నాట్ నౌ డార్లింగ్
---చందు సోంబాబు
నిపవ నిశిధిలో పిశాచ గణాలు స్వైరవిహారం చేస్తున్న అర్ధరాత్రి సమయాన!
అభినయ్ ఆ రోడ్డుమీద ఒంటరిగా సైకిల్ తొక్కుకు పోతున్నాడు చీకటిలో.
"చాలా ఆలస్య అయిపోయిందీ!" అని మనసులోనే అనుకున్నాడు అభినయ్. రో్డ్డుమీద నరసంచారం లేదు. కన్ను పొడుచుకున్నాకనిపించని చిక్కటి చీకటి.
ఇరానీ హోటల్లో టీ తాగి ఆ రాత్రి తెల్లవార్లూ సిద్దార్ధతో కలిసి చదువుకోవాలనుకున్నాడు అభినయ్.
పదిగంటలకల్లా వస్తానని సిద్దార్ధకి చెప్పాడు కూడా అతను. తన కోసం ఎదురు చూసి వుంటాడతడు.
సిద్దార్ధ!
చిరునవ్వు కదిలింది అభినయ్ పెదవుల మీద. తను రాలేదని తిట్టుకుని పడుకొని వుంటాడు సిద్దార్ద.
నిజానికి అనుకున్న టైంకి వెళ్ళేవాడు, వాడి బ్యాచితో కలిసి టీ స్టాల్ కొచ్చాడు. వాడితో పడిపోవడంతో టైమ్ తెలీలేదు. పూర్ణాగాడంతే! మనిషి దొరికితే విడిచి పెట్టడు.
రోడ్డుమీద దీపాలుకూడా వెలగడంలేదు.
రోడ్డుకి అలంకారం కోసం వెలసినవే తప్ప అవి ఏనాడూ వెలగవు.
సైకిల్ ఆపి జేబులోంచి సిగరెట్ పెట్టెని తీసి సిగరెట్ పెదాల మధ్య పెట్టుకుని వెలిగించాడు.
చీకటిలోకి కళ్ళని చీల్చుకుని చూస్తే కనీకనబడని ఆ రోడ్డుమీద సైకిల్ ఆపి సిగరెట్ కాలుస్తున్న అభినయ్ కి శరీరానికి తగులుతున్న చల్లని గాలికి హాయిగా వుంది.
మెల్లగా ముందుకు కదిలాడు. పదిగజాలు ముందుకి సాగాడు.
ఉలిక్కిపడ్డాడతను చేతిలో సైకిల్ హాండిల్ బ్యాలన్స్ తప్పింది. సైకిల్ కొంచెం వరిగింది నయం. ఇంకా కిందపడలేదు. చిన్న గుంటలో పడింది. సైకిల్ బ్యాలన్స్ చేసుకున్నాడు. ఆ రోడ్డు సరైందికాదు అన్నీ గుంటలే చీకటిలో దీనిమీద ప్రయాణం చేయడం కంటే దిగి నడవడం మంచిదనిపించింది.
సైకిల్ దిగి దాన్ని నడిపించడం మొదలు పెట్టాడు అభినయ్.
రోడ్డుకి అటూ ఇటూ ఏపుగా పెరిగిన గానుగచెట్లు ఆకులు గాలికి చప్పుడు చేస్తున్నాయి.
నిశ్శబ్దం.
ఎక్కడా చడీచప్పుడూ లేదు. ఆ చెట్లు ఆకుల చప్పుడు తప్ప.
గాలిలో అక్కడక్కడ ఎగురుతున్న మిణుగురుల మెరుపులు మధ్య మధ్య కానవస్తున్నాయి.
దూరంగా ఏదో కారు వస్తున్నట్టుగా హెడ్ లైట్ల కాంతి రోడ్డుమీద పడుతుంది. దానికి నిదర్శనగా మరుక్షణంలో రెండు హెడ్ లైట్లు కనబడ్డాయి అభినయ్ కి.
అది సింగిల్ రోడ్డు కావడంచేత సైకిల్ని రోడ్డు పక్కకి దించి నడుస్తున్నాడు అభినయ్.
ఆ కారు ముందుకి రావడంలేదు. ఎందుకో ఆగిపోయింది. ఆశ్చర్యంగా చూశాడు అభినయ్.
రోడ్డు మధ్యగా ఆ కారు.ఆగిపోయినట్లుగా ఆ హెడ్ లైట్లే చెపుతున్నాయి.
కారెందుకు ఆగిపోయింది?
ఏక్సిడెంట్ జరిగిందా?
ఎవరన్నా కారుకింద పడిపోయారేమో!
అదే జరిగితే కారు తప్పించుకుపోడానికి వీల్లేదు.
క్షతగాత్రుడి ప్రాణాలు పోకముందే హాస్పిటల్లో చేర్పించాలి. అంతే! అతను గభాల్న సైకిల్ ఎక్కి గబగబా తొక్కడం మొదలు పెట్టాడు. కారు కదలడంలేదు. అక్కడే నిలబడిపోయింది.
ఆ కారు హెడ్ లైట్లు ఆరిపోయి ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చీకటిమయమైంది.
ఆ మరుక్షణంలో అక్కడ -
ఆ నిశ్శబ్ద నీరవ నిశీధిలో అలనాడు నిండు సభలో భయవిహ్వలై మానవరక్షణ కోసం ద్రౌపది చేసిన ఆక్రందనలా ప్రాణభీతితోనో, మానం పోతున్నదన్న వేదనతోనో ఓ ఆడపిల్ల గొంతునించి వెలువడిన ఆర్తనాదం అతి భయంకరంగా అతని చెవులని తాకింది. అంతే! అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది.
అతనికిఅర్ధమైపోయింది.
ఓ ఆడపిల్ల ఆపదలో వుంది.
ఎవరో ఆమెకి అపకారం తలపెట్టారు.
హత్య చేయబోతున్నారా? లేక మానభంగం చేస్తున్నారా?
ఇంకా ఆ అమ్మాయి సవ్యంగానే వుందా?
మొత్తానికి జరగరానిదేదో జరిగిపోతుంది.
అభినయ్ శరీరం జలదరించింది. కోపంతో ముక్కుపుటలు ఎగిసి పడినాయి. అతనో స్థిరనిశ్చయాని కొచ్చాడు. ఆ అమ్మాయిని కాపాడాలి. సైకిల్ హాండిల్ ని అతని చేతి పిడికిళ్ళు బలంగా పట్టుకున్నాయి. శరీరం లోని శక్తినంతా కాలి పిక్కల్లోకి తీసుకుని పెడల్స్ ని తొక్కుతున్నాడు. ఎగుడుదిగుడుగా వున్న రోడ్డుమీద ఎగిరెగిరి పడుతుంది సైకిల్.
ఎవరో అమ్మాయి పెడుతోన్న కేకలు ఇప్పుడు స్పష్టంగా దగ్గరగా వినబడుతున్నాయి అభినయ్ కి.
అంతలోనే వినిపించింది అతనికి దీనంగా ఓ గొంతు -
"కాపాడండి....... నా బిడ్డని కాపాడండి" ఓ మగ గొంతు.
మసక వెల్తురులో ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఆవేశంతో ఊగిపోయాడు అభినయ్.
పంచె, లాల్చీ వేసుకున్న ఓ మధ్య వయస్కుడిని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు యిద్దరు దుండగులూ. అతన్ని కొడుతున్నాడొకడు.
"నా బిడ్డని ఏం చేయకండి, మీకేం కావాలంటే అదిస్తాను!" ప్రార్ధిస్తున్నాడు అతను. కాదు వేడుకొంటున్నాడు. మరో దుండగుడు ఆయన మొహంమీద పిడికిలి బిగించి కొట్టాడు. "అబ్బ!" అన్న అరుపు.
ఇంకో పక్కనుంచి ఆడపిల్ల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
పరిస్థితి పూర్తిగా అర్ధం అయ్యింది అభినయ్ కి. ఓ తండ్రీ కూతురు కారులో వస్తుంటే దుండగులు దారికాసి అడ్డగించి తండ్రిని ఓ పక్క హింసిస్తూ, అతని కూతుర్ని మానభంగం చేయబోతున్నారు. దారుణం అతి దారుణ సంఘటన.
ఇక క్షణం ఆలస్యం చేయదల్చుకోలేదు అభినయ్.
సైకిల్ మీదనించి దూకి, రెండు చేతులతో సైకిల్ ని పట్టుకుని పైకెత్తి ఆ దుండగుడి మీదకి విసిరాడు.
ఆ దుండగులకి అది ఊహించని పరిణామం. సింహ కిశోరంలా అభినయ్ వాళ్ళమీదికి దూకాడు. జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోడానికి వాళ్ళకి కొంత సమయం పట్టింది.
"బాబూ ఎవరో దేవుడిలా వచ్చావు నా బిడ్డని కాపాడు" ఆ మధ్య వయస్కుడు అరిచాడు. అభినయ్ పక్కకి తిరిగాడు. అతనికళ్ళు ఎర్రబడ్డాయి. "యహు" అని పెద్ద పెట్టున అరుస్తూ గాలిలోకి లేచాడు అభినయ్.
అతడి పాదం ఒకడి గెడ్డాన్ని తాకింది. చేతి ముష్టి గాతం మరొకడి ఛాతిపైన పడింది.
కెవ్వుమన్న కేక. ఇద్దరు దుండగులు ఎగిరి అవతల పడ్డారు.
అభినయ్ కళ్ళకి ఓ యువతిని నేలపైన పడేసి ఆమెని ఆక్రమించుకొంటూ, భుజాలని నొక్కి, ఆమె తొడలపైన కాళ్ళతో అదుముతూ కన బడ్డాడు మరొక గూండా. అమ్మాయి శరీరాన్ని అందిన చోటల్లా నలిపేస్తున్నాడు, కొరుకుతున్నాడు.
అమ్మాయి వాడికి పట్టు ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అరుస్తూంది భయంతో. తప్పించుకొనే మార్గంలేక విల విల్లాడిపోతోంది.
ఆమె శరీరంనించి విడిపోయిన చీర పక్కన పడి వుంది. లంగా మోకాళ్ళపైగా చెదిరిపోయింది. జాకెట్టు పీలికలైంది. బ్రాసరీ తెంపబడింది.
ఆమె కాలి పిక్కలనీ, బయటపడిన గుండెలని చూసి రెచ్చిపోయిన ఆగంతకుడు అభినయ్ ని లక్ష్యం చేయకుండా, ఆమె కాళ్ళని వెనక్కి విరిచి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు వాడి ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తోందా అమ్మాయి. అభినయ్ వాడి జుట్టుని పట్టుకుని పైకి లేపాడు. అభినయ్ చేయి ఓ మహా పర్వతాన్ని అధికమైన వేగంతో సమీపించే మిస్సైల్ లా కదిలింది.
"అమ్మో!" అరుపు
వాడి పళ్ళు వూడిపోయినాయి.
ఒక్కసారిగా అయిదుగురు దుండగులు అభినయ్ మీద పడ్డారు.
అభినయ్ వాళ్ళని లెక్క చేయలేదు.