Previous Page Next Page 
యోధుడు పేజి 17

    ఆ కాశీచరణ్ అనే పేషెంట్ ఈ హాస్పిటల్లోవునంతవరకూ మాత్రమె" నవ్వుతూ చెప్పింది డాక్టర్ మధురిమ.

    ఆమె నవ్వుతో శృతి కలిపాడు  నీలకంఠన్ .
   
                                                *    *    *    *
   
    కర్ణాటకలోని లింగ్ షుగర్ సిటీ బస్టాండ్ ఎదురుగా వున్న మయూరలాడ్జిలోంచి ఇద్దరు యువకులు హుషారుగా బయటకి వచ్చారు.

    వాళ్ళిద్దరూ లాయర్  నీలకంఠన్  అసిస్టెంట్లు మహేందర్, అశోక్ రెడ్డి.

    "వేతకబోయిన తీగ కాలికి తగలడం ఏమిటి?" ప్రశ్నించాడు మహేందర్.

    "ఈ తీగలు, డొంకల గురించి నన్నేం అడగొద్దు... అసలే నా బుర్ర పగిలిపోతుంది. ముందు బార్ ఎక్కడుందో చూడు. అనవసరంగా మన రాష్ట్రంలో మందుని నిషేధించడం వల్లగదా పరాయి రాష్ట్రంలో మందుని వెతుక్కోవాల్సి వచ్చింది. చూడు రేపో నేడో మన రాష్ట్రంలో మందువిప్లవం వచ్చి, ప్రభుత్వం పడిపోతుంది" కసిగా అన్నాడు అశోక్ రెడ్డి.

    "ముందు విప్లవం వస్తుందంటావా రాణీ... రాణీ ముందు ఎదురుగా చూడు బిడ్డా" లోట్టలువేస్తూ అన్నాడు మహేందర్.

    ఎదురుగా చూసిన అశోక్ రెడ్డి "పీతమ్  బార్" అనే బోర్డు కనబడగానే.

    "వేదగబోయిన తీగ అంటే ఇంకేదో అనుకున్నాను, పడ... పడ... త్వరగా తాగేద్దాం" ఉరుకులు, పరుగులమీద ముందుకు నడిచాడు అశోకరేడ్డి చెప్పేశాడు బెరర్ తో.

    "మీరు ఆంద్రావాళ్ళా?" బేరార్ కన్నడ యానతో అడిగాడు.

    "ఏం?!"

    "మరి, రేపు మందుండదన్నట్లుగా చెప్పెస్తుంటేనూ" అని వెళ్ళి పోయాడు

    "వీడి క్కూడా... మనం లోకువ అయిపోయాం" అంటూ నలువైపులా పరికించి చూశాడు అశోక్ రేడ్డి.

    కాసేపయ్యాక మూడు బీర్లు పకోడి ప్లేటు తెచ్చి టేబుల్ మీద పేట్టి వెళ్ళిపోయాడు బేరర్. రెండు బీర్లు ఆత్రంగా ఓపెన్ చేసి, తాగడం మొదలేట్టారు వారిద్దరూ.

    "వన్స్ అపాన్ ఏ టైమ్... అంటే అనగనగా ఒకరోజు డాగ్ టైల్ అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాడట వెనకటికేవడో.... అలా వుంది మన పరిశోధన" గత గటా తాగిన బీరు లైట్ గా కిక్కివ్వగా అన్నాడు మహేందర్.

    "నేనూ అదే అనబోయాను. నువ్వే అనేశావు. వాడెవడో సంతోష్ కేవల్కర్. ఒక్క సంతోష్ ను మనం వెతుక్కుని వెళితే,అరడజను సంతోష్ కేవల్కర్లు తగిలారు. మనం ఆ కోట్ల ఆస్తి గురించి చెపితే, ఇంకో డజనుమంది కేవల్కర్లు మనతోపాటు పెట్టె సర్దుకుని వచ్చేసేవారేమో."

    ఏమో... ఇంకో రెండు రోజులు మనం మరిశోధన వివరాలు సాగిస్తే అస్సలు మనకు కావలసిన కేవల్కర్ కుటుంబం గురించి వివరాలు తెలుస్తాయేమో" మహేందర్ అన్నాడు.

    "దొరికిన వివరాలు చాలు. ఇవాళ రాత్రికే వెళ్ళిపోదాం" అన్నాడు అశోకరెడ్డి.

    వాళ్ళిద్దరి సంబాషణ కేవల్కర్ దగ్గర మెదలై క్రమంగా దారితప్పి సినిమాల మీదకు మరలుతోంది. అంతవరకూ వాళ్ళిద్దరూ గమనించని విషయం, వాళ్ళకు కొంచెం దూరంలో కూర్చున్న ఇద్దరు యువకులు వాళ్ళ మాటల్ని చెవులు రిక్కించి వింటూన్నారని. వాళ్ళ మాటల్ని విన్నవారిద్దరూ నేమడిగా కన్నడంలో గుస గుసలాడుకున్నాక, ఒకడు లేచి అశోక్ రేడ్డి, మహేందర్ కూర్చున్న టేబుల్ దగ్గరకొచ్చి "మీరు ఆంద్రావారా?" అని అడిగాడు.

    "ఏస్" జావబిచ్చాడు మహేందర్. ఇంతట్లో రేండో వ్యక్తికూడా వాళ్ళ టేబుల్ దగ్గరకొచ్చాడు.

    "మైనేం ఈజ్ మహేందర్. హి ఈజ్ అశోక్ రెడ్డి. జూనియర్ అడ్వకేట్స్. కూర్చింది" అంటూ పక్కనేవున్న సీట్లను చూపెట్టాడు మహేందర్.

    "బైదిబై... మై నేం ఈజ్ రణదీఫ్ కేవల్కర్... హి.. ఈజ్... అంకుష్ కేవల్కర్... మై కజిన్" చెప్పాడు మొదటివ్యక్తి.

    "కే..వ..ల్క..ర్."

    అంత వినగానే మహేద్మార్ అశోక్ రెడ్డి విస్మయానికి గురయ్యారు.

    "వెదకపయిన తీ .... గ"ఏదో అనబోయాడు మహేందర్. ఆ మాట అతని నోట్లోంచి రాకముందే బూటుకాలితో తొక్కాడు అశోక్ రేడ్డి.
 
    "బీరుకే ఔటయిపోయి కాలితో తంతావెంటి? అందుకే చెప్పాను దూరంగా కూర్చోమని" మహేందర్ అన్నాడు అమాయకంగా.

    "మీరు ఎవరికోసమో వెతుకుతూ ఇక్కడికొచ్చినట్టున్నారు?" అడిగాడు రణదీఫ్.

     "అవును. అదొక కధ. మీలాంటివాడే ఒక కేవల్కర్ కొడుకు కోసం. సంతోష్ కేవల్కర్ అని ఒకయాన ఆయనకో కొడుకు. ఎనిమిది తొమ్మిది కోట్లకి వారసుడు_ అతని పేరు కాశీచరణ్. ప్రస్తుతం రైల్ ఏక్సిడెంటై గతం మర్చిపోయి హైదరాబాద్ లోని శుశ్రుత హాస్పిటల్లో వున్నాడు_ అతని బేగ్రౌండ్ వివరాలు సేకరించటం కోసం వచ్చాం.

    ఎందుకంటే అతని ఐడెంటిటీ విషయంలో స్పష్టమైన అధరాలు కావాలని మా బాస్ పట్టుబట్టాటంతో..." అంటూ కధంతా చెప్పేసి, గబగబా బీరు బాతీల్ ఖాళీ చేసేశాడు మహేందర్.

    "ఈ ఊరిలో సంతోష్ కేవల్కర్ అన్న వ్యక్తి అప్పట్లో బట్టల వ్యాపారం చేసేవాడు అతని గురిచి మీకేమైనా తెలుసా? ఎందుకడిగా నంటే మీ ఇంటి పేరుకూడా కేవల్కర్ కనుక."

    "మా జన్మస్థలం ఇదే అయినా చ్చిన్నప్పటినుండి మద్రాసులో వుండటంవల్ల ఆ వివరాలు మాకు తెలీదు" రణదీఫ్ అన్నాడు.

 Previous Page Next Page