ఆ మాటలు వింటూనే రామయ్య గుండెలు బాదుకున్నాడు "అయ్ బాబో... నాకు జోరవేంటమ్మా... రాయిలా గుంటేనూ?... నాకు అన్నయ్యలేగాని తమ్ముళ్ళేవరూ లేరు...నేనెవర్ని పంపలేదు చిన్నమ్మాయ్ గోరూ...."
చిన్నమ్మాయి గుండెలు ఝల్లుమన్నయి.
అంటే...అంటే తమ్ముడిని ఎవరో తీసుకెళ్ళి పోయారన్నమాట!
"పండూ!..." ఆవేదనతో అరిచింది చిన్నమ్మాయి.
ఆమె చేతిలోని కూరగాయల బుట్ట జారి క్రిందపడింది.
* * *
అప్పటికి మూడు గంటల నుండి వాళ్ళు జూబిలీహిల్స్ లో సగం కాన్స్ ట్రాక్షన్ జరిగి ఆగిపోయిన ఆ ఇంట్లో వున్నారు. అప్పటికే చిట్టబ్బాయ్ కన్నరావులు పండుతో సగం అలిసిపోయారు. వాడితో విసిగిపోయి తోటకూర కాడల్లాగా వెళ్లాడిపోసాగారు.
"ఒరేయ్...చిప్స్ పాకెట్ ఖాళి అయిపోయింది. ఇంకేమ్తెనా తిఅతానికుందా? ఖాళి పాకెట్స్ పక్కకి విసిరేస్తూ అన్నాడు పండు.
"నన్ను తిన్రా....తిను!" విసుక్కుంటూ అన్నాడు చిట్టబ్బాయ్.
"వా..."తారాస్దాయిలో ఏడుపు ఎత్తుకున్నాడు పండు.
"ఊర్కోరా బాబూ.. ఊర్కో..." అన్నాడు కన్నారావు.
"నన్ను మా యింటికి తిస్కెళ్ళిపోండి....వా..."
"తిస్కళ్తాంలె... ఇంకాస్సేపు ఓపిక పట్టుబాబూ!" అనునయిస్తూ అన్నాడు కన్నారావు.
'మరట్టాగ్తెతే చేగోడీలు పట్రా..." ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పండు.
చిట్టబ్బాయ్ పళ్ళు కొరికాడు.
చేగోడిలా పాకెట్ తేవాలంటే అక్కడికి అరకిలోమిటరు దూరంలో ఉన్న జనరల్ స్టోర్స్ కి ఎండలో పది వెళ్ళాలి. అప్పటికి పండుగాడు వీళ్ళని బిస్కెట్లని చాక్లేట్లని ,చిప్సు అని, నాలుగుసార్లు తిప్పాడు.
"విడితో మనం వేగడం కష్టం. సాయంత్రం స్కూలు వదిలేక కూడా, వీడు మన దగ్గర ఉన్నాడని ఫోన్ చెయ్యడం... ఎందుకు ఇదంతా? అంతదాకా వీడిని భరించడం కష్టంగాని.... ఇప్పడే మనం వీళ్ళింటికీ ఫోన్ చేసి చెప్తే వచ్చిన నష్టం ఏంటి?" అన్నాడు కన్నారావు.
"నాకు చేగోడీలు కావాలి. వా" మళ్ళి రాగం ఎత్తుకున్నాడు పండు.
"పద. షాపుకివెళ్ళి కొనుక్కుందాం" పల్లుసూర్తూ అన్నాడు చిట్టబ్బాయ్.
ముగ్గురూ రిక్షాలో జనరల్ స్టార్స్ కి వెళ్ళారు. కన్నారావు, పండు రిక్షాలో ఎక్కి కూర్చుంటే చిట్టబ్బాయ్ తొక్కాడు.
"వెళ్ళేటప్పడు రిక్షా నువ్వే తొక్కాలి!" అన్నాడు చిట్టబ్బాయ్ రిక్షాని ఒక పక్కగా ఆపి దిగుతూ.
"సర్లె. ఊర్కే అట్ట ఏడవకు" విసుగ్గా అన్నాడు కన్నారావు.
ముగ్గురూ షాపులోకి ప్రవేశించారు. షాపువాడిని ఫోన్ చేసుకుంటామని అడిగారు. షాపువాడు సరే అన్నాడు.
"నాకు చేగోడీలు కావాలి...వా..."అంటూ రాగం అమ్డుకుకున్నాడు పండు.
"ముందు వాడిమొహన చేగోడీలు తగలెయ్... లేకపోతే మనకి ఏమాత్రం తోచానివ్వాడు..." విసుగ్గా అన్నాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ ఒక చేగోడిలా ప్యాకెట్ కొని పండు చేతికి ఇచ్చాడు.
"నాకు అది కూడా కావాలి....ఊ...ఊ...ఊ... క్యాడ్బరి చాకెట్లు ఉన్న సిసావంక చూపించాడు పండు.
ఒక చాక్లెట్ కూడా కొని వాడి చేతికి ఇచ్చాడు చిట్టబ్బాయ్.
కన్నారావు షాపువాడి దగ్గర టెలిపోన్ డ్తెరెక్టరి తీసుకుని నెంబరు కోసం వెదకసాగాడు.
"నెంబరు దొరకలేదా?" అడిగాడు చిట్టబ్బాయ్.
"దొరికింది ...." టెలిపోన్ డ్తెరెక్టరి లో ఒక నెంబరు చదివాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ ఆ నెంబర్ డయల్ చేశాడు. అవతల ఫోన్ రింగయిన శబ్దం
వినిపించింది.
"నెంబరు కలిసిందా?" ఆతృతగా అడిగాడు కన్నారావు.
"ఫోన్ రింగవుతుంది. ఇంకా ఎఅవరూ ఎత్త లేదు" అన్నాడు చిట్టబ్బాయ్.
సరిగ్గా అప్పడే అవతల మనిషి ఫోన్ ఎత్తాడు.
"హలో...." అవతలి కంఠం బొంగురుగా.
"హలో రంగనాయకులుగారేనా మాట్లాడుతున్నది?" కంగారుగా అడిగాడు చిట్టబ్బాయి.
"నేనే" అంది అవతలి కంఠం.
"మీ పండు మా చేతిలో ఉన్నాడు...." గంభీరంగా అనడానికి ప్రయత్నిస్తూ అన్నాడు చిట్టబ్బాయి.
"ఏ పండు....జాంపండా? మామిడిపండు?"
ఈ ప్రశ్నతో చిట్టబ్బాయి కం ప్యూజ్ అయిపోయి మౌత్ పిన్ దగ్గర చెయ్యి అడ్డు పెట్టి జాంపండా? మామిడిపండా? అని అడుగుతున్నాడు. విడి అసలు పేరేంటి?" అని కన్నరావుని అడిగాడు.
"ప్రశాంత్" చెప్పాడు కన్నారావు.
చిట్టబ్బాయి మళ్ళి అవతలి వ్యక్తితో అన్నాడు.
"పండంటే ప్రశాంత్!.... మీ పండు మీకు కావాలంటే మాకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి! లేకపోతే మీ పండుని సఫా చేస్తాం..."
"నిరభ్యంతరంగా చేస్కొండి..."
"ఏంటి చేస్కోవాలి!" కంగారుపద్తూ అడిగాడు చిట్టబ్బాయి.
"సఫా! వాడ్నేమ్తేనా చేస్కొండి" అవతలి వ్యక్తి ఫోన్ డిస్కనేక్ట్ చేశాడు. చిట్టబ్బాయి చేతిలోంచి రిసీవర్ జారిపోయింది.
జూబిలీ హిల్సులో...
* * *
సగం సగం కట్టి వదిలేసిన ఆ ఇంట్లో...
చిట్టబ్బాయి, కన్నారావులు గదిలో ఉన్న పునాది రాళ్ళ మీద కూర్చుని ఉన్నారు. వాళ్ళ మొహాలు పాలిపోయి ఉన్నాయి. మరో రాయిమిద పండుగాడు కూర్చుని మెల్లగా పొట్లాలు ఆరగిస్తున్నాడు.
వాడిని చూస్తుంటే ఇద్దరికీ జాలేస్తున్నాడు.
"నువ్వసలు ఇన్ ఫర్మేషను కరెక్టుగానే కనుక్కున్నావా?" నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కన్నారావుని అడిగాడు చిట్టబ్బాయి.
"ఏ ఇన్ ఫర్మేషను గురించి నువ్వడుగుతుంది?" పండుమిద నుండి చూపులు మరల్చి చిట్టబ్బాయి వంక చూస్తూ అడిగాడు కన్నారావు.
"అదే!... ఈ పండుగాడి గురించి!!! విడసలు రంగానాయకులకి సొంత కొడుకేనా అని! రజని పుట్టిన తరువాత చాలా సంవత్సరాలుగా వాళ్ళకి మరో సంతానం కలగలేదని అన్నావు. సరే బాగానే ఉంది! ఆ తరువాత వాళ్ళకి పండుగాడు పుట్టాడంటావా? లేకపోతే పిల్లలు కలగలేదని వీడిని ఏకాది నుండ్తేనా తెచ్చుకుని పెంచుకున్నారంటావా?"
"నా మీద నమ్మకం లేకపోతే నువ్వే కనుక్కోలేక పోయావా?" విసుక్కున్నాడు కన్నారావు.
"ఎందుకలా విసుక్కుంటావ్ ?....నేనిలా అనుమానించడానికి కారణం ఉంది కదా? సొంత కొడుకుని ఎవర్తెనా చంపెయ్యండి నాకేం అభ్యంతరం లేదని అంటారా?"
"అవును...నాకూ అనుమానంగానే ఉంది నువ్వసలు సరిగ్గా విన్నావా అని? రంగనాయకులు అలా అనలేదేమో! ఎదో అంటే నువ్వు ఇంకేదో విన్నావేమో"
"నాకేమ్తేనా చెముడా? నేను సరిగ్గానే విన్నాను. పండుగాడిని సఫా చేసేయమన్నాడు."
కొన్ని క్షణాలు ఇద్దరూ ఎదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నారు.
"ఒరేయ్... నాకు ఇంకాసిన్ని చాక్లెట్లు కావాలి!" అన్నాడు పండు ఇద్దర్ని మార్చి మర్చి చూస్తూ.