దివ్వము (డివ్తెన్) యొక్క సృజనాత్మక ప్రమోద విలాసము లందు పాల్గొనుట మనిషి కర్తవ్యం. పరమసృజన శక్తియగు దివ్వ నూతతో తనను ఎకికరణం (సెల్ప్ ఐడింటిఫికేషను) చేసుకొనుట సాధన. ఈ విషయంలో మనిషి క్రియేటివ్ డివ్తెనుతో సహకరించాలి దానికి ఆత్మసమర్పణ కావాలి. జీవితాన్ని ఆధ్యాత్మికం చేసుకోన్నప్పడే ఏకీకరణము సాధ్యమౌతుంది.(అరవిందుడు)
అతని చుట్టూ డబ్బు ఎవరో విసురుతున్నారు. సగం నోట్లు జేబుల్లో కుక్కేసుకోంటున్నాడు, మిగతా సగం తన ఆఫిసరుకి అందిస్తున్నాడు__ మధ్యలో పిలిసు చెయ్యి చాపుతున్నాడు. ఇంకో చేతితో మావయ్యని లాఠితొ కొడుతూన్నాడు. మావయ్యా సుబ్బుల్ని రెఫ్ చేస్తున్నాడు. రాఘవరావు ఏదో ఆరుస్తున్నాడు- అంతా గంద్రగోళం-ఠంగ్ మని ఎవరో గుడిగంట కొట్టారు ప్రకాశం కళ్ళు విప్పేడు. ఎదురుగా దేముడు. ముందు దీపం వెలుగుతోంది వెనక్కి చూసేడు తన వెనుక ఇంకో నలుగురు నిలబడి వున్నారు. అయితే తను ధ్యానంలో ఉన్నది క్షణం సేపే నన్నమాట-అసత్యం కాని క్షణం.
ప్రసాదం తీసుకొని బయటకోచ్చేడు-అరుగు మీద నిలబడి చూసేడు-ఎక్కడా కుమార్ వస్తున్న జాడ కనబడటంలేదు. చీకటి పడుతోంది. పడమటివ్తెపు ఆకాశం ఎర్రటి ముసుగు నెమ్మదిగా వడిలేస్తూంది. ప్రకాశం మళ్ళి గుడి వెనక్కి వెళ్ళేడు-కోనేరు నిశ్చలంగా వుంది- అతని అలికిడికి తపోభంగమ్తెన బుషిలా ఒక కప్పు సమాధిలోంచి కదిలి నిళ్ళలోకి దూకింది. ఒక్క సారిగా చెదిరిన నీళ్ళు అలలుగా తేలి, మళ్లి నిశ్చలత్వాన్ని ఆపాదించుకోన్నాయి. నిద్రగన్నేరు చెట్టుక్రింద చేష్టామీద కూర్చొన్నాడు. గన్నేరు పూల వింతవాసన. కోనేరు నీటి మీద నుంచి వచ్చే చల్లదనంతో మిశ్రమం చెందుతోంది___అక్కడసృష్టి కూడా నిరాసంలో సేదతీర్చుకోంటూంది. అనుక్షణం గందర గోళంతో స్పందించే సంకీర్ణ ధ్వనులనుంచి దూరంగా పరుగెత్తుకు వచ్చిఅన బాగావంతుడు ఆ శ్యూన్యంతో తాదాత్మ్యం పోండుతున్నాట్టుగాన్నాడు ఆ అసుర సంధ్యలో పల్లవించే నిరావంలోకి చూడగలగితే నిర్మలమ్తెన ఆ కోనేరూ , అలలమీద తేలే తామారకూ, పిల్ల తెమ్మెర స్పర్శకి నెమ్మదిగా తలవూపే నిద్రగన్నేరు, తిరిగేభూమి, స్ధిరమ్తెన ఆకాశం, అరణ్యాలూ, పర్వతాలూ అన్ని కలిసి, ఆ చీకట్లో- లోకం సమస్తం నిద్రపోతున్న ఆ అర్దరాత్రి పూట మౌనంగా గొంతెత్తి ముక్తకంఠంతో ఆ సకల చరాచరసృష్ట లయకారకుడ్ని భక్తితో ప్రార్ధంచే గితం వినబడదా?
.....భావానికి ,భావానికి సంబంధంలేని ఆలోచనలు.
బయట హరన్ చప్పుడు వినిపించింది ఆ ఆలోచనల నుంచి తేరుకొని బయటకోచ్చేడు. కుమార్ అతన్ని చూసి పలకరింపుగా నవ్వేడు. ప్రకాశం కూర్చున్నాక కారు కదిలింది.
"ఇంటికి వెళితే నువ్విక్కడ పున్నావన్నారు...." అన్నాడు కుమార్.
"అవును. నువ్వు అన్నటైముకి రాకపోయేసరికి అక్కడ కాలునిలవలేదు" సీటు వెనక్కి వాలుతూ అన్నాడు.
"కొంచెం ఆలస్యం అయింది__శుభలేఖ ఒకటి ప్రింటు చేయవలసి వచ్చింది....."
"శుభాలేఖా? అంటే?" అడిగేడు ఏదో ఊహిస్తూ.
కుమార్ నవ్వి. "అబ్బే అటువంటి దేవిలేదు, మా క్లయింట్ కూతురి పెళ్ళి ఒకటి హఠాత్తుగా రెండు సంవత్సరాల క్రితం చేయించవలసి వచ్చిందిలే__" అన్నాడు.
"నాకేవి అర్ధంకావటంలేదు" అన్నాడు ప్రకాశం ఆశ్చర్యంగా .
"కొన్ని ట్యాక్స్ లూ అవి ఎగ్గోట్టటనికి మేం పడేపాట్లు అవి- నికేందుకులే-" అని మాట మారుస్తూ "నువ్వప్పడప్పడు ఇలా గుడికి వస్తూ వుంటావా?"
"ఆ!" అని "మరి నువ్వు?" ప్రశ్నించేడు ప్రకాశం.
కుమార్ చాలా సేపటి వరకూ మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అన్నాడు-"గుళ్ళో దేముడ్ని ప్రార్ధంచటం నాకు సాధ్యంకాదు. ఆ గోల- ఆ హడావుడి అన్ని నన్ను డిస్టర్బ్ చేస్తాము. ఏకాంతంగా దేవుణ్ని పూజించాలన్నా , నిర్మలమ్తెన మనసుతో ఆరాదించాలన్నా ఏకాగ్రత అవసరం. దురదృష్టవశాత్తు అది గుళ్ళో దొరకదు నాకు-"
ప్రకాశానికి ఆకస్మాత్తుగా యిందాకటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆ కోనేరు ప్రక్క__నిద్రగన్నేరు చప్టామీద కూర్చొని వున్నప్పుడు క్షణంపాటు స్పందించిన అస్దిత్వం... క్షణంలో వెయ్యోవంతు చాలాదూ?
"___ఏమిటి ఆలోచిస్తున్నావ్?" కుమార్ అడిగేడు.
అతనికి ఆ అనుభవం సంగతి చెప్పాలనిపించలేదు. చెప్తే పేలవంగా వుండొచ్చు. అర్ధంలేదని అనిపించవచ్చు. ఒకరి మనసులో అతిసహజమ్తెన భావమూ ఆలోచనా యింకొకరికి కృత్రిమంగానూ, అసహజంగానూ అనిపిస్తుంది. తప్పు బావానిది కాదు, వ్యక్తులు తనచుట్టూ పెంచుకొన్న విరుద్దమ్తెన ఎన్విరాన్ మెంటుది.
కుమార్ నవ్వుతూ ప్రకాశం చేతిమీద చెయ్యివేసి "ఏమిటి అంత పరధ్యానంగా వున్నావు?" అన్నాడు.
"అబ్బే-ఏం లేదు, ఆలోచిస్తున్నాను."
"దేన్నీ గురించీ?"
ఒక క్షణం ఆగి "మనిషి గురించీ" అన్నాడు ప్రకాశం.
కుమార్ అతనివ్తెపు ఆశ్చర్యంగా చూసేడు.
ఒక్కక్షణం మౌనంగా గడిచింది. ప్రకాశం ఆకస్మాత్తుగా అన్నాడు.
"నన్ను చూస్తే నాకు అసహ్యం పుడుతుంది."
అతను మాట్లాడలేదు.
"నీకు నవ్వోస్తుందా?
లేదన్నట్టు తలూపేడు.