పాదుకలు
సీతారామ లక్ష్మణులు చిత్రకూటమున నివాసమెర్చరచుకొని నెల దినములు కావచ్చినది. రాముడు "జానకీ ఈ వనవాసము తండ్రి మాటను నిలబెట్టుటకును భరతునకు సంతోషమును కలిగించుటకును మాత్రమే కాక మనకు ఆనందదాయకముగనూ సౌఖ్యప్రదముగను ఉన్నది" అన్నాడు.
లక్షణునకు సేన సందడి వినిపించినది. అతడొక వృక్షము నెక్కి పరికించినాడు. భరతడునూ అతని వెంట కదలివచ్చుచున్న రథ గజ తురగా పదాతులునూ కంటబడినారు. అతడు చెట్టునుండి డిగివచ్చి రాముని వద్దకుపోయి "అన్నా భరతుడు కైకేయి వరముతో సింహాసనమును అక్రమముగా ఆక్రమించుట చాలక మనకు హాని తలపెట్టి దండేత్తి వచ్చుచున్నాడు! ఆ తుంటరిని ఎదుర్కోనుటకు మనము ఆయుధములతో సిద్దముగా ఉండవలెను" అన్నాడు.
శ్రీరాముడు "లక్ష్మణా భారత శత్రుఘ్నులు తాతగారి యింటి అయోధ్యకు తిరిగివచ్చి మన మచ్చట లేనందున మనలను చూచుటకు వచ్చుచున్నా రనుకొందును. భరతుడు మనకు హానీ తల పెట్టువాడు కాదు" అన్నాడు.
శ్రీరాముని ఆశ్రమము కనబడుటతోనూ, తల్లులతోనూ వసిష్ఠ మహర్షితోనూ సచివులతోను మాతర్మే పోయి పర్ణశాలను ప్రవేశించినాడు. శ్రీరాముడు అనుజులను ఆలింగనము చేసికొని ఆనంద బాష్పములను గురిసినాడు తల్లులను పలకరించినాడు. దశరథ మహరాజు మరణించినాడని తెలియుటతోనే రామ లక్ష్మణులునూ జానికియునూ శోకించినారు. రాముడు తేరుకుని తండ్రికి గారపిండితో పిండి ప్రదానము చేసినాడు.
మరునాడు రాముడ౦ఱునూ తన చుట్టూ కూర్చునియుండగా భరతునితో "తమ్ముడా రాజ్యమును వదలి ఇప్పుడీ అరణ్యమునకేల వచ్చితివి?" అని అడిగినాడు.
భరతుడు: నా తల్లి వివేకమును విడిచి కోరరాని వరములను కోరినది. దశరథ మహారాజు "ఆడితప్పరాదన్న" నెపమున నిన్నరణ్యమునకు పంపినాడు. ఈ అకార్యచరణము వలన అయన అపకీర్తి పాలగుటయే కాక మరణాంతరము లభించవలసిన సద్గతిని కోల్పోయినాడు. నీవు వనవాసమునకు స్వస్తి చెప్పి అయోధ్యకు తిరిగివచ్చి సింహాసనము నదిస్థించి రాజ్యపాలనము చేయవలేను. ఆ విధముగా మహారాజు నపకీర్తిని పోగొట్టి స్వర్గమును లభింపజేయవలెను. నా తల్లి కైకేయి తన ఆధర్మ ప్రవర్తనకు పశ్చాత్తాప్తయైనది; తనను మన్నించి అయోధ్యకు మరలివచ్చి రాజ్యమేలు కొనుమని నిన్ను వేడుకొనుట కామే మాతో వచ్చినది. ఆమె పార్ధన నంగీకరింపుము.
రాముడు: కైకేయి మాత ప్రవర్తన ధర్మ విరుద్దమా లేక ధర్మ సమ్మతమూ అన్న చర్చ అప్రస్తుతము. మహారాజు 'అడుగుమిచ్చెద' నన్నాడు, ఆమె అడిగినది. నేను వనవాసమునూ నీవు రాజ్యపలనమునూ జేసి తండ్రి మాటను నిలబెట్టవలెను. అప్పుడాయనకు కీర్తి కలుగును: స్వర్గమునూ ప్రాప్తించును.
భరతుడు: తండ్రి మాటను నిలబెట్టుటకు రాజ్యపాలనమును ప్రారంభించేదను. ఎందుకనగా పాలకుడుగా నీవు నాకన్న సమర్దుడువు. అశ్వమునకు గల వేగము గార్ధభమునకుండదు. గురుత్మంతుని వలె వాయసము ఎగురజాలదు.
రాముడు : తమ్ముడా నీవు అసమర్దుడవని భావించకుము. ధర్మజ్ఞుడగు వసిష్ఠ మహర్షియూ రాజనీతి కోవిదులగు సచివొత్తములునూ నీకు అండగా నందురు. నీ రాజ్యపాలనమును ప్రజలు సుఖముగా నుండెదరు...... ఆ విషయమట్లుంచుము. నేనునూ తండ్రిమాటను నిలబెట్టుటకు పదునాలుగేండ్ల వనవాసానంతరము కాని రాజ్యము మాత తలపెట్టరాదు.