Home » Chandu harshavardhan » నల్లతంబి

టైమ్ చూసుకున్నాడు రాజశేఖర్.
"అతను ఏ పనిమీద వచ్చినా నన్ను కలుసుకోవడానికే ఆంధ్రానుంచి వచ్చాడు. అతనికి సహాయం చేయడం మన విధి. అతన్ని మన స్కూలు ఫంక్షన్ దగ్గరకు రమ్మని చెప్పు."
అలాగేనని తలూపి కిందకు వెళ్ళాడు మురుగన్.
హాల్లోని ఫోన్ మ్రోగింది.
"హల్లో! యార్ వేలమ్...ఆమ్ మా....నాన్ దా ఉంగళ్ సెక్రటరీ మురుగన్ పీశ్ ...ఆ... ఇదిగో చూడప్పా ....సార్ కి ఈ రోజంతా బిజీ ప్రోగ్రామ్. సరే ఒక పని చెయ్యప్పా....వెస్టు మాంబళం తెరుయుమా....అంగె సరస్వతీ విద్యాలయం సాత్ టి ఊళ్లానాంగో...ఆ మాకు పని ఉందయ్యా ఫోన్ పెట్టెయ్. అవును. ఆగె అవర్ ఇరుకురార్....కండిపా వరువారొప్పా" అని విసుగ్గా ఫోన్ పెట్టేశాడు మురుగన్.
అతని కోసమే ఎదురుచూస్తున్నారు స్కూలు సిబ్బంది.

                                            *    *    *
ఆ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులకు బహుమతి ప్రధానం చేశాడు రాజశేఖర్.
అనాధ బాలురు, అపరాధ బాలకులు, నిరక్షరాస్యులైన నేరగాళ్లకు చదువు చెప్పడమంటే ఎంత కష్టమో చెప్పనలవి కాదు. అలాంటి పరిస్థితులలో కూడా ఎంతో నేర్పుగా....ఓర్పుగా వారికి విద్యాబుద్దులను నేర్పడంలో కృతకృత్యులు కావడమంటే కత్తిమీద సాము లాంటిది.
అనాధ బాలలకు విద్యాబుద్దులు నేర్పడానికి ఒక విద్యాలయం....వారు వుండడానికి శరణాలయం, యువకులకోసం ఒక ప్రయివేట్ కళాశాల, కష్టించి పనిచేసే వారికోసం తాను ఎక్స్ పోర్టు చేసే బిజినెస్ కి చెందిన ఫ్యాక్టరీ....ఇలా అన్ని అవకాశాలూ కల్పించి, నేరస్తులుగా ముద్రపడిన వారినుంచి నేర లక్షణాలను దూరంగా పారద్రోలడంలో తనవంతు కృషి తాను చేస్తున్నాడు రాజశేఖర్.
అతను వచ్చిన కొద్దిసేపటికే ఇన్ స్పెక్టర్ ధీరజ్ కూడా వచ్చి అ ఆ స్కూల్ ఫంక్షన్ లో పాల్గొన్నాడు. అక్కడి పద్దతులను, వాతావరణాన్ని, 'అన్న'పై అక్కడి వారికి వున్న అవ్యాజమైన ప్రేమానురాగాలను గుర్తించి అచ్చెరువు చెందాడతను.
ఎందరో నేరస్తులు బడా నేరస్తులుగా సమాజానికి దిగుమతి కాకుండా అతనివల్ల మంచి మార్గంలోకి మళ్ళి, దేశాభ్యుదయం కోసం కృషి చేసే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడటం చూస్తుంటే అతనొక అపురూపమైన వ్యక్తిగా తోచాడతనికి.
హడావుడి తగ్గిన తరువాత రాజశేఖర్ దగ్గరకు ధీరజ్ ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు మురుగన్.
"ఇక్కడకు రాకముందు మీ గురించి వినడమే కానీ, ఇంత గొప్పగా వూహించలేకపోయాను. ఎనీ వే....యూ ఆర్ రియల్లీ గ్రేట్! మీ కృషి ఎంతయినా అభినందనీయం. ఏ ప్రభుత్వాలూ చేయలేని పని మీరు చేస్తున్నారు. మీలాంటి గొప్ప వ్యక్తిని కన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు..." చెప్పుకుపోతున్న ధీరజ్ ను మధ్యలోనే ఆపేశాడు రాజశేఖర్. "ముందు మీరు వచ్చినపని చెప్పండి!"
"ప్రశాంతంగా..." అని అర్ధోక్తిలో ఆగిపోయాడు ధీరజ్.
"ఇట్స్ ఆల్ రైట్! మీకు అభ్యంతరం లేకుంటే నా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం."
డ్రయివర్ ప్రక్కనే మురుగన్ సర్దుకున్నాక బయలుదేరింది మారుతీ కారు.
"ఈ మధ్యకాలంలో మాకు కొత్తకేసులు ఎదురవుతున్నాయి. వివిధ రైళ్లలో ఎంతో చాకచక్యంగా సెకండ్ క్లాస్, ఏ.సి. కోచ్, ఫస్ట్ క్లాస్ కోచ్ ల్లో దోపిడీలు చేయడం ప్రారంభించారు. ఇంతవరకూ చిన్న ఆధారం కూడా దొరకలేదు. ప్రతిచోటా ఇద్దరే నేరం చేస్తున్నారని తెలుసు. కాని, వాళ్ళు ఎవరో ఎలా వుంటారో తెలుసుకోలేకపోయాం. దోపిడీ అయిన బంగారం, నగలు, వజ్రాలు ఎక్కడా అమ్మకం కానీ, మార్పిడి చేయడం కానీ జరగలేదు. దీనితోనే వాళ్ళెంత తెలివైన నేరస్తులో అర్ధం చేసుకోవచ్చు. నేరం జరిగిన ప్రతిచోట్టా ధైర్యంగా "కమెండో" అనే స్టిక్కర్ అంటించి వెళుతున్నారు. వాళ్ళ నేరాలు ఏదో ఒక టైప్ అయితే ఒక ప్రాంతానికి పరిమితమైతే ఎలాగోలా వలవేసి పట్టుకోవచ్చు. కానీ, ఎప్పుడు ఎక్కడ ఏ రైలులో దోపిడీ చేస్తారో, ప్రయాణీకులకు ఎలా టోపీ పెడతారో వూహించలేకుండా వున్నాం. ట్రయిన్స్ లో సెక్యూరిటీ పూర్తిగా కవర్ చేసినా వుపయోగం వుండడం లేదు. జరిగే నేరాలు జరుగుతూనే వున్నాయి. ఇంతవరకూ ఎలాంటి ఆచూకీ లభించకపోవడం వల్ల మా డిపార్టు మెంటుకు తలవంపులుగా వుంది."
"వాళ్ళ రూపురేఖలు, ఆనవాళ్ళు వగైరా ఏమైనా తెలుసుకోగలిగారా?"
"ప్చ్...వాళ్ళు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అందరికళ్ళూ గప్పి, అవలీలగా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఏ చిన్న క్లూ వదలడంలేదు. ప్రతిచోటా పోలీసులను వెక్కిరిస్తున్నట్టు 'కమెండో' అనే పేరు మాత్రం వుంటున్నది."
"ఆ ఇద్దరూ అంత తెలివైన నేరస్తులన్నమాట."
"అవును....అందుకే మీ సహాయం కోరి వచ్చాను."
"డ్యూటీ పట్ల ఎంతో సిన్సియర్ గా వుండే మీరు ఆ నేరస్తులను తప్పకుండా పట్టుకోగలరన్న నమ్మకం నాకుంది" అన్నాడు రాజశేఖర్.
"థాంక్యూ...కానీ...." ధీరజ్ క్షణం ఆగాడు.
పోలీస్ పరిభాష అర్ధంకానట్టు విస్మయంగా చూశాడు రాజశేఖర్.
"కానీ, నా మాటలకు మీరు అఫెండ్ ఆపవద్దని ముందుగానే చెపుతున్నాను మిష్టర్ రాజశేఖర్! తమిళనాడు నుంచి ఆపరేట్ చేస్తున్న ఆ ఇద్దరు నేరస్తుల గురించి మీకు తప్పకుండా తెలిసి వుంటుందన్న నమ్మకం తోనే ఇక్కడకు వచ్చాను. నా నమ్మకాన్ని వంముచేయరనే అనుకుంటాను. ఈ విషయంలో ఆరునూరైనా మీరు నాకు వాళ్ళను పట్టిఇవ్వాలి!" నిష్కర్షగా తాను వచ్చిన పని కుండా బద్దలుకొట్టినట్లు రెండు ముక్కల్లో చెప్పాడు ధీరజ్.
"వ్వాట్..! వాళ్ళ  గురించిన సమాచారం నాకు తెలుసునని అంత ఖచ్చితంగా ఎలా అనుకుంటున్నారు? ఐయాం సారీ...! పోలీస్ పరిభాష నాకిప్పుడు అర్ధమవుతోంది. డోంట్ థింక్ ఐ యాం హార్బరింగు క్రిమినల్....క్రిమినల్స్ కు నేనేదో షెల్టర్ ఇస్తున్నట్టు మీరు నన్ను అనుమానిస్తున్నారని నేను అర్హ్ద్మ చేసుకోవలసి వస్తున్నది. దగాపడిన తమ్ముళ్ళను, చెల్లెళ్ళను, అలానే చేసిన నేరానికి శిక్షను అనుభవించి, పరివర్తన చెందిన వ్యక్తులకే నేను ఆశ్రమం కల్పించాను, కల్పిస్తాను. కానీ....నేరస్తుల కొమ్ము కాస్తానని పొరపాటున కూడా అనుకోకండి...." ఎంత అణుచుకున్నా ఆవేశం పొంగిపొరలింది రాజశేఖర్ మాటల్లో. అప్పటికే అతనికళ్ళు ఎర్రబడ్డాయి.
"సారీ! మీరు హార్టు అయినట్టున్నారు....అందుకనే అడగడానికి సందేహించాను. కానీ, నా విద్యుక్తధర్మం నేను నిర్వర్తించాలిగా! ఎనీవే! ఇలా అడగడంలో మిమ్మల్ని అనుమానించానని అపార్ధం చేసుకోవద్దు. దర్యాప్తు అధికారిగా నాపై వుండే ప్రెషర్ ను మీరు అర్ధం చేసుకుని నాకు సహకరిస్తే సంతోషిస్తాను" అన్నాడు ఇన్ స్పెక్టర్ ధీరజ్.
రాజశేఖర్ మౌనం వహించాడు.
అతని ముఖంలో క్రోధం తాలూకు చాయలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి.
మారుతీకారు శాంతి నిలయంలోకి వచ్చి ఆగింది.
"అన్నా! సాయంత్రం ఆరుగంటలకు రమ్మంటారా?" కారు దిగుతూ అడిగాడు మురుగన్.
"అలాగే....భోజనం చేసి వెళ్ళు."
"మరి నన్నెప్పుడు కలవమంటారు?" వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు ధీరజ్.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra