Previous Page Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 24

    సమాధానం అలా చెప్పకూడదు. తండ్రి మరణించాడా ,  కొడుకు మరణించాడా? కచ్చితంగా చెప్పాలి!" నవ్వుని  ఆపుకుంటూ అడిగింది ఆమె.

    "వయసులో తండ్రి పెద్దవాడు కాబట్టి తండ్రే చ్చ్చుంతాడు!"

    "తప్ప!!"

    "అ...అయితే కొడుకు చచ్చుంటాడు.  మొత్తానికి నేను చెప్పినట్లు ఎవరో ఒకరు చచ్చారుకదా?...ఏవండి... మరి నేనాన్సరు కరెక్ట్ గా చెప్పానుగా... మరి మీ పేరు చెప్పరూ?" ఆశగా అడిగాడు కన్నారావు.

    "మీరు ఆన్సరేమి కరెక్టుగా చెప్పలేదు....అసలు తండ్రి కొడుకుల్లో ఎవరూ మరణించలేదు....." ఆమె నవ్వింది.

    "మీరు నన్ను వెర్రివాడి క్రింద జమకడ్తున్నారు!" బుంగమూతి పెట్టాడు కన్నారావు.

    "అదేం కాదు! నిజంగానే మీరు తప్ప చెప్పారు.  తండ్రులు ఇద్దరూ, కొడుకులు ఇద్దరూ ఉన్నా ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురే! ఎలాగంటే  ఆ ఇంట్లో ఉన్నది ఒక అబ్బాయి, వాడి తండ్రి, ఆ తండ్రికి తండ్రి. అంటే మనుమడు, తండ్రి, తాత అన్నమాట."

    "ఆ!" నోరు తెరిచాడు కన్నారావు.

    "ఏయ్ ఆటో!"

    ఆ వ్తెపుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కేసింది ఆ అమ్మాయి.  ఆటో తుర్రుమని ముందుకు పరుగుతిసింది.

    కన్నారావు నిస్పృహగా ఆటో వెళ్ళిన దిక్కుకే చూస్తూ నిల్చుండిపోయాడు. అలా ఎంతసేపు నిలబడిపోయాడో ఏంటోగాని "ఒరేయ్  సన్నాసి!...."  అంటూ గట్టిగా వినబడడంతో పక్కకి తిరిగి చూశాడు" కన్నారావు.

    చిట్టబ్బాయి  రిక్షా ఓ పక్కగా ఆపి ఉన్నాడు. ఆ రిక్షా లో  ముద్దుగా కూర్చుని పండుగాడు!

    చిట్టబ్బాయిని  చూస్తూనే  కెవ్వుమని అరిచాడు కన్నారావు.

    "ఎంటా పిచ్చికేకలు?..." విసుగ్గా చూస్తూఅన్నాచిట్టబ్బాయి."ఇందాకట్నుంది పిలుస్తున్నా... ఏ లోకంలో ఉన్నావ్?"

    కన్నరావ్ చిట్టబ్బాయి దగ్గరికి వేగంగా వచ్చి చెవిలో తిట్టాడు. "నీ మారువేషం తగలేట్టా?... నీ మిసాలేమ్తేనాయి?"

    చిట్టబ్బాయి మూతిమీద తడుముకుని కంగారుపడ్డాడు.

    "అరె ...ఏ ఇప్పటిదాకా ఉండాలే...  ఏమ్తెంది?!"

    "ఎక్కడో పడిపోయి ఉంటుంది.  ఇలా విడ్ని తిసుకెళ్తే అందరు నిన్ను గుర్తుపడ్తారు... ఆఖరికి  ఈ పండుగాడు కూడా..." మళ్ళి చెవిలో తిట్టాడు.

    "నేను ఇటు తిరిగి  రిక్షా తోక్కుతున్నాగా... పండుగాడికి నా విపే తప్ప నామొహం కనబడదు... నువ్విక్కడే వుండు.  నా మీసం ఇక్కడే ఎక్కడో పడిపోయి వుంటుంది" అంటూ రిక్షా దిగి వెనక్కి వచ్చిన దారినే ముందుకు వంగి  నడుస్తూ మీసాలు కనబడ్తాయేమోనని  నేలమీదకి  చూస్తూ నడుస్తున్నాడు. మధ్య మధ్య  కాలనివాళ్ళు.  తనకి పరిచయం ఉన్నవాళ్లు కనిపిస్తే ప్తె గుడ్డతో మొహం కప్పకుంటూ నడుస్తున్నాడు.  అప్పడే ఒక పిల్లవాడు చిట్టబ్బాయికి  ఎదురోచ్చాడు.

    వాడికి పెద్ద పెద్ద మీసాలు!!

    "హమ్మదోంగా... అయితే మీసాలు నీకు దొరికాయన్నమాట! వాటిని పెట్టుకుని దర్జాగా నడుస్తున్నావా?"  అన్నాడు చిట్టబ్బాయి.

    చటుక్కున వాడిని పట్టుకుని "ఏరా?....ఈ మీసాలు నికేక్కడివి?"  అని అడిగాడు.

    "నావే!' అన్నాడు వాడు.

    "ఆ నివే నివే! చాల్చాల్లే ఇలాతే.." మీసాలు పట్టి లాగాడు చిట్టబ్బాయి. అవి గట్టిగా అతుక్కుని ఉన్నాయి.

    "హొరి వెధవాయి...దేంతో అతికించుకున్నావ్ ఇంత గట్టిగా ఆ?? ఈసారి కాస్త గట్టిగా లాగాడు.

    "బాబోయ్ నొప్పి! ఏందయ్యా నా మీసాలు పట్టుకుని అట్లా లాగుతావ్? నీకు బుడ్డుందా?" కోపంగా అరిచాడు వాడు. గొంతు కాస్త బొంగురుగా ఉండడంతో  చిట్టబ్బాయికి అనుమానం వచ్చింది.  పరీక్షగా వాడి మీసాల వంక చూసాడు. అవి పెట్టుడు మీసాలు కావు నిజమ్తెన మిసాలే!

    అంటే వాడు తను అనుకున్నట్లు చిన్నపిల్లవాడు కాదన్నమాట! వాడొక మరుగుజ్జు!!

    చిట్టబ్బాయి చాలా కంగారుపడిపోయి చెంపలు వేసుకుని అతనికి క్షమాపణలు చెప్పుకుని తడబడే అడుగులతో ముందుకు వెళ్ళాడు.

    నాలుగు అడుగులు వేసిన తరువాత అతనికి రోడ్డు మీద తన మీసాలు దుమ్ము కొట్టుకునిపోయి కనిపించాయి.  వాటిని అందుకుని దుమ్ము దులిపి పెదాలమీద అంటించుకుని వెనక్కి తిరిగి పరుగులాంటి నడకతో రిక్షాని సమీపించాడు.

    "ఇంతసేపూ ఎక్కడ తగలబడ్డావురా...నాకసలే స్కూలుకి టైమ్తెపోతే... స్కూలుకి లేటవని నీపని ప్రిన్సిపాల్ తో చెప్తా... ఆయన ని కాళ్లు విరక్కోడతారు....ఇంటికెళ్ళాక  మా నాన్నకి చెప్తే ఆయన ని చేతులు విరక్కోడతారు..." కోపంగా అన్నాడు పండు.

    చిట్టాబ్బాయికి ఒళ్ళు భగ్గున మండింది. కోపంగా పండువంక చూశాడు. వాడికి ఒక్క జిల్లకాయి కొట్టాలనిపించింది చిట్టబ్బాయికి.

    కన్నారావు చిట్టబ్బాయిని కళ్ళతోనే వారించి రిక్షా ఎక్కి పండు పక్కన కూర్చున్నాడు.

    "ఏంటి?.... ఇప్పుడు నిన్ను కూడా ఎక్కించుకుని నేను తిక్కలా?....  నేనేమ్తెనా ప్రొఫెషనల్ రిక్షా పుల్లర్ ని అనుకుంటున్నావా ఇంతింత బరువులు లాగడానికి?" ఇంకా  మండిపడ్తూ అన్నాడు చిట్టబ్బాయి.

    "అయితే నన్ను నడుచుకుని రమ్మంటావా?....వీల్లేదు"  అన్నాడు కన్నారావు.

    "అలా అంటే ఎలా?...అంత దూరం నేనొక్కడినే ఎలా తొక్కుతాను?.... నువ్వు కొంతదూరం తోకకు నేను కొంత దూరం తొక్కుతాను ... సరేనా?"

    కన్నారావు అందుకు ఒప్పుకున్నాడు.

    "ఇంకా నయం...కాస్త దూరం నన్ను కూడా తోక్కమంలేదు.ఇంక పదండి....నాకు స్కూలుకి టైమ్తెపోయింది..." విసుక్కున్నాడు పండు.

    కొన్ని కూరలు ప్లాసిక్ బుట్టలో వేసుకుని కూరగాయల కొట్టువాడికి డబ్బు లిచ్చి వెనక్కి తిరిగిన చిన్నమ్మాయి ఆశ్చర్యపోయింది.

    రామయ్య!...

    జ్వరం వచ్చిందని ఇంటికి కబురు పెట్టినవాడు ఇక్కడ రిక్షా తొక్కుతున్నా డేం?


    రామయ్య నోట్లో బిడి పెట్టుకుని తీరుబడిగా ఖాళి రిక్షా తొక్కుకుంటూ ఆవ్తేపు వస్తున్నాడు.

    "రామయ్య?...."

    చిన్నమ్మాయి గట్టిగా పిల్చింది.

    రజని పిలుపు విన్న రామయ్య రిక్షాని ఆమె దగ్గెరికి తీసుకొని ఆపాడు. "నమస్కారమండి చిన్నమ్మాయిగోరూ... పండు బాబుకి ఎట్టాగుందండి?" అని అడిగాడు.

    "వాడికి ఎట్టాగుండడమేంటి ని మొహం" మొహం చిట్లిస్తూ అడిగింది చిన్నమ్మాయి.

    "అది కాదమ్మాయి గోరూ... మీ తమ్ముడి గొరికి జొరం కదండి? ఆర్ని ఇందాక డాట్టార్ కాడికి తిస్కెళ్ళారుకదండి?"

    చిన్నమ్మాయి ఆశ్చర్యపోయింది.

    "వాడికి జ్వరమని నికెవరు చెప్పారు?"

    "అయ్ బాబోయ్... అట్లాగంటారేంటండి? ఇందాక మీ ఇంటికొత్తే మీ మేనమామగారు  అట్టా  చెప్పి పండు ఈయాల స్కూలుకి రాడని బయట్నుంచే పంపించేసినారండి..."ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు రామయ్య.

    చిన్నమ్మాయ్ మనసు కిడుని శంకించింది.

    "మా ఇంట్లో మేనమామలేవరూ లేరే!  అయినా నికే జ్వరంగా ఉందని...నువ్వు రాలేవని ని బదులు తనని పంపించినట్లు మీ తమ్ముడు చెప్పాడే! వాడే మా పండుని ఈ వేళ  స్కూలుకి తిసుకెళ్ళాడు"

 Previous Page Next Page