అతడు ఆమె మాటలు వినటంలేదు. కళ్ళు విప్పగానే కనబడిన అమ్మాయినే చూస్తున్నాడు. చీరేకీ, జాకెట్లుకీ మధ్య అమెపచ్చాటి శరీరం మీద వెన్నెల మెరుస్తూంది. జఘనం దగ్గర నలిగిన చీర కూడా అదోలాటి శోభనిస్తూంది. సర్దుకుని పైట, జాకెట్టు మేలికల్లో వంపు తిరగలేక పక్కకి తప్పుకుంది.
అతడు లేస్తూ ఎవరూ__ చిరంజీవా?" అన్నాడు.
ఆమె ఆశగా అడుగుముండుకేసి ఆత్రంగా "ఆ __ చిరంజీవే, కొద్ది సేపట్లో అతడిని ఉరిబోతున్నారు. రక్షించగలిగేది నివ్వె" అంటూముందుకొచ్చింది.
అతడు కొద్దిగా పక్కకి జరగటంతోగుమ్మం ఆటోమాటిక్ గా కవర్ అయింది. "ఇంత తెల్లవారు ఝామున ఆ ఊరుల సంగతీ __ శవాల సంగతీ మన కెందుకులే సిన్నమ్మా" అంటూ నవ్వేడు.
అతడి కళ్ళలో భావాన్ని పసిగట్టి ఆమె చప్పున అడుగు వెనక్కీ వేసింది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది.
అర్చన పక్కకి రావటంతో గుమ్మంలోకి ఆమె బయటకు పరుగెత్తకుండాజాగ్రత్త పడుతూ అతడు రెండుడుగులు ముందుకేసేడు. ఆమె అతడికి, చేయిజాస్తే అందే దూరంలోకి వచ్చింది. తనెంత తప్పు చేసిందో ఆమె కర్ధం అయింది. చుట్టూ చూసింది. బయటకెళ్ళాటానికి దారి ఎటువైపూలేదు. ఒకవైపు చిన్న కిటికీ లాటిది వుందిగానీ, దానికవతలివైపు వత్తుగా పెరిగిన జీల్లేదు మొక్కలూ, బ్రహ్మజేముడూ కనిపిస్తున్నాయి.
ఎంచెయ్యాలో తోచక, ఏమయితే అదయిందని. చప్పున గుమ్మంవైపు పరుగెత్తింది. అతడు చెయ్యి జాచి ఆమెని పట్టుకుని __ ఆ విసురుకి ఆమెతోపాటూ గుమ్మం దగ్గరకొచ్చేడు. అతడి బలమైన హస్తాల మధ్య ఆమె నలిగిపోయింది. అది వూరుచివర అనీ, ఎవరూ రారానీ ఆమెకి తెలుసు. ఆమెకి దుఃఖంరాలేదు, కసీ ఉక్రోషంతోతనని పట్టుకున్న చేతుల్ని గీరబోయింది. కానీ అతడి బలంముందు నిలవలేకపోతూంది. ఈ లొపులొఅతడు ఒకచెతిని అమె మెడ వేనుగ్గావేసి, ఆమె మొహాన్ని దగ్గరకి లాక్కుని తల ము౮దుకు వంచాడు.
అప్పుడు పడింది అతడి తలమీద దెబ్బ!
మొదట అతడి కళ్ళముందు వెయ్యి మెరుపులు ఒక్కసారి మెరిసినట్టయింది. ఆ తరవాత చీకటి కమ్ముకుంది. "అమ్మా" అని కూడా అరవకుండా తల పట్టుకుని కూలిపోయేడు.
అర్చనకి మొదట ఓ క్షణం అర్ధంకాలేదు. తనని పట్టుకున్న చేతులు సడలిపోవటంతో తలెత్తి చూసింది. ఏనుగులాంటిఅతడి ఆకారం ఆమె ముందునుంచి నెమ్మదిగా నేలమీదకుజారిపోయింది. దనివెనుక నుంచి శర్మ వస్తూ కనిపించాడు.
ఆమెలో ఆశ్చర్యం, అనందం ఒకేసారి చోటుచేసుకున్నాయి. నుదుటిమీద పట్టిన చెమట తుడుచుకుంటూ "పదండి__ పోదాం" అన్నాడు శర్మ.
"నువ్వు ... నువ్వు యిక్కడికేలా వచ్చావ్?" అని అడిగింది. అర్చన.
"పరుగెత్తుకుంటూ... ఈ రాత్రంతా నా పని పరుగెత్తటమే."
"ఇంతకూ అక్కడ విషయం ఏమైంది? ముందాసంగతి చెప్పు. ముసలమ్మా కనబడిందా" అంటూ ఆత్రంగా అడిగింది. శర్మ విస్మయంగా ఆమెవైపు చూసేడు. తనెంత పెద్ద ప్రమాదము నుంచి బయటపడిందోఆలోచించకుండా __ అక్కడ చిరంజీవి గురిమ్చిఅలోచిస్తూంది.
"ఏం మాట్లాడవేం?" అన్న ప్రశ్నకు తెప్పరిల్లి అతను అన్నాడు__
"__నేను ముసలమ్మా ఇంట్లోకి వెళ్ళలేదు అమ్మగారూ. మీ కారు వెనుకే పరుగెత్తుకొచ్చాను. నన్ను క్షమించండి. కానీ జైల్లో పనిచేస్తున్నా వాణ్ణి కాబట్టి రౌడీలు, ఖూనీకోరులూ ఎలా ప్రవర్తిస్తారో తెలిసినవాణ్ణి. అర్ధరాత్రి ఇంతగా ఓ అమ్మాయి తామున్న చోటికి వస్తే, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. అందుకే దానికన్నా ఇది ముఖ్యంగా తోచి ఇలా వచ్చాను."
ఆమెకి ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. అతడికి కృతఙ్ఞతలు చెప్పుకోవాలో, అతడిని చివాట్లు పెట్టాలో తెలియలేదు. అక్కణ్ణుంచికదుల్తూ "పాడ్ ఆలస్యం అయిపోతూంది" అంటూ బయటకి అడుగువేసింది. నేల మీద ఆకారం కొద్దిగా కదుల్తూ కనిపించింది. శర్మ కూడా అక్కణ్నుంచి బయటపడ్డాడు. మరు నిముషం కదిలింది.
4
ఇంకా పూర్తిగా తెల్లావారు లేదు.
చిరంజీవి సెల్ తాళం తేరునబడగానే, మేజిస్ట్రేట్ అందులో ప్రవేశించాడు. అతడిని చూసి చిరంజీవిలేచి నిలబడబోయి, రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల తూలీ, నిలదోక్కుకున్నాడు. అతడి కళ్ళు నిద్రలేమి వల్ల ఎర్రగా వున్నాయి. అతడి గెడ్డం మాసివుంది. మరణానికి ముందు రోజు మంగలి 'షేవ్' చెయ్యటానికి వస్తాడు కానీ, చిరంజీవి తిరస్కారించాడు.
మేజిస్ట్రేట్ చేతిలోని కాగితాలని పరిశీలనగా చూసి, అందులోని ఖైదీ పుట్టుమచ్చల్నీ గుర్తుల్నీ చిరంజీవితోపోల్చి చూసుకుని, నిర్ధారణ పరచుకున్నాడు. వాటిమీద సంతకం పేట్టి, ఫైలు మూసేస్తూ "నీ ఆఖరి కొరకే ఏమైనా వుందా?" అని అడిగాడు. చిరంజీవి ఎదో చెప్పబోతూ వుంటే మళ్ళీ అతడే, "ఆఖరి కొరకే ఎదంతెఅదికాడు.కేవలం నీ విల్లు మార్చటం కానీ, నీవాళ్ళకేదైనా వార్త పంపాలంటే అడిగానీ చేస్తాం,. అలాటిదేదైనా వుందా?" అని అడిగాడు. చిరంజీవి లేదన్నట్టూ తలూపాడు.
మేజిస్ట్రేట్ అక్కణ్నుంచితప్పుకున్నాక ధర్మారావ్ అతడి దగ్గరకొచ్చాడు. ఒక్కక్షణం అయన ఏమి మాట్లాడలేదు. చిరంజీవి కూడా మౌనంగా వున్నాడు. ఆ గాఢమైన నిశ్శబ్దంలో ఎంతో అర్ధత్ర వుంది. ఆ చీకట్లో అస్పష్టమైన భావాల ఘర్షణ వుంది. బయట కిటికీ ఊచ;ళ మధ్య నుంచి ఒక పిల్లతెమ్మెర జాలిగా స్పృశిస్తూ వెళ్ళిపోయింది. రాత్రంతా రాణి తల్లికోసం ఎక్కడో చెట్టుమీద ఒక పక్షిపిల్ల హృదయవిదారకంగా అరుస్తూంది. చిరంజీవి తెలెట్టి ఆయనవైపే చూసేడు. ధర్మారావు నెమ్మదిగా చెయ్యెత్తి అతడి భుజంమీద వేశాడు. భుజాన్ని రెండుసార్లు తట్టి గిరుక్కున వెనుతిరిగి, మరి అక్కడ వుండలేనట్టూ వడివడిగా నడిచి వెళ్ళిపోయాడు.