Home » Mainanpati bhaskar » Vennela Metlu

 

    శృతి వెళ్ళిపోయిన తరువాత రామకృష్ణ పరమహంస గురించి రాసిన పుస్తకం ఒకటి అందుకుని పడక్కుర్చీలో పడుకున్నాడు కేశవరావు. ఆయన దగ్గర అలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. భగవద్గీత, వేదాంతసారం అనే గ్రంధం, రామాయణం.
    
    పాపాలు చేసేవాళ్ళకు దేముడిని గురించిన భయం - భక్తి కాదు, భయం - ఎక్కువగా ఉంటుందేమో!

 

    ఆయన లేచి శ్రీరాం వాళ్ళ ఇంటికెళ్ళే ప్రయత్నమేమీ చేయకపోవడం ఆశాభంగం కలిగించింది ప్రతిమకి.
    
    మరునాడూ, ఆ తరవాత రోజూ వర్జ్యం, రాహుకాలం లాంటి అడ్డంకుల వల్ల ఆయన శ్రీరాం వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు.
    
    నాలుగో రోజున వెళ్ళకుండా ఉండడానికి తగినంత అభ్యంతరం ఆయనకి కళ్ళజోడు పెట్టుకుని మరీ వెదికినా కనబడలేదు. అందుచేత చాలా సేపు అయిష్టంగా ముక్కీ, మూలిగీ, తరవాత తయారవడం మొదలెట్టాడు. నాలుగైదు నెలల క్రితం ఎవరో పార్టీ ఒకడు సింగపూర్ వెళ్ళి వస్తూ తనకి ప్రెజెంటేషన్ గా తెచ్చిన గేబర్డన్ పాంటూ, పోలియెస్టర్ షర్టూ వేసుకుని, ఇంకో పార్టీ ప్రెజెంటేషన్ గానే ఇచ్చిన పార్కర్ పెన్ను జేబులో పెట్టుకుని డాబుగా కనబడుతూ శ్రీరాం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
    
    అది చాలా పెద్ద ఇల్లే. గేటు పక్కన రెండు బాదంచెట్లు ఎర్రటి ఆకులతో అందంగా కనబడుతున్నాయి. ఇంటికి లైట్ గ్రే కలర్ వేసి ఉంది. వరండాలో పేము కుర్చీలు.
    
    చెప్పులు అక్కడ వదిలి, లోపలికి నడిచి హాలంతా పరికించి చూశాడు కేశవరావు. కూర్చుంటే కూరుకుపోయేంత మెత్తగా ఉన్న సోఫాలూ, శ్రేష్ఠమైన చెక్కతో చేసిన టేబుల్సూ, కుర్చీలూ, గోడకి ఎలెక్ట్రానిక్ గడియారం, బాటిల్లో మనీప్లాంటూ అచ్చు వెయ్యడానికి ఒక్కోదానికీ వందా రెండొందలు ఖర్చయి ఉంటుందనిపించే అమెరికన్, బ్రిటిష్ కంపెనీల కాలెండర్లూ.
    
    అట్టహాసంగా కనబడింది కేశవరావుకి.
    
    అలికిడి విని బయటికి వచ్చింది సరస్వతి.
    
    "నమస్కారం! కూర్చోండి!"
    
    చేతులు దగ్గరగా చేర్చి, పొడుగాటి నమస్కారం పెట్టి సోఫాలో కూర్చున్నాడు కేశవరావు. అతని మొహం సీరియస్ గా ఉంది.
    
    "నా పేరు కేశవరావు - ప్రతిమ తండ్రిని."
    
    చిరునవ్వు నవ్వింది సరస్వతి.

 

    "అదే అనుకున్నాను. మూడురోజుల క్రితమే వస్తారని చెప్పింది శృతి."
    
    "ఎక్కడమ్మా! సవాలక్ష పనులు నాకు. తెముల్చుకుని వద్దామంటే కుదరలేదు."
    
    ఒకసారి ఆయన వైపు పరీక్షగా చూసి, మౌనంగా ఉండిపోయింది సరస్వతి.
    
    కేశవరాఉ తలెత్తి కప్పు వైపు చూశాడు. అక్కడ తప్పేమీ కనబడలేదు. తర్వాత గోడలన్నీ పరిశీలించాడు.
    
    "వేంకటేశ్వరస్వామి వారి ఫోటో తగిలించిలేదేం అమ్మా? స్వామివారి ఫోటో లేకపోతే గోడలు బోసిపోయినట్లే ఉంటాయి."
    
    "పూజగదిలో పెట్టుకున్నామండీ స్వామివారి ఫోటో."
    
    "నట్టింట్లో కూడా తగిలించాలి. ఇంట్లో అడుగుపెట్టగానే స్వామివారి దర్శనం కావాలన్న మాట."
    
    సరస్వతి మొహంలో రంగు కొంచెం తగ్గింది.
    
    "తగిలించాలండీ! ఏదో పెద్దదాన్నయి పోతున్నాను. వోపిక ఉండట్లేదు." అంది.
    
    "అట్లా అని వూరుకుంటామా, అమ్మా? ఒళ్ళు బద్దకమని కాలెండర్లూ, షోకైన వస్తువులూ తగిలించడం మానామా? దేముణ్ణి నిర్లక్ష్యం చెయ్యకూడదు. నడమంత్రపు సిరిలా వచ్చిన డబ్బుని దేముడి దయతో నిలుపుకోవాలి. ఆయనకి ఆగ్రహం వచ్చిందంటే అగ్రహారాలకి అగ్రహారాలు మట్టికొట్టుకు పోతాయి - మావి పోయినట్లు" అన్నాడు కవ్విస్తున్నట్లు.     
    
    కొంతసేపు మౌనం!
    
    ఆయన పెళ్ళి ప్రస్తావన తెస్తాడేమోనని ఎదురుచూసింది సరస్వతి.
    
    పంతం పట్టినట్లు బిగిసిపోయి, మాట్లాడకుండా అలా కూర్చునే ఉన్నాడు కేశవరావు. చివరికి తనే కదిలించింది సరస్వతి.
    
    "మా శ్రీరాం మీ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాడు."
    
    "మా అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందనుకునే వాళ్ళు ఈ ఊళ్ళోనే కాదు -బయట వూళ్ళలో కూడా చాలామంది ఉన్నారమ్మా! గంజాం నుంచీ మా బంధువొకాయన నెల్రోజుల క్రితం కబురంపాడు - ప్రతిమని ఇస్తే కళ్ళకద్దుకుని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటామని మొన్నటికి మొన్న మా రమణయ్య గరికపాటి వాళ్ళ సంబంధం తీసుకొచ్చాడు. మా అమ్మాయిని పకోడీల పొట్లంలా ఎగరేసుకుపోదామని చూస్తున్నారమ్మా పెళ్ళి కొడుకులు!"
    
    సరస్వతి ఆయన్ని తేరిపార చూసింది. ఆయన ప్రవర్తన విడ్డూరంగా కనబడింది ఆమెకి. ఇదేమిటి! ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరగడం ఎంత కష్టంగా ఉందో లోకజ్ఞానం వున్న ప్రతి వాళ్ళకీ తెలుసు. అలాంటప్పుడు ఏరి కోరి చేసుకుంటామంటే ఎగిరి గంతెయ్యాల్సింది పోయి, ఇదో లెక్కలోనిది కాదన్నట్లు మాట్లాడతాడే ఈయన!
    
    నిజంగానే ఆ అమ్మాయిని అన్ని సంబంధాలు వస్తున్నాయా?
    
    లేకపోతే ---
    
    కోరి చేసుకుంటామనటం వల్లే చెట్లెక్కినట్లు మాట్లాడుతున్నాడా ఈయన?
    
    చులకన అయిపోయిందా తను?
    
    వెంటనే ఆమె కనుబొమలు ముడిపడ్డాయి. గొంతులో అతి కొద్దిగా దర్పం తెచ్చి పెట్టుకుంది.
    
    "అయితే వాళ్ళకి ఏం జవాబు చెప్పారు మీరు?"
    
    "ఏం చెబుతానమ్మా! అమ్మాయి చదువు ఇప్పుడే కదా పూర్తి అయింది, ఇంకో ఏడాదయ్యాక ఆలోచించి చెబుతానన్నాను."
    
    తల కొట్టేసినట్లయింది సరస్వతికి.
    
    "అయితే ఇంక దయచెయ్!" అనాలనిపించినా, తమాయించుకుని, "మాకు కూడా ఫలాని సంబంధమే కావాలని పెద్ద పట్టింపు ఏమీలేదు లెండి! ఏదో అబ్బాయి మోజుపడ్డాడు కదా అని పిలిపించి అడిగాను. అంతే! తొందర లేదు. నిదానంగానే ఆలోచించుకోండి!" అంది.
    
    శృతి ట్రేలో కాఫీ కప్పులు పెట్టుకుని వచ్చింది. ఈ మూడురోజుల నుంచి తనుకూడా సాయంత్రం పూట శ్రీరాం వాళ్ళింటికి వస్తూంది -ఏ రోజు కారోజు కేశవరావు వస్తాడని ఎదురుచూస్తూ.
    
    కేశవరావు రావడానికి కొద్దిసేపు ముందే శ్రీరాం కోటీ వెళ్ళాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra