Previous Page Next Page 
ఋషి పేజి 32


    మరొక్కక్షణం  అక్కడ నిలబడలేదు, ఇంటిలోకి పరుగెత్తుకుని వచ్చింది. తెరలు తెరలుగా వచ్చే దుఃఖన్నీ ఇక ఆపుకో లేకపోయింది. టేబిల్ ముందు  కూర్చొని, చేతుల్లో మొహం దాచుకొని  వెక్కి వెక్కి ఏడవసాగింది.

    ఆమె చేతుల్లోంచి జారిన ఆమె మొదటి ప్రేమలేఖ మురిక్కాలవలో పది ఎక్కడికో కొట్టుకుపోయింది.

                                                             18

    "నిజమా?"  అంది నమ్మలేనట్టు  సిత. సుబ్బులు విషాదంగా నవ్వి అవునన్నట్టు తలూపింది. ఆ అమ్మాయితో ప్రస్తుతం స్ధబ్దత గూడు కట్టుకొని వుంది. ఇది ట్రాన్సిమిషన్  ఇక్కడ్నుంచి రెండుదార్లు ఒకటి__ అనుభవాల్ని తేలిగ్గా తీసుకొని బ్రతకటం. రెండోది__ ఈ భయంతో మిగిలిన జీవితాన్ని నిజాయితిగా  బ్రతకటం. మధ్య తరగతి అమ్మాయిలో మొదటిరకం వాళ్ళు చాలా తక్కువ. భావిష్యత్తుపట్ల  భయంవల్ల వాళ్ళు రెండోదానినే ఎన్నుకొంటారు. స్త్రి కావాల్సిన నీడకోసం  చాలా అందంగా  చేసుకొనే ఆత్మవంచన  ఇది. ఈ రెండిటికి  అతీతంగా  ఇంకో  దారి వుంది__ ఇది చాలా కొద్దిమందికే వర్తిస్తుంది. ఈ ఒక్క చిన్న అనుభవంతో వాళ్ళు  చాలా ఎదిగిపోయి  జీవితంపట్ల కొన్ని  నిర్ణయాలను, నిశ్చయాలనూ ఏర్పరచుకొంటారు. విరి మిగతా జీవితం అంతా  చాలా పవిత్రంగా గడుస్తుంది. దురదృష్టవశాత్తూ ఈ రకం  మనుష్యులు  చాలా తక్కువ. ఎందుకంటే వ్యసనాలన్నిటిలోనూ భయంకరమ్తెన  వ్యసనం ద్రిల్ . దానికి ఒకసారి అలవాటు పడ్డ తరువాత ఆ అలవాటు నుంచి  తప్పించుకోవటం కష్టం. అసలు సిగరెట్ తాగనివాడికన్నా, ఒకసారి తాగి మానేసినవాడు గొప్పవాడు.

    సుబ్బుల్లో  యిప్పుడు  ఏదో కనబడుతూంది. ఆ కన్నుల్లో  యేదో నిర్మలత్వం. రాత్రంతా పడ్డ మంచులో ప్రక్షాలితమ్తెన మల్లెలా- ఆమె  సహజ స్వభావము, ఆమె కివ్వబడిన శిక్షణ. ఆమెకున్న విద్య బుద్దులు- తల్లిదండ్రుల  సంసారపు స్ధాయి. వీటన్నిటిని డామినేట్  చేసిన ఒక్క అనుభవం__ అది ఎంత చిన్నద్తేతేనేం?___ దానివల్ల ఆమె ప్రక్షాలితం అయింది. ప్రపంచ భ్రాంతికాని, అసత్యంకాని కాదు. శూన్యం కాదు. దాని సత్యత్వము 'కేవలము' (బ్రహ్మము) కేవలము మాత్రమే  సృజింపబడనిది దివ్వ సత్యత్వమే!

    "....నువ్వేం బాధపడకు " అంది సిత ఓదారుస్తున్నట్టు.

    సుబ్బులు ఆమెవ్తెపు  ఆశ్చర్యంగా చూసి "నేనేం బాధపడటం లేదే_" అంది. ఈసారి ఆశ్చర్యపోవటం సిత వంతయింది. సుబ్బులు మొహంలోకి చూసింది. ఆమె మొహంలో ఏ భావమూ లేక నిర్వికారంగా వుంది.

    "ఇంకటు వెళ్ళకసలు" అంది సిత. సుబ్బులు ఒకక్షణం మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా  అంది__"రాఘవరావునీ పెళ్ళి చేసుకుంటానని నేను చెప్పేశాను ఇంట్లో."

    "ఏవిటి?"

    "అవును" అంది సుబ్బులు.

    "ఎందుకు?"

    ఎందుకో సుబ్బులుకే తెలిదు. మన జీవితాల్లో మనం కొన్ని నిర్ణయాలు ఎందుకు  తిసుకుంటామో, ఎలా ప్రవర్తిస్తామో మనకు  తెలియకుండానే జరిగిపోతూ వుంటాయి. తార్కికంగా ఆలోచించగలిగే సమయం , శక్తి ,ఓర్పు ఉండవు. తరువాత సమర్ధన 'ఎస్కేపిజం' ఈ ఎస్కేపిజంలోనే  మనిషికి ఆనందం గుర్తించ గలిగేవాడూ ఈ విషయంలో తన మనసులో సత్సంబదాంలు ఏర్పరచుకోలేక అనుక్షణం  ఘర్షణ పడుతూ  వుంటాడు. ఈ ఘర్షణవల్లే మనిషి పెరిగేది. అది వేరే సంగతి. ఆనందం  లేకపోయేక ఎదిగి లాభం  ఏమిటి? ఈ ప్రపంచంలో రచయితలూ, కవులూ, తాగుబోతులూ, ప్రేమికులూ, భావకులూ, జూదర్లూ_ వీళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఇదంతా చూస్తూంటే  అమాయకంగా జీవితాన్ని నమ్మేయతంలో ఉండే ఆనందం  యెందులోనూ  లేదనిపిస్తుంది. కాని ఇంత  చిన్నవిషయం తెలిసేసరికే మనిషి తన అమాయకపు  పరిధిలోంచి బ్తేటకు వచ్చేస్తాడు.

    "___సితా" పరంధామయ్య లోపల్నుంచి  పిల్చేడు. సిత లేచి "ఇప్పడే  వస్తాను" అంది.

    "వద్దు. నేను  వెళ్తాను....ఇది చెప్పటానికే  వచ్చాను" అంది  బయటకి అడుగు పెడుతూ. ఆమె మెట్లు  దిగుతూ ఉంటే  రాఘవరావు యెదురుపడ్డాడు. అతన్ని చూసి చప్పన  వెనక్కి అడుగు వేసింది ఆమె.

    అతను కూడా క్షణం పాటు తొట్రుపడ్డాడు. కాని వెంటనే  సర్దు కొని "ప్రకాశం  ఉన్నారేమోనని" అన్నాడు అస్పష్టంగా  సుబ్బులు మాట్లాడలేదు. రాఘవరావు  ఆమెవ్తెపు చూడటంలేదు. ఆమె మాత్రం  కంటికోణాల్లోంచి అతన్ని చూస్తూంది. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. తెల్లటి చొక్కా __ తెల్ల పెంటూ....చాలా  సామాన్యంగా ఉన్నాడాతను. మధ్యాహ్నం అవడంవల్ల  రోడ్డంతా  నిర్మానుష్యంగా ఉంది. దూరంగా ఎక్కడో కుక్క ఒకటి మొరుగుతూంది. అంతా నిశ్శబ్దం  ఆలోచన రేకెత్తించే నిశ్శబ్దం....ఏదో ఆకర్షణ ఆమెని  కట్టిపడేస్తూంది. అతనిలో  ఎవిలేదు. ముఖ్యంగా సుబ్బారావుతో పోల్చుకుంటే, కాని....ఏదో  బంధం - అతను తనవాడు అన్న భావం- ఆ భావంలో  ఏదో సంతృప్తి.... తరతరాలుగా స్త్రి నీ  సంతృప్తిపరిచే విష్యం -దేవుడు స్త్రీకి యిచ్చిన వరం!
    
    వెనుక చప్పడవటంతో ఉలిక్కిపది వెనక్కి తిరిగింది. వెనుక ప్రకాశం ఉన్నాడు. ఆమెకి సిగ్గు ఒక్కసారిగా  ముంచు కొచ్చింది. ఆమె పక్కకి తిరగ్గానే  ప్రకాశానికి అతను కనపడ్డాడు. ప్రకాశం ఒక్కసారి ఇద్దర్ని  పరికించి బిగ్గరగా నవ్వేడు. సుబ్బలు చేతుల్తో మొహం కప్పుకొని లోపలికి పరుగెత్తింది. సిగ్గుతో రాఘవరావు మొహం ఎర్రగా కందిపోయింది.

 Previous Page Next Page