేం చేస్తుంటావ్ బాబు?" త్రినాధ్ ఆసక్తిగా ప్రశ్నించాడు.

    "పేపర్స్ అమ్ముతుంటాను-" అతను మామూలుగా చెప్పాడు.

    అతని వ్యాపారం ప్రారంభం కావటానికి మరో అరగంట టైం వుంది. అందుకే అతను త్రినాధ్ ముందు నుంచి వెంటనే కదలలేదు.

    "ఈ వయస్సులోనే ఈ పనెందుకు చేస్తున్నావ్...?" త్రినాధ్ తిరిగి ప్రశ్నించాడు.

    పిచ్చివాడా- ఎవరైనా ఎందుకు చేస్తారన్నట్టు చూశాడు.

    "డబ్బుకోసం సార్."

    "ఏం చేస్తావా డబ్బుతో?"

    తిరిగి అంతకుముందు చూసినట్టే చూశాడు.

    "బతకడం కోసం సార్."

    "మీ అమ్మా నాన్న సంపాదించరా?"

    "ఉంటే సంపాదించేవారేమో"

    పదేళ్ళ వయస్సులోనే జీవితంపట్ల కొద్దిపాటి అవగాహన తొంగి చూస్తోంది కుర్రవాడిలో.

    "అమ్మా నాన్న ఇద్దరూ లేరా?" ఒకింత బాధగా ప్రశ్నించాడు త్రినాధ్.

    "అమ్మ వుంది. కానెప్పుడూ మంచంలోనే వుంటుంది సార్. క్వారీలో పని చేసినందుకు అమ్మకు టి.బి. వచ్చింది సార్. నాన్న లేడు. పొరపాటున క్వారీ కొలిమిలో పడి చనిపోయాడు" అతని మాటల్లో నిర్లిప్తత, కళ్ళలో విషాదం లీలమాత్రంగా తొంగిచూశాయి.

    త్రినాధ్ మనస్సు కొద్దిక్షణాలు బాధతో విలవిల్లాడిపోయింది.

    "మరి మీ అమ్మకు వైద్యం చేయిస్తున్నావా-?" కుర్రాడు తల వంచుకున్నాడు.

    త్రినాధ్ ఆ కుర్రాడివైపే చూస్తున్నాడు.

    రెండు కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా రాలి అతని చేతుల్లో వున్న పేపర్స్ పైబడ్డాయి.

    కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తన తల్లిని దక్కించుకోలేకపోతున్న నిస్సహాయత ఆ పసిహృదయాన్ని కుదిపివేస్తోంది.

    గుండెకేదో అడ్డం పడినట్లయింది త్రినాధ్ కి. అతని కళ్ళ ముందిప్పుడు తల్లిని దక్కించుకోలేక, తల్లి చావును చూడలేక దూరంగా పారిపోయిన సిద్దప్ప కదలాడుతున్నాడు.

    దుఃఖభాజకమైన జ్ఞాపకాల ప్రవాహం త్రినాధ్ ని క్షణాల్లో ముంచెత్తి వేసింది.      

    "మీ అమ్మను దక్కించుకోవాలని లేదా బాబు?" త్రినాధ్ కంఠంలో తొంగిచూసిన ఆప్యాయతకు కుర్రాడు ఆశ్చర్యంగా చూశాడు.

    "నన్ను గేలి చేస్తున్నారా సార్?" ఏడుస్తూనే అడిగాడు.

    "అదేం లేదు బాబు" అన్నాడు బిత్తరపోతూ త్రినాధ్.

    "ఎన్ని పేపర్స్ అమ్మితే నేను మా అమ్మను బాగు చేయించుకోగలను సార్... నాకా శక్తి లేదని తెలిసీ మీ అమ్మను దక్కించుకోవాలని లేదా అంటే... ఏం చెప్పను సార్?"

    చెళ్ళున వీపుమీద చరిచినట్లయింది త్రినాధ్ కి. వెంటనే ఓ నిర్ణయానికొచ్చి జేబులో చెయ్యెట్టి ఆరోజు వచ్చిన డబ్బు మొత్తాన్ని బయటకు తీశాడు.

    కుర్రాడు ఆశ్చర్యపోయి చూస్తుండగానే త్రినాధ్ తన చేతిలోవున్న డబ్బును అతని జేబులో పెట్టాడు.

    "మా అమ్మను వెంటనే చంపుకోమంటారా ఈ డబ్బు తీసుకుని?"

    త్రినాధ్ కి మతిపోయినట్లయింది.

    మంచి మనసుతో నాకు సహాయం చేయాలనుకున్నందుకు కృతజ్ఞతలు. నేనింతవరకు సంపాదించుకున్న డబ్బుతో ఒకటి తెలుసుకోగలిగాను సార్- మా అమ్మ ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందని? ఇప్పుడు నేను బిచ్చగాడ్ని అయినా, దొంగయినా కనీసం ఆ సంవత్సరం కూడా మా అమ్మ బ్రతకదు సార్..."

    ఒక్కక్షణం ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు త్రినాధ్ కి.

    ఓ బాలుడా- నువ్వు అంతర్లోకంలో మానవతా వాదివయ్యా- మనిషి జీవితానికి సుద్దులే నేర్పే బుద్ధుడివయ్యా నువ్వు- నీతి, నిజాయితి, ఆత్మాభిమానం, అభిజాత్యం నీ రూపంలో ఇంకా ఈ లోకంలో మిగిలే వున్నాయయ్యా-

    నన్ను బతికించుకోవడానికి నా కొడుకు బిచ్చగాడు, దొంగ అయ్యేకన్నా నన్ను చంపుకొనైనా కొడుకు ధీరోదాత్తుడు కావాలనుకునే నీ మాతృమూర్తికి నా శతకోటి వందనాలురా బాలుడా-!

    నిశ్శబ్దంగా ఓ కన్నీటి చుక్క రాలిపడింది త్రినాధ్ కంటివెంట.

    జిజియాబాయి లాంటి కన్నతల్లులు కడుపునిండి తమ కొడుకులకు చెప్పిన కథలకన్నా, నీతి సూత్రాలకన్నా కడుపుమండి, ఎండి నీ కన్నతల్లి నీకు చెప్పిన జీవిత సత్యాలు గొప్పవిరా- కన్నతల్లిని దక్కించుకోలేని నీ నిస్సహాయత నీకు పాపం అంటగట్టదురా... ఆ నిస్సహాయతలోంచి ఉద్భవించనున్న విశిష్ట వ్యక్తిత్వం నీకు పుణ్యాన్నే అంటగడుతుందిరా-

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra