Previous Page Next Page 
అభిలాష పేజి 37

    అయితే ఈ నిరాశ అంతా ఒక్క క్షణమే!
   
    క్షణంలో ఆమె సర్దుకుంది.పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు యిలాటి డిప్రెషన్ రావడం సహజమే. అందులోంచి బయటకొచ్చి_ ఎంత తొందరగా దాన్ని ఎదుర్కోగలమా అన్నది స్వశక్తిమీద ఆధారపడి వుంటుంది. ఒక్కసారి ఆమె అలా సర్దుకాగానే మామూలు అర్చన అయిపోయింది. చిరంజీవిని ఉరినుంచితప్పించటం అనేది చాలా అత్యాశ అని తెలుసు. ఎందుకంటే_ అతడిని పురి తీయటానికి ఇంకా గంటా, రెండుగంటల కన్నా ఎక్కువ లేదు. ఈ లోపులో ఏం సాధించటానికి వీలవుతుంది? కానీ మానవ ప్రయత్నం చెయ్యడంలో తప్పులేదు. చిరంజీవి నిర్దోషిత్వాన్ని నిరూపిస్తే కనీసం అతడి ఆత్మ అయినా....
   
    ఆపైనా ఆలోచించ లేకపోయింది ఆమె.
   
    లేచి నిలబడి _ "పద, మనం వెంటనే జైలుకి వెళ్ళాలి" అన్నది.శార్మతెల్లబోయి "ఎందుకు" అని అడిగాడు.
   
    "చాలా వివరాలుకావాలి,వీళ్ళకి ఈ శవం ఎక్కడ వుంటాడు? అతడి చిరునామా ఆ ఫోటోలు కడిగిన స్టూడియో...." అంటూ చప్పున ఆగిపోయింది ఫోటోలు కడిగిన స్టూడియో !
   
    తమ యింట్లోనే వాటిని కడిగివుండాలి.
   
    ఆ ఆలోచన స్పురించగానే ఆమె లోపలికి వేగంగా పరుగెత్తింది. సర్వోత్తమరావు స్టడీరూమ్ పక్కనే చిన్న గదిని డార్క్ రూమ్ గా చేసుకున్నాడు.ఆయనకి ఫోటోగ్రఫీ హాభీ.
   
    ఆమె లైట్ వేసి తొందర తొందరగా వేటకసాగింది.
   
    ఎన్నో ఫోటోలు వేసి చిన్నప్పటివి... గౌన్లు వేసుకున్నవీ.... రకరకాల భంగిమలు... వగైరా అన్నీ కనబడుతున్నాయి కనీ, కావలసినవి మాత్రం కనబడలేదు. దాదాపు పావుగంట వెతికి అవి లేవన్న నిర్ధారణ కొచ్చింది.ఇక వెతకటం అనవసరం అనిపించింది. అయినా,సర్వోత్తమరావు నాలుగింటికే బయలుదేరేడు కాబట్టి ప్రేసిడెంట్ దగ్గరకే అయివుండాలి.ఆ ఫోటోలు తనతోనే తీసుకెళ్ళి వుంటాడు.
   
    ఆమె బయటకొచ్చి, అక్కడే నిలబడివున్న శర్మతో "పడ వెళ్దాం" అన్నది. అతడు కదలకుండా, "ఎక్కడికీ" అన్నాడు.
   
    "జైలుకి"
   
    జైలంటే అత్తవారిల్లు కాదు ఇష్టమెచ్చినప్పుడు లోపలికీ,బయటకీ వేల్లతానికివప్పుకోరు" అన్నాడు అది మాత్రం నిజం.
   
    "మెయిన్ జైలు లాకఫ్"____ అంటే జైలు ముందు గేటు మూసేయ్యటం అనేది రాత్రి ఎదున్నారా, ఎనిమిదిమ్తిమధ్యా నైట్ డ్యూటీ అయిపోయినవాళ్ళు అక్కడే పడుకోవాలి. అలాగే నైట్డ్యూటీ వున్నవాళ్ళు సాయంత్రం అయిదింటికల్లా లోపలికెళ్ళిపోవాలి. ప్రతి బరక్ కీ ఇద్దరు జవంలువుమ్తారు.ప్రతీ మూడు గంతలకీ వాళ్ళు వున్నవాళ్ళు సాయంత్రం అయిదింటికల్లా లోపలికెళ్ళిపోవాలి. ప్రతి బారక్ కీ ఇద్దరు జవాన్లు వుంటారు. ప్రతీ మూడు గంతలకీ వాల్లుమారుతూ వుంటారు. అంటే రాత్రి తొమ్మిదినుంచీ పన్నెండువరకూ __ మళ్ళీ తెల్లవారుఝామున మూడు నుంచీ ప్రొద్దున్న ఆరు వరకూ.... అలా డ్యూటీలు మారుతూ వుంటారు. రాత్రంతా సెంట్రీ పచార్లు చెయ్యాలి కాబట్టి మూడు గంటల కన్న ఎక్కువసేపు డ్యూటీ వుండడు. అన్నిటికన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉరిశిక్ష కన్ ఫారం అయ్యాక జైలరు ప్రతీ పదిహేను నిముషాల కొకసారి ఖైదీని చూడాలి.ఖైదీ,ఆ రోజు రాత్రి భయంతో ఆత్మహత్య చేసుకోకుండా వుండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అసలుఖైదీ రాగానే బట్టలు మార్చి జైలు మార్చేతప్పుడే అతడి దగ్గర ఏ విధమైనా వస్తువులూ లేవని నిర్ధారణ పరచుకుంటారు. అంతేగాక అతడి గదిలో వులేన్ దుప్పట్లు, ఇత్తడి సామాన్లు తీసేసి మామూలు గుడ్డలూ,మట్టి పాత్రలూ పెడతారు. గది పైకప్పుకి కొక్కేలు లేకుండా జాగ్రత్తపడ్తారు. కరెంటు దీపం వున్నా కూడా దూరంగా హరికేన్ లాంతరుగానీ,పెట్రమాక్సుగానీ పేట్టి, ఆ వెలుగు లోపల ఖైదీమీద పదేతట్టూ ఏర్పాటు చేస్తారు. కరెంటుపోయిన సమయమ్లో ఖైదీ ఏ అఘాయిత్యానికీ తలపడకుండా చూసేటందుకే ఈ జాగ్రత్తలన్నీ! ప్రావుద్దున్నా సాయంత్రం "విధిగా" గదంతా వెతుకుటారు. గార్డులకి బాయినెట్స్ __తుపాకులు ఇవ్వకుండా,కేవలం వెదురు లాఠీలు మాత్రమే యిస్తారు.
   
    మరుసటిరోజు చచ్చిపోయే ఖైదీ __ ఈ రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోకుండా ఇన్ని జాగ్రత్తలు! ఎంత విషాదకరమయిన __ కానీ నవ్వొచ్చే నిజం! లోపల ఖైదీ ఆత్మహత్య చేసుకొంటూంటే ఆపు చెయ్యడానికి సెంట్రీ దగ్గరే తాళం చెవి వుంచుతారు. ప్రతి ఖైదీకి ఒక స్పెషల్ గార్డ్ ని ఏర్పాటుచేసి రాత్రింబవాళ్ళుఆ ఖైదీ దగ్గరకి ఎవరూ వెళ్లకుమ్దాఎర్పాటు చేస్తారు. ఖైదీతో ఎవరూ మాట్లాడకుండా కూడా వీల్లేదు.
   
    శర్మ ఇదంతా చెప్పి "అన్నిటికన్నా ఈ చివరిదే_ అంటే జైలు మన్యివాల్ రూలు నేం. 534 ఇప్పుడు మనకి అడ్డొస్తోంది. ఖైదీతో మాట్లాడటానికి కుదరదు" అన్నాడు.
   
    అతడు చెప్పిదంటా బాగానే వుంది.కాని ఎనిమిదింటికి మెయిన్ లాకఫ్ ....అంటే ఎనిమిదింటికి జైలు తలుపులు మూసేసే   పక్షంలో, రాత్రి పన్నెండింటికినువ్వు బయటకేలా వచ్చావ్?"
   
    శర్మ గొంతులో వెలక్కాయపడ్డట్టు అయింది. "అదీ... నేనూ.... గేటు దగ్గర న స్నేహితుడూ... "అంటూ తడబడ్డాడు.
   
    "పద శర్మా__ ఆలస్యం వద్దు. నిన్ను బయటకోదిలిన స్నేహితుడే లోపలి వెళ్ళడానికి కూడా మాట్లాడుకుందాం. ఇప్పట్నుంఛీ ప్రతిక్షణమూ  విలువైనాదే.... " అని అతడి జవాబు కోసం చూడకుండా లోపలికి పరుగేత్తింది. రెండు నిముషాల్లో పర్సు పట్టుకుని తయారై వచ్చి "పడ" అంది. మరు నిమషం వాళ్ళ  కారు రివ్వున గేటునుంచిబైటకు దూసుకుపోయింది.
   
    కార్లో అర్చన అంది_ "ఇప్పుడు నువ్వు చేయవలసిన పని చాలా ముఖ్యమైనది.  చిరంజీవి చెప్పే ప్రతి విషయాన్ని అక్షరం పొల్లుపోకుండా జ్ఞాపకం వుంచుకుని నాకు చెప్పాలి. ఆ ఇంటి నెంబరు__ అడ్రసు అన్నీ వీలయితే రాసుకోవాలి."
   
    "అది కుదరదు" అన్నాడు శర్మ ".... ఇప్పుడు డ్యూటీలో వున్న రాజు కర్కోటకుడు. వీటికి దేనికీ ఒప్పుకోడు. అసలు నేనిలా మళ్ళీ వచ్చి మాట్లాడాననిఅతడేవారినైనా చెబితే అది చాలునా ఉద్యోగం పోవటానికి."

 Previous Page Next Page