ఆయిల్ ఫిల్లింగ్ చేసుకుంది తొమ్మిదిగంటలకు... వెంటనే నారాయణ గూడా వెళ్ళాడు. అక్కడనుంచి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు వెళ్ళడానికి ఐదు లీటర్లు ఖర్చుకావు. అంటే ఇంకా చాలాదూరం తిరిగి ఉండాలి.
సో.. ఇంకెక్కడో అతనని హత్యచేసి, అదే వెహికల్ లో తెచ్చి పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర పడవేసి ఉండాలి!
అందువల్లనే ఆయిల్ ఐదు లీటర్లు ఖర్చు అయింది.
మీటర్ రీడింగ్ ఎప్పటికప్పుడు నోట్ చేస్తున్నట్టు వెహికల్ మెయింటెనెన్స్ బుక్ ద్వారా తెలిసింది.
అందుకే ఆయిల్ కొట్టించినప్పటి రీడింగ్ నూ... చనిపోయిన స్థలంలో వెహికల్ దొరికినప్పటి మీటర్ రీడింగ్ నూ టాలీచేసి చూస్తే చాలాదూరం తిరిగినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది...
అంటే... చతుర్వేది మరణం యాక్సిడెంట్ కాదు... ఎవరో హత్యచేసి ఉంటారనడానికి ఎలాంటిసందేహం లేదు. యాక్సిడెంట్ జరిగిందా, ఎవరయినా చంపి అలా సృష్టించారా అన్నా అనుమానం ఇక అనవసరం....
ఇన్ స్పెక్టర్ వీరేష్ కళ్ళముందు పోస్ట్ మార్జం రిపోర్ట్ తో పాటు డాక్టర్ చెప్పిన మాటలు మెదిలాయి.
'చతుర్వేది శరీరం లారీ చక్రాలకింద బడి నజ్జు నజ్జు అయినట్టు గానే ఉందికానీ... గుండెలోనుంచి ఏదో పదునయిన ఆయుధం దూసుకుపోయి రంధ్రం చేసినట్టు... అందువలనే గుండె ఆగిపోయిందని నా అనుమానం. అది ఇనుపరాడ్ కావచ్చు... లేదా బుల్లెట్ అయినా కావచ్చు. ఇది కేవలం నా అనుమానమే తప్ప కరెక్ట్ గా నిర్దారించడానికి గుండె, ఊపిరితిత్తులు, తల పూర్తిగా చిన్నా భిన్నమైపోయి ఉన్నాయి. అందువలనే బాహ్యంగా కనిపిస్తున్న వాటిని బట్టి లారీ గుద్దడం వలెనే చనిపోయాడని నిర్దారణకు వచ్చాను.'
డాక్టర్ వెలిబుచ్చిన అనుమానం ఇప్పుడు నిజం కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనిపించింది వీరేష్ కు.
ఇంకొకసారి పోస్టుమార్టమ్ చేసిన డాక్టర్ ను కలిస్తే ప్రయెజనం ఏమయినా ఉటుందేమోనని బయలుదేరాడు ఏ.సి.పి వీరేష్.
* * * *
గదిలో తిరుగుతున్నా సీలింగ్ ఫాన్ కింద పడుకుని అలోచిస్తుంది రజని.
జరిగింది కళ్ళముందు మెదులుతుంటే ఒళ్ళంతా పులకించి పోతుంది.
తను బట్టలు మార్చుకుంటుండగా... ఎంతో దగ్గరగా తన శరీరంలోని అణువణువునూ చూశాడు రవితేజ. పదేపదే ఆ దృశ్యమే గుర్తుకు రాసాగింది. అతనిచేత హుక్స్ కూడా పెట్టించుకుంది.
పరాయి మగాడిముందు సిగ్గు విడిచి తను డ్రెస్ ఛేంజ్ చేసుకోవడము కళ్ళముందు గిర్రున తిరుగుతుంటే సిగ్గుతో కుచించుకుపోయింది. ముఖం ఎరుపెక్కింది.
తను కావాలనే అతనని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది.
కానీ, రవితేజ ఎంతో నిగ్రహంతో ఉన్నాడు. ఆ సమయంలో అతని స్థానంలో ఇంకొకరు ఎవరయినా ఉండి వుంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకొనడంతో చిగురుటాకులా వణికిపోయింది రజని.
తను అతనని కరిగించలేకపోయాను అనే విషయం ఎలా వున్నా అతనిలోని నిజాయితీకి ఆమె హృదయం పులకించిపోయింది.
అలా అనుకోవడంతో అతనిమీద గౌరవం కలిగింది.
తన అవయవ సౌష్టవాన్ని చూసిన తొలి మగాడు రవితేజ.
అతను గుర్తుకు రాగానే ఫోమ్ బెడ్ పై వాలి మెత్తని దిండును గుండెకు అదుముకుని తీయని ఊహలలో తేలియాడసాగింది.
యమునా నదీ తీరాన గోపికల దుస్తులు దొంగలించిన గోపీకృష్ణుడు...
నడుంవరకూ మడుగులో వుండి రెండుచేతులు పైకెత్తి దీనంగా వేడుకుంటున్న గోపికలు...
ఆ సీనరీ రోజూ చూసేదే అయినా ఇప్పుడు ఎంతో శృంగారాత్మాకంగా కనిపించసాగింది.
కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడింది.
మనసుకు నచ్చిన ప్రియునితో వూహలలో తేలియాడుతున్న తనని భంగపరిచింది ఎవరా అని విసురుగా వెళ్ళి బెడ్ రూమ్ తలుపు తెరిచింది రజని.
ఎదురుగా తన ప్రియుడు... చిరునవ్వులు చిందిస్తూ నిలుచునివున్న రవితేజ.
అతనని చూడగానే సిగ్గులమొగ్గలు పోయింది.
నమ్మలేని అద్బుతాన్ని చూసినట్టు పులకించిపోయింది.
చిరునవ్వుతో లోనికి నడిచాడు అతను.
"సారీ రజనీ... ఆరోజు జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. అందుకే క్షమాపణ చెప్పి వెళదామని వచ్చాను..." అన్నాడతను.
"మిమ్ముల్ని క్షమించడమా?" అతనివేపు కొరకొరా చూసింది.
ఆ మాటలకు రవితేజ అవాక్కయ్యాడు.
"మీరు చేసిన తప్పుకు ఏ శిక్ష విధించిన తప్పు నాది గనుక బాధ్యతగా స్వీకరిస్తాను. ఏం చేయమంటావో చెప్పు"
"కళ్ళు మూసుకోండి"
ఆమె మాటలు, చేష్టలు అర్ధం కావడంలేదు.
రవితేజకు అయోమయంగా వుంది. అయినా ఆమె చెప్పినట్టే చేశాడు.
ఉన్నట్టుండి వెచ్చటి స్పర్శ... బుగ్గలపై తాకడంతో చటుక్కున కళ్ళు తెరిచాడు.
దొండపండు లాంటి ఎర్రటి పెదవులతో రజని ముద్దు పెట్టింది.
తన పెదవులను తాకి దూరంగా వెళ్లిపోతున్న ఆమె ముఖాన్ని గమనించగానే తమకాన్ని అపుకొనలేకపోయాడు అతను.
ఆ ప్రయత్నంగానే రవితేజ ఆమెను తన బాహువుల మధ్య బంధించాడు.
మరులు గొలిపే మదన భాండం వచ్చి ఢీ కొనట్టు... ఆ సమయము గడచిపోతే తిరిగి అలాంటి అవకాశం మళ్ళీ రాదేమో అన్న తమకంతో ఆమెను మరింత గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు అతను.
కొద్దిక్షణాల తరువాత...
తను ఎలాంటి స్థితిలో ఉందో ఆమెకు అర్దమైంది.
"రవీ... ప్లీజ్ నన్ను వదిలేయ్... పెళ్ళికాకుండా ఇలా తొందర పడడం మంచిది కాదు"
"అదేం కుదరదు. నిన్ను ఆరోజు చూసినప్పటినుండీ నా మనస్సు మనస్సులో ఉండడంలేదు. ఆ అనుభవం ఎలా వుంటుందో చూడాలి. నామాట కాదనకు"
"నా మాట విను రవీ..." అంటూ రజని అతని కౌగిలిలోనుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
మరింత గట్టిగ కౌగిలించుకున్నాడు అతను.
"ప్లీజ్ వదిలెయ్..."
"ఊహో ఒక్కసారి..."
"మూడుముళ్ళూ పడ్డ తరువాతే ఏదయినా..."