ఎన్నిక
హైద్రాబాద్ నుంచి టెలిగ్రాం వొచ్చింది. స్ర్కూటనీ ఆదివారం యేర్పాటయింది గనక వెంటనే బైలుదేరి రమ్మనక తప్పేదిగాదు. శనివారు రాత్రి బస్సులో కూచుని అమ్మిరెడ్డి గురించి ఆలోచించేను!
కధలూ, నవలలూ రాసుకునే రోజుల్లో ప్రజల్నుంచి నాకింత " గమనింపు" రాలేదనే చెప్పాలి. ఏ శుభమూహూర్తాన ఈ నాటకాలు ప్రారంభించేనోగానీ, ప్రారంభించిన కొన్ని మాసాల్లోనే ప్రతి వూరా నాటాకాలు ప్రదర్శింపబడి మన్నన లందుకున్నాయి!
ఆర్నెల్ల క్రితం ' బ్రతక నేర్చిన మనిషి' రాసేను. అమ్మిరెడ్డి ఆ నాటకంలో ముఖ్యమైన పాత్ర. అమ్మిరెడ్డి వయస్సు రమారమి పదేళ్ళకి మించరాదు. పాత్ర. అమ్మిరెడ్డి వయస్సు రమారమి పదేళ్లకి మించరాదు. నాటకం మధ్యలో అమ్మిరెడ్డి తండ్రి చనిపోయాడు. బ్రతికున్న నాటకం మధ్యలో అమ్మిరెడ్డి గడిచిన మనిషి అమ్మిరెడ్డి తండ్రి. అప్పులు చేయడంలో సిద్ధహస్తుడు. దానివల్ల అతను పోయిన పిదప, మిగిలిన కొంపకాస్తా అప్పులవాళ్ళ పరమవుతుంది.అమ్మిరెడ్డి వీధిలో నించొని గుండెలవిసేవలా యేడుస్తాడు. ఇక్కడ అమ్మిరెడ్డి నటన పరాకాష్టంనందుకుంటే గాని నాటకం రాణించదు. గనుక అమ్మిరెడ్డి పాత్రకి తగిన కుర్రాడు చాకులాటి వాడై వుండాలి. వయసుచిన్నదైనా నటన విషయంలో తగిన వాడై వుండాలి. వయసు చిన్నదైనా నటన విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది.
' బ్రతకనేర్చిన మనిషి' మొట్టమొదటి మూడు ప్రదర్శనలూ నేను చూడడం జరిగింది.అయితే నే నూహించి రాసిన అమ్మిరెడ్డిని ఆ ప్రదర్శనల్లో చూడలేకపోయేను.
ఈ మధ్య నా కాపాత్రమైన " భయం" గూడా వేస్తోంది.ఆలోచనలేకుండా అలాంటి పాత్రల్ని నాటకంలో రాసేయడం నాకు సులభమేనోగానీ ప్రదర్శకులకు మాత్రం తలకు మించిన పని! అందుకే అమ్మిరెడ్డి మిద నమ్మకపోయిన , భయం వేస్తోంది!
ఈ నాటకం తీసుకున్న హైద్రాబాద్ ప్రదర్శకులు స్థానికంగా మంచి పేరున్న నటులనివిన్నాను. వాళ్ళ అమ్మి రెడ్డని చూడాలని యెప్పట్నుంచో అనుకుంటున్నాను.ఎందు చేతనోగాని వాళ్ళ అమ్మిరెడ్డి నాకు అన్యాయం చేయడని పిస్తోంది? కేవలం ఈకారణం వల్లనే వాళ్ళ స్ర్కూటీనీ చూచేందుకు- ముఖ్యంగా ఈకొత్త అమ్మిరెడ్డి ని పరీక్షించేందుకు ఆయత్త పడ్డాను.
హైద్రాబాద్ లో బస్సు దిగుతూనే వాళ్ళందరూ నాకు స్వాగతం పలికేరు. వాళ్ళు తెచ్చిన టాక్సీలో కూచుంటూ వాళ్ళ ఆర్గనైజర్ని అడిగేను. అమ్మిరెడ్డిని చూపించమని అతను ముట్టిస్తూ అన్నాడు." ఇంకా రాలేదు. స్ర్కూటీనీ వేళకొస్తాడు. మెరికలాటి కుర్రాడు లెండి?"
ఆ సాయంత్రం నాలుగున్నర క్కాబోలు రవీంద్రభారతిలో స్క్ర్రూటినీ ఏర్పాటు చేసేరు. మూడు గంటలనుంచే నటులు రంగులు వేసుకోడం ప్రారంభించేరు. అప్పటికొచ్చి గూడా అమ్మిరెడ్డి రాలేదని విన్నాను. మనసు కొంచెం బాధ పడ్డది.
నన్నంటి పెట్టుకు తిరుగుతూన్న స్క్రూటిని అధికారి నా మనసు గమనించక,
" అదేం అలా ఉన్నారు? యూ ఆర్ నాట్ ఫలింగ్ వెల్ ఐసీ! అని తెలుగులో పరామర్శించి యింగ్లీషులో హెచ్చరించేడు. నవ్వేసి వూరుకున్నానేగాని నా కోరిక అతనికి చెప్పలేదు. నాలుగ్గంటల క్కాబోలు అమ్మిరెడ్డి పాత్రధారి వొచ్చేడని యెవరో కుర్రాడు చెప్పేడు. వెంటనే గ్రీన్ రూం లోకి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ అధికారి ఉపన్యాసానికి మధ్యలో ఆవాంతరం కలిగించడం శ్రోతగా నాధర్మం కాదని తప్పనిసరిగా ఆ ఆడిటోరియంలో బల్లిలా కూర్చుండవలసిన అవసరం యే ర్పిడంది.అధికారి సంభాషణ ముగింపు కి రాక మునుపే ఓ లావు పాటి వ్యక్తి వొచ్చి నా ప్కకన కూచుంటూ నన్ను పలకరించేడు. నేనతనివేపు చూచిన మరుక్షణమే అతన్ని ఖరీదైన మనిషిగా గుర్తించేను. ఆయన తనని తను పరిచయం చేసుకున్నాడు. చిట్టిబాబు తండ్రిట.
ఇక్కడ ఈ నాటకంలో అమ్మిరెడ్డి వేషం వేస్తోన్న కుర్రాడిపేరు చిట్టిబాబు.
సరిగ్గా నాలుగున్నరకే తెలతొలిగింది.నాటకం మొదలు పెట్టేరు. మొదటి రంగం పూర్తవుతుందనగా ఓ తడవ పరిశీలనాధికారివేపు చూసేను. అతను గోడమిద బొమ్మాలవేపూ ,అప్పుడు తన చేతి గడియారం వేపూ, చూస్తూన్నాడు. నాటకంపట్ల అతని నిర్లక్ష్యానికి చాలా నొచ్చుకున్నాను.
పెళ్ళి చూపులకీ , ఈ స్క్ర్రూటీనీలకూ చాలా దగ్గిరసం బంధం వున్నది నాటకాలు కరాయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లో నే పూర్తిగా తెలిసొచ్చింది. వొచ్చిన వరుడి మిద కన్నెపిల్ల పెళ్ళి ఆథారపడినట్లే. ఇక్కడ ఈ పరిశీలనాధికారి నీర్ణయంమిద నాటక సమాజం వారి కొన్ని నెలల వ్యయ ప్రయాసలు ఆధారపడి వుంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆరాటం ముందు సమాజం నిర్వహకుల గుండెదడ ఏమాత్రం తీసిపోదని చెప్తాను.
మొదటిసీను పరిశీలనాధికారి అంతగా ఆకట్టుకోలేక పోయినా, రెండో సీనులో అతను బాగా కదిలిపోయినట్టు గమనించేను. దానికి సాక్ష్యం ఆ సీను పూర్తయింతర్వాత అతని కనుకొకుల్లో నీళ్ళు చెక్కు చెదరకుండా వుండటమే!"