"నెల తక్కువ వెధవ... నువ్వు కామెంటేటర్ పని చేస్తున్నావా?" కోపంగా అడిగాడు.
"సారీ బాసూ... నువ్వు పరుగేడుతూంటే, నిన్ను ఉత్సాహపర్సాలంటే ఓవర్ ఏమైసవై అన్నాను.పోనీ మరో టేక్ చేద్దామా?" అడిగాడు ఆశగా.
పిచ్చిగా రాహుల్ వి కాదురా... రాహువుని... నా పాలిట రాహువుని.."
"మరి కేతువు ఎవరు బాసూ..." అడిగాడు కళ్ళు మిటకరిస్తూ రాహుల్.
"ఇంకెవడు, అ కేమెరామేనే... స్టిల్ ఫోటో గ్రాఫర్ ని అనుభవం లేకుండా కెమెరా మెన్ ని చేస్తేయిలానే ఉంటుంది. ఇంతకీ వాడెక్కడ?" కోపంగా అడిగాడు.అంకిత్.
ఇక్కడున్నసార్..." ఎక్కడ్నుంచో ఓ కంఠంబొంగురుగా వినిపించింది.
ఎదురుగా జనం మధ్య వున్నాడు.ప్రయాణీకులు చితకబాదుతున్నారు. వాళ్ల నుంచి అ కేమెరా మెన్ ని విడిపించేసరికితల ప్రాణం తోకకు వచ్చింది.
"ఇంతకూ ఏమైందెంటే... నిన్ను వాళ్ళు చాకిరేవు ఎందుకు పెట్టారు?" అడిగాడు అంకిత్ కెమెరామెన్ ని.
"నేను నీ వెనకే కెమేరాతో పరుగెడుతూన్నాను. మద్యలో జనం అడ్డోచ్చాడు.ఓ అమ్మాయి పైట జారింది... నేను పరుగెడుతూనే నిన్ను ఘాట్ చేస్తంతే, ఆ అమ్మాయి 'మిస్సండర్ స్టాండ్'చేస్కుంది. వాళ్ళాయన కు చెప్పింది. ఎక్స్ ఆర్మీ మెన్ అత... పిడిగుద్దులుగుద్దాడు. ఒక్కచుక్క రక్తం రాలేదు కానీ, ఒంట్లో పార్తులన్నీ అరిగి పోయాయి...' లబోదిబోమన్నాడు కెమెరామెన్.
***
"ఛీ..ఛీ...మీ తెలివి తక్కువతనం వల్ల మంచి అవకాశం మిస్సయింది. మళ్ళా ఏదో ఓ ట్రెయిన్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి..." విసుకున్నాడు అంకిత్.
రాహుల్ దూరంగా నిలబడి గుడ్లు మితకరిస్తూ అంకిత్ వంక చూస్తున్నాడు. కెమెరామెన్ వ్యాన్ లో కూర్చుని "అమ్మా, అబ్బా..." అంటూ మూలుగుతూన్నాడు.
తలంతా దిమ్ముగా అనిపించింది అంకిత్ కు. వేడివేడిటీ తాగాలని అనిపించింది.వెంటనే 'అల్పా'హొటల్ వైపు నడిచాడు.
***
మృదువని స్టేషన్ బయటకు వచ్చింది.
అక్కడక్కడ ఫోలీసులు కనిపించేసరికి కంగారుగా చున్నీని తల మీదుగా కుప్పకుంది.సాధ్య మైనంత వరకూ ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుంది.
ఓ ఫోలీసు మృదువని వైపు రాసాగాడు. మృదువని కంగారుగా'ఆల్ఫా' హొటల్ వైపు నడిచింది. ఎదురుగా వున్న ఓ అటోనీ పిలిచి, అందులో ఎక్కింది.
"ఎక్కడికి వెళ్ళాలి మేడం?" అడిగాడు ఆటోవాడు.
ఏం చెప్పాలో తెలియదు. ముందు ఇక్కడ్నుంచి బయటపడాలి...
"చెప్పండి మేడం... ఎక్కడికి వెళ్ళాలి..." అడిగాడు ఆటోవాడు.
"అబిడ్సు..." అంది వెంటనే.
ఆటో ముందుకు కదిలింది.ఆటో కాడిలాక రిలాక్స్ ఫీలయింది.ఆటోక్లాక్ టవర్ దాటగానే,
ఆటో... ఆపు.."అంది.
ఆటోవాడికి అర్ధంకాక, ఆపేశాడు.
బ్యాగులో నుంచి పది రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చి దిగి పోయింది. ఆటోవాడు విచిత్రంగా మృదువని వంక చూసి బుర్ర గోక్కుని ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎదురుగా కామత్ హొటల్ కనిపించింది. అటువైపు అడుగులు వేసింది మృదువని.
***
వాష్ బేసిన్ దగ్గరకి వెళ్ళి, మొహం కడుకుంది. అద్దంలో తన మొహం తనకే విచిత్రంగా అనిపించింది. మొహమంతా పీక్కుపోయి ఉంది. రెండ్రోజోలుగా పుడ్డు లేదు.ట్రెయిన్ లో భయం భయంగా గడపాల్సి వచ్చింది.
ఎక్కడ ఎవరు చేయిన్ లాగినా, తన గురించేనని ఉలిక్కిపడింది. చివరకు తి.సి వచ్చినా భయపడిపోయింది. చల్లటి నీళ్ళు మొహానికి తగిలే సరికి ప్రాణంలేచి వచ్చినట్టు అయింది.
వెయిటర్ మనూ కార్డు ఇచ్చి వెళ్ళాడు.
ఇడ్లీ చెప్పింది మృదువని.
అయిదు నిమిషాల్లో వేడి వేడి ఇడ్లీ తీసుకువచ్చాడు వెయిటర్.
ఎన్నో ఏళ్లుగా తిండీ తిననట్టు, గబగబ కేవలం రెండే రెండు నిమిషాల్లో టిఫన్ ముగించేసి, పెసరట్టు, ఉప్మా చెప్పింది.
మృదువని టిఫన్ తినే తేరు చూసి వెయిటర్ ఆశ్చర్యపోయాడు. మనిషి చూస్తే హుందాగా ఉంది. కానీ తినే విధానం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
వెయిటర్ పెసరట్టు తీసుకువచ్చేలోగా సాంబారు తాగేసింది.ఆమెకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పోలమారింది. వెంటనే నీళ్ళు తాగింది.
పెసరట్టు తిని, కాఫీ తాగి బిల్లు చెల్లించి బయటకు వచ్చింది. హొటల్ పక్కనే వున్న ఎస్.తి.ది. బూత్ లోకి వెళ్ళింది. డీల్లిలో వున్న శరణ్య కు ఫోన్ చేసింది.
మృదువని శరణ్య కు ఫోన్ చేయడానికి పన్నెండు గంటలకు ముందు...
***
శరణ్య సెల్లార్ లో కారు పార్క్ చేసి, లిప్టు వైపు నడిచింది.
"మేడమ్.." గూర్ఘా వచ్చి ఏదో చెప్పబోయాడు.
"ఏమిటి?" అడిగింది.శరణ్య.
"మీ కోసం మృదువని మేడమ్ వాళ్ల నుంచి తప్పించుకుంది.." అంటూ వివరంగా చెప్పుకోచ్చ్హాడు గూర్ఘా.
శరణ్య ఆ మాటలు విని షాకయింది.ఒక్కక్షణం అచేతనంగా ఉండిపోయింది.లిప్టు దగ్గరకి నడిచింది.
తన ప్లాట్ లోకి వెళ్ళి సోఫాలో కూచుంది.
మృదువని పోలీసుల నుంచి పారిపోవడం ఏమిటీ?.....ఏమీ అర్ధం కాలేదు. వెంటనే మృదువని ఇంటికి ఫోన్ చేసింది. అటువైపు నుంచి ఎవరూ లిఫ్ట్ చేయటంలేదు. అలసటగా వుంది. ముందు ఫ్రెషప్ అవ్వాలనుకుంది. బాత్రూం వైపు వెళ్తోండగా, డోర్ ఎవరో నాక్ చేసిన శబ్దం వినిపించింది.
వెంటనేవెళ్ళి పీస్ హొటల్ లో నుంచి చూసింది. ఎదురుగా డిఫెన్స్ కు సంభందించిన అధికారులు ఆశ్చర్యంతో తలుపు తీసింది.