Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 20



    "అదిగో....ఆ విషయంలో  మాత్ర్హం  నువ్వేప్పడూ జిక్యం చేసుకోకు....మనిషికొక బలహీనత వుంటుంది అది నా విక్ నెస్  అన్న సంగతి నీకు తెలిసిందేగా.....అది తప్పు  ఇంకేదయినా అడుగు చెబుతాను" చిరు కోపంతో అన్నాడతను.

    "అవును బావా....ఆ రోజు హాస్పిటల్ లో  నిన్ను జాయిన్ చేసి వెళ్ళిపోయానుకదా....ఇన్స్ పెక్టర్  ధీరజ నిన్ను జాగ్రత్తగా  చూస్తుందనే  నమ్మకంతోనే  అలా చేశాను . అసలు ఆమె నీకోసం  పదే పదే ఎందుకు వస్తుంది? ఆమె అడిగే లెక్చరర్ నిలిమకు, నీకూ ఏదయినా సంబంధం వుందా?"

    "రజని....వద్దన్నా మళ్ళి అదే ప్రశ్న వేస్తున్నావు."


    "అది కాదు బావా.....నువ్వు ఏదయినా పోలిస్ కేసులో ఇరుక్కుంటున్నావేమోననే నా బాధంతా....."

    "చఛ....అలాంటిదేమిలేదు....ఆ నీలిమ యూనివర్శిటి మూడు రోజులు రాకుండా అదృశ్యమ్తెనట్టే  అదృశ్యమ్తె.... నాలుగావరోజు వచ్చిందని తెలిసింది. ఆమె అదృశ్యనికి కారకురేవరోనని ఎంక్వయిరీ చేస్తుంది ఇన్స్ ప్పెక్తర్ దిరజ. అంతేతప్పు నేనెలాంటి తప్పూ చేయలేదు."

    "మరి, ఆమె నీ దగ్గరకే రెండుసార్లు ఎందుకొచ్చింది? ఏ ఆధారమూ లేకుండా  రాదుకదా?" అనుమానంగానే  ప్రశ్నించిందామే.

    "నీలిమ మా డిపార్టుమెంట్  కావడంవలన ఫార్మాలిటిస్ గా  వచ్చిందే తప్పు ఆమె కనిపించకుండాపోవడానికి నేనే కారణమని అనుమానించి రాలేదు."

    "మరి బ్రతికివున్న  మనిషిని పట్టుకుని ఆరోజు రాత్రి నీలిమ దయ్యం కనిపించిందంటూ కలవరించా వెందుకు? ఆమెను గురించి నిజంగానే నీకు ఏమీ తెలియకపోతే అలా ఎందుకు మాట్లాడతావు?"

    "అ....దా....అ....ది...."

    సుధాకర్ తడబడిపోయాడు.

    "అవును....ఆ విషయంలో ధీరజ నిన్ను అనుమానిస్తున్న దన్న సంగతి నీకు  ఖచ్చితంగా తెలుసుకదా?" 

    ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత....

    "అవును....ఆమె అనుమానం నాప్తెనే వుందని నాకు తెలుసు."

    "అదే...ఎందుకనే నేనడిగేది?"

    "ప్లీజ్ రజని.....ఆ విషయం  మాత్రం అడగకు."

    రజని నోరు తెరిచి ఏదో అనబోతున్నంతలోనే ఫోన్ మ్రోగింది.

    రిసీవర్ తీసిన వెంటనే సుదాకర్ ముఖంలో రంగులు మారిపోయాయి.

    "అలాగే సర్....ఇప్పడే  బయలుదేరుతున్నాను. మీరు సరిగానే విన్నారుకదా....అనిల్ ఫాదర్  ముకుందరావు ఆమెతో ఏం చెప్పాడో తెలుసుకున్నారు కదా....ఓకే ఇన్స్ పెక్టర్ ధీరజ వాళ్ళ ఇంటికి వెళితే వెళ్ళింది....వెళ్ళనియండి....మన కెందుకు-నేను వచ్చేవరకూ మీరు ఆఫీసులోనే వుండండి."

    సుధాకర్ ఫోన్ పెట్టేశాడు.

    ఒక మాటకు మరొక మాటకు  పొంతన లేకుండా ఫోన్ లో  మాట్లాడిన సుధాకర్  మాటలని విన్న తర్వాత, అతని ప్తెమారింత అనుమానం  బాలపడిందామేకు.

    "రజని.....నేను  అర్జెంటుగా బయటకు  వెళ్ళాలి. తలుపు వేసుకో. రావడానికి ఒకగంట పడుతుంది" లేచి బట్టలు వేసుకుంటూ అన్నాడు సుధాకర్.

    "ఇప్పడే వెళ్ళాలా బావా?"

    "అవును....మా వ్తేస్ చాన్సలర్ ఫోన్ చేశాడు. ఒక ముఖ్యమ్తేన విషయాన్ని డిస్కస్ చేయవచ్చు. ఎంతో అవసరం కాకపోతే చక్కని చుక్కని గదిలోవుంచి నేను బయటకు వేళతానా చెప్పు?"

    "నేను ఒక్కదానినే ఒంటరిగా వుండలేను.....అయితే నేను మా వూరెళ్ళిపోతాను.

    "నీ యిష్టం."

    "తాళం వేసి నేను ఆటో లో వెళ్ళిపోతాను కానీ....అర్జెంటు  అంటున్నావు కదా ముందు నువేళ్ళు బావా."

    తలూపి  బయటకు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు.

    స్కూటర్  నడుచుకుంటూ వస్తున్న ఆమెని  చూడగానే....అంత వరకూ దూరంగా ఒక సందులో నిలిచివున్న  పోలిస్ జిఫ్ కదిలి వచ్చి ఆమె ప్రక్కనే ఆగింది.

    రజని మారు మాట్లాడకుండా జిఫ్ ఎక్కింది.

    గేర్ మార్చి జిఫ్ నీ ముందుకు దూకించింది ఇన్స్ పెక్టర్ ధీరజ.

   
                              *    *    *    *


    యూనివర్శిటి కాంపస్.....

    సాయంత్రం నాలుగు గంటల ఇరవ్తే ఐదు నిమిషాలు.

    ఆఖరి క్లాసు కావడానికి ఇంకా ఐదు నిమిషాల వ్యవధి వుంది.

    ఇంగ్లీషు లెసన్  చెప్పి, అప్పడే క్లాసు రూమ్ లో నించి  బయటకు రాబోకున్న  లెక్చరర్ నీలిమ నిలుచున్నామే  నిలుచున్నట్టే కుప్పకూలి పోయింది.

    సరిగ్గా ఆక్షణంలోనే నీలిమవ్తెపు చూస్తున్న రమేష్  మిత్రబృందం ముగ్గురూ ఆమె అంత హఠాత్తుగా  పడిపోవడం చూసి ఖంగు తిన్నారు.

    క్రిందపడిపోబోయేముందు లెక్చరర్ నీలిమ చూపులు  తమప్తెన  వుండడం చూసి బేజార్తేపోయారు వాళ్ళు.

    వ్తెస్ చాన్సలర్  హడావుడిగా వచ్చాడు.

    అంబులెన్స్ కు  ఫోన్ చేయడంతో పది నిమిషాల్లో ఆమెని హాస్పిటల్ లో చేర్చించాగాలిగారు.

    యూనివర్శిటి లెక్చరర్లు, స్టూడెంట్లు అసలా మెకు ఏమయిందో అర్ధంకాక హాస్పిటల్  ముందు  గుమికూడి తమలోతామే చర్చించుకుంటున్నారు.

    సరిగ్గా ఇది  జరిగిన మూడు  గంటల తర్వాత....

    టీచర్స్  కాలనిలో వున్న ఒక ప్రభుత్వోద్యోగి క్వార్టర్ లో ఇద్దరు పెద్దమనుషులు సమావేశమ్తె వున్నారు.

 Previous Page Next Page