Home » Yamini saraswathi novels » Paadabhivandanam

అలా మాటకి మాట జవాబు చెపుతూ గలగలలాడుతూ కిలకిల నవ్విస్తూ ఎదుర్కోలు అంతా తనే అయిపోయాడు జగన్నాధం. అతని చొరవ ఆనందాన్ని కలిగిస్తే అతని మాటకారితనం హాయి కలిగించేది.

"తలంబ్రాలు పడందే పెళ్ళికొడుకు అత్తవారింట్లో భోజనం చెయ్యకూడదు. విడిదింటికే భోజనం పంపిస్తాము: అన్నాడు విజయ్ మామగారు.

'నో!నో! అలాంటి మూడ విశ్వాసాలు నాముందు పనికిరావు బాబాయ్ గారూ! ఎప్పుడైతే ముహూర్తాలు నిశ్చయించుకున్నారో అప్పుడె మా విజయ్ 'కడు స్వతంత్రుడై నాడు' నలుగురిలో కూర్చుని హాయిగా భోజనం చేసే చాన్సు పోగొట్టకండి వాడికి' అన్నాడు జగన్నాధం కాల్పించుకుంటూ.

విజయ్ కి కూడా అతని మాటలు నచ్చాయ్. ఇహ కాదనలేక అంగీకరించారు అందరూ. భోజనాల వేళ అతని చమత్కారాలు మరీ అలరించాయ్. పట్టుబట్ట కట్టుకుని వచ్చి 'బాబాయిగారూ నేనూ వడ్డిస్తా ' నన్నాడు జగన్నాధం.

అందుకాయన కృతజ్ఞతగా నవ్వి "మాట చాలు బాబూ నీకు శ్రమెందుకు? మేమంతాలేమా? అన్నాడు.

"మీరంతా వున్నారనే నేనూ వచ్చింది బాబాయ్. మీ అల్లుడికి ఏమేం కావాలో తెలుసుకుని వడ్డించకపొతే రేపు చెల్లిలికి వడ్డించేస్తాడు.'

'అయినా వియ్యాలవారి తరుపున వచ్చావు. నీ కెందుకులే......'అనబోయాడాయన.

"ఆమాట అన్నారంటే నేనూరుకోను బాబాయ్. నేను మీ తరుపు వాడినే విజయ్ నాకూ వరుస. అసలు నేను ఆడపిల్లనై ఉంటే అతన్ని నేనే పెళ్ళి చేసుకునేదాన్ని.....అని మామిడికాయ ఉరగాయ అందుకుని వెళ్ళి వడ్డించివచ్చాడు.

తర్వాత కూరగిన్నె తీసుకోబోతూ 'మేమిద్దరం చాలా అన్యోన్యంగా పెరిగాం బాబాయ్. మా స్నేహితాన్ని చుట్టరికంతో ముడివేసుకుందామనుకున్నాం కానీ వెధవది యిద్దరికీ చెల్లెళ్ళు లేరు." అన్నాడు నవ్వుతూ. ఇహ అయన జవాబు చెప్పలేదు.

ఏ"మగపెళ్ళి స్పెషల్ ఎరేంజ్మెంట్స్, ఏం కావాలన్నా నన్నాడగండి కావలసింది చెయ్యకుండా, అక్కర్లేనిది అడుగుతూ వడ్డిస్తాను" అన్నాడు నేతిజాడి చేత పట్టుకుని ఫక్కుమని నవ్వారు అందరూ.

'అయ్యా! భోజనాల వేళ నవ్వులు మంచివి కావు. సైన్స్ చెప్పిన మాట వినండి'

"ఏమిటో!'

"పొరపొతుందంటారుకదండీ! భోజనాల వేళ మాటలాడటం కూడదు."

మజ్జిగ తీసుకుని వస్తూ "అయ్యా చిక్కని మజ్జిగ! చి....క్క....ని.......మజ్జిగ' అన్నాడు సాధ్యమైనంత శ్లేషతో. పంక్తి పంక్తి పగలబడి నవ్వింది.

"అయ్యాయిలా అందరూ ఒకేమారు నవ్వి రత్నాలు వోలకబోస్తే ఏరుకోవటం కష్టమండి. వరుసగా చాన్స్ తీసుకోండి. "తాంబూలాలు అందిస్తూ' ఆ కర్ణాయతలోచనలకి యిష్టమైన బంగారం లాటి ఆకులు, పూర్ణ చంద్రవదనల పలువరసలా తెల్లనైన సున్నం! మీ కిష్టమైన సుగంధ ద్రవ్యాలతో వక్కపొడి. ఆలసించిన ఆశాభంగం' అంటూ తెగ నవ్వించాడు అందర్నీ.

"శాస్త్రిగారూ! మా చెల్లాయి లక్షకోట్ల వరహాలు. మీ వాడు చిల్లిగవ్వ.....పొత్తు ఎలాగండి?"

"ఒరే! ఓరే! నన్ను మరీ అలా తీసేయ్యకురా! మొదట్నించి నువు నా పార్టీ."

"అంతే! ఇప్పుడు మాత్రం సమక్యవాదుల్లా పార్టీ ఫిరాయించేశాను. నీ విలువ అంతే!" చుట్టూ ఉన్నవాళ్ళుంతా ఫక్కున నవ్వేశారు.

కాస్తసేపు గడిచాక "శాస్త్రిగారూ! ఇది మరీ అన్యాయమండి! మా చెల్లాయి పప్పేనుగ అన్నాడు సరే ఒప్పుకున్నాం! వాడు ఉప్పేనుగా అన్నారు.

అంగికరించాం కానీ యింత పప్పుకి అంత వుప్పు అక్కర్లేదండి. ఉప్పెక్కువైనా అప్పెక్కువైనా భరించటం కష్టమట కదండీ' అన్నాడు మళ్ళీ.

పొలోమని నవ్వింది పెళ్ళిపందిరంతా!

ఋవపుబంతుల వేళ!

ఒరే అబ్బాయ్! ఈ భోజనాలు ఎందుకో తెలుసా? ఈ రోజే కాదు జీవితాంతం నీవు నీ భార్యని కాదని ఏది తినరాదు. ప్రతిది సమంగా పంచుకుని తిను. ఇద్దరూ కలిసి తినండి, కలసి తిరగండి అని చెప్పటానికి తెలుసా?

"లేదు లేవోయ్! మాబాగా తెలుసు నీకు చదువుకున్న ఆడవాళ్ళు మగని ఎంగిలి అసహ్యించుకుంటారేమోనని' అమ్మాయ్! భర్త ఎంగిలి తినటంలో తప్పులేదు. మిగిలింది పారవేయ్యోవద్దు. ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. పొదుపు అవసరం అని చెప్పటానికే తెలుసా?' అన్నాడు విజయ్.

'ఐ.ఏ.యస్. లో చేపుతారేమోనేనెరుగను. కానీ జీవితంలో ఆడదాన్ని కాదని వెళ్ళొద్దు. మగాడనే టెక్కు నికొద్దు. భార్య మాట విను. అవసరమైతే సలహాకి సంప్రదించు అని.  ఆడదానికి లొంగి ఉండాలని బోధించటానికి మగవాడికి పంక్తి భోజనం ఏర్పాటు చేశారు తెలుసా?'అన్నాడు నవ్వుతూ.

'ఒహొ! నీ మెడిసెన్ లో అలా చెపుతున్నారేమోలె! నాకు తెలియదు ' అన్నాడు విజయ్ బదులుగా. అలా అన్నిటా తనే అయి తిరిగాడు జగన్నాధం.

చివరికి భోజనాలవేళ బువపుబంతి పాట కూడా పాడాడు. గొంతు బాగుందని ఇంకోటి పాడమని అడిగారు అందరూ. 'సావిరహే తవది నారాధా' పాడాడు 'భేష్ భేష్! అన్నారు అందరూ.

గర్వించాడు విజయ్ అతని స్నేహితానికి.


    గడియారం టంగ్ మనటంతో ఆలోచనలు ఆగిపోయాయి. కవరు చించి జగన్నాధం వ్రాసిన జాబు చదవసాగాడు విజయ్. రేయ్! కలక్టరు బావా!

ఈనాటికి నేను పెళ్ళి చేసుకుంటున్నానురా! నేను కోరినట్టుగా నా అభిరుచులకు తగిన అమ్మాయి ఈనాటికి దొరికింది. పెళ్ళికి చాలా ముందుగా జాబు వ్రాయలనుకున్నా వీలు చిక్కింది కాదు.

విశేషాలు అన్నీ సమక్షంలో చెపుతాను. డివిజన్ అధికారినని సెలవు పెట్టటానికి వీలుకాదని అనకుండా వారంరోజులు సెలవు పెట్టి వెంటనే బయల్దేరిరా.
                                                                                                        నీ రాకకై ఎదురు చూస్తూ

                                                                                                            నీ జగన్నాధం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra