Previous Page Next Page 
అభిలాష పేజి 38

    అర్చన మాట్లాడలేదు. ఏం చెయ్యాలా అని ఆమె ఆలోచిస్తూ వుండగా శర్మ అన్నాడు__ "ఈ విషయంలో మీరేమీ దిగులు పెట్టుకోకండి. నా మీద నమ్మకం వుంచండి. చిరంజీవి చెప్పే అడ్రసులన్నీ అక్షారం పొల్లుపోకుండా మీకు చెప్పే బాధ్యత నాది. మీరుగానీ స్వంత డబ్బా అనుకోకపోతేనేను జైలు మాన్యువల్ ఆరువందల రూల్సూ సెక్షన్స్ తో సహా వప్పజెప్పమంటే చెప్తాను."
   
    "అక్ఖర్లేదులే" అంది అర్చన. "ఆ మాత్రం రిస్కు తీసుకుందాం. వెతన్నిటికన్నా ముఖ్యమైనది టైమ్! ఏమాత్రం దాన్ని వ్యర్ధపరచకు.పనవ్వగానే వెంటనే వచ్చేయి" అంది . ఈలోపు కారు జైలు వద్దకు చేరుకుంది. కొద్ది దూరంలో ఆపింది అర్చన.
   
    ఒక పెద్ద యుద్ధ రంగంలోకి ప్రవేశించబోయే ముందు సర్వసైన్యాధక్షుడుమౌనంగా పరికించినట్టూ, నిశ్శబ్దంగా సీటుకి అనుకుని కూర్చుని, జైలు గోడల జేగురు రంగుమీదపేరుకున్న చీకటిని చూస్తూ "ఆఖరిసారి హాయిగా నిద్రపోతున్నవాడిని అనవసరంగా లేసినట్టూ అవుతుందేమో" అంది. ఆఖరిసారి నిద్ర అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. అలా అన్న తర్వాత మళ్ళీ ఏమ్డుకన్నావా అని  బాధపడింది.
   
    శర్మ పేలవంగా నవ్వి, "తెల్లవారుఝామున చావు పొంచివుందని తెలిసిన ఖైదీ__ చివరిరోజు నిద్రపోరు అమ్మగారూ" అమ్తూకారు డోరు తీసుకుని దిగేడు.
   
    "శర్మా..."
   
    అతడు అగేడు.
   
    ఆమె కొంచెం తడబడి "నేను ఇక్కడ వున్నట్టుచేప్పకు" అంది.చెప్పటం అనవసరం. ఈ రెండు గంతల్లూనూ అతడి వురి తప్పించటం అసాధ్యం మనవ ప్రయత్నం చెయ్యాలని చెయ్యటమే ఇదంతా. అటువంటప్పుడు, ఆఖరి నిముషం వరకూ అనవసరంగా చిరంజీవిని ఎందుకు ఆశతో బ్రతికించటం! అందుకే ఆమె తమ అక్కడ వున్నట్టు చెప్పావద్దంది.
   
    శర్మ తలూపి జైలువైపు వడివడిగా కదిలేదు.
   
                                                        *    *    *    *
   
    "మీకు శవం ఎక్కడ దొరికిందో ఆ అడ్రసూ____ దారాసింగ్ ఎక్కడ వుంటాడో అవీ చెప్పండి.... అర్జెంట్ మాటల సందర్భంలో ఇదంతా చెప్పాలి,రాజుకి అనుమానం రాకుండా.
   
                                                                                                                            ____మీ శర్మ.
   
    చిరంజీవికి అది అర్ధం అవటానికి అరనిముషంపట్టింది.తలెత్తి  "ఇదంతా ఎందుకు?" అని అడగబోయేడు. కానీ శర్మ సైగ చేసేడు. చిరంజీవి తల వంచుకుని, ఉత్తరం వ్రాసే నెపంమీద వ్రాస్తూసంభాషణ కొనసాగించాడు.
   
    "ఆ కోట పక్కన సత్రంలో దారాసింగ్ కనబడకపోయినా బావుండేది___"
   
    "దారాసింగ్ పేరు గమ్మత్తుగా వుందే" అన్నాడు శర్మ.
   
    "అసలు పేరు భీమేశ్వర్ ."అన్నాడు చిరంజీవి ఇంకా గుర్తులూనూ, అవీ వ్రాస్తున్నట్టు నటిస్తూ! నిజానికి అతడు వ్రాస్తున్నది, సిశీల శవం దొరికిన ఇంటి అడ్రసూ గుర్తులూనూ, అవి వ్రాస్తూ అన్నాడు. "ఆ పక్కంటి మిసలమ్మే ఇంటి యజమానురాలు. శవం దగ్గర కూర్చొని వుంది. బహుశా సుశీల అద్దే ఎగ్గొట్టి చచ్చిపోయి వుంటుంది."
   
    వచ్చిన పని అయిపోయినట్టుశర్మ ఆకగితం తీసుకుని, వేళ్ళోస్తాను." అంటూ లేచాడు. చిరంజీవి అప్పటివరకూ వున్న హుషారు పోయింది. మళ్ళీ ఒంటరితనం ఆవరించింది. శర్మని చూడగానే అతడెందుకోఒక స్కహనం రిలీఫ్ గా ఫీలయ్యాడు. అతడు మానసికంగా మరణం కోసం ఎప్పుడో సిద్దపడ్డాడు. ఈ లొపులొఈ రాజు సాడిజనాన్నిమాత్రం భరించలేకపోతున్నాడు. దీనికన్నా ఉరికంబం ఎక్కడమే సుఖమని అనిపిస్తుంది.
   
     
    "శర్మా"
   
    వెళ్ళబోతున్న విష్ణుశర్మ అగేడు. చిరంజీవి ఊచల మధ్యనుంచి చేయిజాచి "అర్చనకంతా చెప్పావా?" అన్నాడు. అన్నాడు. శర్మ కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. వాటిని దాచుకుంటూ "చెప్పను బాబూ. మీ నిర్దోశిత్వాన్ని మే మందారం మనస్పూర్తిగా నమ్ముతున్నాం. " అంటూ ఆ చేతిని స్నేహపురస్పరంగా సృశించాడు. ఈ లోపులో రాజు కదిలి_ "ఇక వెళ్ళు" అన్నాడు శర్మ భారంగా కడలి అక్కణ్ణుంచి బయటకోస్తూ వుంటే వరండా చివర్న మూడు ఆకారాలు కనబడ్డాయి. అతడు వులిక్కిపడిఆగిపోయాడు.
   
    మేజిస్ట్రేట్, జైలరు , జైలు డాక్టరూ వస్తున్నారు.
   
    వీళ్ళు అప్పుడే ఎందుకు వస్తున్నారు? అన్న అనుమానంతో అతడు అటేచూస్తూ నిలబడిపోయాడు. అతడి అనుమానం నివృత్తి చేసేటందుకా అన్నట్టూ గడియారం నాలుగుసార్లు కొట్టింది.
   
    శర్మ పళ్ళు ఒక్కసారిగా జలదరించింది. అప్పుడే నాలుగైందా? అవును... తాము హడావిడిలో టైమ్ చూసుకోలేదు నాలుగైంది. ఇంకేముంది.....టైమ్ అయిపోయింది. ఇంక ఏ శక్తి ఇతడిని రక్షించలేదు.... అప్పుడే డాక్టర్ వచ్చేసేడు...... మేజిస్ట్రేట్ కూడా స్టేట్ మెంట్ తీసుకుంటున్నాడు.
   
    అతడు, కళ్ళు నేలకంటుకు పోయినట్టు అలాగే నిలబడి అక్కడి దృశ్యాన్ని చూడసాగేడు. తలుపులు తాళం తీసి లోపలి ప్రవేశిస్తున్నారు వాళ్ళు. దూరంగా ఎవరో చీపురుకట్టతో ఊడుస్తున్న ద్వని. మేజిస్ట్రేట్ చిరంజీవితో మాట్లాడుతున్నాడు. జైల్లో ప్రపంచం నెమ్మది నెమ్మదిగా నిద్ర లేస్తూంది.
   
    శర్మ అలాగే నిలబడి చిరంజీవిని చూసెడు. క్రితంరోజువరకూ హాయిగా నవ్వుతూ జికోలేసిన చిరంజీవి, ప్రొద్దున్న కళ్ళ వుండడు! ఇదే యని ఆఖరిసారి అతడిని చూడటం..... ఈ ఈ భావమే ఏడుపు తెప్పిస్తూంది. ఒక్కసారిగా అతడు కదిలేదు, ఇక ఆ పరిసరాల్లో వుండలేనట్టూ పిచ్చివాడిలా అక్కణ్ణుంచి బయటకు పరుగెత్తాడు.
   
    జైలుకి కొద్దిదూరంలో కారులో కూర్చొనివున్న అర్చన క్కూడా జైలు గంటలు వినిపించాయి. నాలుగైదు పోయిందనితెలుసుకుని ఆమె స్థబ్దుగా కూర్చుండిపోయింది. మహా అయితే ఇమ్కావుగంతా రేడుగంటలు తరువాత ఈ నిజం బయటపడినా లాభం ఏముంది? ఒక నిర్దోషి ని ఉరి తీసినందుకు ప్రత్రికలు ప్రభుత్వాన్ని దుమ్మేత్తి పోస్తాయి. అంతే.    

 Previous Page Next Page