Previous Page Next Page 
యోధుడు పేజి 18

    తమకు తన బాస్ అప్పగించిన పని త్వరగా అయిపోతే బావుండన్న ప్రయత్నంలో మహేందర్ బయట పెట్టిన వివరాలు కొత్త ప్రమాదాల్ని తేబోతున్నాయని అశోక్ రెడ్డి ఊహించలేకపోయాడు.

    "కేవల్కర్ కుటుంబానికి చెందిన మీకే ఆ వివరాలు సరిగ్గా తెలియకపొతే, మాకు ఎలా తెలిస్తాయి?" నిరాశగా అన్నాడు అశోక్ రెడ్డి.

    "ఎప్పుడైనా మీకు సంతోష్ కేవల్కర్ గురించి ఎలాంటి వివరాలైనా తెలిస్తే... మా క్కొంచెం ఫోన్ చేస్తారా?" మహేందర్ తన పాకెట్ లోంచి విజిటింగ్ కార్డు తీసి అంకుష్ కేవల్కర్ చేతికిస్తూ అన్నాడు.

    "ఓ.కే.మా  పెద్దవాళ్ళని అడుగుతాం" చెప్పాడతను.

    మరో ఇరవై నిమిషాలు గడిచాక మహేందర్, అశోక్రెడ్డి ఇద్దరూ బిల్లు చెల్లించి, వాళ్ళిద్దరితో కరచాలనం చేసి, బార్ లోంచి బయటకి వెళ్ళిపోయారు.

    వాళ్ళు కౌంటర్ దాటి వెళుతున్నంతసేపూ, మౌనంగా వున్న రణదీఫ్ కేవల్కర్_

    "మన పధకం తలక్రిందులైపోయింది" అన్నాడు ఒకింత నిస్పృహగా.

    "ఏం?" అడిగాడు అంకుష్ అమాయకంగా.

    "పేపర్లో ఆ లాయర్  నీలకంఠన్  యిచ్చిన ప్రకటన చూసి ఒకప్పుడు ఈ లింగ్ సిగార్ లో కాపురమున్న సంతోష కేవల్కర్ కొడుకుని ఏవో కొన్ని వివరాలు సేకరించి, నేనే సంతోష్ కేవల్కర్ కొడుకునని నిరూపించే ఆధారాలు తీసుకుని, హైదరాబాద్ వెళ్ళి ఆ లాయరు ని కలిసే లోపే, అసలైన కాశీచరణ్ హైదరాబాద్ చేరిపోయి,   లాయరు దృష్టిలో పడిపోయాడు. ఇప్పుడేమిటి చేయడం?" అన్నాడు రణదీఫ్.

     అంకుష్  మౌనంగా వుండిపోయాడు.

    "అయినా ఫర్వాలేదు_ వీలయితే నేనే సంతోష్ కేవల్కర్ అసలు కొడుకునని వదిస్తాను_ లేదనుకుంటే మరో రకంగా ఆ ఆస్తిపై హక్కు కోసం ప్రయత్నిస్తాను" అన్నాడు రణదీఫ్ ఎక్కడో ఆలోచిస్తూ.

    "అల్  రెడీ కాశీచరణ్ హకీం సత్యం మనవడ్ని తొంభై శాతం ఆ లాయరు నమ్మేశాడు. కాకపోతే ఆ లాయరు గట్టిపిండం కానుక మిగతా పదిశాతం ఆధారాలకోసం అయన అసిస్టెంట్  ని యిక్కడికి పంపించాడు కనుక అసలు కొడుకుననే వాదన మానేసి, రేండో మార్గంలో ఆలోచించడం బెటర్.

    ఏది ఏమైనా, ఒకప్పుడు యిక్కడ నివాసమున్న సంతోష్ కేవల్కర్ గురించి మనం విన్నది కరక్టే" విస్మయానికి గురవుతూ అన్నాడు అంకుష్.

    "హండ్రెడ్ పర్సెంట్" అన్నాడు రణదీఫ్.

    "ఏదో లక్షల్లో ఆస్తి వుండనుకున్నానుగాని, కోట్లలో వుంటుందనుకోలేదు" అన్నాడు అంకుష్.

    రణదీఫ్ అలోచిస్తుండిపోయాడు.

    "శుశ్రుత హాస్పిటల్లో అ వ్యక్తిని వుంచుకుని వీల్లెక్కడకు వచ్చారెందుకూ?" తిరిగి అనుమానం వ్యక్తం చేశాడు అంకుష్.

    "చెప్పాడుగా వినలేదా? ఆ క్యాండి డేట్ విషయంలో కొన్ని డౌట్లు వున్నాయట. అతనే అసలైన వ్యక్తి చేశాడు అంకుష్.

    చెప్పాడుగా వినలేదా? ఆ క్యాండినెట్  విషయంలో కొన్ని డౌట్లు వున్నాయట. అతనే అసలైన వ్యక్తి అని నిరూపించే ఆధారాలు పకడ్బందీగా వుండాలని వచ్చారు ఆ కాశీచరణ్ అనే వ్యక్తి విషయంలో, లాయర్  నీలకంఠన్  కి కొన్ని డౌట్లు వుండటమే మనకు మంచిది. అలాగే అతని దగ్గర తన తల్లి పోటోగాని, తండ్రిపోటోగాని లేవు. ఎందుకంటే ఆ ఫోటోలు మన దగ్గరే వున్నాయి కాబట్టి" తను అమలుపర్చబోయే పధకానికి మనసులోనే అంకురార్పణ చేసుకుంటూ వున్నాడు రణదీఫ్.

    "అతని దగ్గర మాత్రం అతని తల్లిదండ్రుల అనడానికి ఆధారం ఏముంది?" ప్రశ్నించాడు అంకుష్.

    "అసలు కాశీచరణ్ హాకీం సత్యం మనవడేనా? అయినా కాశీచరణ్ తల్లితండ్రులు ఫలానా అని తెలియడానికి వాళ్ళని ఏ ఒక్కరూ చూడలేదుగా?" ధీమాగా అన్నాడు రణదీఫ్.

    "కాశీచరణ్ తన తల్లితండ్రుల ఫోటోలు గుర్తుపట్టగలడు కదా?" అడిగాడు.

    "అతను రైలు యాక్సిడెంట్ తో గతం అంతా మర్చిపోయాడనే శుభవార్తను ఆ జూనియర్లు ఇద్దరూ చెప్పారు గదా వినలేదా? మా నాన్న అప్పుడెప్పుడో ఫోటోస్టూడియో పేట్టి, పాత ఫోటోలను శాంపిల్స్ గా పెట్టడం, ఇప్పుడు మనకు బాగా ఉపయోగపడుతోంది. అంతా మనకు కలసివచ్చే టట్టుగానేవుంది" అన్నాడు రణదీఫ్ అనందం వ్యక్తం చేస్తూ.

    "ఏమిటి కలసివచ్చేది బూడిద? నాకయితే నమ్మకం లేదు. ముందేమో హాకీం సత్యం మనవడ్ని నేనేనంటూ ఉత్సాహపడి పోయావ్. నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఆ లాయర్ ని నమ్మిచేలోపే ఎక్కడి నుంచో ఒకడు ఊడిపడి ఆ లాయరు దృష్టిలో పడిపోయాడు. వాడేనిజమైన వారసుడు, సందేహమే లేదు. లేదంటే మహా మేధావైన నమ్మేవాడు కాదు.

    ఇకపై మనం జాగ్రత్తగా ఈ విషయాన్నీ డీల్ చేయకపోతే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే" భయపడుతూ అన్నాడు అంకుష్.

    "మనం అంతకంటే గట్టివాళ్ళం."

    "నాకెందుకో భయంగా వుంది" అన్నాడు అంకుష్.

    "ఒర్ పిచ్చి కజినూ! లక్షరూపాయలు మనం అక్రమంగా సంపాదించాలంటే అరకోటి వెధవపనులు చేయాలి. కోటీరూపాయలు సంపాదించాలంటే అరకోటి వెధవపనులు చేయాలి. తొమ్మిదికోట్లు సంపాదించాలంటే అందులో సగామన్నా వెధవ పనులు చెయ్యాలి. పేపర్లో సంతోష్ కేవల్కర్ కి సంబంధించిన ప్రకటన రావటం దగ్గర్నుంచేదాకా మనం ప్లాన్ వేశా. మనం అదృష్ట జతుకులం కాబట్టి సంతోష్ కేవల్కర్ ఫోటో, అతడి భార్య ఫోటో మనకు దొరికాయి.

    దీనికితోడు ఆ లాయర్  నీలకంఠన్  ని నమ్మించడానికి నేను చేసిన పనులేంటో తెలిస్తే నువ్వు గుండాగి చస్తావ్?" అన్నాడు రణదీఫ్.

    "నాకు తెలీయకుండా నువ్వేం చేశావ్?"

    "నకలీ డిగ్రీ సర్టిఫికేట్, ప్.జి. సర్టిఫికేట్ సృష్టించా. అందులో నా తండ్రి పేరు సంతోష్ కేవల్కర్, నా పేరు రానదేఫ్ కేవల్కర్ అంతే."   
 

 Previous Page Next Page