ధర్మారావు మేజిస్ట్రేట్ కి ఫోన్ చేశాడు. "తెల్లవారు ఝ్మున నాలుగిమ్తికి __" అన్నాడు.
"నోట్ చేసుకున్నాను, వస్తాను" అన్నాడాయన.
ఫోన్ పెట్టేస్తూవాచీ చూసుకున్నాడు.తొమ్మిదిన్నరయింది. జైలంతా నిశ్శబ్దంగా వుంది. అతడికి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు.
బెల్ కొట్టాడు. యాదగిరి వచ్చాడు.
"వెన్నవుందా" అడిగాడు. య్ద్గిరి "వుంది సార్" అన్నాడు. నిజానికి రూల్ ప్రకారం వెన్న అవసరం లేదుకానీ, జైలు అధికారులు ఖైదీమీద జాలితో వెన్న వాడతారు.కేవలం జాలే.
ప్రతీ ఊరికీ ఒక కొత్త టాడు ఉపయోగిస్టారు. కాబట్టి అది మెడ చర్మానికి ఒరుసుకోకుండా వెన్న రాయటం ఆనవాయితీ.
ధర్మారావు కుర్చీలోంచి లేచాడు. ఇకవుమ్ది చేసేదేమీలేదు. డ్రాయరు తాళం వేసి గది బైటకొచ్చాడు. చిరంజీవి సెల్ వైపు వెళ్దామా అనుకుని, మళ్ళీ మనసు మార్చుకుని, ఇంటివైపు నడక సాగించాడు.
* * * *
"ఏవోయ్ శర్మా__ ప్రెసిడెంట్ వూళ్ళో వున్నాడా" చిరంజీవి తలుపు ఊచలు పట్టుకుని అనుమనంగా అడిగాడు.
"లేడుసార్. బొంబాయి వెళ్ళాడు ఈ సాయంత్రమే" అన్నాడు విష్ణుశర్మ.
చిరంజీవి కెవ్వున అరిచినంత పనిచేసి, "ఏమిటీ" అన్నాడు.
"అవున్సార్, యూనియన్ మీటింగ్ వుందిగా."
"ఏ ప్రెసిడెంట్ గురించి నువ్వు చెప్పేది?" అనుమానంగా అడిగాడు.
"మాయూనియన్ ప్రెసిడెంట్ గురించి."
"ఓహ్ __ అతడు కాదు. మన ఇండియా ప్రసిడెంట్ గురించినేనడుగుతూంది."
"తెలీదు సార్__ నేను పేపరు చదవను."
అయిదు నిముషాలు హడిలో ఇటూ, అటూ పచార్లు చేశాడు చిరంజీవి. మళ్ళీ తలుపు దగ్గరకొచ్చిపిలిచాడు. శర్మా, నాకో చిన్న సాయం చేసిపెట్టాలి."
"ఏమిటి సార్."
"నేనో ఫోన్ నెంబర్ యిస్తాను. ఫోన్ చేసి సర్వోత్తమారావుగారు వున్నారో లేదో కనుక్కో....."
"నే నిక్కణ్ణుంచి కదలకూడదు.కానీ నా ప్రెండ్ ఒకున్నాడు యాదగిరి అని. ఆటగాడిని కనుక్కోమంటాను" అని..... నెంబరు తీసుకొని, బైట తలుపు దగ్గరకి వెళ్ళి __ ఎవర్నో పిలిచాడు.
చూస్తున్న చిరంజీవి కళ్ళు ఎందుకో చెమర్చాయి. అతడు చేస్తున్నది పెద్ద సాయంకాదు కానీ ఒకసేమ్త్రీ__ ఒక ఖైదీకి అలా చెయ్యటం__అల గౌరవిమ్చడం__ సార్ అని పిలవడం__ పోలీసులందర్నీ దుర్మార్గులుగా చిత్రీలరిస్తూ వుంటారు.అది ఏంట తప్పో అతడికి ఆక్షణం తెలిసింది.
అతడు ఆలోచనల్లో వుండగానే శర్మ వచ్చి "___అయన ఇంటికి రాలేదట. సాయంత్రమే వెళ్ళారట" అన్నాడు.
"___మరేం చేస్తున్నాడు ఇంతసేపు?" అనుకున్నాడు చేరంజీవి. రేమ్డునిముశాలు ఆలోచించి, శర్మా నా కింకో సాయం చేసి పెట్టాలోయ్" అన్నాడు.
"ఏమిటి సార్."
"ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ కి ఫోన్ చెయ్యాలి."
శర్మ ఉలిక్కిపడి అర్ధంకానట్టు "ఏమిటి" అన్నాడు.
"అక్కడకి ఫోన్ చేసి సర్వోత్తమారవుగారువచ్చారో లేదో కనుక్కోవాలి. వస్తే ఇంకా అక్కడే వున్నారేమో కూడా తెలుసుకోవాలి."
"ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను మాట్లాడటమో__ భలేవారే! నాకు మా సూపర్నెండే౦ట్ గారితో మాట్లాదళంతేనే కళ్ళు వణుకుతాయి."
"అబ్బా ప్రెసిడెంట్ తో కాదోయ్ .... వాళ్ళ పియ్యేలూ, పెర్సనల్ అసిస్టెంట్ వుంటారు. ఎవర్నడిగినా చెప్తారు. బాబ్బాబూ__ ప్లీజ్..."
"బాబోయ్ నాకు భయం సార్."
తలుపు వూచల్లోంచితలని వీలైనంత బైటకి వంచి, ద్వారంవైపు చూడసాగాడు. చిరంజీవి. దూరంనుంచి శర్మ వస్తూంటే అతడి గుండె వాడివాడిగా కొట్టుకోవటం ప్రారంభించింది.
శర్మ దగ్గర కొచ్చి "ప్రెసిడెంట్ లేరట సార్. ఆరింటికే ఏదో సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్ళిపోయారట. అది అయిన తర్వాత తిమ్మిందింటికివిందు కూడా వుండట..." అన్నాడు. "సర్వోత్తమరావు అనే పెరుగాలాయన అసలు రానేలేదుట. అప్పాయింట్ మెంట్ కాన్సిల్ అయిపొయిందట."
ఊచల్ని పట్టుకుని నిలబడ్డ చిరంజీవి, అలాగే క్రిందకి జారి పోయాడు.కళ్ళముండుచీకట్లు కమ్మినట్లయింది. మోకాళ్ళమీద కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. శరీరం సన్నగా కంపిస్తూంది.
సెంట్రీ బూట్ల శబ్దం దూరంగా వినిపిస్తూంది..... దగ్గర వుతూంది...... మళ్ళీ దూరంగా వెళ్తూంది.
బైట చంద్రుడ్నితిరిగి మబ్బు మూసెయ్యటంతో చీకటి కాటుకలా పేరుకుంది. ఇంకో తుఫాను తాకిడికి సూచనగా వాతావరణం స్తబ్ధంగా వుంది.
జైలు గంటలు పడకొండుసార్లు మ్రోగినాయ్.
చిరంజీవిలో చలనం లేదు.
పదకొండుపావయింది.... పదకొండున్నర... పావుతక్కువ పన్నెండు..... పన్నెండు పన్నెండు బైట చీకటి లోపల చీకటి కళ్ళు మూసుకుంటే చీకటి __ తెరిచినా చీకటే.....
ప్రాణాలు పోవటానికి ఇంకా సరీగ్గా నాలుగున్నార గంటలు.... ఈ ప్రపంచంలో ఎవరూ దాన్ని ఆపుచెయ్యలేరు... అవునన్నట్టూ ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ పన్నెండు సార్లు గంటలు వినిపించాయి. అవి ప్రతిధ్వనించి__జైలు అవరానని కంపింపజేశాయి.