డాక్టర్ విలాస్ కు వచ్చిన కోపమింతా అంతాకాదు. "నా భార్య మోసగత్తె మాత్రమేకాదు. పొగరుబోతు కూడా నేనంత నిలదీసినా నిజం ఒప్పుకోలేదు. తన అనారోగ్యం అబద్దం కాదంటుంది. నా ఆరోపణలన్నీ అబద్దాలంటుంది. నాకు చాలా కోపం వచ్చి చేయి కూడా చేసుకున్నాను."
"అధి సరే...ఆమెనేందుకు తీసుకుని రాలేదు?"
"ఎలా వస్తుంది? నేనామెను పుట్టింటికి పంపించేశాను. ఆ రోగమే నా తగ్గాలి, నిజమేనా చెప్పాలి."
ఉత్పల్ నీరసపడిపోయాడు. మొదటిసారిగా అతడికి డాక్టర్ విలాస్ పై అసలయిన కోపం వచ్చింది.
"ప్రపంచంలో ఇలాంటి నయవంచన ఉంటుందని నేనెన్నడూ వూహించ్జలేదు ఉత్పల్! ఆమెనా కాళ్ళు పట్టుకుంటుంది. ఏడుస్తుంది తప్పితే నిజం చెప్పదే! చివరికి కళ్ళ నీళ్ళతోనే ట్రైన్ కూడా ఎక్కింది."
"ఇంకా చాలు డాక్టర్ విలాస్! ఈ సొసైటీ భార్యావిధేయులకోసం, అవకాశ వాదులకోసం నెలకొల్పబడలేదు. సొసైటీకి కొన్ని నియమాలున్నాయి. మీరే వ్యవస్థాపకులు కాబట్టి కొంతవరకూ సహించగలిగాము. ఇక మీదట మీరు మా సభ్యుల్ని తప్పుదారి పట్టించి, మోసగించారన్న అనుమానం నాకున్నది. సరీగా వారమంటే వారంరోజులు మీకు టైము ఇస్తున్నాను. వారంరోజుల్లో మీ భార్యను సొసైటీకి తీసుకువచ్చారా సరేసరి...లేదా రాజీమానా సభ్యత్వానికి" అన్నాడు ఉత్పల్ అసహనంగా.
వారంరోజులు విలాస్ సొసైటీకి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఒంటరిగానే వెళ్ళాడు.
ఒంటరిగా వచ్చిన విలాస్ ని చూడగానే ఉత్పల్ కు వళ్ళు మండిపోయింది. "ఒంటరిగా రావద్దని చెప్పానుగదా" అన్నాడతను కోపంగా.
"ఒంటరిగా రావాలని నాకులేదు. అది నా దురదృష్టం"
"దురదృష్టమో, నాటకమో-నాకు అనవసరం..."
"మిస్టర్ ఉత్పల్... ఈ సొసైటీ నేను ప్రారంభించాను. దీన్ని నేను వదులుకోలేను" అన్నాడు విలాస్.
"వదులుకోక తప్పదు" అన్నాడు ఉత్పల్.
"ప్లీజ్..." అన్నాడు విలాస్.
"డాక్టర్ విలాస్ ! ప్లీజ్ గెటౌట్!" అన్నాడు ఉత్పల్.
విలాస్ ముఖం ఎర్రగా కందగడ్డలా అయింది. "నా పరిస్థితి తెలుసుకోకుండా నన్నవమానించావు. నీలాంటి వాడున్న సొసైటీలో కొనసాగాలనుకోవడం నా బుద్ది తక్కువ. ఈ రోజునుంచీ ఈ సొసైటీకి నాకూ ఏ విధమైన సంబంధమూ లేదు. గుడ్ బై"
అలా అనేసి డాక్టర్ విలాస్ అక్కడ్నించి చరచారా వెళ్ళిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి ఉత్పల్ తెల్లబోయాడు.
కొద్ది క్షణాల్లోనే అతడికి విలాస్ ఎంత తెలివయిన వాడో, తామందర్నీ ఎలా ఫూల్ చేశాడో అర్ధమైంది. సొసైటీనుంచి రాజీనామా చేసి విలాస్ నష్టపోయినదేమీ లేదు.
అతడు సొసైటీ సభ్యులందరి భార్యాలనూ అనుభవించాడు. తన భార్య పవిత్రతను నిలుపుకున్నాడు.
ఓ వారంరోజుల తర్వాత అతడా ఊరుకూడా వదలినట్లు తెల్సింది ఉత్పల్ కి.
"సింప్లీ ఐయామే ఫూల్" అనుకున్నాడతను.
O O O O
డాక్టర్ విలాస్ కథ చదివి ఆశ్చర్యపోయాను. లోకంలో ఇలాంటి మనుషులుంతారా? ప్రతివాదిలోనూ స్వార్ధం వుంటుంది. కానీ అధి మరీ ఇంత బహిరంగంగా బహిర్గతమవుతుందా?
కేవలం తన సరదాకోసం సొసైటీ స్థాపించాడు. అతడిలో విశాల హృదయంలేదు. విశాల హృదయాన్ని ప్రోత్సహిస్తూ తన సంకుచిత తత్వాన్ని మాత్రం వదులుకోలేదు.
దీన్నిబట్టి డాక్టర్ విలాస్ స్త్రీలకు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని తెలుస్తున్నది. అతను నా యింట చేరాడు.
కోమలి అతడి విషయమై నన్ను హెచ్చరిస్తున్నది.
అంటే పద్మినికి అతడివలన ప్రమాదమున్నది.
కానీ పద్మిని అతడి వల్లో పడుతుందా?
మాధవరావు ఆల్బంలో పద్మిని తైలవర్ణంచిత్రం నా కనులముందు మెదిలింది. ఒక్కసారి తప్పుచేసిన ఆడది మళ్ళీ మళ్ళీ తప్పు చేయదని నమ్మకంలేదు.
పద్మినికి ప్రమాదమున్నది. పద్మిని బుద్దిని బట్టి చూస్తే ప్రమాదం ఆమెకు కాదు నాకు.
"ఏమిట్రా ప్రమాదం?" అని ఎవరో నన్ను నిలదీసినట్లయింది.
వెంటనే నాకు సమాధానం దొరకలేదు. ఎంత ఆలోచించినా ప్రమాదమేమిటో నా తార్కానికందలేదు. అదీ గాక ఎక్కువగా ఈ విషయమై ఆలోచించడం నాకు ఇష్టం లేదు.
రాత్రి ఈ కథ చదివాను. రకరకాల కలలువచ్చాయి. కొన్ని కలలు మనసుకు భయాన్ని పుట్టించాయి. కొన్ని కలలు సిగ్గును కలిగించాయి కొన్ని కల్లు బొత్తిగా బయటికి చెప్పుకోలేనివి.
ఆ కలలోకి డాక్టర్ విలాస్ భార్యకూడా వచ్చింది. ఆమె నిండా ముసుగువేసుకునే వున్నది.
పరాయి స్త్రీలపట్ల కలలు కంటూ, వారిపై వాంచలు పెంచుకుంటూ, వారిని అనుభవించడానికి పథకాలు కొనసాగిస్తూ తన భార్యను బురఖాలో వుంచుతున్నాడు డాక్టర్ విలాస్.