Previous Page Next Page 
అభిలాష పేజి 39

    దూరంనుంచి శర్మ పరుగెత్తుకు రావటం కనిపించింది. ఆమె ఒక్కసారి తల విదిలించి మామూలు మనిషి అయిపోయింది. ఎంతో విపత్కర సమయాల్లో అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఎలా వుంటుందో అలా బ్యాలెన్స్ డ్ గా మరిపోయింది.
   
    అతడు వచ్చి ఎక్కేలోపులోనే కారు స్టార్టు చేసి వుంచి, అతడు ఎక్కీ ఇంకా డోర్ వెయ్యకముందే పోనిస్తూ,'ఎటు' అంది. అతడు కాగితం చూస్తూ అడ్రసు చెప్పాబోయెడు .ఆమె విసుగ్గా "ముందుకా వెనక్కా__ ముందు అది చెప్పు" అంది.
   
    "ముందుకే" అన్నాడు శర్మ. ఆమె రోడ్డుమీదకి దృష్టి సారించి, అక్సిలేటర్ బలంగా నొక్కింది.కారు స్పీడోమీటరు నలభై మీదనుంచి ఎనభైమీదకి మారింది. "ఊ ఇప్పుడు తొందర తొందరగా చెప్పు" అంది. శర్మ క్లుప్తంగా శవం దొరికిన స్థలం గురించీ, దారాసింగ్ వుందే ప్రదేశం గురించీ చెప్పాడు. ఆమె కారుని ఇరుకు సందుల్లోకి తిప్పి అక్కడ కూడా నువ్వు వాకబు చెయ్యి, సత్రం దగ్గరకి నేను వెళ్తాను. ఆ సుశీల మరణం మామూలుదే అనీ,తనే శవాన్ని యిచ్చాను అనిగానీ ఆ ముసలమ్మ చెబితే మేజిస్ట్రేట్ ఉరిని ఒక రోజుబాటు అయినా ఆపు చెస్తాదనెఇ నేను అనుకుంతున్నాను. ఈ లోపులో అంకుల్ ఎక్కాడున్నదీ తెలుస్తుంది" అంది.
   
    "ఇద్దరం సత్రం దగ్గరకి వెళ్దాం. ఇంత రాత్రప్పుడు ఒక్కరూ వెళ్ళటం ప్రమాదకరం" అన్నాడు శర్మ . అర్చన తల తిప్పకుండానే "ప్రతిచోటకీ ఇద్దరమూ కలసి వెళ్లటం కుదరదు. టైమ్ సరిపోదు. ఏ చిన్న సాక్ష్యమైనా సంపాదించాలీ అంటే ఇద్దరం చెరో చోటకి విడిపోవాలి తప్పదు" అంది. శర్మ తటపటాయిస్తూఏదో అనబోయి మళ్ళీ వూరుకున్నాడు.
   
    "ముసలమ్మనీనీ ప్రశ్నలతో ఒక్కసారిగా బెదరగొట్టేయ్యకు. అందులోనూ మంచి నిద్రలో వుంటుందేమో__ లేపి వెంటనే శవం గురించి ప్రశ్నిస్తే కంగారు పడుతుంది. ఏ పోలీసులో అనుకొని అసలు జవాబు చెప్పాడు. జాగ్రత్తగా హాండిల్ చెయ్యి."
   
    శర్మ ఆమె ముందుచూపుకి ఆశ్చర్యపోయాడు.
   
    "ఇద్దరం కలసి వెళ్ళడానికి వీలుకాని పక్షంలో....." నసిగేడు శర్మ. "నేను సత్రానికి వెళ్తాను. ఆ ముసలమ్మాతోమీరు మాట్లాడితే బావుంటుంది."

    "సత్రం ముందోస్తుందా___ ముసలమ్మా ఇల్లా?"
   
    "ముసలమ్మా ఇళ్ళు దాటి ముందుకో అయిదు ఫర్లాంగులు వెళ్తే __ ఆ ఊరు చివర ..... సత్రం."
   
    "నీకు డ్రైవింగ్ వచ్చా...?"
   
    "రాదు."
   
    "మరి నిన్ను సత్రం దగ్గర దింపి, నన్ను మళ్ళీ వెనక్కీ రమ్మంటావా..... లేక నువ్వు అతడితో మాట్లాదేవరకూ నన్ను అక్కడే ఆగమంటావా?" అని తాఫీగా అడిగింది. శర్మ దెబ్బతిన్నాడు.
   
    "శర్మా __ టైమ్ సంగతి నువ్వు మర్చిపోతున్నావ్" అంటూ సర్రున పక్కకి కారుని కోసింది. రేండు మురికి కలవాల మధ్యనుంచి పోతూంది. కారు. ఏ మాత్రం కొద్ధిగాపక్కకి వెళ్ళినా ఏ ఇంటి మేట్లో ఎక్కేలా వుంది. దూరంగా చిరంజీవి చెప్పిన దీపపు స్థంభం, ముందుకీ వంగిన పెంకుతిళ్ళూ కనబడుతున్నాయి.  విషయంలోకి వస్తూ ఆమె అంది. __"ఆ ముసలమ్మా ఏలాటిదో గమనించు. ఉన్న విషయాలు వున్నట్టు చెబితే మంచిదే. లేకపోతే ఎంతడబ్బైనాసరే__ అయిదొందలు__ వెయ్యి__ రెండు వేలు__ ఎంతైనా సరే యిస్తానను, నేను అతడిని నాతోపాటూ తీసుకొచ్చే సరికి ఆపేలా చెయ్యొచ్చునుకుంటూ" అంటూ కారు ఆపింది.
   
    "మీ రోక్కరూ సత్రానికి ..."
   
    "శర్మా.... ప్లీజ్" ఆమె కంఠం అసహనంతో వణికింది. మరి మాట్లాడకుండా అతడు చప్పున కారు దిగేడు. ఆమె కారుపోనిస్తూ __ "నాలుగ్గంటలోఅయిదు నిముషాలయింది. నాలుగుంపావుకల్లా అంతా అయిపోవాలి" అంటూ సాగిపోయింది. టైమ్ వింటూ అతడు విభ్రాంటుడయ్యాడు. "నాలుగూ అయిదా ... అంటే __ రెండు నిముశాల్లోమూడు మైళ్ళు వచ్చామా?" అనుకున్నాడు. నమ్మశక్యం కాలేదు. తను ఏక సందాగ్రాహినని అతడికి గర్వంవుండేది. కాని అతడు చెప్పినదంతాజ్ఞాపకం వుంచుకుని మళ్ళీ తిరిగి ఆడకుండా చిరంజీవి వ్రాసిన ప్లానుని మసక చీకట్లో వొక్కసారిచూసి ఈ లోపులోనే ఏది దగ్గర, ఏది దూరం అని అలోచించకుండా ఎవరు ఎక్కడికివెళ్ళాలిఅని నిర్ణయం చేసుకుంటూ ఈ ఇరుకు సందుల్లోంచియింతదూరంఅంత తక్కువ సమయంలో తీసుకొచ్చిందీ అంటే!
   
    ఈ అద్భుతమైన అమ్మాయి కోసమైనా చిరంజీవి బ్రతుకుతే బావుణ్ణు అనుకొన్నాడు మనస్పూర్తిగా శర్మ.
   
    ఈ లోపులో అర్చన కారు సత్రం ముందు ఆగింది. పాడుబడిన సత్రం అది. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగివున్నాయి.ఒకవైపు పూర్తిగా కూలిపోయివుంది. ఎత్తైన గుట్టమీద వుంది అది. పైకి వెళ్ళే మెట్లుకూడా శిధిలమై వున్నయి. కీచురాళ్ళు శబ్దంతప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. రాత్రి కురిసిన వర్షానికి నేలంతా చిత్తడిగా వుంది. చల్లటిగాలిరివ్వున వీస్తోంది. చీకట్లో ఆ సత్రం శత్రుసైనికలు పొంచివున్న చీకటి గుహలా వుంది.
   
    కారు ఆగీ ఆగగానే ఆమె ఒక్క గెంతులో దిగింది. క్షణంసేపు సత్రాన్ని పరికించి, చూసి, మరి ఆలస్యం చెయ్యకుండా, కుచ్చిళ్ళు ఎత్తి పట్టుకుని జాగ్రత్తగా __ అయినా వడివడిగా మెట్లు ఎక్కింది. తడిసిన ఆమె దాన్ని పట్టించుకోకుండా లోపలి వెళ్ళింది. మిగతా చోట్లకన్న కొంచెం శుభ్రంగా వున్న ప్రదేశంలో ఒక మూల చూసుకోకుండా ముందు కెళ్ళడంతో సగం తినేసి వదిలేసినా అన్నం పాత్ర కలికి యగిలి బంతిలా ముందు కెళ్ళింది. ఆ శబ్దానికిఅతడు కళ్ళు విప్పేడు. 
    ఎదురుగా కనబడిన అమ్మాయిని చూసి క్షణంపాటూ విస్తుబోయేడు. ఈ లోపులో అర్చన అతడు నిద్ర లేవటం గమనించి "నా పేరు అర్చన.  చాలా అర్జెంటు పనిమీద వచ్చాను.కొన్నినెలల క్రితం చిరంజీవికి ఒక శవం చూపెట్టటం జరిగింది, జ్ఞాపకం వుందా?ఆ విషయం గురించి....." అంటూంది.

 Previous Page Next Page