Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 19



    "అందుకేగా....ఇప్పటినుంచే నీతో సంసారం చేస్తున్నాను. ఒకరి కొకరు సంసార సుఖం పంచుకోవాలంటే పెళ్ళి చేసుకొనక్కరాలేదు....." ఆమెని సమీపిస్తూ అన్నాడతను.

    రజనిని పొదివి పట్టుకుని మంచం మీదకు చేర్చాడు సుధాకర్.

    ఎన్నాళ్ళనుంచో  వియోగాన్ని  పొందుతున్నట్టు ఆర్తిగా సుధాకర్  ని అల్లుకుపోయింది రజని.

    వెచ్చని ముద్దులు....వేడి నిట్టూర్పులు....తీయని కబుర్ల తో  ఆ గది నిండిపోయింది.

    సుధాకర్ కు తన  మరదలు  రజనిలో  నచ్చిన గుణం అదే....సొంత భార్యలా ఏమీ దాచుకోకుండా, అరమరికలు లేకుండా తనకు స్వర్గసుఖాలు రుచి  చూపిస్తుంది.

    ఆ విషయంలో రజనిని  తప్పుపట్టాలేకపోయినా, ఒకోసారి తను తప్పు చేయడం  లేదు  కదా అనే బాధ కలుగుతుంది. కానీ తను మాత్రం అదేమీ  పట్టించుకికుమడా, అసలు మాటలు మాట్లాడే అవకాశం యివ్వదు.

    ఉన్న టైమ్ అంతా శృంగారంతోనే  ప్రొద్దుపుచ్చుతుంది.

    అప్పటికే తను పూర్తి పసిపాపాల మారిపోయి.... అతన్ని కూడా తనలా చేయడంలో  మునిగిపోయింది రజని.

    బ్రహ్మ తన కళాన్తేపున్యాన్ని అంతా రంగరించి తీర్చిదిద్దినట్టున్న గ్రీకు శిల్పంలాంటి  ధృడమ్తెన బావ శరీరాన్ని తగలా పెనవేసుపోయిన రజని అతనికి మాట్లాడే అవకాశమే యివ్వడం లేదు.

    ఇరువురూ సృష్టికార్యంలో  మునిగి తెలపోతుంటే తానెందుకు చూడడం అనుకున్నదో ఏమో బెడ్ ల్తెట్ కూడా ఆరిపోయింది.

    ఎప్పటికో అలసిన శరీరాలు వేరయ్యాయి.

    తృప్తినిండిన కళ్ళతో బావను అంటిపెట్టుకునే వుండిపోయింది రజని.

    "రజని! ఏవయినా కబుర్లు చెప్పు."

    ఆమె ఉలకలేదు, పలకాలెదు.

    ఎప్పుడు తనతో పోటిపడుతూ శృంగారంలో అందేవేసిన చేయిలా  తనకన్నా ఫాస్ట్ గా....షార్ప్ గా ప్రవర్తించే రజనిలో ఏదో  మార్పు స్పష్టంగా కనిపించిందతనికి.

    "రజని....వాట్ హే పెండ్? ఇంట్లో ఏమయినా గొడవయిందా?" అనుమానంగా అడిగాడు.

    "అదేమీ లేదు బావా!"

    "మరలా వున్నావేంటి?"

    "ఏమీ లేదు. కాస్తంత తల నొప్పిగా వుందంతే!"

    "అదేమీ లేదు. నా దగ్గర నువ్వేదో దస్తున్నావు కదూ?"

    "ఊహు"

    "నిజం చెప్పు....నీ గురించి నాకు తెలియదా  చెప్పు. ఏమీ లేకపోతే, ఏమీ జరగకపోతే నువ్విలా వుండవని నాకు తెలుసు కానీ.... ఆపలేమయిందో చెప్పు" అనునయంగా అన్నాడతను.

    ఆ మాటలకు అంతవరకు బిగపట్టి వుంచుకున్న దుఃఖం కాస్తా ఆమెలో పొంగి పొర్లింది. అమాంతం అతని గుండెలప్తె  వాలి వెక్కి వెక్కి ఏడ్చింది.

    మొత్తానికి ఆమె మానసికంగా ఏదో  వ్యధతో నలిగిపోతుందని అతనికి అర్ధమయింది అందుకే బాధ అంతా బయటకు పోయేలా ఆమెని ఎవడనిచ్చాడు కొన్ని కొన్ని  సందర్భాలలో  గుండేలలోని బరువంతా దిగిపోయే వరకూ కన్నీరు  కార్చనివ్వడానికి మించిన ఓదార్చు వుండదు.

    సుధాకర్ వ్యక్తిత్వం లేని మనిషే  కావచ్చు. ఆడదంటే  చులకనే  వుండవచ్చు......

    కానీ....అతనికి తనంటే పిచ్చి ప్రేమ చూపించే రజని పట్ల వల్ల మాలిన అభిమానం  వున్నది. తనుఏది కోరితే  అది  చేయడానికి సిద్దపడే మరదలంటే  అతనికి చెప్పలేనంత ప్రేమ, వాత్సల్యం కూడా వున్నాయి.

    అందుకే  ఆమె బాధ చూసిన  అతని హృదయం  చివుక్కుమన్నది.

    "బావా! నాకు  పెళ్ళి  సంబంధాలు చూస్తున్నారు ఈ నెలలో ఎలా  గయినా నా పెళ్ళి  చేయాలనే పంతంలో వున్నాడు మా నాన్నా."

    ఆమె దిగులు ఎందుకో అప్పుడు  అర్ధమయింది అతనికి.

    "అప్పడే  ఏమంత తోందరోచ్చింది మీ నాన్నకు?"

    "తొందర మా నాన్నకు కాదు.

    "మరి నికా?"

    "నీకేం బాబూ! సూటిపోటి మాటలు అనడం మాత్రం బాగా వచ్చు తప్పు  ఎదుటి మనిషి పడే వేదన ఎప్పడయిన అర్ధం చేసుకున్నావా ఏంటి?"

    "సారి డియర్! ఏదో  వచ్చే విషయం మా నాన్నకు ఎలా తెలిసిందో  అప్పటినించి ఎలాగయినా నా పెళ్ళి చేయాలనే  పట్టుదలతో  వున్నాడు."

    "ఏదో ఒక కారణం చెప్పి ఇంట్లో పెళ్ళి వాయిదా వేసే వీలులేదంటావా?"

    "ఊహు....ఇకముందు నిన్ను కలుసుకోవడానికి నేను వచ్చే వీలు వుండకపోవచ్చు. అందుకే  నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలనిపించి మా ఊళ్ళో వుండలేక, నేను  వస్తున్నట్లు నీకు ఫోన్ చేసి బస్ ఎక్కేశాను."

    సుధాకర్ మౌనం వహించాడు.

    "సరెలే బావా....నా నుదుట ఎలా రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. రేపు నాకు పెళ్ళయిపోయిన తర్వాత నేనేప్పడయిన నీకు గుర్తుంటానా?"

    "భాలేదానివి, నిన్నెలా మరచిపోగలను."

    "బావా! నిన్నొకమాట అడుగుతాను నిజం చెబుతావా?"

    "అడుగు."

    "నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు?"

    "అది నాకే తెలియనప్పుడు నీకు నేనేం చెప్పగలవు?"

    "అంతవరకూ గోపాలకృష్టునిలా అడ్డమయిన ఆడవాళ్ళతో తిరుగుతూనే వుంటావా?" ఎత్తిపొదుపుగా అన్నది రజని. 

 Previous Page Next Page