Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 18

    " అర్ధమైందిరా కర్ణా జయచిత్రా! నీ కళ్ళు లేడిని పోలివున్నాయి. నీ నడుం పిడికెడే వుంది. అలాగేనా?"

    " అలాగే సందర్భాన్ని బట్టి మన పొగడ్త మారుతూ వుండాలి. ఎలాగో చెప్పు!"

    " మి మాటలు ముత్యాలు ,మూటలు."

    " మి నవ్వు చిలక నవ్వు జయా!"

    " మి నడక హంస నడక."

    " మి చూపులు మన్మధ బాణాలు."

    " ఛా... ఛా... వున్నట్లుండి మన్మధ బాణాలు దగ్గర కెళ్ళావేమిటిరా! తప్పు. జయచిత్ర వింటే...!"

    " నిజమేరోయ్! వింటే మన్మధ బాణాలు కాదు నిప్పు రవ్వలు కురుపిస్తుంది. జయచిత్ర చూపుల్లో చురుకు వుంది. జయ... జ..." గుమ్మం దాతబోతున్న జయచిత్రను చూసి కంగారుపడ్డాడు వ్యాకర్ణ.

    అబ్బులు జయచిత్రను చూడలేదు. జ.. జ.. ఏంటిరా? జయచిత్ర జపం చేస్తున్నావా ఏమిటి?" అన్నాడు.

    గుమ్మందాటీ లోపకి కడుగుపెట్టిన జయచిత్ర అబ్బులి మాట విననే వింది. " ఏమండో య్! నే లేకుండా నా పేరేత్తుతున్నారు?" అంటూ ఉరుములా గర్జించింది.

    వ్యాకర్ణకి ముచ్చెమటలు పోసేశాయి. ముందుగా చమట తుడుచుకుని నెప్పరిల్లింది అబ్బులే.

    " జయచిత్ర మా వాడి ఫేవరేట్. ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడల్లా జయచిత్రని మెల్లకన్ను, గొగ్గిప ళ్ళు ,కొంగముక్కు, కొరివికారం అంటూ ఎక్కిరిస్తుంటాను.

    అది వీని మావాడు వుడుక్కుంటాడు. మిరొచ్చే ముందే జయచిత్రని ఏడిపించాలని ఆహా... కాదు... కాదు... మావాడి నేడిపించాలని జయచిత్రది ఏడుపు ముఖం అన్నాను.

    అలా కోపంగా చూస్తున్నా రేమిటి? మిమ్మల్ని కాదండి. మావాడి ఫేవరేట్ జయచిత్ర ముఖం..."

    " ఆపండి" జయచిత్ర గట్టిగా అంది.

    అబ్బులు అబద్దాలు కట్టిపెట్టి నోరు మూసేశాడు.

    " పంపికా రాలేదని మంచినీళ్ళు  తనింట్లోవి  ఓ కూజా బిందెడిస్తానని" వెళుతూ వెళుతూ బామ్మగారు చెప్పి వెళ్ళింది.

    స్టీలు కూజా బిందెనిండా మంచినీళ్ళతో జయచిత్ర గదిలోకి వచ్చేటప్పటికి అబ్బులు, వ్యాకర్ణ జయచిత్ర గురించి మాట్లాడుకుంటుంన్నారు. అదే జయచిత్ర వింది.

    నడుంకి స్టీలు బిందె ఎత్తుకుని చీరకొంగు దోపి వాలుజడ ముందు కేసుకుని ముంగురులు ముఖాన దోబూచులాడు తుండగా కళ్ళల్లో కోపం తొణికిసలాడుతుండగా వ్యాకర్ణకి జయచిత్ర ఎంతగానో నచ్చింది. ఉపాయం తోచింది.

    ఒక్క ఉదుటున లేచి జయచిత్రనడుకి అటిపెట్టుకుని వున్న నీళ్ళబిందెని అందుకుని, " అరెరే! మా కోసం మిరు కష్టపడి మి యింటినుంచి బిందె మోసుకు రావాలా? మేమొచ్చి తెచ్చుకోలేం ! మా కాళ్ళు నొచ్చేనా? మా చేతులు నొచ్చేనా? మా నోరు పిదచక ట్టుకుపోయేనా!" అని.

    ఆపై జయచిత్రని కిందనించి పైకి, పైనుంచి కిందకు చూసి-" మికు కోపం రాదంటే చిన్నమాట జయచిత్ర గారూ!" అన్నాడు.

    ఆ మాటేంటో తెలుసుకోవాలన్నా కుతూహలంతో , " నాకు కోపం రాదులెండి. చెప్పండి" అంది జయచిత్ర.

    " మరండి, మిరండి, అచ్చం జయచిత్రలా వున్నారండి. అరె, మిరు కోపంగించుకోనని చెప్పారు. మళ్ళీ కోపంగా చూస్తున్నారు.

    అర్ధం? ఓహో జయచిత్ర కన్నా అందంగా వున్న మిమ్మల్ని జయచిత్రతో పోల్చానని కోపమా? సారి,అబ్బసారీ చేపాకదండి, అందమైన అమ్మాయిలకు అంతకోపం పనికి రాదండి.

    అన్నట్లు కాళిదాసు యేం చెప్పాడో తెలుసా అండీ? కోపంవల్ల అందం తరిగిపోతుందని చెప్పడండి.    

 Previous Page Next Page