Previous Page Next Page 
కాలనాగు పేజి 14

    ఆ వసంతయామినీ వేళలో అయన చేస్తున్న ఆ దిక్షా కార్యక్రమం జంటల్ని ముడివేయడం అది ఆయనకే తెలుసు.

    ఆ రహస్యాన్ని_ నాకు తెలిసిందే అయినా_ నీకు ఎలా చెప్పగాను?

    ఉలూచి మాటలు విని మౌనం వహించాడు ఆదిత్య

    "ఆదిత్యా! నేను నిన్ను ప్రేమిస్తున్నాను"

    నిట్టూర్చాడు అతను

    "నన్ను పెళ్ళిచేసుకో_ మీ తండ్రికి చూపు తెప్పిస్తాను, నీకు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం వేయిస్తాను. నీకు ఎక్కడలేని స్ఖు భోగాలు అందిస్తాను. అన్నట్టు భోగాలు అంతే తెలుసా?"
    తలూపాడు అతను

    'నీకు తెలీదులే! భోగం అంతే పాడగా. అది సుఖాలు చోహ్నం.

    అనండ చిహ్నం ఎంత భోగం అన్నమాట వినలేదా? స్వామికి బహోగం నేరిపాడు అన్నమాట వినలేదా? పోనీ_ రసిక ప్రపంచంలో పురుష లోకానికి స్రీ సౌఖ్యాన్ని అందించే అత్యత్తమ కళాకారిణిని ఏమంటారో తెలుసా? బోగుంది అంటారు- ఆదిత్యా! ఈ సృష్టిలో దేవతులు,రాక్షసులు,మనుష్యులు,గందర్వులు, కిన్నెరలు_ ఎందరో వున్నారు. కానీ దాంపత్యం సుఖం మీరూ, మేము కలసి సుఖిస్తే అది సుఖానికి పరాకాష్ట సృష్టిలో అంత అనందం యింకెక్కడా వుండదు? అందుకే నరశ్రేష్ఠమైన అరుర్జునిడి ఉలూచి వలచింది'అంది ఉలూచి.

    ఆదిత్య ముఖాన మందహాసం వెలిసింది.
   
    "నవ్వుతావేం?"

    నవ్వక_ అమ్మా! నిన్ను చూస్తే నాకు దేవతాభావన కలుగున్నది, మీరు దివ్వులు మేం మనుషులం మాకూ పొట్టు_ కుదరదు.

    "ముర్ఖుడా!" కోపంగా అంది

    నమస్కరించాడు ఆదిత్య, "తిట్టివే! దీవించినా తల్లి వే!

    "నిన్ను శపిస్తాను_"

    "నా ఖర్మ అనుకుంటాను_"

    "పో_ అనుభవిస్తాను-"

    కళ్ళముందు ఏదో మెరిసినట్టుయింది

    మెరుపులా మెరిపి మాయమైనట్టుంది.

    కళ్ళు నలుముకున్నాడు ఆదిత్య.

    ఎదురుగా ఎవరూ లేరు....

    దూరంగా జనం... ఎవరి పనుల్లో వాళ్ళు.

    గాధంగా నిట్టూర్చి యింటి ముఖం పట్టాడు ఆదిత్య.
   
   
                                                                           12

    'మావయ్యా!"

    చల్లని గాలి వీచినట్టు పూలు పరిమళించినట్టు, మంచి గంధం అలదినట్టు, గిరిశ్రుంగాప్రపాత నిర్గరీ లహరీ లహరి గత పద్మ పుష్ప మారండ మాధురి నాసా తర్పణం చేసినట్టుగా వినిపించింది ఆ పిలుపు

    'మామాగారూ!"

    చప్పున అటు చూశాడు మసక వేలుతుర్లు మనిషి స్పష్టత వుండదు మంచు తెరల మధ్య మానవ మూర్తికి రూపు కట్టారు స్పష్టత వుండదు మంచు తెరల మధ్య మానవ మూత్రికి రూపు కట్టారు వెన్నెల దారుల్లో దూరంగా వుండీ మనిషి ఆకృతి రేఖగా తెలిసినా గుర్తు తెలీదు

    అలాకనిపించింది ఆ అమ్మాయి.

    స్పష్టంగా యువతి అన్నది తెలుస్తోంది. ఎవరా అన్నదే తెలీటంలేదు 'ఎవరమ్మా' ప్రేమగా పిలిచాడు ధర్మరాజు.

    'నేను మావయ్య! సరళని.... మీ అబ్బాయి అదిత్యకి క్లాస్ మేట్ ని ప్రెండ్ ని.... అత్మీయురాలిని... యింకా...యింకా... పూర్తిచేయలేక సిగ్గుపడింది సరళ. ఆమె గొంతులో వలపు వేణువులు నివసించాయి.త్రపాపూరణ స్వరంలో అంది. బాగా కావలసిన దాన్ని...'

    ఆమె ఎవరో ధర్మరాజుకి తెలియలేదు.

    ఎప్పుడూ చూళ్ళేదు అతను. ఇన్నేళ్ళలో ఎవరూ ఆ యిటికితాను ఆదిత్య ప్రెండ్ నంటూ ఏ అమ్మయీ రాలేదు.
 
    'ఒక్కరే వున్నారేం మావగారూ?'

    'ఆవిడా ఎక్కడికో వెళ్ళింది. బాబు లైబ్రరీకి వెళ్ళేడు.

    'లోపలకి రానా మావగారూ?" అడిగిందిదామె

    'తలుపు  తాళం వేశారేమిటి మావయ్యా?'

    'అయ్యా! మరచి పోయా ఆవిడా వెళుతూ బయట తాళాలు వేసి కిస్ యిచ్చి వెళ్ళింది ఇవిగో తెరుచుకూనిరా!

    తళాపు చెవి అందుకుంది ఆమె

    మరో రెండు నిమిషాలకి తలుపు తెరుచుకుని లోపలకి వచ్చింది వచ్చి అయన ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.

    'ఏమిటిమ్మా విశేషాలు?'

    సిగ్గుపడింది సరళ

    మీ రేమిటి మామగారూ అలా వున్నారు!'

    నిట్టూర్చేడు ఆ ప్రశ్నకి.

    నింపాదిగా జవాబు చెప్పాడు " నిన్న యీ వేళకి యిలా ఆయ్యిదమ్మా! ఫోన్లో ఎవరితోనో మాటాడెను. ఎప్పుడూ విన్న తెలీదు ఆదిత్య సంథ్యతో తిరుగుతున్నాడని, మందలించమనీ హెచ్చరించారు.

    యుక్తవయస్సు  వచ్చిన అబ్బాయిల్ని దండించకూడదు. నేను హద్దులో పెట్టటం ఏమిటి అన్నాను. అయితే అనుభవించు అన్నమాట వినిపించింది అ తర్వాత ఏదో ఘాటయిన వాసన. పీల్చకూడదకున్నాను. ఆ మాదకత ముందు నా నిర్ణయం ఆగలేదు. పీల్చే స్పృహ తప్పాను.

    ఇదిగో యీ రోజు తెల్లారాక యిలా అయింది. కెమెరాలో బాగా ఎక్స్ పోజ్ కాని బొమ్మ కనిపించీ కనిపించినట్టు కనిపిస్తారు అంతా. టి.వి.లో ఛానల్ సరిచేయక ముందు కదిలే బొమ్మలా స్పష్టత వుండదు శరీరంలో ఏ అనారోగ్యంలేదు ఆప్టిక్ సర్వ్ దెబ్బతిన్నదేమోనని డాక్టర్ అన్నాడు"

    అమాటలు వినగానే ఏదో ఆలోచనలో పడిపోయింది సరళ.తదేకంగా ఆయన్నే చూడ సాగింది సాగింది.

    'మావగారూ?'

    "ఏమ్మా?"

    మీరు పీల్చింది విశావాయువా?

    'అనే అన్నాడు డాక్టర్ గారు?'

    'అది పాము విషమా?'

 Previous Page Next Page