Previous Page Next Page 
ఋషి పేజి 33

.

                                                                                 19

    ఆఫీసులో పన్జేస్తున్నాడన్న మాటేకాని ప్రకాశానికి  మాటిమాటికి ఆ దృశ్యమే గుర్తుకోస్తూంది. సుబ్బులు తండ్రి  ఆమెని రాఘవరావుకి యివ్వటానికి ప్రయత్నాలు  చేస్తున్నాడని తెలుసు.  దానికి సుబ్బులు ఒప్పుకోలేదని మాటలు సందర్భంలో  ఎప్పుడో సిత చెప్పింది.

    -కాని ఈ రికన్పిలియేషన్ చూస్తూంటే___

    లవ్ ఎట్ ఫస్టుస్తేట్  అనేది తప్పు . అది ఆకర్షణ. ప్రేమ అనేది సిన్సియారిటి వల్ల కలుగుతుంది. ఆ సిన్సియారిటి పునాది ఆకర్షణ.

    ___ఒకవ్తెపు యిలా ఆలోచిస్తూనే ఆ రోజు పని పూర్తిచేశాడు. సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో  కుమార్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.

    "హలో బాస్- ఏం  చేస్తున్నావ్?__" హుషారుగా అన్నాడు ప్రకాశం. ఎందుకో అతనికి చాలా ఆనందంగా వుంది. సీతని ముద్దు పెట్టుకొన్నండుకో- మావయ్యకి జరిగిన శాస్తి గురించో- సుబ్బులు విషయమో.....

    "ఏవిలేదు. సాయంత్రం  ఆరింటికి మీ ఇంటికి వస్తాను ఇద్దరవూ కలిసి మాణిక్యాలరావింటికి వెళదాం. అది చెప్పటానికే  ఫోన్ చేసెను."

    ఏదో జ్ఞాపకం  వచ్చినవాడిలా ప్రకాశం క్యాజువల్ గా "బ్తెదిబ్తె- ఏం ఇస్తే బావుంటుంది!" అన్నాడు.

    "ఇవ్వటం ఏమిటి?" అర్ధంకానట్టు అడిగేడు కుమార్.

    "అదే ప్రజంటేషన్___"

    కుమార్  నవ్వి "అటువంటి ఫార్మాలిటిస్ ఏవి పెట్టుకోక-" అన్నాడు. ప్రకాశం తేలిగ్గా ఊపిరి  పిల్చుకొన్నాడు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలవల్ల అతనికి ఆ రోజు జీతం రావటంలేదని  తెలిసింది.

    __ఫోన్ పెట్టేసి వచ్చి కూర్చొని, సెట్ చమన్ లాల్  క్లియరెన్స్  సర్టిఫికెట్లు విషయమ్తే ప్తేలు పూర్తిచేసేడు.

    సాయంత్రం అయిదవగానే సీటు కట్టేసి, ఇంటికి బయల్దేరాడు. రోడ్డుమీద నడుస్తూవుంటే అతనికి ఆ సాయంత్రం ఎంతో  అందం  గానూ- హుషారుగానూ అనిపించింది. క్రితంరోజు తాలూకు చాయ లేవి, అతనిలో కనబళ్ళేదు.

    ఈ స్ధితిలో  కొద్దిగా పరిశీలించి చూస్తే  అందులో  పెద్ద చిత్రమేమి  వుండదు.ఇది ట్రాన్స్  అనుభవాల్ని కొద్దిగా రుచిచూసి, ఆ పరిధిలోకి అప్పడే అడుగు పెట్టినవాడు- తనకి ప్రపంచం  అంతా తెలిసిపోయిందని, అప్పటివరకూ  చీకట్లో వున్న - తను  ఛికట్లోంచి బ్తేట కు  వచ్చేసేనని అనుకుంటాడు. తనచుట్టూ వున్నవాళ్ళంతా  ఇంకా ఆ చీకట్లోనే మగ్గిపోతున్నట్టు భావిస్తాడు. తానో స్తేకాలజిస్టు నయిపొయ్య నని గర్వపడతాడు. ఈ పరిధి నుంచి బ్తేట పడటానికి మనిషికి చాలా సెల్ప్ కాంట్రడిక్షన్  కావలి.

    __అరుగుమీద కూర్చొన్న మావయ్యనీ చూపుల్తోనే పలకరించి లోపలకి  వెళ్ళేడు. మొహం కడుక్కుని గదిలోకి వచ్చేసరికి గ్లాసులో వేడి  వేడి టి  పొగలు కక్కుతూ అతన్ని ఆహ్వానించింది. ప్రకాశానికి ఆశ్చర్యంతోపాటు ఉక్కిరి బిక్కిరి అయ్యేటంత ఆనందంకూడా కలిగింది. అతనికి ఊహ వచ్చిన తరువాత  తన ఉనికిపట్ల  ఇంకొకరు ఆసక్తి ప్రదర్శించటం ఇదే  మొదటిసారి. ప్లాస్క్ లోంచి  టి, గ్లాసు  లోకి వంపుకోలేడనీ కాదు__గిన్నేలోంచి అన్నం  కంచంలోకి వడ్డించు కోలేదని కాదు ___కాని యిటువంటి చిన్న చిన్న  విషయాలే ఆప్యాయతని ఆ పెక్షని పట్టి ఇచ్చేస్తూ వుంటాయి.

    టి తాగి బట్టలు  మార్చుకొంటూ  టైమ్ చూసుకొన్నాడు అయిదున్నరయింది. ఇంకో అరగంట ఏం  చెయ్యాలో తోచలేదు బ్తేట కొచ్చాడు- సిత ఎవరితోనో మాట్లాడేదల్లా, అతన్ని చూసి దగ్గిరగా వచ్చి "జీతం వచ్చిందా బావా?" అని అడిగింది.

    "లేదు రేపోస్తుంది" అన్నాడు.

    సిత వెళ్ళి ఏదో చెప్పి ఆవిడ్ని పంపేసింది.

    "ఎవరామె?" అడిగేడు.

    "సుబ్బులు తల్లి"

    "ఏమిటట?" క్యాజువల్ గా అడిగేడు.

    "ఏమిలేదు. ఆవిడకి మనమో యబ్తె రూపాయలివ్వాలి, ఇస్తామేమో కనుక్కోవటానికి  వచ్చింది" అంది సిత.

    ప్రకాశం ఆశ్చర్యంగా "యబ్తే  రూపాయలా?" అన్నాడు.

    "అవును, మొన్న ఇరవయ్యో తారిఖున తీసుకొన్నాం."

    "ఎందుకు?"

    "ఇదే మొదటి  నెలగా, సరిగ్గా లెక్క తెలిలేదు. వేచ్చాలూ అవి ఇరవయ్యో తారిఖు  వచ్చేసరికే  అయిపోయేయి."

    అతనికి కోపం వచ్చింది మొదటిసారి...

    "మొదటి నేలేమిటి__ఇన్నాళ్లూ గడపలేదా?" అన్నాడు.

    ఆమె ఒక్కక్షణం  మౌనంగావుండి తరువాత నెమ్మదిగా అంది- "నేనేం చెయ్యను? ఎంత పొదుపుగా వాడినా సరిపోవటంలేదు."

    ఇంక ఆ విషయాన్నీ పొడిగించకుండా "సరేలే వెళ్ళు" అన్నాడు.

    సిత వెళ్ళి ఒక క్షణంలో తిరిగివచ్చి అతనికో కాగితం ఇచ్చింది. దాన్ని అందుకొంటూ "ఇదేమిటి?" అన్నాడు ఆశ్చర్యంగా.

    "నువ్వే చూడు బావా, ఖర్చు వ్రాసి వుంచాను" అంది ఆమె  నిర్లిప్తంగా. 

 Previous Page Next Page