సిద్దార్థ ఆయన విద్యార్థి ఒకప్పుడు. సిద్దార్థ బీద విద్యార్థి అవడంతో ఆయనే వారాలు చేసుకోమని సలహా ఇచ్చాడు. దాని ప్రకారంగానే వారానికి ఒక రోజు ఆయన ఇంట్లో భోజన వసతి సిద్ధార్థకి కలిపించాడు కొండలరావు.
ఆ ఒక్క రోజు ఆ ఇంట భోజనం చేసి బయటపడేవరకూ గజలక్ష్మి సూటిపోటి మాటల్ని అతను భరిస్తూనే వుంటాడు.
సిద్దార్థ అరుగు మీద వున్న బల్లమీద కూర్చుని తను వచ్చినట్టుగా పిలిచి చెప్పాడు గజలక్ష్మికి.
" ఇంకా రాలేదే అనుకొంటున్నాను.వచ్చావా నాయనా, కూర్చో. సూర్యుడు దిక్కుమారి ఉదయించినా ఆశ్చర్యపోను కానీ, వేళకి నువ్వు రాకపోతేనే ఆశ్చర్యం నాకు. పెళ్ళి అరిటాకు తెచ్చుకో" అంది గజలక్ష్మి లోపలనించే.
సిద్ధార్థకి ఆ స్వాగతవచనాలు కొత్తవేం కాదు.
గజలక్ష్మి కూతురు ఇందిర బ్లేడు తెచ్చి. ఇచ్చిందతనికి . పెరట్లోకి వెళ్ళి లేత అరిటాకు కోసి తెచ్చుకున్నాడు సిద్దార్థ.
అతను వరండా అరుగుమీద బయటికి తొంగి చూపి-
"నువ్వలా ఆకు ముందు కూర్చుంటే నా వంట కావద్దూ. పది నిమిషాలు కూర్చో" అంది ఈసడింపుగా.
మనసు చివుక్కుమంది. కానీ తప్పదు. అనాధ బతుకులకి ఇలాంటి అవమానాలు తప్పవు.
ఒంటరి బతుకు,ఏకాకి. నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. లేనితనం ఎన్నో అవమానాలని భరించేలా చేస్తూ అతని నోరుని నొక్కేస్తూ వుంటుంది.
" సిద్దూ!"
ఆ పులుపుకి తలెత్తి చూశాడు సిద్దార్థ.
గజలక్ష్మి కూతురు ఇందిర నిలబడి వుంది.
ఇందిరకి పదహారేళ్ళుంటాయి. గజ్జల గుర్రంలా వుంటుంది. చలాకీగా వుంటుంది.
సిద్దార్థ ఆ అమ్మాయిని చూసి నవ్వాడు.
"సిద్దూ కాదు సిద్దార్థ అని పిలవాలి" అన్నాడు సిద్దార్థ.
ఇందిర ముద్దబంతి పువ్వులా నవ్వింది. కళ్ళని చక్రాల్లా తిప్పుతూ.
" నీ పేరు నాకు నోరు తిరగదు.అయినా కూడా నిన్నిలా పిలవడం అంటే నాకిష్టం!"అంది జడ కొసకు ఉన్న జడకుచ్చులని చేతి వేలికి మెలివేస్తూ.
" నీ కిష్టమని అలాగే పిలుపు. మీ అమ్మ నాకు గుండు కొట్టిస్తుంది" నవ్వాడతను.
ఇందిర కిసుక్కున నవ్వింది.
ఇందిర బొద్దుగా , చామనఛాయ రంగులో వుంటుంది. వత్తైనజుత్తు, పెద్ద జడ, ఆ జడ, ఆజడకి బంగారు కుచ్చులు వేసుకొంది. కాళ్ళకి వెండి మువ్వలు , గుండ్రని మొహం, పెద్ద కళ్ళు, నునుపైన చెంపలు.
ఇందిర గొప్ప అందగత్తె కాదు.
కానీ ఆకర్షణీయంగా వుంటుంది.
లంగా, ఓణీ వేసుకొని గుమ్మటంలా ఉంది ఇందిర.
చేత్తో లెక్కల పుస్తకం, నోట్ బుక్ పట్టుకొని అతని దగ్గరగా వచ్చింది. ఇందిర. ఆమె అప్పుడు అతనితో తెలీని లెక్కలు చెప్పించుకొంటుంది.
" ఏమిటి, లెక్క రావడంలేదా?" అడిగాడు సిద్దార్థ.
"తెలిస్తే నీ దగ్గరకెందుకు రావడం తెలీంది నేర్పుతావనేగా?" అంది ఇందిర.
" ఏదీ చూపించు" అన్నాడు.
" చూపించేదేమిటి, చూడాలి కానీ!" అంటూ టెక్ట్స్ బుక్స్ ని, నోట్ బుక్ ని అతనికి అందించింది కాస్త ముందుకి వంగి ఇందిర.
లోనెక్ జారెట్ లోంచి గుండ్రంగా అప్పుడప్పుడే కొత్త అందాలని సంతరించుకొంటున్న ఆమె గుండెల అంచుల ఎత్తుపల్లాలని అతని కళ్ళు గమనించాయి.
అందాన్నా అస్వాదించడానికి అతను చేసుకొంటున్న వారాలు అడ్డు రాకపోయినా చూపుని తిప్పేసుకున్నాడు సిద్దార్థ.
" చూశావా?" అడిగింది.
" చూస్తున్నాను" మెల్లగా అన్నాడు.
అతను లెక్కను పరిశీలిస్తున్నాడు.
" చేస్తావా మరి?" మెల్లగా అన్నాడు.
" ఏమిటి?"
" లెక్క" ఆమె కింద పెదవిని మునిపంటితో నొక్కిపట్టి అంది.
" చేస్తాను" అన్నాడు.
"త్వరగా చెయ్యి బాబూ!" మెల్లగా అడిగింది. మధ్య మధ్య గుమ్మం కేసి చూస్తోంది ఇందిర తల్లిగానీ వస్తుందేమోనన్న భయంతో.
సిద్దార్థ జెబులోంచి పెన్ను తీసి లెక్క చేయడం మొదలు పెట్టాడు.అతని చేతిలో పెన్ను చకచకా నడుస్తోంది.
ఇందిరా చూస్తోంది. అతను చేస్తోన్న లెక్కకాదు. అతని మొహంలోకి తదేకంగా చూస్తోంది.
అతనంటే ఆమె కిష్టం.
వారాని కొక్కసారే అతనొస్తాడు. రోజూ అతను వాళ్ళింటికి భోజనానికి వస్తే బాగుండనని ఇందిర అనుకొంటూంది.అసలు వాళ్ళింట్లోనే వుండిపోకూడదా! అని కూడా ఎన్నోసార్లు అనుకొంటూ వుంటుంది.
తండ్రి అతన్నేమి అనడు. కానీ తల్లికి తనంటే అసలు గిట్టదు. అందుకే మనసులో మాటని మనసులోనే అట్టిపెట్టేసుకుంది.
" సరిగ్గా చేశావా?" చిలిపిగా అడిగింది.
"ఎలా చేశానో నువ్వు, చెప్పాలి. చూసుకో" అన్నాడు.
' నా దగ్గరవన్నీ నేను రోజూ చూసుకొనేవే అని నా దగ్గర వుండవే, నువ్వే చూడాలి. కదా ఏదైనా....?' అని మనసులో నే అనుకొంది ఇందిర.
" ఊరికే అలా చేసినా నా మొహాన కొడితే నాకెలా అర్దం అవుతుంది. ఎలా చేశావో, ఎలా చేయాలో నాకు చెప్పాలి కానీ!" అంది ఇందిర.
సిద్ధార్థ తను ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేసిందీ స్టెప్ బై స్టెప్ ఆమెకి విడమరచి చెప్పాడు.
అతనికేసి విస్మయంగా చూస్తోంది ఇందిర.
తన క్లాస్ టీచర్ కన్నా చక్కగా చెపుతున్నాడు.
" ఇది మా ఫ్రెండ్స్ ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు సిద్దూ.!" ఇప్పుడు నేను చెప్పి క్రెడిట్ కొట్టేస్తాను" అంది ఇందిర కళ్ళు మరింత పెద్దవి చేస్తూ.