Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 19

        "అదంతే... చెవిటి వాళ్ళు కేవలం మన పెదవుల కదలిక వల్లే మనం ఏ  మాట్లాడుతున్నామో ఊహించగలరు.భస్మను కేవలం నా టోన్ కు మాత్రమె ట్యూన్ అవ్వగలిగేలా చేశాను.
    ఇన్నాళ్ళు అతను మాట్లాడిన మాటలు చాలా తక్కువ. అతనికి మాట్లాడ్డమే ఓ విచిత్రం.కావాలనే అతన్ని మెల్లి మెల్లిగా మనుష్యుల్లో తిరగాలి. మనుష్యులను పరిశీలించాలి. వాళ్ళతో మాట్లాడ్డం అలవాటు చేసుకోవాలి. అదంతా ఇప్పుడు కుదర్డు...
    అతడ్ని మనకు అనికూలంగా మరల్చుకున్నాం..."
    "వెరీ గుడ్... అగర్వాల్ సాబ్... ఇప్పుడతడ్ని ఏం  చేయదల్చుకున్నారు?" అడిగాడు ఖాన్.
    "తినబోతూ రుచి అడగడం ఎందుకు? వెయిట్ అండ్ సీ..." అంటూ భస్మను ఓ సెల్ వైపు నడిపించుకుంటూ వెళ్ళాడు.
    విశాలమైన ఆ హాలు మధ్య ఓ సలుమ్ది. భస్మ సెల్ లోకి వెళ్ళగానే రిమోట్ తో ఓ నెంబర్ నొక్కాడు. సెల్ డోర్ క్లోజయింది. పక్కనే వున్న మెయిన్ అన్ చేశాడు.
    "ఏం చేస్తున్నారు?" కంగారుగా అడిగాడు కరంజయా.
    ఆ సెల్ లో ఎలక్ట్రిక్ పాస్ అవుతూంది.పొరపాటున దాని మీద చేయ్యస్తే మన పని మటాష్..." అన్నాడు అగర్వాల్.
    "మైగాడ్...భస్మ చేయివేసినా..."
    "అంత రియాక్షన్ ఉండదు.... కొద్దిపాటి షాక్ తప్ప..." అన్నాడు.
    భస్మ ఆ సెల్ లోపల కుర్చీలో కూర్చున్నాడు. రకరకాల వైర్లు భస్మ బాడేకి కనెక్ట్ చేయబడి వున్నాయి.
    "అ వైర్లు ఎందుకు?" కరంజయా లో మళ్ళీ అనుమానం. దాని ద్వారా వుద్యుత్ అతని బాడీ లోకి వెళ్తుంది. మెల్లిమెల్లిగా అతని బాడీ విద్యుత్ కు ఎడిక్ట్ అవుతుంది.
    విష కన్యల గురించి తెలుసుగా... ఇప్పటికీ దక్షణాప్రికాలో ఓ అడవి తెగలో... పెద్ద పెద్ద త్రాచుపాములను పట్టుకుని వాటి విషం పింది ఆ తెగలోని ఆడవళ్ళకు తాగిస్తారు. అప్పుడే పుట్టిన పసిబిడ్డకు చుక్కలు చుక్కలుగా అలవాటు చేస్తారు. ఆ బిడ్డ శరీరం విషమయం అవుతుంది.
    ఒక విధంగా దీనికీ, దానికీ పెద్ద తేడా లేదు... భసం శరీరం కొద్దికొద్దిగా విద్యుత్ కు ఎడిక్ట్ అవుతుంది.మామూలుగా మనం మెయిన్ అన్ చేస్తే విద్యుత్ ప్రవహిస్తుంది. భస్మ మెదడులో కూడా మెయిన్ వుంది" అగర్వాల్ చెప్పాడు.
    "మెయినా? ఎక్కడ?"
    "ఆ మేయినే... భస్మ తలలో వున్నా మూడో కన్ను!"
                                                ***
    "నిజమా?" కరంజయా గొంతులో విస్మయం.
    "హండ్రెడ్ పర్సెంట్ ఫాక్ట్... అతని కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో... ఆ మరుక్షణమే అతని మూడో కంటిలో నుంచి విద్యుత్ తరంగాలను ఆ చుట్టుప్రక్కల  ప్రాంతంలోకి ప్రవహించి.... అక్కడున్నా వాళ్ళని శాక కు గురి చేస్తాయి. దాని తీవ్రతను బట్టి... ఆ ప్రాంతం భస్మమైన ఆశ్చర్యం లేదు.
    కొన్ని వేళ వోల్టుల విద్యుత్ అతని శరీరంలో చిన్న కదలిక... మెల్లి మెల్లిగా అతని శరీరంలోకి విద్యుత్ ప్రవహిస్తుంది. పళ్ళు బిగువున బాధని అనిభవిస్తున్నాడు.
    "సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూశారా?" కరంజయా ఖాన్ తో అన్నాడు.
    "అవును. అయితే ఒక్కోసారి సైన్స్ కు కూడా అంతుబట్టని సంఘటనలు జరుగుతుంటాయి."
    "న్యూయార్క్ లో నాలుగు చేతులతో బిడ్డ పుట్టింది. మిగతా రెండు చేతులకు సరైన కదలిక లేదు. పురాణాల్లో దేవుళ్ళకు నలుగు చేతులు ఉండేవని చదువుకున్నాం. మన దేశంలోనే చాలా సంవత్సారాల క్రితం... ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఓకే కన్నుతో బాబు పుట్టాడు. రెండు కనుబొమ్మల మధ్య కన్ను వుందిట.
    మూడు కళ్ళతో బిడ్డ పుట్టడం మనం చూసాం . వీటికి లాజిక్కుల రీజనింగులూ వెతుక్కుంటూ కూచోలెం. కొన్నింటికి రీజినింగులు చెప్పుకున్నా... ఇంకా ఆ రీజనింగులకు అందని నిజాలెన్నో సైన్స్ చాటున వున్నాయి.
    అలంటి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు..." అగర్వాల్ అన్నాడు.
    ఖాన్ పెదవుల మీద ఓ విషపూరిత దరహాసం...
                                                                      ***
    వెల్లకిలా పడుకుని ఆలోచిస్తోంది మౌన.
    భస్మ ఆమెకు ఒక పట్టాన అర్ధం కావడంలేదు.
    రాత్రంతా ఆలోచించింది.
    ఓ అందమైన ఆడపిల్ల తనకు తానుగా అద్వాన్సయినా అతను చలించలేదంటే, అర్దమేంటి?
    రాత్రంతా కూచుని ఆలోచించింది. నిద్ర రావడంలేదు. భస్మ కాళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ప్రేమంటే ఇంత ఉద్వేగభరితంగా ఉంటుందని ఆమెకు మొదటిసారి అర్దమైంది.
    అతని ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతను తనతో చనువుగా వుండలేదు. అతని జ్ఞాపకమూ తన దగ్గరలేదు. అయినా ఆమెలో ఏదో ఉద్వేగం...
    ఆ రాత్రి ఎలా తెల్లారుతుందా? అని ఆలోచించి... ఓ నిర్ణయానికి వచ్చింది.
    వెంటనే తన పుస్తకాల ర్యాక్ లో వున్నవాటిని వెతికి, దులిపి ప్రేమ మీద కొటేషన్లు ఉన్న పుస్తకం తీసింది. వెంటనే ఓ కొత్త నోట్ బుక్ తేసుకుని రాయడం మొదలుపెట్టింది. చాలామందికి 'ఇది నాకు తెలిసే...' అనిపించే కొటేషన్లు... అయినా డెప్త్ లోకి వెళ్తే వాటిలో అర్దత టచ్ అవుతుంది.
    చార్లీ చాప్లీన్ రాసిన కొటేషన్ ఆమె మనసుకు టచ్ అయింది. భావుకత్వమావు, సెన్సాఫ్ హ్యూమరో... రెండూ కలసిన భావమో...
    స్వెటర్ కన్నా అధికంగా చలి నుంచి రక్షించేది ప్రేమ... అది ఉదయం బోజనం పెరుగుతుంది కూడా..."

 Previous Page Next Page