అతడు నొచ్చుకుంటూ- "చా అదికాదు నా ఉద్దేశ్యం " అన్నాడు. తనలో తనే బాధపడతాడేగాని తన వల్ల ఇంకొకరు బాధ పడటం సహించలేడు అతను. అందుకే మళ్ళి "సారి సితా"అన్నాడు.
ఆమె నవ్వి "అదికాదు బావా, నువ్వే చెప్పు.... అందులో తగ్గించే ఖర్చులేమ్తెన వున్నాయేమో -" అనేసి వెళ్ళిపోయింది.
అతడు కాగితం తీసుకొని పరిశీలనగా చూశాడు. మొత్తం నాలుగు వందల యాభ్తే రూపాయలకి లెక్కవ్రాసి వుంది. ఒక్కొక్క అయిటమూ చూడసాగేడు. మొదటి పదిలోనూ అతను చూడవలసింది ఏవి కనబడలేదు, అవన్ని ముఖ్యావసరాలు. బియ్యం-ఇంటద్దె-చాకలి పనిమనుషి-వెచ్చాలమీద ఆగింది. వేచ్చాలకి అరవ్తే రూపాయలా? పేజి తిప్పి సూపర్ బజార బిల్లు చూశాడు. కందిపప్ప ఆరు రూపాయలు! ప్రకాశం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రెండురూపాయల లవంగాలు, రెండురూపాయల ల....వం...గా...లు?
మళ్ళి మొదటిపేజి కొచ్చాడు సినిమాలు-పదిరూపాయలు! ప్రకాశం చిరునవ్వుతో జేబులోంచి పెన్నుతిసి దాన్ని అయిదు చేసేడు. నెక్ట్స్- 'బావాకి' అని, ఇరవ్తే అయిదు అంకె వేసుంది. ఎదురుగా దాన్ని ఇరవ్తే చేసేడు.
తరువాత మిగిలిన అయిటమ్స్ లో వేటిని తక్కువ చేయటానికి విలుపడలేదు. చిన్నవిగా కనబడ్డ-బ్లేడులు,పౌడరు,సబ్బులు, మంగలి వీటిని యెలా కొట్టేయ్యగలడు?
ఇప్పుడు మొత్తం ఖర్చు నాలుగువందల నలబ్తే రూపాయలు, తన జీతం నాలుగువందల పది!....ఎలా?
....ఎలా? అవును ఎలా?
ఒక్కసారిగా అతనిని భరించలేనంత ఒంటరితనం ఆవరించింది. జమా ఖర్చులు చూసుకోవటం వల్ల వచ్చింది కాదది ఏదో ఎగోని___
తన జీవితమంతా రెవిన్యూ ఖర్చులకే సరిపోతే తానెప్పుడు జీవితం స్దిరపడగలడు.
తనింకా నయం-ఎల్దిసిలూ, ప్యూన్ లూ- వీళ్ళ సంగతి? తనకి యింకా పెళ్ళికాలేదు, కాని నలుగుర్తేదుగురు పిల్లలున్న వాళ్ళ సంగతి?ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళంతా? ఎందుకి స్టగుల్ ఫర్ ఎగ్జిస్తేన్?
చాలా చిన్న ప్రశ్న యిది. కాని జవాబు మాత్రం మనం వుంటున్న సంఘం అంత పెద్దది. ఈ జవాబునీ భరించలేక- అసలా ఆలోచనే మనసులోకి రాకుండా చేసుకొంటున్నాడు మనిషి. అందుకోసం ఉక్కిరిబిక్కిరి అయ్యేటంత వ్యాపకాన్ని కల్పించుకుంటున్నాడు.
ఒకవ్తెపు ఉనికి ఇంత భయంకరమౌతుంటే ఇంకోవ్తెపు డబ్బు ఏరా చూపించి పన్లు జరిపించుకోవాలనే మనిషులు....వీరితో ఎంతకాలం తానీ ప్రాన్సిపూల్స్ అనే కట్టుబాట్ల మధ్య బ్రతకగలడు? ఏ తృప్తితో? ఎవరన్నా తనకి రెండు పూటలా భోజనం పెట్టి -వుండటానికి ఓ ఎయిర్ కండిషాన్ రూమ్ ఇస్తే, తనూ నీతి గురించీ న్తేతిక విలువల గురించీ మాట్లాడగలడు. అంతేకాని కాలే కడుపుతో ఆదర్శలేలా వల్లించాగలదు?
ప్రకాశానికి విచార మేసింది. తనమీద తనకే జాలివేసింది.
__బ్తేట చప్పడవటంతో ఆలోచన్లనుంచి తేరుకొని చూసేడు. పరంధామయ్య లోపలకోస్తూ "ఎరా బయటకేక్కడికన్నా ప్రయణమా" అని అడిగేడు__ అతను ఇస్త్రీ బట్టల్లో వుండటం చూసి.
"అవును. భోజనానికి వుండను__సీతకి చెప్పాను" అన్నాడు ప్రకాశం.
"సరేలే అయితే" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.
ప్రకాశం ఒక్కడే మిగిలెడు. మళ్ళి ఆలోచన్లు అతన్ని చుట్టూ ముట్టాయి.
మే.
"మే"లో తన పెళ్ళి. సంవత్సరం తిరిగేసరికల్లా పిల్లలు-పాలడబ్బాలు,వాళ్ళకి జ్వరాలు ,మందులు. వాళ్ళు ఎదిగిన తరువాత చదువులు__ తరువాత పెళ్ళిళ్ళు. ప్రకాశానికి మళ్ళి యిదే సమస్య చర్విత చరణం.
ఏం చెయ్యగలడు తను? ఈ చరిత్రకి ఎదురిది లాభం ఏమిటి?
నవ్వొచ్చింది ప్రకాశానికి. తన ఆలోచనలు తనకే నవ్వు తెప్పించి నయ్. జేబులోంచి మళ్ళి పెన్ను తిసేడు. నాలుగు వందలయాభయి క్రింద నాలుగువందల పదివేసి, గిత గిసేడు, కింద మ్తెనస్ నలభయి అని వ్రాసేడు-దాని క్రింద "డియర్ సితా....భయపడకు ప్రెంచి రివల్యూషన్ ఈజ్ కమింగ్ షార్ట్ లి" అని వ్రాసేడు-ఒక క్షణం ఆగి మళ్ళి చదివితే- తన పని తనకే సిగ్గేసింది. ఆ కాగితాన్ని చింపెసేడు. తరువాత ఏం చెయ్యాలో తోచలేదు-టైమ్ చూసుకున్నాడు. ఆరుకు అయిదునిముషాలు తక్కువుంది.
"కుమార్ లోపలికోస్తాడేమో, గది సర్దుదం" అనుకొన్నాడు. దండెంమీద బట్టలు సరిగ్గా వేసేడు.పక్కబట్టలు సర్దుతూ వుంటే తలగడ క్రిందనుంచి ఓ పుస్తకం బయటపడింది. తిసి చూసేడు , న్యూస్ పేపరు అట్ట వేసుంది. పేజి తిప్పేడు. విరహనుమాన్ -పది ప్తేసల ల్తేబ్రరి... సెక్స్ గురించీ ఏనాబ్తే పేజీల్లో పూర్తిగా వివరించి డిటెక్టివ్ కమ్ సెక్స్ నవల. తన కాబోయే భార్య మధ్యాహ్నం పూట తీరికగా చసివే పుస్తకం.
తల్లిలేని- తల్లి శ్రద్ధ తీసుకొని ఆడపిల్లలు ఎలా పెరుగుతారో తెలియజెప్పటనికి ఏదో ఉదాహరణ. సిత మీద కోపం రాలేదు....ఎవరో వచ్చి మానని సంస్కరిస్తారానీ అనుకోవటం చాలా బుద్దితక్కువ తన బ్రతుకు తను నిజాయితిగా బ్రతుకుతూపోతే చాలు. ఈ ప్రాంక్ నెస్ లేకమనుషులు త్యాగం, పుణ్యం, సంస్కారం-ఇలాటి విశేషణాలు అన్వయించుకొని, తామేదో గొప్పవాళ్ళమని పొంగిపోతూ వుంటారు.
దూరంగా ఆరు కొట్టింది.
ఆకస్మాత్తుగా ప్రకాశానికి భయం వేసింది. ఎందుకో తెలిదు. వెన్నులోంచి కొద్దిగా చలిపుట్టి వళ్ళు జలదరించింది.
తను మారిపోతున్నాడు.