Home » Yandamuri veerendranath » అష్టావక్ర


    మహాదష్ట చరచరా వెళ్ళిపోయాడు.

    వెనుకే రెడ్ స్కెలిటన్స్ కూడా.

    అలాగే నిలబడి వున్న రాకేష్ పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. కుట్టి సైతాన్ అనుగ్రహం వుంటే ఏదీ ప్రాణాంతకం కాదు. ఇక డబ్బు సంగతంటేనా.... కేదారగౌరి అమాయకత్వం అలా వున్నంత కాలమూ దానికీ లోటు లేదు.


                    *    *    *    *


    "నేను కొంతకాలం నుంచి నిన్ను గమనిస్తూ వున్నాను. ఈ మధ్య అదోలా వుంటున్నావేమిటి బావా-"

    రాకేష్ తలెత్తి ఆమెవంక చూశాడు. అతడి మొహం భావరహితంగా వుంది.

    "ఎందుకో చెప్పవా?"

    "వద్దులే గౌరీ..."

    "ప్లీజ్ చెప్పవా. చెప్పకపోతే నా మీద ఒట్టే".

    అతడు కుర్చీలోంచి లేచాడు. ఒకటి రెండుసార్లు పచార్లు చేశాడు. ఆగి ఆమె వంక చూశాడు. తరువాత తలవంచుకుని, నెమ్మదిగా అన్నాడు.

    "నేను ఇక్కడగానీ, చివరికి ఒకప్పుడు నువ్వు వున్న ఆ ఇంట్లో.... మావయ్య దగ్గిరగానీ అసలు వుండలేకపోతున్నానంటే నమ్ముతావా?"

    "నమ్ముతాను".

    "గుడ్ నువ్వు తెలివైనదానివి. అందుకే నా ఫీలింగ్స్ ని అర్ధం చేసుకోగలిగావు. ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి. దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలి. ఊపిరి సలపనంత పనుల్లో మునిగిపోవాలి. అప్పుడే నా మనసుకి కొంత విశ్రాంతి దొరుకుతుంది".

    "అనవసరంగా నువ్వు చిన్న విషయాన్ని కొండంతలు చేస్తున్నావేమో అనిపిస్తూంది నాకు. నువ్వు ఊఁ అంటే నా కన్నా వెయ్యి రెట్లు అందమైనవాళ్ళు దొరుకుతారు". 

    "కానీ నీ అంత మంచివాళ్ళు దొరకరు".

    ఆమెకీ సంభాషణ చాలా ఇబ్బందికరంగా వుంది. కానీ అనవసరంగా అతడి జీవితంలో ఒక గొప్ప ఆశాభంగం కలగటానికి తాను కారకురాలనయ్యానేమో అన్న అనుమానం ఆమెని అమితంగా బాధిస్తూంది.

    "నువ్వు ఏదైనా వ్యాపారం పెడతానంటే కాదన్నది ఎవరు బావా" అని అడిగింది.

    "ఇక్కడ కాదు ఏ బొంబాయిలోనే- మద్రాసులోనో".

    "నీ ఇష్టం-"

    "కానీ మావయ్య వప్పుకోడేమో-"

    చాలాసేపు తరువాత ఆమె మొదటిసారిగా నవ్వింది. "నేను అడిగితే నాన్న కారణం కూడా తెలుసుకోకుండా వప్పుకుంటాడు. చెప్పు, ఎంత కావాలి?"


                   *    *    *    *


    "ఎంత? రెండు లక్షలా?" అన్నాడు భవానీశంకరం.

    "అవును నాన్నా! రాకేష్ ని ఒక ఇంటివాడిని చేయవలసిన బాధ్యత మన మీద వుంది. దానికన్నా ముందు తనకో వ్యాపకం కలిగించాలి. అందుకే ఈ బిజినెస్..."

    "రాకేష్ ఎక్కడున్నాడు?" ఆమెని 'కట్' చేస్తూ అన్నాడు భవానీ శంకరం. అతడి మొహం అదోలా వుంది. తండ్రి అలా వుండటం ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎంతో ఆశగా వచ్చింది. తను అడగ్గానే అతడు ఒప్పుకుంటాడనీ, పని సులభమవుతుందనీ అనుకుంది. కానీ రాకేష్ పేరు చెప్పగానే అతడి మొహంలో ఒక అనూహ్యమైన మార్పు కనబడటంతో విస్మయం చెందింది.

    "రాకేష్ ఎక్కడున్నాడు?" ఈసారి ఆయన కంఠం మరింత కఠినంగా వినపడింది.

    "ప... పల్లెలో".

    "నువ్వెళ్ళు. అదే కారులో రాకేష్ ని పంపించు".

    "కానీ నాన్నా".

    "నాకు వెంటనే అతడు కావాలి-" ముక్తసరిగా అని, లేచాడు భవానీశంకరం. ఆమె తండ్రివైపు చూసి, అతడి మొహంలో భావాలు గ్రహించటానికి ప్రయత్నించింది. కానీ ఏమీ తెలియలేదు. 'ఇక నువ్వెళ్ళు' అన్నట్టు చూశాడు.

    ఆమె వెళ్ళి రాకేష్ ని పంపేవరకూ ఆయన ముళ్ళమీద వున్నట్టే వున్నాడు. ఆ సాయంత్రం రాకేష్ వచ్చాడు. అయితే గౌరి అతడికి తండ్రి ప్రవర్తన గురించి ఏమీ చెప్పలేదు. ఒకసారి చూడాలనుకుంటున్నాడని మాత్రం చెప్పింది.

    రాకేష్ హుషారుగా లోపలికి ప్రవేశిస్తూ "ఏమిటి మావయ్య" అన్నాడు.

    అది భవానీశంకరం ఆఫీసు గది. పూర్తి ఎయిర్ కండీషన్డ్ -టైట్ రూమ్ అది. విశాలమైన టేబిల్ ముందు రివాల్వింగ్ చెయిర్ లో కూర్చుని వున్నాడు ఆయన. లోపలికి ప్రవేశించిన రాకేష్ వైపు కన్నార్పకుండా చూశాడు కొంచెంసేపు.

    "కూర్చో" అన్నాడు.

    అతను కూర్చుంటూ వుండగా వెళ్ళి తలుపు బోల్టువేసి వచ్చాడు. రాకేష్ దాన్ని విస్మయంతో చూశాడు.

    "నేను నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను".

    భవానీశంకరం డ్రాయర్ లోంచి ఓ కవరు తీసి టేబిల్ మీద పడేసి, "ఇదేమిటో నీకు తెలుసా?" అని అడిగాడు.

    "ఏమిటి?"

    "ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ వ్యాస్ దగ్గిరకు నువ్వు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో చెపుతావా?"

    రాకేష్ ఉలిక్కిపడ్డాడు.

    ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. ఇప్పుడెలా బయటికి వచ్చింది.

    "రాకేష్! ఈ భవానీశంకరం డబ్బులో పెరుగుతున్నవాడు. అనుక్షణం పరిసరాల్నీ- శతృవుల్నీ గమనిస్తూ వుండటం నా అలవాటు. పోతే పేషెంటుయొక్క రహస్యాల్ని ఏ డాక్టరూ వెల్లడించడు. కానీ డబ్బు కొనలేనిది ఏదీ లేదు. నిన్ను చేసిన పరీక్షల తాలూకూ వివరాలూ, పెంథాల్ మత్తులో ఆ రోజుల్లో నువ్వు ఆయనకి వెల్లడి చేసిన వివరాలూ, వాటి తాలూకు కాపీ ఇది! నువ్వు ఎంత నీచుడివో- ఎలాంటి సైకోపాత్ వో తెలిపే పత్రాలు ఇవి...." ఆయన ఆగాడు.

    "నాకు చాలా రోజుల క్రితమే నీమీద అనుమానం వచ్చింది రాకేష్. ఎందుకో నీ ప్రవర్తన చిత్రంగా తోచింది. కానీ అంతగా పట్టించుకోలేదు. అందుకనే నా కూతురు నిన్ను చేసుకోనంటే సంతోషించాను. కానీ ఆ తరువాతే దారుణమైన రహస్యాలు బయటపడినయ్. అందులో ఈ రిపోర్టు ఒకటి. దీని ప్రకారం నువ్వు చాలా సైకోపాథెటిక్ సిట్యుయేషన్ లో వున్నావు. ఒక రకమైన క్రూరత్వంతో కూడిన పిచ్చితనానికి అది పరాకాష్ట. మైగాడ్! ఇంతలో నా కూతురికి ప్రమాదం తప్పింది!!!!"

    ఆయన ముందుకు వంగాడు. "నా అనుచరులు నీ గురించి వివరాలు సేకరిస్తూనే వున్నారు. ఇప్పుడు చెప్పు రాకేష్- పదవ క్రాస్ స్ట్రీట్ లో తలుపులు మూసివుండే రెండంతస్థుల భవనంలోకి తరచు ఎందుకు వెళ్తున్నావ్? దానికీ నీకూ ఏమిటి సంబంధం? మొన్న ఒరిస్సా ఎందుకు వెళ్ళావ్? నీతోపాతూ వచ్చిన ఆ ముసలాడు ఎవరు?"

    అగ్నిపర్వతం బ్రద్ధలై వచ్చినట్టు వచ్చిన ఆ వార్తకి ఇంకొకరైతే కంగారుపడి వుండేవారేమో. కాని రాకేష్ మాత్రం మామూలుగానే వున్నాడు.

    "ఏమంటున్నావ్ మావయ్యా నువ్వు? నేను సైక్రియాటిస్టు దగ్గరికి వెళ్ళటం ఏమిటి? సైకోపాథిక్ అవటం ఏమిటి?" అన్నాడు అమాయకంగా.

    "రాకేష్! నీలాటి వాళ్ళని లక్షమందిని చూశాను నా అనుభవంలో.... బుకాయించకుండా నీ ప్రాబ్లెమ్స్ చెప్పు".

    "నాకా! నాకేమీ ప్రాబ్లెమ్స్ లేవే...."

    "రాకేష్.... గత పది సంవత్సరాల్లో సైన్సు బాగా అభివృద్ధి చెందింది. మనిషి చెప్పకపోయినా మనసులో భావాలు కనుక్కునే కంప్యూటర్లు వచ్చినయ్. ఈ రిపోర్టు ప్రకారం నువ్వు హైపర్ టెన్షన్, సోమ్నాంబులిజమ్ లాటి మామూలు సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. కానీ ఆ తరువాత ఆయన చేసిన పరిశోధనలవల్ల అంతకన్నా దారుణమైన విషయాలు బయటపడినయ్".

    ఆయన ఆగాడు.

    రాకేష్ నిర్వికారంగా ఆయనవైపు చూస్తున్నాడు.

    "ఆ తర్వాత రహస్యంగా నీ గది వెతికాను. హాషిష్ దొరికింది. డ్రగ్స్ కి అలవాటు పడ్డావని తెలిసింది. తిరిగి మళ్ళీ ఆ సైక్రియాటిస్ట్ ని కలుసుకున్నాను. నీ సైకిక్ కొలాప్సింగ్ ని ఏ మందూ ఆపలేదని, ఇది మరింత హాని చేస్తుందనీ అయన చెప్పాడు. కానీ హఠాత్తుగా నువ్వు మామూలుగా ప్రవర్తించసాగావు. ఇదెలా సాధ్యం? సైన్సు కందని ఏదో అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యంకాదు. నువ్వు మామూలు మనిషివయి పోయావో లేదో తెలియని పరిస్థితుల్లో గౌరి తన వివాహంపట్ల నిర్ణయాన్ని తెలిపింది. సంతోషించాను కానీ నా అనుమానం అలాగే వుండిపోయింది. నువ్వు ఏదో ఒక రహస్య గ్రూపులో చేరావు రాకేష్! ఈ ప్రపంచంలో నీ మేలు కోరేవారు ఎవరైనా వుంటే నేనొక్కణ్ణే. నీ చిన్నతనంలో జరిగిన సంఘటనలూ, అవి నీ మీద చూపించిన ప్రభావాలూ అన్నీ నేను సానుభూతితో అర్ధం చేసుకోగలను. చెప్పు రాకేష్, ఈ గ్రూపు ఎవరు? నువ్వు పాల్గొంటున్న ఆ రహస్య సమావేశాలు ఏంటి? చెప్పకుండా తప్పించుకోగలవని అనుకోకు. ఈ రోజు కాకపోతే రేపైనా నేను దీన్ని తెలుసుకోగలనని నీకు తెలుసు. నువ్వే చెప్పడం మంచిది".

    రాకేష్ చాలాసేపటి వరకూ మాట్లాడలేదు. తర్వాత కుర్చీలోంచి లేస్తూ "మావయ్యా" అన్నాడు. అతడి కంఠం అదోలా వణికింది. "అన్ని విధాలా భ్రష్టుడనైపోయాను మావయ్యా నేను. ఇక బాగుపడదామన్నా పడలేను".

    "అలా అనకు రాకేష్! నీ గురించి నాకు తప్ప మరెవరికీ తెలియదు. నీ మంచికోరే, ఎవరికీ ఈ విషయం చెప్పలేదు నేను. నీతో వున్నప్పుడు కూడా, నా మనసులో అనుమానాల్ని ఏ మాత్రం బయటపడకుండా ప్రవర్తించిన విధానం నువ్వు గమనించే వుంటావు. అవునా?"

    "థాంక్స్ మావయ్యా. నేను.... నే.... ను-" అతడు మాట్లాడలేకపోయాడు. కళ్ళు మూసుకున్నాడు. పెదవులు వణుకుతున్నాయి. భవానీ శంకరం అతడి దగ్గిరకు వచ్చాడు. మేనల్లుడిని ఆప్యాయంగా దగ్గిరకు తీసుకుని ఆప్యాయంగా "చెప్పరా బాబూ" అన్నాడు.

    ముందతడికి తెలియదు. తర్వాత భగ్గున మండింది. గుండె పక్కగా, క్రిందవైపున- కాలేయం దగ్గిర.... దేనితోనో పొడిచినట్టు- లోపల గిర్రున తిప్పినట్టూ.

    చప్పున అడుగు వెనక్కివేశాడు. కానీ అతడితోపాటూ రాకేష్ కూడా అలాగే కౌగిలించుకున్నట్లు ముందుకు వెళ్ళాడు. "ఎవరికీ చెప్పకుండా నీలోనే దాచుకున్నందుకు థాంక్స్ మావయ్యా" అంటూ పేపర్ నైఫ్ తో మరోసారి కాలేయం దగ్గిర పొడిచాడు.

    భవానీశంకరానికి అప్పుడు తెలిసింది బాధ. నూతిలోంచి జలవూరినట్టు రక్తం బయటకు జిమ్ముతూంది. చేతివేళ్ళతో గాయాన్ని నొక్కిపట్టి వుంచటానికి ప్రయత్నించాడు. అయినా లాభం లేకపోయింది.

    పామునోట చిక్కిన కప్ప బయటపడటానికి చేసే విఫలయత్నాన్ని ఆనందంతో గమనించినట్టు రాకేష్ తాపీగా చూడసాగాడు. ఒక నిండు ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ శరీరం నుంచి బయటపడటానికి చేసే హృదయ విదారకమైన ప్రయత్నం కూడా అంత తాపీగా, మామూలుగా చూడగలిగే స్థితికి అతడు దిగజారేడంటే- కుట్టి సైతాన్ మరెక్కడో లేదు అతడిలోనే వుంది. అతడు మరోసారి పొడిచే ప్రయత్నం కూడా చేయలేదు. సరిగ్గా ఆయువుపట్టు చూసి, ఒకే ఒకసారి పొడిచాడు. అంతే!  

    భవానీశంకరం మోకాళ్ళ మీద క్రిందికి జారిపోయాడు. ప్రాణం పోతూందని తెలుసు. అయినా అరిచే ప్రయత్నం కూడా చేయలేదు. 'పాలుపోసిన పాము' అని తెలిసిన షాక్ లో వున్నాడు. ఒక మనిషి సాటి మనిషి మీద పెంచుకున్న నమ్మకాన్ని నిలువునా తోసేసిన షాక్ అది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra