Previous Page Next Page 
ఋషి పేజి 35



     తస పరిస్ధితినీ, తన ఉనికిని  పరిశీలించి చూసుకోవటం మొదలు పెట్టెక తనలో చ్తేతన్యం  వస్తూంది. చాలా  దురదృష్టకరమ్తెన చ్తేతన్యం  ఇది పెద్దవుతే తనిక ఈ పరిసరాల్లో బ్రతకలేడు. రాత్రి పదిదాటితేగాని ఇంటికి  రాలేడు. పెకాతో, తాగుడో, దేశసేవో-నాటకాలో కదా రచనో-  ప్రాస్టిట్యూషనో- ఏదో ఒక వ్యసనం నేర్చుకొని, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి! చెడు అలవాట్లు ఈజీ కొంతకాలానికి పాపం  కూడా ద్తేవత్వాన్ని పొందుతుంది. టేబిల్  దగ్గరా, పేకాట దగ్గరా, నాటకాల దగ్గార కనబడే మనుష్యుల్లో  వున్న నిజాయితి ఇంకేక్కడా దొరకదు. మహాత్మాగాంధికి దేశ సేవలో  ఎంత  మనశ్శాంతి లభించిందో  అంతే శాంతి అతని మనవాడికి తాగుడులో లభించి  వుండవచ్చు.సన్యాసికి అరణ్యాలలో- సంసారికి భార్య కౌగిట్లో -ఎవరు గొప్పవారు? ఎవరూ కాదు. అసలు 'గొప్ప' అనే పదానికి అర్ధంలేదు. పిపిలికంలాంటి మనిషి. అతని జీవితానికో  అస్దిత్వం ఎందుకు? ప్రకాశం చచ్చిపోతే  ఎవరికీ జ్ఞాపకం వుండడు గండిని ఓ వెయ్యి సంవత్సరాలు జ్ఞాపకం వుంచుకొంటుంది ప్రపంచం  అంతేగా! ఈ అనంతానంత కలపరిదిలో అదేపాటిది? యెందుకు? ఈ అడ్వర్ టైజ్ మెంట్? మనిషులు గొప్పవాళ్ళు కాదు. వారి  చరిత్ర గొప్పది కావచ్చు, అది వేరే.

    బయట కారు చప్పడవటంతో కిటికీలోంచి చూసేడు. యెవరిదో కారు. కుమార్ కాదు....

    పుస్తకం మళ్ళి యధాస్దానంలో పెట్టేసెడు. దుప్పటి సరిగ్గా వేసి బయటకోచ్చేడు.

    ఆరున్నర కావొస్తుంది. కుమార్ రాలేదు.

    ప్రకాశం బయటకోచ్చేడు. అతనోస్తున్న జాడ కనబడలేదు___ ప్రకాశానికి  ఏం చెయ్యాలో అర్ధంకాలేదు.

    వెళ్ళాలి.

    ఎందుకు__

    పార్టి ఒక్కటే కాదు___మనసు అట్టడుగు పొరల్ని తరిచి తరిచి చూస్తే__సుజాత ఇంకోసారి కనిపిస్తుందేమో ఆశ. తనేవి  చెయ్యడు.


    చాలా సీరియస్ గా వుంటాడు. ఆమె తనని ఆర్తితో చూస్తూ వుంటుంది. తను గమనించాడు___తన చిరునవ్వు కోసం తపించిపోతుంది  ఆమె- త్ర్హనేలా  నవ్వగలడు? తన ప్రిన్సిపల్స్-తన వ్యక్తిత్వం!!

    పావు తక్కువ ఏడు__

    "ఎరా -వెళ్ళవా ?" అడిగేడు పరంధామయ్య.

    "ఒక ప్రెండ్ రావాలి"

    ఆయన కళ్ళల్లో ఏదో అనుమానం ,అల్లుడు పాడాయి పోతున్నాడేమోనని?

    ప్రకాశానికి కాలు నిలవలేదు- బయటకు అడుగు పెడుతూ "వెళుతూన్నాను__ నా కోసం ఎవరన్నా వస్తే  గుళ్ళో వుంటానని  చెప్పు....."అన్నాడు.

    కారు వచ్చేదారిలోనే  చూసుకుంటూ ఓ వందగజాల దూఅరంలో వున్న గుడికి  బయలుదేరేడు.

    గుడి ఆ రోజు కొంచెం రష్ గ వుంది___ నలుగురో  అయిదుగురో చిన్న క్యూలో వున్నారు. అతనూ వెళ్ళి నిలబడ్డాడు. పూజారి ఒక్కొక్క రికే హారతి యిస్తున్నాడు. ప్రకాశానికి నవ్వొచ్చింది.

    మొన్న యిదే టైముకి తను సుజాత కారులో వున్నాడు.

    నిన్న కుమార్ తో  కలిసి బార్లో.....ఈ రోజు గుడిలో

    రేపు___?

    (తెలిదు -ఎందుకంటే ఈ రాత్రితో కథ అయిపోతోంది)

    క్యూలో నిల్చున్నంత సేపూ ముందువాడు కదుల్తాడేమోనని ఆతృత. దేముడిముందు  నిలబడ్డ రెండు క్షణాల్లోనూ  పూజారి  వెళ్ళి పొమ్మంటాడేమో నన్న బాధ. పుణ్యం వస్తుందేమోనన్న  స్వార్ధం తప్పు ఇంకేముంది గుడి కెళ్ళటంలో?

    ప్రార్ధన__కోరిక !అది భక్తికాదు. భక్తిలో  స్వార్ధంలేదు. స్మరణలా మనశ్శాంతి దొరికితే మంచిదే, దొరక్కపోతే అది ఆత్మవంచన! గుడి,దేవుడు,హారతి-అన్ని నమ్మకాలు. నమ్మకంలో ఆనందం వుంది. ఆ నమ్మకం విప్రనారాయణుడికి పాండురంగడిలో దొరికితే, దేవదాసుకి పార్వతిలోనూ, తాగుడులోనూ దొరికింది. ఇద్దరూ బూషులే?

    ఆలోచనలతో  ముందుకు  చేరుకున్నాడు. దేముడి ముందు  దీపం  లోపలి చీకటినీ పారద్రోలుతుంది. కుంకుమ  వాసన మందంగా  వస్తుంది పూజారి హారతి పట్టెడు పది ప్తేసలువేసి కళ్ళుమూసుకొన్నాడు. ఆలోచనలు- సంబంధం  లేని ఆలోచనలు-

    ఓ పల్లెటూరు- ఓ పది పూరిళ్ళు ఎండ పెతాలున కాస్తూంటే- మిట్ట మధ్యాహ్నం ఆ మండు  టీండలో...ఓ ముసల్ది వంటికి నల్లచిరే చాలిచాలని చీరే కట్టుకొని బియ్యం ఎరుతుంది. దూరంగా రెండుకోళ్ళు ఆమె జుట్టు తల్లగా పండిపోయింది. ఎండిపోయిన     పెదవులు వికృతంగా వంగిపోయేయి ప్రపంచాన్ని  సాకినచేతులు  బలహీనంగా వణుకుతున్నాయి దూరంగా దాహంతో కాకి ఆరుస్తూంది. మళ్ళి నిశ్శబ్దం.

    మబ్బుల మధ్య నక్షత్రం కొత్త పెళ్ళికూతురి మొహాన్ని కప్పేసి నట్లు ఆ నీలిమేఘం నక్షత్రాన్ని కప్పెస్తూంది. ఎల్లోరాలో పేరుకుపోయిన నిశ్శబ్దంలో కూడా ఏదో ఆర్తి. ప్రపంచం అంతా కదిలిపోతూంది. అరణ్యాలు కూలిపోతున్నాయి. ఆర్తనాదాలూ, హహకారాలతో అంతా గగ్గోలుగా వుంది. అతనోక్కడే నిశ్చలంగా వున్నాడు. అహంబుష్యత్వాన్ని పొందుతూంది.

    మళ్ళి నిశ్శబ్దం  ఆప్పడే విచ్చుకున్న పువ్వు  లాలిత్వాన్ని సంతరించుకోంటూంది. నయాగరా జలపాతంలో సంధ్యవర్ణ విశ్లేషణ చెందుతోంది- దట్టంగా పట్టిన మంచు మల్లెల్ని ప్రక్షాలితం చేస్తూంది. లేత చిగురుల్ని  ఆరగించి కోయిల మధురాతి మధురంగా గానంచేస్తూంది. గడ్డిపోచ పవితంగా ఊగుతోంది.

    మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి అతని పక్కన సిత.సిత కొత్తగా కనబడుతూంది. మనిషిని  చరిత్ర లీనం చేసుకోంటూంది. అతనో  వెర్రివాడు. కానివాడెవ్వడు? జలపాతాల అంచుల్లోనో- పిల్ల కాలువ ఇసుక తిన్నెల  మీదనో గున్నమావిడి చెట్టుక్రింద నీడలోనో అల్లరి ఆడుతూ తిరగవలసిన సన్నాయి వాయిద్యాల మధ్య ఓ తాడుకు పవిత్రత ఆపాదించుకొని అంకితమయిపోతుంది. ప్రేమ కోసం మనిషి బాధ్యతనీ స్వీకరిస్తాడు.

 Previous Page Next Page