"అరే... ఓపక్క అమ్దమైనామ్మయిఉని పెట్టుకుని తాపీగా బాత్రూం లోకి దూరతావు.ఇదేమైన న్యాయంగా వుందా? నేను మాట్లాడుతుంటే అరవ సినిమాకు కుదరని తెలుగుదబ్బిమ్గ్ లా వుంది నీ పొజిషన్..." వళ్ళు మండి అంది మౌన.
భస్మ మాత్రం బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. కొద్దీ క్షణాల తర్వాత షవర్ నుంచి నీల్లుదారగా పడుతోన్న శబ్దం వినిపించింది.
జీపుడు స్నానం చేస్తున్నాడు కాబోలు... అనుకుంది.
విసుగ్గా వాచీవంక, వాచీలో తిరుగుతున్న సెకను ముళ్ళు వంక చూసింది.
పావుగంట తర్వాత బయటకు వచ్చాడు భస్మ. వస్తూనే టవల్ విప్పి మంచంమీద గిరాటేశాడు. ఆ దృశ్యం చూసి ఒక్కసారి గా కెవ్వున కేకవేసి,
"పోస్టాఫీసు...పోస్టాఫీసు.. అని అరిచింది కళ్ళు మూసుకుని భస్మ మాత్రం తపేగా హ్యంగర్ కు తగిలించివున్న బట్టలు తీసుకుని వేసికోసాగాడు.
మెల్లగా ఓ కన్ను తెరచి చూసింది.
ప్యాంట్, షార్ట్ వేసుకోవడం అయినట్టుంది. అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. పిచ్చెక్కిన సెన్సేషన్ కలిగింది మౌనకు.
అసలీ మనుషికి మరో మనిషి వుందన్న స్పృహ లేదా? అన్నా డౌట్ వచ్చింది.
భస్మ తయారై 'కీ' తీసుకుని బయటకు వెళ్తున్నాడు. వెంటనే భయమేసింది. మౌనకు.
తనలాగేవుంటే, బయటకు వెళ్ళి తనని గదిలోనే ఉంచి తాళం వేసేలా వున్నాడన్న అనుమానం వచ్చేసి అనుమానాన్ని కన్ ఫర్మ్ చేసుకుని భస్మ కు అడ్డుగా నిలబడి, అతని చేతిని తన చేతిలోకి తీస్కోనీ ఆ చేతిని గట్టిగా నిలబడి, అతని చేతిని తన చేతిలోకి తీస్కోనీ ఆ చేతిని గట్టిగా వూపుతూ... "హాలో... అయాం మౌన... మౌనాంజలి. గుడ్ గాళ్ ని..." అంది.
భస్మ ఒక్కక్షణం తన చేతిలో వున్న ఆమె చేతి వైపుచూసి ఆమె చేతిని తోసేసి... ముందుకు కదిలాడు.
వెంటనే పరుగున బయటకు వచ్చేసింది.
భస్మ ప్లాటుకు లాక్ చేసి, మెట్ల మీదుగా గ్రాండ్ ప్లోర్ లోకి వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు.
మౌన అక్కడకి వచ్చేలోగా... బైక్ స్టార్టయింది.
'షిట్... ఏం మనిషో...' అనుకుంది చిరాగ్గా మోఎన. ఎలాగైనా అతడిని ఈరోజు పరిచయం చేసుకోవాలనుకుంది. కానీ, ఇంత కేర్ లెస్ గా బిహేవ్ చేస్తాడనుకోలేదు.
***
ఢీల్లీలో పెద్ద దుమారం.
నితీష్ రాయ్ హత్య వార్త నగరమంతా కార్చిచ్చులా వ్యాపించింది.
పత్రికా ప్రపంచం నివ్వెరపోయింది.
ఓ పత్రికా విలేకరి హత్య కాబట్టి ఆ వార్త మరింత సెన్సేషనల్ ని క్రియేట్ చేసింది.
హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు మౌన ప్రదర్శన జరిపారు.
పత్రికల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
పోలీసుల్లో కలకలం.
హత్యకు గురైంది పత్రికా విలేకరి కాబట్టి, పత్రికలు ఈ సంఘటనను అంత త్వరగా వదలి పెట్టావు. అదీగాక బ్యాంకు రాబరీ... అందులో సెంట్రీ సజీవ దహనం... అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్ధం కావడం లేదు.
అసలే ఈమధ్య ఢీల్లీలో క్రైమ్ రేటింగ్ పెరిగిపోతోందని ఆ సెంబ్లీలో గొడవ... ఇలాంటి పరిస్థితుల్లో మరో తలనొప్పి.
ఫోలీసులు ఇంవిస్ట్ గేషన్ ని త్రీవ్రతరం చేశారు. ఫోలీస్ డాగ్స్ వచ్చాయి. పిమ్గర్ ప్రింట్స్ నిపుణులు వచ్చినా ఏమీ చేయలేకపోయారు.
***
"మనం అనవసరంగా ఫోకస్ అవుతున్నాం" అన్నాడు ఖాన్.
"తప్పదు ఖాన్ సాబ్... ఆ రిఫోర్టర్ కు జరిగిన సన్మానం చూసి మిగతా రిఫావుర్తర్ భయపడిపోవాలి. వణికిపోవాలి. అందుకే అతనికా ట్రీట్ మెంట్ అదీకాక, మనం కామ్ గా వుంటే ఆ నితీష్ రాయ్ ఏదో ఓ గొడవ తెస్తాడు.అతను సామాన్య వ్యక్తి కాదు. చిచ్చరపిడగు. మనందర్నీ పత్రికలో ఉతికి పారేసేవాడు" చెప్పాడు కరంజయా.
"నిజం ఖాన్ సాబ్... అయినా భస్మ గురించి మనం భయపడాల్సిన పని లేదు. అతన్ని ఐరన్ మెన్ గా తయారుచేస్తాను" సైంసిస్ట్ అగర్వాల్ అన్నాడు.
"ఏం చేస్తారో నాకు తెలియదు. మరో ఆరునెలల్లో భస్మ కరెంట్ మెన్ కావాలి..." చెప్పాడు ఖాన్.
"ష్యూర్ తప్పకుండా..." అన్నాడు అగర్వాల్.
"ఇప్పుడు భస్మ ఎక్కడున్నాడు?" అడిగాడు ఖాన్.
"మన దగ్గరకే వస్తున్నాడు. ఎలక్రకల్ సెల్ లో అతడ్ని ఓసారి టెస్ట్ చేసి... అతని బాడీలోకి విద్యుత్ తరంగాలను పంపించాలి..." చెప్పాడు అగర్వాల్.
సరిగ్గా అప్పుడే... భస్మ వచ్చాడు.
"కమాన్ భస్మా... కామన్..." అగర్వాల్ వెళ్ళి భస్మకు ఒసీటు చూపెట్టి కూచోమనన్నాడు.
భస్మ కూచున్నాడు.
"హౌ ఆర్యూ బ్స్మా..." అడిగాడు అగర్వాల్.
"ఫైన్.." చెప్పాడు.భస్మ.
"గుడ్ మార్నింగ్ భస్మా..." కరంజయా చేతిని ముందుకు చాచాడు.
భస్మ నుంచి రియాక్షన్ లేదు.
"హలో... భస్మా! గుడ్ మార్నింగ్..." మాడిపోయిన మోహంతో మరోసారి అన్నాడు.
అయినా భస్మ మాట్లాడలేదు.
"ఏంటి అగర్వాల్ జీ..." కోపంగా అన్నాడు కరంజయా.
"మీరు మరచిపోయినట్టున్నారు కరంజయా సాబ్. భస్మ నామాటలకు మాత్రమే ట్యూన్ అవుతాడు.మిగతా వాళ్ల మాటలకు రియాక్ట్ అవ్వదు."
"అదేంటి?"