"ఓ. కే! వెళ్తాను! కానీ.... ఆమె మీద నమ్మకంతో నేను వెళ్లటం లేదు! ఆమెను నిలదీసి అడగటానికి వెళ్తాను!" అన్నాడు ప్రశాంత్.
"అది నీ ఇష్టం! నువ్వు ఆమెను కలిస్తే చాలట! క్షమించమని వేడుకుని వచ్చేస్తాను రుక్కూ.... నువ్వు అతనితో చెప్పి ఒప్పించూ... .అని ప్రాధేయపడింది!" అని చెప్పింది రుక్మిణి.
"చెప్పు ప్రశాంత్! నన్ను క్షమించానని ఒక్కమాట చెప్పు...." అంది మాధురి.
అతను గిరుక్కున వెనుతిరిగి ఆమెవైపు సూటిగా చూసాడు.
అతని కళ్లల్లో ఎర్రజీరల!
"నా మీద నీకెందుకంత పగ?" అన్నాడు ఆవేశంగా.
"పగ కాదు! ప్రేమ!" అంది మాధురి.
"హు! ప్రేమ! నిన్ను చూసేంతవరకు తెలీదు! నిన్ను చూసాకే నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది! ప్లీజ్ డియర్!...... నన్ను అర్దం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యి!"దీనంగా అంది మాధురి.
ప్రశాంత్ లో చలనంలేదు.
"ఓ. కే. ప్రశాంత్! నామీద నీకు నమ్మకంలేదు! సరే! ఆడదానికి తన అందచందాలే సిరిసంపదలు. ఇదిగో! ఏ అందచందాలని చూడటం కోసం మన కాలేజీ యువతరం వెర్రెత్తిపోతుందో, ఏ అందచందాల కోసం మగధీరులు బస్టాండ్ వద్ద, సందు చివర్లో... కాలేజీగేట్ల దగ్గర కాపుకాస్తుంటారో.... ఆ అందచందాలనిప్పుడు నీముందు బహిర్గతం చేస్తాను" అంది మాధురి దృఢనిశ్చయంతో.
అదిరి పడ్డాడు ప్రశాంత్.
"చూడు!ప్రశాంత్!ఇటు చూడు! నీకోసం నగ్నంగా నిల్చోడానికి ఈ మాధురీ సిద్దంగా వుంది! ఐ విల్ స్టాండ్ నేక్ డ్! నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో! నా మీద నీ పగ తీర్చుకో!!" అంది మాధురి. ... చీర కుచ్చిళ్లు లాగిపారేస్తూ. 11
ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంది.
మాధురి తన చీర కుచ్చిళ్లు నిజంగానే లాగి పారేస్తోంది.
ఇది కలా? నిజమా?
అందానికి అందాన్నిచ్చే అతిలోక సుందరి....
అపురూప సౌందర్యరాశి....
ఇలా ఒంటరిగా....
తన కళ్లముందు... తనని తానే కానుకగా అర్పించుకోడానికి సంసిద్దంగా వుందంటే అది నమ్మశక్యంగాని నగ్నసత్యంలా వుంది.
గులాబీ రంగు శరీరం....
విశాలమైన కురులు....
పురుష జాతినే సవాల్ చేసేలా ఉప్పొంగే అవయవసౌష్టవం. ....
చూపులతోనే మాట్లాడగలిగే పెద్ద పెద్ద కళ్లు, కురుదైన నాసిక, చిన్ననోరు, ఎర్రని పెదవులు, నిగనిగ మెరిసే బుగ్గలు, శంఖంలాంటి మెడ, ఎత్తయిన గుండెలు, గుండ్రని భుజాలు, జాకట్టుకీ చీరకట్టుకీ మధ్యన పాముకుబుసంలా నున్నగా సన్నగా వున్న నడుము, సంపెంగ లాంటి బొడ్డు, ఎత్తయిన పిరుదులు, బిగువుగా చీరకట్టులోంచి అంచనాలకి సులభంగా అందుబాటులో వున్న బలమైన తొడలు, కలువరేకుల్లాంటి సుకుమారమైన పాదాలు...