Previous Page Next Page 
వేగు చుక్క పేజి 3


    "ఈ షిప్పు దాదాపు అయిదంతస్తులుగా ఉంటుందనుకోండి. రెండు అంతస్తులు నీళ్ళ అడుగున ఉంటే, మూడు అంతస్తులు నీళ్ళ పైన ఉంటాయన్నమాట ఉజ్జాయింపుగా! ఇది చూశారా? దీన్ని లంగరు అంటారు!"

    కేప్ స్టన్ అనే జెయింటు సైజు మేకులాంటి దానికి చుట్టుకుని ఉంది చాలా లావుగా కొండచిలువలా ఉన్న గొలుసు షిప్పులో ఉన్న ఒక రంధ్రం లాంటి దానిలో నుంచి బయటకు జరవిరచబడి ఉంది అది. దానికి కొసన ఏడెనిమిది టన్నుల బరువున్న లంగరు ఇసుకలో దిగబడి. షిప్పు కదిలిపోకుండా ఆపుతోంది.

    సెయిలర్స్ ఎవరి పనులు వారు చకచక చేసుకుపోతున్నారు, ఒక తను డెక్ ని సోప్ వాటరూ, బ్రష్ తో కడుగుతున్నాడు. మరొకతను పెద్ద ట్రేలో ఏవో పోసి శుభ్రం చేస్తున్నాడు.

    "ఫ్రాణ్స్  !" అన్నాడు బావా. "డిన్నర్ కోసం!"

    "ఫ్రాణ్స్  ట! అంటే తెలుగులో ప్రాణాలు అంటారనుకుంటాను" అంది అనూహ్య బుగ్గలో నాలుక పెట్టి, తన ఫ్రెండ్సు వైపు చూస్తూ.

    "నీ మొహంలే! వాటినే రొయ్యలంటారకు నాకు తెలుసు!" అంది శ్రీప్రియ.

    "కమాన్!" అంటూ చకచక చిన్న ఇనుప నిచ్చెన ఎక్కాడు బావా, ఆడపిల్లలందరూ అతని  వెనకే వెళ్ళారు.

    "దీన్ని బిడ్జి అంటారు. ఇదే నేవిగేషన్ రూం! చూడండి!"

    మూసివున్న అద్దాల తలుపులలోనుంచి కుతూహలంగా తొంగి చూశారు అందరూ.

    "అదిగో! ఆ సీటుకి ఎదురుగా ఉన్న కిటికీ చూశారా? దానికి అమర్చినవి చాలా స్పెషల్ అద్దం! దానిలోంచి చూస్తే పధ్నాలుగు పదిహేను కిలోమీటర్ల దాకా చాలా స్పష్టంగా కనబడుతుంది."

    "రియల్లీ?" అంది ఎలిజబెత్ ఆశ్చర్యంగా.

    తర్వాత షిప్పు తాలూకు దిక్సూచినీ, రాడార్ నీ చూపించాడు అతను.

    ఆ బ్రిడ్జి అనేది అయిదంతస్తుల ఇంటిమీద కట్టిన డాబాలా ఉంది. రెయిలింగ్సు దగ్గరికి వచ్చి నిలబడితే షిప్పుకి ఒక వైసంతా అగాధంలా కనబడుతోంది.

    "షిప్పులో లోడ్ చేసిన సరుకు అంతా దాన్లో ఉంచుతారు. ఇది కార్గోషిప్పు. కేవలం సరుకుల రవాణాకి మాత్రమే! నలబై వేల టన్నుల కార్గోని మోసుకెళ్ళగలదు ఇది!" అని చెప్పి, "కమాన్ లేడీస్! కింది కెళదాం!" అన్నాడు బావా.

    "ఒక్క క్షణం!" అంటూ అనూహ్య అక్కడే ఆగిపోయింది. థ్రిల్లింగ్ గా వున్న ఆ దృశ్యం మీద నుంచి కళ్ళు తిప్పుకోవడం తనకి సాధ్యం కావడంలేదు.

    "ఈ షిప్పు ఎంత స్పీడుగా వెళుతుంది?" అంది తనని తనే ప్రశ్నించుకున్నట్లు.

    "గంటకి పదహారు నాట్స్!" అంది, చాలా మాన్లీగా వున్న ఒక కొత్త గొంతు.

    నెమ్మదిగా తల తిప్పి చూసింది అనూహ్య. అతను సెయిలర్ బావా కాదు, ఇంకెవరో.

    చిరునవ్వుతో తల పింకించి, "నాట్స్ అంటే?" అంది ఇంగ్లీషులో.

    "నాటికల్ మైల్స్! సముద్రంలో దూరాన్ని నాటికల్ మైల్స్ లో కొలుస్తారు."

    "ఐసీ!" అంది అనూహ్య. అప్పుడు గమనించింది అతను స్వచ్చమైన తెలుగులోనే మాట్లాడుతున్నాడు.

    ఆశ్చర్యంగా అడిగింది. "మీరు తెలుగు స్వచ్చంగా మాట్లాడుతున్నారే?"

    అతను చిన్నగా నవ్వాడు. "ఎందుకు మాట్లాడను? చాలా స్వచ్చమైన తెలుగువాడినే నేను."

    "నేను మిమ్మల్ని చూడగానే ఆ బావాలాగా పంజాబీ అయివుంటారనుకున్నాను."

    "ఎందుకని?"

    సమాధానం చెప్పకుండా అతనివైపు చూసింది. అతనిలాగా అంత మేలిమి బంగారు చాయ వుండేవాళ్ళు తెలుగువాళ్ళలో చాలా తక్కువ మంది వుంటారు. బిగువుగా వున్న అతని చెంపలూ, గెడ్డం, నున్నగా షేవ్ చేసుకోవడంవల్ల ఆకుపచ్చ నీడలు తేలుతున్నాయి. లేత గులాబి రంగులో ఉన్నాయి అతని పెదిమలు. ఆ పెదమల మీద తుమ్మెద రెక్కల్లాంటి నల్లటి మీసం, బలంగా వున్న చేతుల మీద గుబురు వెంట్రుకలు. అతను సెంటు పూసుకోలేదు. కాని అతని దగ్గర ఫ్రెష్ గా ఏదో సువాసన.

    అతన్ని తను తదేకంగా చూస్తోందని గుర్తొచ్చి చటుక్కున చూపులు పక్కకి తిప్పుకుంది.

    "మీరేం చేసుంటారు ఇక్కడ?" అంది.

    "అడ్మిస్టేషన్ సైడ్" అని చెప్పాడతను ముక్తసరిగా.

    "అంటే?"

    "కరెస్పాండెన్స్ చూసుకుంటూ, లెటర్స్ రాయడం, జవాబులు ఇవ్వడం, డబ్బు డిస్బర్ చెయ్యడం, నేవిగేషను." అని ఆగి, సింపుల్ గా చెప్పాలంటే, నేను ఈ షిప్పుకి కెప్టన్ ని" అన్నాడతను.

    చెప్పలేనంత ఎక్సయిట్ మెంట్ ఫీలయింది అనూహ్య. ఇతనేనా ఈ షిప్పుకి  కేప్టన్! ఇతనేనా ఈ షిప్పుని సముద్రాల మీదికి సాహసంగా తీసుకువెళ్ళేది!

    అదంత గొప్ప సంగతేమీ కాదన్నట్లు ఎంత కూల్ గా చెప్పాడో!

    చాలా థ్రిల్లింగ్ గా వుంది?" అంది సిన్సియర్ గా.

    "ఏమిటి?"

    "ఒక కేప్టన్ ని కలుసుకోగలగడం!"

    "ఇందులో థ్రిల్లేముంది?" అని చిన్నగా నవ్వాడతను. "ఈ రోజుల్లో షిప్పుకి కేప్టన్ అంటే చాలా రొటీన్ జాబ్. అడ్వెంచరు కాదు. కొత్తగా  తయారవుతున్న షిప్పులన్నీ పూర్తిగా కంప్యూటరయిజ్జు. పుల్లీ ఆటోమాటిక్. నా ఆఫీసర్లూ, ఇంజనీర్లూ మిగతా క్రూ అంతా కలిసి షిప్పుని నడిపించేస్తూ వుంటారు. నేను ఊరికే ఆలంకారప్రాయం!"

    బొత్తిగా గర్వంలేని అతని మాటలు ఆమెకి నచ్చాయి.

    "ఈ స్టీమరులో ఎంతమంది క్రూ వుంటారు మొత్తం?" అంది కుతూహలంగా.

    "అయిదుగురు ఆఫీసర్లూ, అయిదుగురు ఇంజనీర్లు సరంగు, ముగ్గురు స్టివార్డ్ లు, వంటవాళ్ళు....." అని తడుముకోకుండా లిస్టులా చదివేసి, "మొత్తం నలభై అయిదుమంది" అని  కొద్దిక్షణాలు ఆగాడు అతను. "స్టీమరు అంటున్నారు మీరు, కానీ ఇది స్టీమరుకాదు. స్టీమరు అంటే ఆవిరి శక్తితో నడిచేది.

    "మొదట్లో నౌకలు తెరచాపల సాయంతో గాలి పోసుకుని నడిచేవి. తర్వాత ఆవిరి శక్తితో నడిచే స్టీమర్లు వచ్చాయి. ఇప్పుడన్నీ ఆయిల్ తో నడిచే షిప్పులే!"

    "అంతంత పెద్ద పిప్పులని అన్నేసి వేల మైళ్ళు నడిపించే శక్తి ఉంటుందా గాలికి?" అందామె ఆ పాతకాలపు నౌకలని ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ.

    దానికి సమాధానం అతను చెప్పేలోపలే గాలే చెప్పింది.

    తన శక్తిని ఆమె శంకించినందుకు కోపించినట్లు , ఒక్కసారిగా సుడిగాలి లేచింది.

    వెంటనే బుట్టలా పైకి లేచిపోయింది ఆమె స్కర్టు.

    పొడుగ్గా బంగారురంగులో బలంగా వున్నాయి ఆమె కాళ్ళు. ఆ పైన తెల్లటి పాంటీస్. సున్నితమైన వలలాంటి మెటీరియల్ తో చేసి వుంది ఆ పాంటీస్. దాని అంచులకి డెలికేట్ గా వున్న లేసుకుట్టి వుంది.

    ఇంకా పైన లేత అరిటాకులా ఉన్న పొట్ట లోత్తెన నాభి.

    కంగారు పడిపోతూ, స్కర్టుని కిందికి లాక్కోబోయింది. ఆమెతో పంతం పట్టినట్లు దాన్ని ఇంకా పైపైకి తోసేస్తోంది గాలి.

    ఇంకేం చెయ్యడానికీ తోచక, చుతుక్కున వున్నచోటే కూర్చుండి పోయింది.

    అర్థనగ్నంగా కనబడుతున్న అందాలని ఆబగా చూడలేదు కెప్టెన్. ఆమె ఇబ్బందిని అసలు తను గమనించనట్లే, పక్కకి తిరిగి, నేవిగేషన్ రూంలోకి నడిచేడు.

    అతను లోపలికి వెళ్ళిపోగానే లేచి నిలబడింది అనూహ్య. ఎర్రగా కందిపోయిన మొహంతో చకచక మెట్లు దిగేసి, కిందికి వచ్చేసి ఫ్రెండ్సుని చేరుకుంది.

    "ఇదే ఇంజన్ రూమ్!" అని పాతాళలోకంలో కనబడుతున్న ఆ రూముని బయటనుంచే చూపించి, "గేలీ" అనబడే  కిచెన్ వైపు తీసుకెళ్ళాడు సెయిలర్ బావా.

    వీళ్ళు షిప్ లోకి రావడం చూసిన హెడ్ కుక్ ఇబూకా అప్పటికే హాట్ హాట్ గా కాఫీ కలిపి ఉంచాడు జపనీయుడు అతను.

    వద్దు వద్దని మొహమాట పడుతున్నా, కాఫీ తాగక తప్పలేదు వాళ్ళకి.

    "మీరు కావాలనుకుంటే మా కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ కూడా చూడవచ్చు" అన్నాడు ఇబూకా ఉత్సాహంగా.

    షిప్పులో ఉన్న వాళ్ళందరూ కూడా సాటి మనుషులతో మాట్లాడడం కోసం తపించిపోతున్నట్లు కనబడుతున్నారు. నెలల తరబడి ఎవరితోనూ సంబంధం లేకుండా సముద్ర మధ్యంలో బతకవలసివస్తే ఎవరైనా అలాగే ఫీలవుతారేమో!

    బలహీనంగా అభ్యంతరం పెట్టబోయాడు బావా.

    "వద్దు యార్ టైమయిపోతోంది!" అన్నాడు.

    "రెండు నిమిషాలే!" అంటూ గబగబ తాళాలు తీసుకుని బయలు దేరాడు ఇబూకా. "కొంచెం గుండే ధైర్యం ఉన్న వాళ్ళే నాతో రావాలి! హర్రర్ పిక్చర్లో సీన్లా ఉంటుంది మా కోల్డ్ స్టోరేజ్ !" అన్నాడు నవ్వుతూ.

    ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు చూసి, అందరికంటే ముందు తనే కదిలింది అనూహ్య, దైర్యం చాలా ఎక్కువ ఆ అమ్మాయికి.

    వాళ్ళతో బాటు ఇంకో ముగ్గురు అమ్మాయిలు మాత్రమె కదిలారు మిగతావాళ్ళు బావాతోపాటు కిచెన్ దగ్గరే నిలబడిపోయారు.

    మెట్లు దిగి, కోల్డ్ స్టోరేజ్ రూమ్ తాళం తీశాడు హెడ్ కుక్.

    వెంటనే చల్లటిగాలి సోకింది అదోరకమైన వెగటు వాసన వచ్చింది.

    సంకోచంగా దాన్లోకి నడిచారు అరల్లో ఎన్నో రకాల పళ్ళూ, కూరగాయలూ పేర్చి ఉన్నాయి.

    లోపల మరో గది ఉంది. దానిలోపల మరో గది, అలానాలుగయిదు చిన్న చిన్న గదులు ఉన్నాయి తేనె తుట్టిలా.

    రెండో గది తలుపు తెరిచాడు హెడ్ కుక్ ఇబూకా.

    వెంటనే, తోలు పలచబడి ఎర్రగా బోలుగాఉన్న జంతువు కళేబరం ఒకటి ఒక అమ్మాయి మీద పడింది.

    భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసి "అమ్మా!" అంది ఆ అమ్మాయి కానీ గొంతు కీచుబోయి, అది "మే!" అన్నట్లు వినబడింది.

    "బతికున్నప్పుడు అది అట్లాగే అరిచేది" అన్నాడు హెడ్ కుక్ నవ్వుతూ. "అది మేక! చచ్చిపోయింది! భయపడకండి!"

    మేకల కళేబరాలు ఎన్నో అరల్లో వరసగా హుక్స్ కి తల క్రిందులుగా తగిలించి ఉన్నాయి.

    "రండి!" అని ఇంకా లోపలికి నడిచాడు ఇబూకా.

    ఆ గదిలో మేకల తలకాయలు పేర్చి ఉన్నాయి. నేలమీదంతా చేపలు.

    అనూహ్య తప్ప మిగిలిన అమ్మాయిలందరూ అక్కడే ఆగిపోయారు.

    "ఇది డీప్ ఫ్రీజ్ రూం! అన్నింటికంటే మరీ చల్లగా ఉంటుంది" అన్నాడు ఇబూకా.

    ఈకలు పీకివేయబడ్డ కోళ్ళు చాలా ఉన్నాయి అక్కడ. వాటిని డ్రెస్స్ డ్ చికెన్ అంటారని తెలుసు అనూహ్యకి.

    'ఈకలు పీకేసి, నగ్నంగా అయిపోయిన కోడిని డ్రెస్స్ డ్ చికెన్ అనడమేమిటి పాపం' అనిపించింది.

 Previous Page Next Page