Previous Page Next Page 
అభిలాష  పేజి 33

    ఉరి కంబంమీద మునగదీసుకుని కూర్చున్న చిన్న పక్షి పైనుంచి వర్షపు చుక్క ఒకటి మీద పడటంతో రెక్కలు టపటపా కొట్టుకుంటూ అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.
   
                                                                    2
   
    అడుగుల చప్పుడు దగ్గరగా వచ్చి ఆగటంతో____ మోకల్లా మీద తల పెట్టుకుని కూర్చొన్న చిరంజీవి తలెత్తాడు,ఎదురుగా శర్మ!
   
    "పన్నెండుయిపోయింది సార్, ద్తూటీ దిగిపోతున్నాను....." శర్మ అన్నాడు. అతడి మాటల్లో __ఇదే సార్ మిమ్మల్ని ఆఖరిగా చూడటం అన్నభవం వున్నది. చిరంజీవి ఏదో అనబోయాడు. గొంతులో ఏదో అడ్డుపడి మాట రాలేదు.
   
    చిరంజీవి మౌనాన్ని శర్మ ఇంకోలా అర్ధం చేసుకున్నాడు. ".... నన్ను క్షమించండి  సార్" అన్నాడు. చిరంజీవి మోహంలో విస్మయం కనబడింది.
   
    "మీ మీద జోకులేశాను. మీరు తినే భోజనం ఆఖరిదన్నాను. మతి మాటికీ మీకు ఉరి గురించి జ్ఞాపకం చేసెను. ఏదో తెలిసీ తెలియక మిమ్మల్ని బాధపెడ్తే క్షమించండి."
   
    "పర్లేదోయ్" అనబోయేడు. ఈ మాటకూడా బైటకి రాలేదు. ఈ లోపులో శర్మ ఊచలగుండా చెయ్యి లోపలి పేట్టి "వెళ్ళొస్తాన్సార్" అన్నాడు. "నా జీవితంలో మీలాటి ధైర్యవంతుల్నీ, చావునికూడా నవ్వుతో పరిహసీంచగలిగే వాళ్ళాని చూడటం  యిదే మొదటిసారి ."
   
    చిరంజీవి ఏడవలేక నవ్వుతూ చెయ్యి అందించి, "నేనేం ధైర్యవంతుణ్ని కాదు. ఉరి తప్పదు అని తెలియగానే చూడు నా చెయ్యి ఎలా వణుకుతూందో"అన్నాడు.
   
    "లేదు __నిజంగా నేను బాధపడ్తున్నాను. భయపడ్తున్నాను."
   
    "నాకు తెలుసు గూరూగారూ ..... మీరు బాధపడేది ప్రాణం పోతూదనికాదు. మరోసారి మువ్వంకాయ కూర తినలేక పోతున్నానే అని" అన్నాడు. షేక్ హండ్ ఇవ్వడం పూర్తయింది. అంతలో శర్మ మోహం సీరియస్ అయింది. "ఈ రాత్రికి నాకు నిద్ర వుండడు సార్. మీ గురించే ఆలోచిస్తాను. మీరు వ్యక్తిగతంగా హంతకులై వుండోచ్చుగాక,  కానీ నాకు మాత్రం మంచివారే సార్_ మంచివారే!"
   
    చిరంజీవికి షాక్ తగిలినట్టయింది. ఈ విషయం తను ఆలోచించలేదు. తననెవరూ రక్షించలేరనీ, ఉరి తప్పదనీ అనుకున్నాడు. సర్వోత్తమారావుగారు ఏమయ్యారో తెలియలేకపోవడంతో మరణం ఖాయం అని భావించాడు. కానీ ఈ మరణంతో పాటూ తను ఒక నిండని కూడా తనతో తీసుకేళ్తున్నాడు. సర్వోత్తమరావు ప్రపంచానికి అసలు నిజం చెప్పని పక్షంలో__ తన మరణంతో అసలు నిజం కప్పుబడిపోతుంది.లోకం దృష్టిలో తనెప్పటికీ హంతకుడిగా నిలబడిపోతాడు. అర్చనకూడా అలానే అనుకుంటుంది. కనీసం తను ఒక్కత్తీ అనుకోకపొతే అదే చాలు.
   
    తను "వ్యక్తిగతంగా " కూడా మంచివాడే అన్న విషయం ఈ లోకంలో ఒక్క అర్చన నమ్మితే అదేచాలు. తను హాయిగా ప్రాణాలు వదిలేస్తాడు.
   
    "నాకింకో చిన్న సాయం చేస్తావా? ఈసారి నిజంగా ఆఖరిది."
   
    "ఏమిటిసార్?"
   
    "సర్వోత్తమారవు గారని నా దగ్గరకి వస్తూవుండేవారు తెలుసా?"
   
    "లాయరుగారే.ఆయనింటికి వేళ్ళాలి....."
   
    "ఇంత రాత్రప్పుడా?"
   
    "అవును.ఇప్పుడే" అన్నాడు చేరంజీవి.క్షణం నిశ్శబ్దంగా వున్నాడు. తరువాత నెమ్మదిగా చెప్పాడు.
   
    "శర్మా, ఈ హత్య నేను చేయలేదు. నేను హంతకుడ్ని కాదు."
   
    కాళ్ళముందు ఒక్కసరిగా మెగాటన్నుబాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. శర్మ. అయోమయం, టెన్షన్, విస్మయం అన్నీ ఒక్కసరిగా అతడి మొహంలో చోటు చేసుకున్నాయి. కొంచెంసేపునోట మాటరాలేదు. తరువాత తడబద్తున్నా కంఠంతో  "ఏ ... ఏమిటి మీరు అంటున్నది" అన్నాడు.
   
    "అవును శర్మా. నేనీ హత్య చేయలేదు" అంటూ తనూ సర్వోత్తమరావూ వేసిన ప్లాన్ గురించీ, తమ ఆశయం గురించీ, వివరంగా చెప్పాడు. "సాయంత్రం నాలుగింటికల్లా అయన ప్రేసితెమ్ద్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించి నన్ను విడుదుల చెయ్యాలి. అదీ మేం అనుకొన్నది. కానీ అయన రాత్రి పదింటివరకూ ప్రెసిడెంట్ ని కలుసుకోలేదు. ఏమయ్యాడోతేలేదు. నన్నే శక్తి రక్షించలేదిక. కనీ నువ్వు చెయ్యవలసినసాయం ఒకటే. అయన మేనకోడలు తెలుసుకదా,అర్చన."
   
    శర్మ తలూపాడు.
   
    "ఈ విషయం అర్చనగారికి చెప్పు. కనీసం ఆమె అయినా నిర్దోషి నని నమ్మితేచాలు, ప్రశాంతంగా చచ్చిపోతాను. "ప్రశాంతంగా చచ్చిపోతానని మాటవరసకి అన్నాడేకానీ, అతడి వళ్ళు ఆ చలిలోకూడా చెమట పట్టింది. ఇంకో నలుగు అయిదు గంటల్లో జరగబోయే కర్మకాండ తల్చుకొంటూంటేవణుకు పుడుతూంది.
   
    "ఎలా _ ఎలా సార్ మిమ్మల్ని రక్షించటం?"
   
    చిరంజీవి విషాదంగా నవ్వేడు, "రక్షించటమా_ఇక ఆ విషయం మర్చిపో."
   
    శర్మ ఇంకా ఈ షాక్ నుంచి తేరుకోలేదు. కళ్ళు పెద్దవిచేసి ఇంకా చిరంజీవి మోహంలోకి చూడసాగేడు. చిరంజీవి అన్నాడు__ "నేనెలాగూ చావాబావువటం లేదన్న ధైర్యంతోనే జోకువేసెను. అల్లూరి సీతరామారాజు అన్నాను, మువ్వంకాయ కూర అన్నాను. శర్మా__ నన్ను నమ్ము,నేనీ హత్య చేయలేదు__"
   
    శర్మ నొచ్చుకుంటూ __ "నేను నమ్మకపోవటమా__ ఎంతమాట__   మిమ్మల్ని చూసినప్పుడే నేను మీరీ హత్య చేయలేదనిఅనుకున్నాను సార్" అన్నాడు.   

 Previous Page Next Page