Previous Page Next Page 
రామాయణము పేజి 14

                                 

                                   

                                                                   9. భరతుడు

       
    కైకేయి తన వరద్వయమును గూర్చి వివరించి "నీ మార్గమును నిష్కంటకమొనరించుటకునే నా రెండవ వరమును కోరవలసివచ్చినది. సీతారామలక్ష్మణులు కానలకు పోయిననాడే 'అయోధ్యకు తక్షణమే రమ్మని' నీకు వర్తమానమంపినాను. నీవు చేరుటతోనే యువరాజుగా నిన్నభిషిక్తుని గావించదలచినాను. ఇప్పుడింక నీకు రాజుగనే పట్టము గట్టించెదను. పితృ మరణమునకు వగవకుము" అన్నది.   
    దశరథుని శరీరము చెడిపోకుండ తైలమున నిక్షిప్తము చేయబడెను. గిరివ్రజముననున్న భరత శత్రుఘ్నులకు "మీరు శీఘ్రముగ అయోధ్యకు రావలెను" అని వసిష్ఠ మహర్షి కబురు పంపినాడు. అంతకుముందే కైక నుండి పిలుపునందుకొన్న వారుభయులునూ వెంటనే బయలుదేరినారు. మార్గమున శత్రుఘ్నుడు "అన్నాకైకేయి మాత కాని వసిష్ఠుల వారు కాని మనలనిప్పుడయోధ్య కెందుకు రమ్మనిరో తెలుపలేదు" అన్నాడు. భరతుడు "బహుశః తండ్రిగారు శ్రీరామచంద్రుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయుచున్నారు కాబోలు" అన్నాడు. అగ్రజునిపై అత్యంత గౌరవభీమానములు గల భరతుడు శ్రీ రామునకు శుభమునే తలచినాడు.   
    వారు ప్రవేశించిన అయోధ్య వారూహించుకొన్నట్లు లేదు. నగర వీధులు కలావిహీనములై కనబడినవి. అంతటను నిశ్శబ్ద మావరించినది. ఎరిగినవారు కూడా పలకరించుట మానిదూరమునుండియే వైతొలగిపోవు చుండుట భరతుడు గమనించినాడు. "ఈ వైముఖ్యమునకు కారణమేమి? నగర మిటెందుకున్నది?"   
    వారు తిన్నగా కైకేయి భవనమునకు పోయినారు. భరతుడు తనకు కలిగిన సందేహముల నివృత్తికై ఆమెను ప్రశ్నించినాడు. ఆమె "అంతయు నీ బాగుకొరకే అనుకూలముగ జరిగినది" అన్న ధోరణిలో మాట్లాడినది. భరతునకంతయూ ఆయోమయముగ తోచెను. అతనికి తండ్రి జ్ఞప్తికి వచ్చి "అమ్మా నాయనగారేరి?" అని అడిగినాడు.   
    ఆమె "మీ నాయనగారు సమస్త ప్రాణులు వలెనే  కాలము తీరిపోయి స్వర్గస్థులైనారు" అన్నది. అతడు "తండ్రీ, తండ్రీ!" అని విలపించుచూ మూర్చపోయినాడు. తేరుకున్న పిదప "అయ్యో మిమ్ము సేవించుకొనుచూ అయోధ్య యందే ఉండిపోక గిరివ్రజమున నేల గడిపితిని." అని దుఃఖించుచూ "నా దుఃఖమును శామిమ్పజేయగలవాడు అగ్రజుడు శ్రీరామచంద్రుడే.  పోయి ఆయనకు పాదాభివందనము చేసెదను" అని లేచినాడు.   
    కైక: రాముడు పదునాలుగేండ్ల వనవాసమునకు పోయినాడు.   
    భరతుడు : (నిర్ఘాంతపోవుచూ) అట్లెందులకు జరిగినది? శ్రీరాముడు వరమ ధార్మికుడు. భ్రూణహత్యను చేసిన వానిని పంపినట్లు తండ్రి అతని అడవికి ఏల వెడలగొట్టినారు?   
    కైకేయి తన వరద్వయమును గూర్చి వివరించి "నీ మార్గమును విష్కంటకమొనరించుటకునే ణ రెండవ వరమును కోరవలసివచ్చినది. సీతరామలక్ష్మణులు కానలకు పోయినవాడే 'అయోధ్యకు తక్షణమే రమ్మని, నీకు వర్తమానమంపినాను. నీవు రాజుగనే పట్టము గట్టించేదను. పితృమరణమునకు వగువకుము" అన్నది.   
    తన తల్లి ఇట్టి అధర్మ ప్రవర్తనకు లోనగునని ఎంతమాత్రమూ ఊహించని భరతుని వదనము కోపాగ్నితో  ఎర్రబడినది. "దుర్మార్గులారా రాజ్య కాంక్షతో నీవు మాలో ఎవరునూ సుఖపడకుండ చేసినావు! నా తండ్రిని చంపివేసినావు! శ్రీరామచంద్రునీ సీతాదేవినీ లక్ష్మణునీ అడవులపాలు చేసి కౌసల్యాదేవికీనీ జనకమహారాజునకునూ సుమిత్ర మాతకునూ దుఃఖమును కలిగించావు! వారేవరునూ లేరని ఏడ్చేడి నిర్భాగ్యునకు నాకీ రాజ్యమెందులకు? పరాక్రమవంతుడునూ పాలనాదక్షుడునూ అగు శ్రీరాముడు మాత్రమె వహించగల రాజ్యభారము నేను మోయగలనా? మాహా వృషభము వహించగల బరువును లేగదూడ భరించగలదా? నేనీ రాజ్యము కావలెనంటినా? నేనునూ అగ్రజుని వద్దకుపోయి అడవులందు గడపేదను. నీవు కిరీటమును నెత్తిన పెట్టుకుని ఊరేగుము!" అనుచు అతడు కైకేయిని దూషించినాడు. కోపము నాపుకొనలేక దండ తాడిత భుజంగము వలె బుసలు కొట్టసాగినాడు. దుఃఖము ముంచెత్తుకొని రాగా వేటగాండ్రచే తరుమబడివచ్చి గోతిలో పడిపోయిన ఏనుగు వలె నేలపై కూలినాడు.   
    కైకకు నోటమాట రాలేదు! "నా ప్రయత్నమంతయూ ఇట్లేల విఫలమైనది?" అని ప్రశ్నించుకొనుచూ లోలోన కుమిలిపోయినది. ఆమెకిప్పుడు దశరథుడు మున్ను దుఃఖించుచూ అన్నమాట జ్ఞప్తకి వచ్చినది. "ధర్మపరుడగు భరతుడు నీ  ఆ కార్యమును  హర్షించడు! అని మహరాజు వంచించినాడు. అట్లే జరిగినది! భరతుడింక నన్ను ద్వేషించును. సపత్నులు నన్ను క్షమించరు! రాణి వాసమున నేనింక తలయెత్తుకొని తిరుగుజాలను! కేకయ రాజ దంపతులు నా వలన కలిగిన యప్రతిష్టకు కుందేదరు!" ఆమెకు దుఃఖము పొంగి వచ్చినది.
బయట గందరగోళమేదియో జరుగుచున్నట్లు వినబడి భరతుడు లేచి వెళ్ళినాడు. కైకేయూ అనుసరించి పోయినది. అచట భరతునికై నిరీక్షించుచూ నిలబడియున్న శత్రుఘ్నని యోదుట కొందరు పౌరులు గుమిగూడియున్నారు. గూనిదగు మంధర, కైకేయి బహుకరించిన రత్నహారములనూ సువర్ణా భరణములనూ అలంకరించుకుని ఆ దారిని వచ్చుచుండగా వారామేను  పట్టుకుని తెచ్చి శత్రుఘ్నుని పాదముల వద్ద పడవైచి "దశరథ నందనా జరిగిన అపచారమున కంతకునూ మూలకారణము ఈ వక్రాంగియే. ఈ దుర్మార్గురాలిని శిక్షించుము" అన్నారు. శత్రుఘ్నుడు భరతునితో  "అన్నా నీవీమెకు శిక్షను విధించుము. నేను అమలుపరిచేదను" అన్నాడు. భరతుడు "తమ్ముడా శ్రీరామచంద్రుడు నన్ను 'మాతృఘాతుకుడు!' అని నిందించుచున్న  భయముతో నేను పాపిష్టురాలైన కైకేయికి ఎట్టి యోగ్గునూ తలపెట్టలేదు. నీవీ మంధరను వాదించినచో ఆ ధర్మాత్ముడు మనలను క్షమించడు" అని చెప్పి కుబ్జను విడిపించినాడు. భరతుని వచనముల నాలకించిన కైకేయి వెక్కివెక్కి ఎడ్చుచూ లోనికి పోయినది.   
    వసిష్ట మహర్షి భరతునిచే దశరథునకు అంత్యక్రియులను జరిపించినాడు. పిమ్మట మంత్రులు భరతునితో  "నీవంక సింహాసనము నధిష్టించి రాజుగా బాధ్యతలను స్వీకరించుము " అన్నారు. భరతడు "గద్దె నేక్కుటకు అర్హుడూ, సమర్దుడూ రామప్రభువు కాని నేను కాదు. మనము చతురంగా బలముతో పోయి అగ్రజుని సగౌరవముగా  ఆహ్వానించి అయోధ్యకు తీసుకుని రావలేను. మన ప్రయాణమునకు ఏర్పాట్లును చేయుడు' అన్నాడు.   
    భరతుని కోరికపై మంత్రులనూ వసిష్టుడునూ కొందరు పురప్రముఖలునూ జానపద ముఖ్యులనూ అతనితో వెళ్ళినారు. సీతారామ లక్ష్మణులను చూడవలెనన్న ఆత్రుతతో కౌసల్యయూ సుమిత్రయూ పోయినారు. తన యపరాధమును క్షమించుమనియూ, అయోధ్యకు తిరిగి రామ్మనియూ శ్రీరాముని ప్రాదేయపడుటకు కైకేయియూ అరిగినది.   
    భరతుడు వారందరితోనూ వ్హతురంగా బలముతోనూ గంగానది దారిని చేరుకున్నాడు. గుహుని సాయముతో నదిని దాటి అవాలి యొడ్డున విదిసినారు. అచ్చట నుండి భరతుడు వసిస్టుని మాత్రము వెంటనిడుకుని భరద్వాజాశ్రమమునకు పోయినాడు. సీతారామ లక్ష్మణులు వసించుచున్న చిత్రకూటమునకు మార్గమును ఆ మునిని అడిగి తెలుసుకొని మరలివచ్చినాడు. మరునాడందరునూ చిత్రకూటమునకు బయలుదేరినారు.

 Previous Page Next Page