Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    సానుభూతితో అతని పక్కనే కూర్చున్నాడు సాగర్. ఓపికగా ఒక్కొక్క ముల్లూ తియ్యడం మొదలెట్టాడు.

    కానీ కృతజ్ఞత కలగలేదు చాంగ్ కి.

    ఎవరైనా తమకి ఉపకారం చేస్తే కృతజ్ఞత కలుగుతుంది సజ్జనులకి. మరి కొంతమంది మనుషులకి చిత్రమైన మనస్తత్వం వుంటుంది. పొరబాటున ఎవరివల్లనన్నా ఉపకారం పొందవలసి వస్తే, అది తమకు గొప్ప అవమానంగా భావించే సైకాలజీ వాళ్ళది.

    అలాంటివాడే చాంగ్.

    సాగర్ తీస్తున్న ప్రతి ముల్లూ తన గుండెలో గుచ్చుకుంటున్నట్లు అవుతోంది చాంగ్ కి. ఇందాకటి బాధకంటే ఈ అవమానాన్ని భరించడం కష్టంగా వుంది అతనికి.

    కానీ భరిస్తున్నాడు అతను.

    తను బతకాలి! బతికి, తనని రక్షించి హీరో అయిపోయినట్లు ఫోజు పెడుతున్న ఈ సన్యాసిని చంపాలి! తన చేత కాళ్ళు పట్టించుకున్న వీడి కాళ్ళు, తొడల దగ్గర విరక్కొట్టి నుగ్గునుగ్గు చెయ్యాలి.

    అలా చెయ్యకపోతే తన పేరు డ్రాకులా చాంగే కాదు!

    వీడికి తన సంగతి ఇంకా పూర్తిగా తెలియదు. తెలుసుకుంటాడు త్వరలోనే.

    నోరెత్తి పైకి ఒక్కమాట కూడా అనలేదు చాంగ్. కానీ అతని కళ్ళలో మాత్రం ద్వేషం కనబడుతోంది.

    నరకయాతన పడుతున్న చాంగ్ ని రక్షించి తన ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నానని సాగర్ కి తెలియదు, అప్పట్లో!



                                                                            14


    ఆ చుట్టుపక్కల అంతా ఎక్కువగా ముళ్ళు తుప్పలూ, ఎండుగడ్డి దుబ్బులూ వుండటంవల్ల అతి వేగంగా వ్యాపిస్తున్నాయి మంటలు కార్చిచ్చు మొదలవుతోంది.

    చాంగ్ ని ముళ్ళ పొదలలో నుంచి బయట పడెయ్యగలిగినా, ప్రమాదము  తప్పలేదని గ్రహించాడు సాగర్. అతన్ని తక్షణం ఏదన్నా సురక్షిత ప్రదేశానికి తరలించాలి.

    సునిశితమైన అతని దృష్టి త్వరత్వరగా పరిసరాలను గమనించింది.

    అనూహ్యా, ఫకర్, ఇబూకా నిలుచుని వున్న కొండ కిందిభాగంలో చిన్న గుహ ఒకటి వుంది.

    లోపలికి వెళ్ళి చూశాడు.

    అది మరో విశాలమైన గుహలోకి దారి తీస్తోంది.

    ఇంకా లోపలగా తేనెతుట్టిలా అసంఖ్యాక గుహలు వున్నాయి. ఒక దాన్లో నుంచీ మరొక దానిలోకి దారి వుంది.

    చాంగ్ ని అక్కడికి చేర్చాలి.

    ఆ మహాకాయుణ్ణి తను ఒక్కడే మొయ్యడం అతి ప్రయాస.

    అందుకని చేతులు ఊపుతూ ఫకర్, ఇబూకా, అనూహ్యలని కిందికి రమ్మని సైగ చేశాడు.

    త్వరత్వరగా కొండ దిగి వచ్చారు వాళ్ళు.

    "నువ్వు ఇక్కడే ఉండు" అని అనూహ్యతో చెప్పి, ఫకర్ నీ,  ఇబూకానీ వెంట పెట్టుకుని చాంగ్ దగ్గరికి పరిగెత్తాడు సాగర్.

    మంటలు చాంగ్ ని సమీపిస్తున్నాయి.

    "మంటలు కాలిపోతున్నాను" అని అరుస్తున్నాడు చాంగ్.

    పరిగెడుతున్న ఇబూకా ఆగి, కసిగా అన్నాడు. "మంటల్లో కాలిపోతానని ప్రాణభయం పట్టుకుంది వీడికి. ఇందాక మేడమ్ సాబ్ ని నిలువునా తగలెట్టేదామని చూడలేదూ ఈ డ్రాకులాగాడు. కేప్టెన్ సాబ్ వీణ్ణి రక్షించడం అంటే తద్దినాన్ని కొని తెచ్చుకోవడమే!"

    సాగర్ ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు.

    భుజాలు ఎగరేసి సాగర్ ని అనుసరించాడు ఇబూకా.

    చాంగ్ ని చేరుకోగానే, అతని భుజం కింద చేతులేసి పైకి లేపాడు సాగర్.

    ఫకర్, ఇబూకా, చాంగ్ కాళ్ళు చెరొకటి పట్టుకున్నారు.

    వర్ణింపనలవికాని బాధతో, ఏడుపులాంటి మూలుగు వస్తోంది చాంగ్ కంఠంలో నుంచి.

    అతికష్టం మీద మోస్తూ, అతన్ని గుహలోకి తెచ్చి దింపారు.

    "ఏం తిని ఇంత బలిశాడో!" అన్నాడు ఇబూకా, వగురుస్తూ.

    "ఇంకేమిటి నెత్తుటి కూడు" అన్నాడు ఫకర్. "ఇప్పుడింక వీడికి గడ్డి తినిపిస్తాను చూడు."

    "నిజంగానే?" అంటూ నవ్వాడు ఇబూకా.

    గబగబ బయటికెళ్ళాడు ఫకర్.

    చాంగ్ శరీరంలో మిగిలిన ముళ్ళు తియ్యడానికి వంగారు సాగర్ అనూహ్య.

    కానీ ఎవరినీ దగ్గరకి రానివ్వడంలేదు చాంగ్. వంటిమీద చెయ్యి వేస్తే చాలు విలవిల్లాడిపోతున్నాడు. వెల్లకితలా పడుకుని ఉంటే వీపులోని ముళ్ళు మరింతగా గుచ్చుకుని నలుపుతున్నాయి. పక్కకి తిరిగితే చేతులకి ఉన్న ముళ్ళు బాధిస్తున్నాయి.

    పావుగంటలో తిరిగి వచ్చాడు ఫకర్. అతని చేతిలో ఒక చిత్రమైన జాతి గడ్డి పరకలు  ఉన్నాయి.

    వాటిని చాంగ్ నోటిదగ్గర పెట్టాడు ఫకర్. "తినరా, గడ్డితిను!"

    అవసరం తనది కాబట్టి అవమానాలు అన్నీ సహిస్తున్నాడు చాంగ్. కానీ, సమయం వచ్చినప్పుడు వీళ్ళందరినీ చిత్రహింసలుపెట్టి చంపాలని నిర్ణయించుకున్నాడు.

    "తిను బేటా" అన్నాడు ఫకర్ "ఇది గడ్డే గాని మందులా పని చేసే గడ్డి. తింటే పందిలాపడి నిద్రపోతావ్! తిను."

    అనుమానంగా చూస్తూ, కొన్ని పరకలు కొరికాడు చాంగ్. వంటనే వికారంగా అనిపించింది అతనికి. తల గ్రిరున తిరుగుతున్నట్లు అయింది.

    మెల్లిగా కళ్ళు మూతలు పడిపోయాయి.

    తట్టి చూశాడు ఫకర్ చాంగ్ కదలలేదు.

    "ఇంక మనం వీడి వంట్లో ఉన్న ముళ్ళన్నీ పీకెయ్యవచ్చు సర్!"

    నలుగురూ కలిసి, మానవరూపంలో ఉన్న పిన్నుల కుషన్ లా అయిపోయిన చాంగ్ శరీరంలో మిగిలిపోయిన ముళ్ళన్నీ లాగేశారు.

    తన జేబులోంచి మరికొన్ని  ఆకులు తీశాడు ఫకర్. రెండు చేతులతో బాగా నలిపి, చాంగ్ ఒంటికంతా పట్టించాడు.

    నాచుపట్టిన బండలా ఆకుపచ్చగా కనబడుతున్నాడు చాంగ్.

    ఆ పని పూర్తయ్యాక, అందరూ కాసేపు రెస్టుగా కూర్చున్నారు.

    అంతలో వాతావరణం చల్లగా మారింది సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అది జడివానగా మారింది.

    ఆ ఉధృతానికి, అడవి అంతా అలుముకుంటున్న దావానలం చప్పగా చల్లారిపోయింది.

    అప్పుడు ఆకలి మంటలు చెలరేగాయి అందరి కడుపుల్లో.

    "చూడు! చూడు, చూడు" అన్నాడు ఫకర్.

    బాగా బలిసి, నిగనిగలాడుతున్న అడవి కోళ్ళు నాలుగు తిరుగుతూ కనబడ్డాయి దూరంగా.

    "వాటిని పట్టుకొస్తాను" అంటూ పరిగెత్తాడు ఇబూకా. అందినట్లే అంది దూరంగా పారిపోతున్నాయ్ అవి.

    పరిగెత్తి, పరిగెత్తి ఆయాసం వచ్చింది ఇబూకాకి. రోషంగా చూస్తూ నిలబడిపోయాడు.

    నవ్వాడు ఫకర్. "వాటి సంగతి నాకొదిలెయ్యి నేస్తం!" అంటూ గబగబ ఒక చెట్టు ఎక్కాడు. వంపు తిరిగి ఉన్న చిన్న కొమ్మని విరక్కొట్టాడు కిందకు దిగివచ్చి చాకుతో దాన్ని చెక్కడం మొదలెట్టాడు.

    "కోళ్ళు కొట్టుకొస్తానని చెప్పి కొమ్మలు విరక్కొడతావేమిటి?" అన్నాడు ఇబూకా.

    ఫకర్ ప్రయత్నమేమిటో సాగర్ కి మాత్రం అర్ధమైపోయింది.

    "బూమరాంగ్ తయారు చేస్తున్నావ్! అవునా?" అన్నాడు.

    "కేప్టెన్ సాబ్ కి తెలియని విషయమంటూ లేదని నాకు తెలుసు." అంటూ ముసిముసిగా నవ్వాడు ఫకర్.

    దాదాపు అర్ధచంద్రాకారపు ఆకారంలో తయారైంది బూమరాంగ్. అస్ట్రేలియాలోని ఆదిమావాసులు అనాదిగా ఉపయోగిస్తున్న ఆయుధం అది.

    మళ్ళీ ఇంకో నాలుగు అడవికోళ్ళు కనబడ్డాయి.

    బూమరాంగ్ ని ఒడుపుగా విసిరాడు ఫకర్.

    రెక్కలు టపటపలాడిస్తూ పారిపోయాయి అవి.

    వృత్తాకారపు కక్ష్యలో రివ్వున పయనిస్తున్న బూమరాంగ్ విసిరిన వాళ్ళ దగ్గరికే తిరిగి వచ్చేస్తుంది అంటే, మాటిమాటికీ దాని వెనక పరిగెత్తే శ్రమ తప్పుతుంది.

    రంగురంగుల ఈకలతో జిగజిగ మెరిసిపోతూ మరో కోడి.

    మళ్ళీ బూమరాంగ్ విసిరాడు ఫకర్ అది తగిలి, కింద పడిపోయింది కోడి "రొస్టు చికెన్" అని ఆనందంగా అరుస్తూ పరిగెత్తాడు ఫకర్.

    ఈలోగా, ఒక చెట్టుకొమ్మను విరిచి చేతి కర్రలా పట్టుకుని  వృద్దుడిలా నడుస్తూ దగ్గరలోనే ఉన్న ఒక మడుగు అగ్గారికి వెళ్ళింది ఉరాంగ్ ఉటాన్.

    కోకొల్లలుగా చేపలు ఉన్నాయి అందులో.

    నీళ్ళలో దిగి, నిర్నిమేషంగా చూస్తూ ఉండుండి ఫెటేల్మని కర్రతో కొట్టి, చేపలని చంపుతోంది ఉరాంగ్ ఉటాన్. కొన్ని ఆటవిక జాతులు చేపలని పట్టే పద్దతి అది. ఆ ఉరాంగ్ ఉటాన్ ఎవరో అలా చేపలని పట్టడం చూసింది ఇదివరకు.

    దాన్ని అనుసరిస్తోంది ఇప్పుడు.

    చూసిన కొత్త విషయాలను గుర్తు పెట్టుకుని అనుకరించి, అలవాటు చేసుకునే శక్తి ఉరాంగ్ ఉటాన్, గిబ్బన్, గొరిల్లా, చింపాజీలాంటి తెలివైన కోతులను ఉందని పరిశోధనల్లో తేలింది. ఒకసారి ఒక కోతుల గుంపు తాలూకు ఆహారం బురదలో పడిపోయి మట్టి గొట్టుకుపోయింది. దాన్ని ఏరుకుని తెస్తూ ఉంటే, మళ్ళీ పొరబాటున నీళ్ళలో పడిపోయింది.

    నీళ్ళలో తడిస్తే ఆహారానికి ఉన్న మట్టి తుడిచిపెట్టుకుపోతుందని గ్రహించింది ఆ కోతుల గుంపు. అప్పటి నుంచీ అని ముందు నీటిలో కడగకుండా ఆహారాన్ని నోట పెట్టడం మానేశాయి. కోతుల జాతులలో నుంచి వచ్చిన ఆదిమానవుడు కూడా అలా ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ నాగరికుడయ్యాడు.

    గుహ లోపలి భాగంలో మంట చేశాడు ఫకర్. వంట మొదలెట్టాడు ఇబూకా.

    భోజనం పూర్తి అయిన తర్వాత చిత్రమైన పాట ఏదో పాడుతూ, చేతులు చరుస్తూ, పాదాలు కదుపుతూ నృత్యం చెయ్యడం మొదలెట్టాడు ఫకర్.

    నల్లగా భూమికి నాలుగడుగుల ఎత్తే వున్న ఫకర్ డాన్సు చేస్తుంటే నవ్వు మొహాలు పెట్టి చూస్తున్నారు.

    ఉన్నట్లుండి కేకలు వినబడ్డాయి.

    "చస్తున్నాను బాబోయ్, రక్షించండి నాయనోయ్......"

    వెంటనే మదపుటేనుగు ఘీంకారం వినబడింది.

    ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారు అందరూ.

    నల్లటి పర్వతంలా వున్న పెద్ద ఏనుగు ఒకటి ప్రొఫెసర్ ఆనందరావుని తొండంతో గాల్లోకి ఎత్తి పట్టుకుని, వడివడిగా అడుగులు వేస్తూ వెళుతోంది.

    కాళ్ళూ చేతులూ గాల్లో తపతప ఆడిస్తూ శోకాలు పెడుతున్నాడు ప్రొఫెసర్ ఆనందరావు.

    సీరియస్ గా చూస్తున్నాడు సాగర్. ఆ ఏనుగు మదంతో వుందని అర్ధమయింది అతనికి అలంటి రోగ్ ఎలిఫెంట్ ని తను ఎదుర్కోవడం సాహసం అనిపించుకొదు, అది మూర్కత్వమే అవుతుంది.

    వెర్రి కోపంతో,  చిరాకుతో ఉన్న అలాంటి ఏనుగులే "కిల్లర్ ఎలిఫేంట్స్" గా మారతాయి.

    కానీ ప్రొఫెసర్ ని రక్షించక తప్పదు! ఎలాగ? ఏం చెయ్యాలి?

    ఏమయితే అది అవుతుందని ముందుకి అడుగు వేశాడు సాగర్.

    వెనకాల నుంచీ ఎవరో షర్టు పట్టుకుని గుంజినట్లయింది.

    వెనక్కి తిరిగి చూశాడు.

    అనూహ్య!

    ఆమె పెద్ద పెద్ద కళ్ళలో భయం కనబడుతోంది. 'వెళ్ళొద్దు. ప్లీజ్!' అన్న అభ్యర్ధన కనబడుతోంది.

    ధైర్యంగా ఉండమన్నట్లు ఆమె భుజం తట్టాడు సాగర్.

    ప్రొఫెసర్ ని ఎత్తుకెళుతున్న ఏనుగు ఆ మడుగులోకి దిగబోయింది.

    కానీ అనుకోకుండా ఒక విశేషం జరిగింది అప్పుడు.

    రెండో వైపునుంచీ మరి మూడు ఏనుగులు వచ్చి అదే మడుగులో దిగాయి.

    'పక్కకి తప్పుకోమన్నట్లు అసహనంగా, పెద్దగా ఘీంకరించింది ఆనందరావుని పట్టుకుని ఉన్న మొదటి ఏనుగు.

    ఆ సవాలుకి జవాబులాగా ఘీంకరించింది ఆ మూడు ఏనుగుల్లో ఒకటి. అది వయసులో ఉన్న మొగ ఏనుగు.  వాళ్ళ గుంపులో ఉన్న ఏనుగులన్నింటికీ నాయకత్వం వహించాలని దానికి ఉబలాటం ఉంది దానిలో నిజంగానే లీడర్ షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి కూడా.

    పైగా, ఆ సమయంలో అది తనతోపాటు ఉన్న ఆడ ఏనుగులని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉంది.

    అందుకని, పౌరుషంగా అక్కడే కదలకుండా నిలబడిపోయింది.

    సాధారణంగా స్వజాతి జంతువులలో పోరాటం మూడు విషయాలలో జరుగుతుంది. తనది అనుకున్న ప్రాంతాన్ని [TERRITORY] రక్షించుకోవడం కోసం, గుంపులో నాయకత్వం కోసం, లేదా ఒక ఆడదాని కోసం పోట్లాడుకుంటాయి.

    అసలే చిరాగ్గా ఉన్న రోగ్ ఎలిఫెంట్ కి తిక్కరేగిపోయింది. తొండంతో గిరగిర తిప్పి విసిరేసింది ఆనందరావుని. అతనొక చెట్టుమీదపడి కొమ్మల్లో ఇరుక్కుపోయాడు.

    అతి వేగంతో వచ్చి, తనకు ఎదురు నిలిచినా ఆ కుర్ర ఏనుగుని ఢీ కొంది. మహొద్రేకంతో పోరాడటం మొదలెట్టాయి ఆ రెండూ.

    భయభక్తులతో పక్కకి తప్పుకుని, ఆ పోరాటాన్ని ఆదుర్దాగా చూస్తున్నాయి ఆడ ఏనుగుళు రెండూ.

    కాళ్ళతో మడుగు అంతా కలచివేశాయి ఆ ఏనుగులు. మడుగు అంతా బురద బురద అయిపోయింది ఢీ  కొన్నప్పుడల్లా ఆ ఏనుగుల కుంభస్థలాలు కొద్దికొద్దిగా చిట్లుతున్నాయి. వాటి ఘీంకారాలకి అడవి అంతా ప్రతి ధ్వనిస్తోంది.

    తలలతో ఒకదాన్ని ఒకటి నెట్టుకుంటూ, మడుగులోనుంచీ బయటికి వచ్చాయి అవి.

    వాటి భారీ శరీరాలు తగిలి అక్కడ వున్న చెట్లు అన్నీ ఒకటి తర్వాత ఒకటిగా పడిపోతున్నాయి. అంతా అల్లకల్లోలం అయిపోతోంది.

    ప్రొఫెసర్ ఆనందరావు కూర్చున్న చెట్టు చూడా వున్నట్లుండి ఒరిగి పోయింది.

    దబ్బున కిందపడ్డాడు ఆనందరావు. అయితే దెబ్బలేం తగల్లేద్దు  అతనికి. కాలు మాత్రం కొద్దిగా  బెణికింది. కుంటుతూ, కుంటుతూ పరిగెత్తి ఎదురుగా కనబడుతున్న గుహలోకి చేరుకున్నాడు.

    తనకు స్వాగత మివ్వడానికి రిసెప్షన్ కమిటీలూ అక్కడ నిలబడి వున్న మనుషులని చూడగానే అతని ఆశ్చర్యానికి, ఆనందానికే పట్టాపగ్గాలు లేకుండా పోయాయి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra